ఓం శ్రీ గురుభ్యోనమః. మన జీవితాన్ని అద్భుతంగా జీవించాలి అంటే మనం జీవించే పద్ధతిని మార్చుకోవాలి. మనసును,వాక్కును కర్మలను శుద్ధి చేసుకోవాలి. ఎవరిని వారే ఉద్దరించుకోవాలి.
మనసును శుద్ధి చేసుకోవడానికి ఆలోచనలలో ప్రశాంతత, మృదుత్వం, మౌనం, ఆత్మ నిగ్రహం, ఉద్దేశ పవిత్రత ను అలవాటు చేసుకోవాలి.
వాక్కుని శుద్ధి చేసుకోవడానికి ఉద్వేగం కలిగించనివి, కోపం పుట్టించనివి, ప్రయోజకరమైనవి, ఉదాహరణకు వేద శాస్త్ర పఠనం, సత్యం మాట్లాడటం, భగవద్గీతను చదవటం.
శరీరంతో భగవంతుని గురువుని పెద్దవాళ్ళను సేవించడం, మానవసేవే మాధవ సేవ అనుకోవటం, మన కర్మలను శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్ల నిష్కామ కర్మలను చేస్తూ, జ్ఞానం సంపాదించుకోవాలి.
రమణ మహర్షి గారు చెప్పినట్లు ప్రతి కర్మను భగవంతునికి అర్పించాలి.
రవీంద్ర ఠాగూర్ గారు గీతాంజలి బుక్కులో భగవంతుడు ఒక కష్టపడి పని చేసే శ్రామికుడి చెమట చుక్కలో ఉన్నారు అని తెలియజేశారు.
ఎవరైతే సహజంగా స్వభావాను గుణంగా పవిత్రీకరించుకొనటు వంటి కర్మల చేత నన్ను అర్ధిస్తాడో వాడు నా శ్రేష్ట భక్తుడు అని, నాకు పూజలు, యజ్ఞాలు, తపస్సులు ఏవి అవసరం లేదు అని భగవద్గీతలో తెలియజేశారు. మనం చేసే పనులు త్రికరణ శుద్ధితో చేస్తే మనం భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులము అవుతాము. మన జీవితం దివ్యంగా ఉంటుంది.
🙏🙏🙏🙇♀️
No comments:
Post a Comment