*🍁మృత్యుభీతి.....*
🕉️🦚🌹🌻💎💜🌈
*🧎🏻మానవులలో చాలా మందికి సాధారణంగా వచ్చే ప్రశ్నలలో ఓకటి మృత్యుభీతిని అధిగమించేదెట్లా.*
*ఈ మృత్యుభీతి నిన్నెప్పుడు ముట్టడిస్తోంది మెలకువలో ఉన్నప్పుడా. గాఢనిద్రలో ఉన్నప్పుడా.*
*మెలుకువలో ఉన్నప్పుడే ఈ మృత్యుభీతి నిన్ను చుట్టుముడుతోంది. కనుక మృత్యువు ఎవరికి అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. మృత్యువు వల్ల "నేను" పోతుందని భయపడుతున్నారు. "నేను" శాశ్వతంగా ఉండాలని ప్రతి వారు తలుస్తున్నారు.*
*ఎందు చేతనంటే ఆత్మ శాశ్వతమైంది. ఆ ఆత్మ తానై ఉన్నాడు కనుక. ఆత్మ నుండి అహంకారం పుట్టి దేహంలోకి వచ్చి దేహమే తానని తలుస్తోంది. మళ్లీ గాఢనిద్రలో, అహంకారం ఆత్మలో కలిసిపోతుంది. ఇట్లా అహంకారం నిత్యమూ పుడుతూ చస్తూనే ఉంది. కావున మనం ఆత్మానుభవం పొందితే చావు పుట్టుకలు దాటి పోగలం.*
*┈━❀꧁ఓం నమశివాయ꧂❀━┈*
*🍁బంధువులెవరు తోడురారు. బరిలో దిగి పోరాడడానికి, నువ్వే ప్రయత్నించుకో.!*
*🌾బంధాలేవి సాయం చేయవు , బలంగా ఎదిరించడం నువ్వే నేర్చుకో.!*
*🍁స్నేహాలేవి వెంట నిలవవు, సాహసాలు చేయడం అలవాటు చేసుకో.!*
*🌾పరిచయాలేవి పక్కన నిలబడవు, ప్రపంచాన్ని చదవడం పాఠమనుకో.నేర్చుకో!*
*🍁ఎవరు వెంట నిలిచినా.. నిలవకపోయినా.. స్థితిగతులు ఎలా ఉన్నా.. ఏమవుతున్నా..*
*🌾ధర్మాన్ని మాత్రం వీడకు! దైవాన్ని మాత్రం వదలకు!!*
*🍁 *ఏ శక్తి ఏ వ్యక్తి నిన్ను నడిపించిన నడిపించకపోయినా.. దైవశక్తి మాత్రం నీ వెంటే తప్పక ఉంటుంది అని తెలుసుకో*.!
🕉️🦚🌹🌻💎💜🌈
*అతి సర్వత్ర వర్జియేత్*
*మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది.*
*మితిమీరిన పొదుపు అనారోగ్యం పాలు చేస్తుంది.*
*మితిమీరిన సంపాదన మానశ్శాంతిని దూరం చేస్తుంది.*
*మితిమీరిన క్రమశిక్షణ ఆత్మీయులకు దూరం చేస్తుంది.*
*మితిమీరిన హాస్యం అపహాస్యం చేస్తుంది.*
*మితిమీరిన కోపం శత్రువులను పెంచుతుంది*
*మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని పెంచుతుంది*
*మితిమీరిన మంచితనం పాతాళానికి తొక్కేస్తుంది*
*అందుకే ఏదైనా మోతాదు మించకూడదు.*
🕉️🦚🌹🌻💎💜🌈
No comments:
Post a Comment