*
🎉⛳🎉 🙏🕉️🙏 🎉⛳🎉
[8/27, 05:57] +91 93985 06263: *గణపతి తత్త్వం.....*
*'గ' అనే అక్షరం జ్ఞానవాచకం, 'ణ' అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణశాసకుడు గణపతి. కంటికి కనిపించే విశ్వం పంచభూతాత్మకమైంది. దీన్నే 'జగము' అంటారు. 'జ' అంటే పుట్టి; 'గ' అంటే గతించేది. జగము, గజము పరస్పర సంబంధం కలిగిన విషయాలు. వ్యక్తం నుంచి అవ్యక్తం వైపుకు సాగే పయనమే గణేశ తత్త్వం.*
*గణపతి ఏకదంతుడు. ఆయనకు ఉన్న ఇరవై ఒక్కనామాలలో శూర్పకర్ణుడు అనే పేరులోని అర్ధాన్ని లోతుగా పరిశీస్తే 'భక్తుల మొరలను బాగా వినడమే నా పని అన్న సంకేతం కనిపిస్తుంది. తాలును పోగొట్టి అసలైన ధాన్యాన్ని మన కందించే వేటలవంటి చెవులు ఆయనకున్నాయి. తాలు వంటికోరికల్ని పక్కకి నెట్టేసి మంచి కోరికలు తీర్చే దాక్షిణ్యమూర్తి ఆయన. వినాయకుడు వక్రతుండుడు ఆ తొండం ప్రణవస్వరూపం... ఓం కారమంటే పరబ్రహ్మం. ఆ తొండాన్ని ఆరాధిస్తే. మూలాధారదైవాన్ని ఆరాధించినట్టే.. మాయను నివారించే మహిమగల స్వామి వక్రతుండ* *గణపతి ఆయన వాహనం ఎలుక ఇంద్రియ చాపల్యానికి సంకేతంగా ఎలుకను తత్త్వజులు అభివర్ణించారు. ఆ అసురతత్త్వాన్ని అణిచివేయడం గణపతి లక్షణం కనుక మూషికాన్ని వాహనంగా స్వీకరించాడు. ఆయన సూక్ష్మనేత్రుడు. ఆ చిన్ని కళ్లు సూక్ష్మదృష్టికి దివిటీలు. సూక్ష్మబుద్ధికి సంకేతాలు. పురుష రూప దేవతలకు వారి శక్తులనే భార్యలుగా సంభావన చేసింది శ్రీ శాస్త్రం, అందువల్ల 'సిద్ధి బుది' గణపతి భార్యలుగా పేర్కొన్నాయి కొన్ని పురాణ కథనాలు, సర్వలోకాలు గణపతి ఒజకు బొజ్జలో ఉన్నాయి. విష్ణు ప్రసాద పుష్పాన్ని అలంకరించుకున్న ఏనుగు ముఖంతో పుట్టిన శివపుత్రుడు సృష్టికి ఆద్యుడు కనుక త్రిమూర్త్యాత్మిక స్వరూపుడు గణపతి.*
*వినాయకుని వీణపేరు 'లకుమి'. సంగీత శిక్షణారంభంలో లంబోదర లకుమి కరా అన్న కీర్తన వినపడుతుంది. ఆయన సంగీత ప్రియుడు. నృత్య ప్రియుడు. ఆయన సకల కళా నిలయుడు. ప్రపంచంలో కళల వలనే సుఖ సంతోషాలు విలసిల్లగలవని పావన గణపతి భావన. వినాయకుడి ఆరాధనలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ. గాణపత్యాలనే అయిదు ఉపాసనలు నిబిడీకృతమవడం వల్ల సర్వమతాలను సమానంగా చూచే గాణపత్యం పొందినవాడాయన. గణపతికి తొమ్మిది రాత్రులపాటు ఉత్సవాలు చేస్తారు. పూర్ణ బ్రహ్మపదాన్ని సాధించడమే యీ తొమ్మిది సంఖ్యకు గల సంకేతం ఏకవింశతి (21) పత్రాలతో స్వామిని పూజిస్తారు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. తన్మాత్రలు 5 5 మనస్సు ఒకటి కలిపితే మొత్తం 21. 21. వీటిన్నింటితో కూడిన శరీరంతో వినాయకచవితినాడు ఏకవింశతిపత్ర పూజ చేస్తాం. కన్యారాశిలో సూర్యుడున్నప్పుడు చంద్రుణి చూడరాదని శాస్త్రం. గణేశుడు పరంజ్యోతి అయిన ఆత్మ. సూర్యుడిచ్చినట్టు చెప్పబడే శ్యమంతకమణి ఆత్మకు ప్రతిక చంద్రుడు మనస్సుకు సంకేతం. మనస్సును ఆత్మలో లయంచేయకపోతే అనర్థం అని శ్యమంతకోపాఖ్యానం చెబుతుంది. మానవ - జంతు ఆకృతులు కలగలిసిన రూపాలు గల దేవతలు త్వరగా కరుణిస్తారని మంత్ర శాస్త్రం చెబుతోంది. గణపతి అష్టోత్తర శతనామావళిలో 'ఓం కలికల్మష నాశనాయ నమః' అన్న నామం వుంది. కలౌ చండీవినాయకౌ అన్నట్లుగా కలిలో సత్వరంగా అనుగ్రహించే దైవం ఆయన. విభిన్నపురాణాలలో విభిన్న. రీతులలో గణనాయకుడి గాధలున్నాయి. ఆయన మానవులు తలపెట్టిన సకల కార్యాలనూ నిర్విఘ్నంగా పూర్తిచేయించి సాఫల్యం కలిగిస్తాడు. కీర్తిని ప్రసాదిస్తాడు.*
*┈┉┅━❀꧁లంబోదరా꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌻📿🌻 🙏🕉️🙏 🌻📿🌻
No comments:
Post a Comment