Sunday, September 3, 2023

"వ్యక్తి వికాసము దానికి గల సూత్రములు"

 🌷🌷🌷🌷🌷🌷
" వ్యక్తి వికాసము దానికి గల సూత్రములు"
         💅🏿💅🏿💅🏿

🙏సమర్పణ:- "MAZUMDAR BANGALORE
87925-86125.'
       💐💐💐
 " మీలో అన్ని రకాల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ వాటికై సాధన చేస్తూ అన్ని పరిస్థితులలోనూ ఆధారపడే రీతిలో 'వ్యక్తిత్వాన్ని' సాధించినప్పుడే  మీకు "పరిపూర్ణ వ్యక్తిత్వం" సిద్ధిస్తుంది . అందులో ఏమాత్రం సందేహము లేదు.
      🙏🙏🙏
🌹" మీరు ఎదుటి వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించి అతని కార్యకలాపాలను గుర్తుంచుకొని మాట్లాడటం ఈనాడు చాలా అవసరం.  ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతనికి ఇష్టమైన విషయాలపై మాత్రమే మాట్లాడాలి.  అప్పుడే మీ రాక ఆసక్తికరమైన వ్యక్తిగా మిమ్ములను గౌరవిస్తాడని గుర్తుంచుకోండి!

🪷" మిమ్మలను ప్రజలందరూ ఇష్టపడతారని భావించుకొని వారితో మెలగండి.  మీతో ప్రజలు మాట్లాడాలనే భావం కలగజేస్తే ,  ప్రజలు కూడా హృదయపూర్వకంగా స్పందించగలరు.   ఒకవేళ మీరు అంటి ముట్టనట్లు ఉంటే బహుశా మీరు ఏకాంతాన్ని కోరుకుంటున్నారో అని ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి, ఫొయె ప్రమాదం ఉందని తెలుసుకోండి?   మీరు ఇతరుల సహచర్యాన్ని కోరుకోకపోతే ఒంటరి వారై  మిగిలిపోతారు.

🔥" మీయొక్క సొంత లోపాలని ఎల్లప్పుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి.
  అంత మాత్రాన కావాలని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు.
నిజంగానే పొరపాటు మీ వల్ల జరిగితే సరదాగా ఇతరులకు చలోక్తి విసరటానికి అవకాశం ఇచ్చేవారు అవుతారు. జాగ్రత్త!
తద్వారా ఇతరులలో ఉన్నత భావం పెంపొందించటమే కాదు, మీ వ్యక్తిత్వంలో మరింత మృదువత్వం వస్తుంది.
మీలో ఉన్న మంచి చెడులను నిర్భయంగా ఒప్పుకోండి!  అలాగే అదే దృష్టితో ఎదుటివారిని చూడండి!  
ఒక వ్యక్తి తన లోపాలను నిజాయితీగా ఒప్పుకున్నప్పుడే ఇతరులకు చెప్పడానికి అవకాశము ఏర్పడుతుంది.  అప్పుడే మీరు ఇతరులను  వారి దృష్టి కోణంలో అర్థం చేసుకునే శక్తి వస్తుంది., (Empathy)
ఇతరుల యొక్క శక్తి సామర్థ్యాలను గౌరవించగలుగుతాము.

💐" మీరు ఒక వ్యక్తిని గ్రీట్ చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయండి.
   " గుడ్ మార్నింగ్ అన్నప్పుడు మీ చెయ్యి సహుదయం తో లేవటంతో పాటు, ఓ "చిరునవ్వు" ను కూడా ప్రదర్శిస్తే  ఫలితం అద్భుతంగా ఉంటుంది కదా!  మీరు హృదయపూర్వకంగా మాట్లాడటంలో సహజత్వాన్ని చూపించండి.

🚩" ఇతర వ్యక్తులతో "ఆత్మవిశ్వాసాన్ని" పెంపొందించేటట్టు ప్రవర్తించాలి.  "ఆత్మ నున్యతా" తో వారు బాధపడుతున్నట్లు మీరు గమనిస్తే , మీరు అతనిలోని మంచి గుణాలను అభినందించండి.  అప్పుడు అతనిలోని "ఆత్మ నూన్యత" "భావం తరిగి "ఆత్మవిశ్వాసం" బాగా పెరుగుతుందని తెలుసుకోండి!  మీరు అతని గురించి మాట్లాడటం కంటే కూడా అతను తెలివితో చేసిన కార్యకలాపాలను గురించి మాట్లాడి "అభినందనలు" తెలియజేయండి.   స్త్రీల విషయానికి వస్తే  తమ అందాన్ని , ఆకర్షణ ప్రశంసంచటం ఇష్టపడతారని మర్చిపోకండి , అయితే మీరు చేసే అభినందనలలో "నిజాయితీ" తోడు కావాలి సుమా,!

🌻" నేను" అని కాకుండా "మీరు " మనం అనే పదాన్ని ఎక్కువగా వాడటం మీరు నేర్చుకోండి!   మీరు తరచూ మాట్లాడే విధానమును బట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎదుటివారు అంచనా వేసే అవకాశం ఉంది.
మీరు వారితో కలిసి పోయారో లేదో పరీక్షించుకోవాలంటే మీ అభిప్రాయాలు ఎన్ని చెప్పారన్నది 'కోలబద్ద " గా భావించండి.   అందుకే మీరు, మీది అతను, అతనిది ,ఆమె యొక్క అనే పదాలను మీరు ఉపయోగించిన మీ వ్యక్తిత్వ వికాసము వారి వద్ద  వికసించదు సుమా!

🌸" మీరు ప్రేమించటం నేర్చుకోండి,.  మానవుని యొక్క సహజ ప్రవృత్తి ప్రేమించటం, ప్రేమింపబడటం, మీ వల్ల ఎవరో ఒకరు సంతోషపడే బాధ్యతను స్వీకరించండి.
మనుషులను ప్రేమించడంలో లభించే ఆనందము, తృప్తి అపూర్వమైన దన్న సంగతి గుర్తుంచుకోండి?

🌼" మీ స్నేహితులను ఆరాధించండి.   ఇతరుల పట్ల మనం ఉదారంగా ప్రవర్తించినప్పటికీ, ఇతరులు మన పట్ల దయతో మంచిగా ప్రవర్తించకపోవచ్చు.  వాళ్లు స్వార్థపరులు అయి ఉండవచ్చు.  వాళ్లు మనకు విధేయులుగా మంచివాళ్లుగా ఉండటంలో విఫలమైతే "నిరాశావాదము," పెంచుకొని ఇతరుల పట్ల ద్వేషము పెంచుకోవద్దు.
మనము మనుషుల వైఫల్యాలను మనం సహించాలి , వాళ్లు మారిపోయే మంచి వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది అని తెలుసుకోండి.  లేకపోతే వాళ్ళ నైజము అంతే అని భావించండి. వారిని శత్రువులుగా చూడకండి.
పాముకు కోరల్లో విషము ఉండును, తేలుకు కొండెము నందు విషము ఉండును.  కుట్టటం వాటి యొక్క సహజ లక్షణము. ప్రేమించటం నీయొక్క సహజ లక్షణము.
అలా సరిపెట్టుకోండి.

🧤" తరచుగా మీ యొక్క వాతావరణంన్ని, మారుస్తూ ఉండండి.
సెలవుల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళండి.
కొత్త కొత్త వ్యక్తులను కలుసుకోండి.  అప్పుడప్పుడు మీ భార్యా పిల్లలను మీతో తీసుకెళ్లకుండా , ఒంటరిగా విశ్రాంతి  కాలాన్ని గడపండి.  అదేవిధంగా మీ భార్యా పిల్లలకు కూడా ఒంటరిగా విశ్రాంతి కాలాన్ని గడపటానికి అణువుగా వారికి అవకాశం ఇవ్వండి.
మీది ఉన్న ఇంటినే పట్టుకొని వేలాడకుండా దాన్ని , అమ్మి కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు,  తరచుగా పాత ఫర్నిచర్ ను  వాడే కంటే అప్పుడప్పుడు వాటిని మార్చవచ్చు, కానీ అహంకారముతో పక్కనున్న ఇంటితో మీరు వారితో  పోల్చుకొని ఆడంబరాలకు పోకండి. ఇంట్లో ఉన్నంతసేపు విశ్రాంతి గా హాయిగా గడపండి.  ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలని ఉబలాటపడండి.

💅🏿" వైఫల్యాలు నుండి విజయము సాధించిన వ్యక్తులు ఆనందంగా ఉండే వ్యక్తులతో , మీరు సహచర్యం చేయండి .  వారు నేర్చుకున్న గుణపాఠం తెలుసుకొని, మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోండి.  మీలో మీరు ఒంటరిగా తమలో తాము బతకటం హానికరం.  మనలో కొత్త దృక్పథం కొత్త ఆలోచనలు కొత్తవరవడి కొత్త ఆశలు మొలకతించగలిగే.       కొత్త వ్యక్తులతో సంబంధం ఎంతో అవసరం అని గుర్తించండి!  ప్రతి వారం సామాజిక సంబంధమైన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనండి.   మీ ఇరుగుపొరుగు వాళ్లతో వెళ్ళండి . క్లబ్బుల్లో కొత్త వ్యక్తులను కలుసుకోండి.
ఇంటా, బయట కొత్త ఆటలలో కొంత సమయాన్ని పాలుపంచుకోండి,. వీరు ఇతరులతో కలిసి ఉన్నప్పుడు మీ సహచరులను మీ కన్నా ఉన్నతులుగా  లేదా తక్కువ వారు గా మీ ఆలోచనలకు  తావు ఇవ్వకండి.  మనుషులంతా  నీకన్నా అధికులనే ఆలోచనకు కూడా తావివ్వకూడదు.
ఇతర రంగాల్లో నైపుణ్యము సాధించిన వ్యక్తుల నుండి కొత్త విషయాలను నేర్చుకోండి,
వాటిని ఆచరించండి.
మీయొక్క సంతోషము డబ్బులో గాని అందంలో గాని లేదు సంతోషమనేది మన తెలివితో సాధించిన విజయము వల్ల మనము సంపాదించుకున్న స్థానంలో ఉంది ,అని గుర్తించండి!  ఆధ్యాత్మిక చింతనలో," హరి సర్వోత్తమ", " వాయు జీవో త్తమ' తత్వజ్ఞానముతో,  తారతమ్య సిద్ధాంతము,
యొక్క విశిష్టత, గురించి
తెలుసుకొని "మోక్షానికి" ప్రాకులాడండి!
💚❤️💜🦚🙏

No comments:

Post a Comment