ఏ పాపం తెలియని ఓ పేద యువకుణ్ని రక్షకభటులు తీవ్రవాదిగా పొరబడ్డారు. ఖైదు చేశారు. ఆ హఠాత్ పరిణామానికి యువకుడు ఎంతో కలవరపడ్డాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తననే నమ్ముకుని జీవిస్తున్న ముసలి తల్లిదండ్రులు అనాథలవుతారని కుమిలిపోయాడు. దానికి తోడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నేవాడు లేక అది బీడు పడిపోతోందంటూ తండ్రి నుంచి అందిన లేఖ మరింత కుంగదీసింది. మరణమే శరణ్యమనిపించింది.ఆదిత్యయోగి..
అంతలో అతడికి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన 'జీవన్ భద్రాణి పశ్యతి... బతికియున్నను సుఖములు బడయవచ్చుననే మాట గుర్తుకొచ్చింది. చచ్చి సాధించేదేమీ లేదని తనను తానే ఓదార్చుకున్నాడు. చటుక్కున ఒక ఆలోచన తోచింది. ఆశ చివురించింది. ఏం చెయ్యాలో. వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు. వారం తిరిగేసరికి తండ్రి నుంచి బదులు వచ్చింది. తమ పాలాన్ని రక్షకభటులే దగ్గరుండి దున్నించారని, వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదని తండ్రి రాశాడు.
తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ, ఆ యువకుడు 'నా మొదటి ఉత్తరాన్ని రక్షక భటులు తెరిచి చూస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ఆ భూమిలో కొన్ని ఆయుధాలను దాచి పెట్టానని నీకు రాశాను. ఇప్పుడిక నీవు అదను చూసి ఓపిక చేసుకుని విత్తనాలు జల్లు' అని రాశాడు. ఆశ మనిషిని బతికిస్తుంది. ఆలోచన ముందుకు నడిపిస్తుంది. అదే ఈ కధలోని సందేశం.
'మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ రచయిత విక్టర్ ప్రాం గొప్ప మానసిక వైద్య నిపుణుడిగా పేరు గడించా ఆయనకోరోజు అర్ధరాత్రిపూట ఓ మహిళ ఫోన్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. జీవితంలో తాను సర్వస్వాన్నీ కోల్పోయానని, ఒక బతకాలని లేదని చెప్పింది. ఆమెను అనునయిస్తూ విక్టర్ దారుణమైన ఆ నిర్ణయానికి గల కారణాలను రాబట్టాడు. జీవితం ఎంత విలువైనదో వివరిస్తూ ఆమె తన సమస్యలను ఎలా అధిగమించవచ్చో చెప్పాడు. బతకడానికి ఎన్ని
రకాల దారులున్నాయో చెబుతూ ఆమెతో చాలా పేపు చర్చించాడు. చాలా రోజుల తరవాత ఆమె విక్టర్ను కలిసింది. | తాను చెప్పిన ఏ అంశం ఆమెను ఓదార్చిందో, ఏ అంశం బాగా నచ్చి తన ఆలోచనను మార్చుకొనేలా చేసిందో- తెలుసుకోవచ్చా... అని విక్టర్ ప్రశ్నించాడు.
'తీవ్రమైన నిరాశలో మునిగిపోయి, చావుబతుకుల మధ్య సతమతమవుతున్న నాతో మీరంతసేపు ఓపికగా మాట్లాడటమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బతుకుమీద ఆశను పుట్టించింది' అని బదులిచ్చిందామె.
సాటి మనిషికి సాయం చేయలేకపోయినా, కనీసం వారి కష్టాన్ని ఓపికతో విని, నాలుగు మంచి మాటలతో, ఓ చక్కని ఓదార్పుతో, ఓ చల్లని స్పర్శతో.. మనం భరోసా ఇవ్వగలిగితే ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతాం. ఇది బాహ్య ప్రేరణకు ఉదాహరణ. బతకడమే కాదు, నలుగురినీ బతికించాలన్న ఆలోచనతో జీవించడమే మనిషి బతుక్కి పరమార్ధం...
No comments:
Post a Comment