Tuesday, September 5, 2023

వెల్తురు దీపాలు........!!!

 వెల్తురు దీపాలు........!!!

వెలుగుతున్న దీపానికి
నూనె పోస్తే
వెలుగుతూ ఉంటుంది

అరిపోయిన ఒత్తికి
ఎంత నూనె వంపినా
చీమ్మేది చీకటి రాత్రులే 

ఉదయం ఎంత వెలుగులున్నా
వేళ కాగానే వెలిగించే దీపం
మనకు తోడునిచ్చే ధైర్యంతో 
వెల్తురునిస్తూ కాంతించే రాత్రులే 

సుఖం ఎంత కోరుకున్నా
దుఃఖం వెంబడిస్తూనే ఉంటుంది
మనకు వెలుగులెంత ఉన్నా
చీకటి మాత్రం
వెంటాడుతూనుంటుంది.....

సంతోషాన్ని పంచుకుంటాం
దుఃఖంలో పాల్గొంటాం
ఎవరి దుఃఖం వారిదే
కాని సంతోషాన్ని కూడ 
అవసరాన్ని బట్టీ
పంచుకునేల మారుతున్న
మానవ సమాజం.....

సుఖంగా ఉన్న మానవుడు
దుఃఖం కోరుకోడు
దుఃఖం కోరుకుంటే రాదు
దాని దారి దానిదే...
ఎప్పుడు వచ్చి వాలుతుందో
ఊహించలేనీదే

అయితే సంతోషాలు మాత్రం
మానవుడి చేతుల్లో
ఉంటుంది ఎంత కావాలంటే
అంతకు మించిన ఆనందం
పొందాలని ఆశిస్తూ
ముందుకు పోయే స్వభావం....
మనిషిలో మారని తత్త్వం......✍🏻

No comments:

Post a Comment