*****************************************
భగవద్గీత - దుర్యోధనుడి జీవిత పాఠాలు
Day 5 - శ్లోకాలు
*****************************************
-----------------------------------------------------
👉 భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 1
-----------------------------------------------------
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
తాత్పర్యం:
----------
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?
-----------------------------------------------------
👉 భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 2
-----------------------------------------------------
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
తాత్పర్యం:
----------
సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.
-----------------------------------------------------
👉 భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 3
-----------------------------------------------------
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।।
తాత్పర్యం:
----------
దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
-----------------------------------------------------
👉 భగవద్గీత అధ్యాయం 2 - శ్లోకం 62
-----------------------------------------------------
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే ||
తాత్పర్యం:
----------
ఎల్లప్పుడూ విషయాలను గురించే ఆలోచన చేసే వాడికి వాటిమీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది, కోరిక వలన కోపం కలుగుతుంది.
-----------------------------------------------------
👉 భగవద్గీత అధ్యాయం 16 - శ్లోకం 4
-----------------------------------------------------
దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ।।
తాత్పర్యం:
----------
ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు.
No comments:
Post a Comment