*_ఓ మాయల మనిషి..._*
*_సాయంకాలం, ప్రాతః కాలం , శిశిరం,వసంతం మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కాలం అలా ఆడుకుంటూ వెళ్లిపోతుంది ఆయువు గడిచిపోతూ ఉంటుంది. అయినా ఆశను వదిలిపెట్టవు కదా! ఎంతవరకు ధనం సంపాదించడంలో ఆసక్తి కలిగి ఉంటావో,అంతవరకు నీ పరివారము నిన్ను ప్రేమిస్తుంది. దుఃఖానికి లోనైనప్పుడు ఇంటిలోని వారు అసలు నీ విషయమే పట్టించుకోరు కాస్త గుర్తెరుగు . శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు నీ క్షేమ సమాచారం సంగతిని అడుగుతారు.ప్రాణం పోయిన తర్వాత..నీ భార్యే నీ శరీరాన్ని చూసి భయపడుతుంది. మొదట సుఖంతో, స్త్రీ సంబంధమైన సంభోగముతో చొరబడతావు.ఆ తరువాత శరీరమందు రోగం ఆవహిస్తుంది. రోగగ్రస్తుడవై క్షణక్షణం నరకయాతన అనుభవిస్తూ ఉంటావు. చావు అనేది రాక తప్పదు కదా! అయినా శరీరము సడలిపోతుంది,శిరస్సు పండిపోతుంది, నోటిలోని పళ్ళు రాలిపోతాయి. ముసలివాడై కర్రను ఆసరుగా చేసుకుంటావు అయినా కోరికల మూటను వదలవు ఎందుకు..? బాల్యంలో ఆటపాటలతో గడిపేసావు, యవ్వనంలో స్త్రీ సంబంధమైన ఆశక్తితో గడిపేసావు, వృద్ధాప్యంలో శరీరము సహకరించక నానా అవస్థలు పడుతు ఉన్నా.. ఆశను, ఈర్షను, త్యాజించవెందులకు..? స్త్రీ స్థనములను, నాభి ప్రదేశాన్ని చూసి మోహావేశం, పిచ్చి భ్రమకు లోను కాకు ఓరి పిచ్చివాడా..అవి మాంసము, కొవ్వుల వికారాలే...ఎందులకు మోహము...?_*
*_ఓ...మాయల మనిషి... ఒక్కసారి ఆలోచించు...☝🏾_*
*_వయస్సు మళ్ళిన తర్వాత కామ వికారం ఏది..?ఎక్కడుంది..?_*
*_నీరు ఇంకిన తర్వాత సరస్సు అనేది ఏది..?_*
*_నీ వద్ద డబ్బులు క్షీణించిన మీదట పరివారం ఎక్కడ..? ఎవరు..?_* *_ఎక్కడుంటారు..?_*
*_జ్ఞానోదయం కలిగిన మీదట ఈ సంసారలంపటం ఎక్కడుంటుంది...?_*
*_అసలు నీవెవరు..?_*
*_నీవు ఎక్కడి నుండి వచ్చావు...?_*
*_తల్లి ఎవరు..? తండ్రి ఎవరు..?_*
*_నీకు ఈ సృష్టికి ఉన్న సంబంధం ఏమిటి..?_*
*_నేను లేను,నీవు లేవు, ఈ సంసారం లేదు ఇలా తెలుసుకొని కూడా ఎందుకు సోకిస్తున్నావు..?_*
*_ఇలా ఒక్కసారి అయినా.. నీ మనసులో ప్రశ్నల వర్షం కురిపించు.. వీటన్నిటికీ సమాధానం నీలోనే ఉంది. సాధన చే అంతర్ముకుడవు కమ్ము. నీ ఇంద్రియాలకు కనబడ్డా మొత్తం ప్రపంచం సారం లేనట్టిది, కేవలం స్వప్నం లాంటిదని తెలుసుకో._*
_-శ్రీ ఆది శంకరాచార్య చర్పట పంజరికాస్తోత్రం నుండి.._
*_✍🏾మీ. 🙏🏾_*
No comments:
Post a Comment