*ప్రీతి హెల్త్ కేర్ టిప్స్ *. మనం తీసుకున్న ఆహారం ఎంతసేపటిలో జీర్ణం అవుతుందనే విషయం తెలుసా?*
☘️ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే సమయం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
🌿ఆహారాన్ని నమిలి మింగిన తర్వాత, అది జీర్ణ వాహిక ద్వారా శరీరంలో ప్రయాణిస్తుంది. ఇది జీర్ణాశయం, పెద్దపేగు, చిన్నపేగు వంటి అవయవాలగుండా వెళుతుంది.
☘️జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం జీర్ణమవడాన్ని 'ఇంటెస్టినల్ మొటిలిటీ' అంటారు. మన పేగులలో ఉండే బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఈ ప్రక్రియను పాక్షికంగా నియంత్రిస్తుంది.
🌿ఈ బ్యాక్టీరియా మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆహారాన్ని మనకోసమే కాకుండా, చిన్నపేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియాను దృష్టిలో పెట్టుకుని కూడా తీసుకోవాలి.
🌱ఈ బ్యాక్టీరియా మెటాబొలైట్స్ అని పిలిచే చిన్న అణువులను ఉత్పత్తి చేస్తుంది, ఇవి మన రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఆహారాన్ని కదిలించే నరాలను ప్రేరేపించడం ద్వారా మన పేగులను కదిలేలా చేస్తాయి.
🥦ఈ బ్యాక్టీరియా, అవి ఉత్పత్తి చేసే మెటాబొలైట్స్ లేకుండా, మన పేగుల్లో ఆహారం జీర్ణంకాదు. అలా జీర్ణం కాకపోతే తిన్న పదార్థం పేరుకుపోయి మలబద్ధకం కారణంగా అసౌకర్యం కలుగుతుంది.....
విరేచనాలకు కారణమవుతాయి.
🌱పేగులో ఆహారం వేగంగా కదిలితే, ఫలితంగా వచ్చే మలం జిగటగా, అధిక నీటి శాతంతో ఉంటుంది. పేగులో ఎక్కువసేపు లేకపోవడం వల్ల శరీరం నీరు, పోషకాలను తగినంతగా గ్రహించకుండా నిరోధిస్తుందని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ కేసులలో ఇది డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది.......
🥦స్వీట్ కార్న్ టెస్ట్..
మీరు ఇంట్లోనే చేయగలిగే చాలా సులభమైన పరీక్ష ఇది. దీనిని "క్యాండీ కార్న్ టెస్ట్" అంటారు.
☘️మెదటి దశ: 7 నుంచి 10 రోజులు ("శుభ్రపరిచే" దశ) మొక్కజొన్న తినకుండా ఉండాలి.
ఆ తర్వాతే మీరు టెస్టుకు సిద్ధమైనట్లు.
🥦కొంచెం స్వీట్ కార్న్ తినండి. గుప్పెడు ఉడకపెట్టిన లేదా కాల్చిన మొక్కజొన్న కూడా సరిపోతుంది. తిన్న తేదీ, సమయాన్ని రాసి పెట్టుకోండి.
☘️మొక్కజొన్న బయటి పొట్టు జీర్ణం కాదు కాబట్టి, అది మీరు తిన్న మిగిలిన ఆహారంతో పాటు జీర్ణవాహిక గుండా వెళుతుంది, చివరికి మీ మలంలో కనిపిస్తుంది.
🌿మీరు చేయవలసింది ఏమిటంటే, పేగు కదలికలపై ఒక కన్ను వేసి ఉంచడమే. మొక్కజొన్న పొట్టు మలం ద్వారా బయటకు వచ్చిన సమయాన్ని నోట్ చేసుకోవాలి.
🥦అయితే, ఇంట్లో చేసుకునే ఈ పరీక్ష ఖచ్చితమైంది కాదని గుర్తుంచుకోండి. కానీ, ఫలితం అధునాతన పరీక్షలకు సమానంగా ఉంటుందని చెప్పొచ్చు.
☘️మీరు మొక్కజొన్నను 12 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయంలో విసర్జిస్తే, మీ పేగులో ఆహారం వేగంగా కదులుతోందని అర్థం.
🌿48 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మలవిసర్జన చేయకపోతే, మీ పేగులో ఆహారం చాలా నెమ్మదిగా కదులుతోందని అర్థం.
🌱మీ పేగులో ఆహారం నెమ్మదిగా కదలుతోంటే, దాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని పనులు ఉన్నాయి.
☘️ఆహారం మరీ నెమ్మదిగా కదులుతున్నప్పటికీ, ఉబ్బరం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం లేదా వికారం వంటి ఇతర లక్షణాలు లేకపోతే బ్యాక్టీరియాకు అవసరమైన ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తిని, ఎక్కువ నీరు తాగాలి. అలాగే వ్యాయామం కూడా చేయాలి.
🌿సమతుల ఆహార పద్దతులను అనుసరించడం వలన మీ పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
🌿అలా కాకుండా వేగంగా కదలుతోంటే పేగు లోపల ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.......☘️🥦ఎల్లప్పుడూ మీ ఆయురారోగ్యాలను కోరుకునే * *ప్రీతి హెల్త్ కేర్* * విశాఖపట్నం*
No comments:
Post a Comment