Tuesday, December 9, 2025

 🧘మోక్షపురీ(కాశీ).. తత్వ.. స్వరూపం !!🧘‍♀
🔥🪷🔥🕉🔥🪷🔥

కాశీనగరం..!! 
విశ్వమే తన శరీరంగా చూపగల అంతరంగ దర్పణం !! 
చిత్తమందు నిక్షిప్తమై ఉన్న చిదాకాశం !!

మణికర్ణిక...!!
పాంచ..భౌతిక.. సారాన్ని హవిస్సుగా.. సమర్పణ చేస్తే.. ఆవిర్భవించు...
మాణిక్యం వంటి కాంతి కలిగిన పరంజ్యోతికి మూలస్థానం..!
అదే గొప్ప యాగశాల..!! మహా స్మశానం...!!
జనన మరణ చక్ర భ్రమణం..స్మృతి పథంలో స్ఫురించే సత్య దృక్పదం..!!
జీవుని ఒంటరి ప్రయాణ...  
జ్ఞాన,వైరాగ్య భావనా తరంగ  విలయం..!!

(హరిశ్చంద్ర...మనోలయం.చంద్రమతి..మనస్సు.లోహిత.. బుద్ధి )

దశాశ్వమేధ...!! 
జ్ఞాన, కర్మేంద్రియా లను పది గుర్రాలను అధిష్టించి ఉన్న సంకల్ప శక్తి ! 

విశ్వనాధుడు... విశ్వ పాలకుడు !!
విశ్వేశ్వరుడు... విశ్వశ్వాస !!

విశాలాక్షి...!! 
విశ్వమంతా వీక్షించే 
త్రికాల జ్ఞాన దృష్టి !!(దివ్యదృష్టి)

అన్నపూర్ణమ్మ...!!
తానే వివిధ రూపాలుగా... సదా రూపాంతరం చెందుతూ...
ఒకదానికి మరొకటి ఆహారంగా...
తనకు తానే ఆహారమై...
అణువణువూ తానుగా...
నిరంతరం నవ్యాకృతిలో..
అనుక్షణం వ్యక్తమయ్యే... ప్రకృతి మాత స్వరూపం !!
 
జ్ఞానవాపి...!!
సుషుమ్న మార్గమునకు ప్రతీక..!!

గంగా మాత...!! 
ప్రాణికోటికి ఆధారభూత మైన పవిత్ర జీవ శక్తి !

కాలభైరవుడు...!!
బ్రహ్మ యొక్క ఊర్ధ్వ శిరస్సును (అహాన్ని) తొలగించిన శివాంశ ...!!
కాలం యొక్క స్వరూపం..!!
నేననే తత్వం నశిస్తే గానీ 
 కా లా తీ తు ని.. చేరలేరు. 

ధన్వంతరీ స్వామి వారు..!!
 ఆరోగ్యం ప్రసాదించే 
ధన్వంతరీ బావి తీర్థం...!!
అమరత్వం ప్రసాదించే సంజీవినీ హనుమాన్..!!
మృత్యుంజయేశ్వర మహదేవ్..!!
అపమృత్యువు నుండి రక్షించే అమృతేశ్వర  తీర్థం...!! 

సాక్షి గణపతి...!!
అధ్యాత్మిక దృక్కోణం లో(ఆత్మ తత్వం) భౌతిక జగత్తును సాక్షిగా వీక్షించ గల సామర్థ్యం !

దండ పాణి...!! 
దండము పట్టుకున్న వాడు !
(మెరుదండము నందు పయనించు నేర్పరి)

డుoడి గణపతి...!!
ధుo..ధీ.. గణపతి.. సమర్పణా భావంతో కూడిన అధ్యాత్మిక సాధనా శక్తికి ప్రతీక !

వారాహిమాత... !! అత్యద్భుత యోగశక్తి !
భౌతిక జగత్తు నిద్రించే సమయంలో ఆమె జాగృతం అవుతుంది ! జగత్తు జాగృతి లోకి వస్తే ఆమె నిద్రిస్తుంది !

హర హర మహాదేవ 
🙏🪷💫💥💫🪷🙏
Santhi Vupasi.    

No comments:

Post a Comment