Tuesday, November 7, 2023

*****భగవత్ చింతన!…* *భగ్వద్ సాక్షాత్కారం!

 1302.   2-6.  260223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*భగవత్ చింతన!…*

            *భగ్వద్ సాక్షాత్కారం!*
                 ➖➖➖✍️

*శ్లో॥ చింతా మపరి మేయాంచ*
*ప్రళయాం తా ముపాశ్రితాః ।*  
*కామోప భోగ పరమాః*
*ఏతావదితి నిశ్చితాః ॥*
 
*చనిపోయేంతవరకు అంతులేని కోరికలలో మునిగితేలుతూ, కామభోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం ఏదీలేదని నిశ్చయించుకుంటారు.*
 
*ప్రళయాంతాం అపరిమేయాం చింతాం ఉపాశ్రితాః...!!!*

*చచ్చేంత వరకు అంతులేని కోరికలలో మునిగి తేలుతూ ఉంటారు.*

*కట్టు విప్పుకొన్న ఎద్దు... ముందూ, వెనకలు చూడకుండా, ఎలా పడితే అలా పరుగులు తీస్తుంది.* 

*ఎవరో ఒకరు దానిని హింసించి అదుపులోకి తీసుకొనే దాకా అది ఆగదు.  ఊపిరి ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు అలా పరుగులు తీస్తూనే ఉంటుంది.*

*తెగిన గాలిపటం గాలి ఎటు వీస్తే అటు కదిలిపోతుంది, అది ఎక్కడో ఒక చోట, చెట్టు కొమ్మల మధ్య చిక్కుకొనే దాకా అలా ఎగురుతూనే ఉంటుంది.*

*అలాగే... అసుర స్వభావి భగవంతునిపై విశ్వాసం లేనివాడు గనుక వాడికెప్పుడూ విషయచింతనే, ఉంటుంది.*
*చిన్న వ్యాపారం ప్రారంభిస్తాడు, కలిసొస్తే ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అని పెంచుకుంటూ పోతాడు.*
*ఇళ్ళు కొంటాడు, స్థలాలు కొంటాడు, పరిశ్రమను స్థాపిస్తాడు, సినిమాహాలు కట్టిస్తాడు, ఆశ తీరదు, కాలేజీలు కట్టించి విద్యా వ్యాపారం బాగుందనుకుంటాడు. హాస్పిటల్స్ కట్టించి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించి వైద్య వ్యాపారం ప్రారంభిస్తాడు.  ఇక ఇక్కడ లాభం లేదని విదేశాలకు వెళతాడు, నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు.*

*శరీరం, మనస్సు, బుద్ధి.. అన్నీ                      విషయ చింతనలోనే...!*
*భార్యకు సుఖంలేక పోయినా, కొడుకులు చెప్పిన మాట వినకపోయినా, బంధువులు శతృవులుగా మారినా ఆ జీవుడు ఆశల పల్లకిలో ఊరేగుతూనే ఉంటాడు.*
*తనంతట తాను మారడు, ఎప్పుడో భగవంతుడే దయ తలచి ఏ విమాన ప్రమాదంతోనో, హార్ట్ ఎటాక్ తోనో అతణ్ణి బంధ విముక్తుణ్ణి చెయ్యక పోతే అతడికీ గాడిద చాకిరీ తప్పదు.*
*ప్రకృతి వేసిన శిక్షను అనుభవించక తప్పదు, ఒక వేళ ఆరోగ్యం చెడినా, కాలోచేయ్యో విరిగినా, మంచంలో పడి ఉన్నా మనస్సు మాత్రం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది..!*
*కోరికల వేడితో విషయ చింతన అనే అగ్నిలో కాలిపోతుంటాడు...!*
 
*బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః ।*
*వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోఽపినసక్తః॥*
 
*బాల్యం ఆట పాటలతో..                       యవ్వనం కామ ప్రేరిత చర్యలతో..                   వృద్ధాప్యం చింతలతో..                               గడిచిపోతే పరమాత్మను తలచుకోనేది ఎప్పుడు?*

*భగవద్ అనుగ్రహము కావాలంటే నిరంతరం భగవద్ చింతన, భగవద్ కార్యాలలో పాలుపంచుకోవడం ముఖ్యం..! అలా అని దేవుని హుండీలో డబ్భులు వేయడం కాదు, దీనజన సేవలో ఆ డబ్బులు వినియోగించాలి, అప్పుడే భగవద్ సాక్షాత్కారం లభిస్తుంది..!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment