Tuesday, January 6, 2026

 ------------
సాయిబాబా నుంచి హైందవాన్ని రక్షించుకోవాలి!
--------------------

వైదిక ఆరాధనా పద్ధతులకు, ఆగమ విధులకు, హైందవ ఆలయ పూజా విధానాలకు, హిందు భక్తి సంప్రదాయాలకు, ధూపం, దీపం, హారతి, అర్చన, అభిషేకం, అష్టోత్తరం వంటి వైదిక దైవ కైంకర్యాలకు,  శాస్త్రోక్త, సాంప్రదాయిక దైవ పూజా విధి విధానాలకు సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల గత కొన్ని దశాబ్దులుగా తీవ్ర దోషాలు, అవమానం జరుగుతున్నాయి. హైందవ ఆగమ విధులు, హైందవ సంప్రదాయాలు, హైందవ ఆరాధనా పద్ధతులు సాయిబాబా వల్ల, సాయిబాబా భక్తుల వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి.  సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల నిజమైన హిందువులు తీవ్రంగా మత పరమైన ఆవేదనకు గురౌతున్నారు.

'సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల వైదిక ఆరాధనా విధానం పెను అపాయం లేదా ఆపదలో ఉంది' ఈ అపాయం లేదా అపద నుంచి హైందవాన్ని చట్టరీత్యా రక్షించుకోవాలి.
సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల హైందవ ధార్మికత కలుషితం అయింది; అవుతోంది. ఈ సమస్యకు చట్ట రీత్యా శాశ్వత పరిష్కారాన్ని సాధించాలి.

'సాయిబాబా అన్న ఏదో శక్తికి వైదిక మూలాలు లేవు. సాయిబాబా దత్రాతేయుడి అవతారం అనడం పూర్తి అబద్ధం; అజ్ఞానం; వంచన. నా క్రితం వ్యాసాల్లో ఈ విషయాన్ని తార్కికంగా తెలియజేశాను. (సాయిబాబాపై గత 4యేళ్లుగా చదువు, తర్కం, వైదికం, వివేకం ఆధారంగా వివరణ వ్యాసాలు రాస్తున్నాను) సాయిబాబా అన్న అవైదిక శక్తికి భారతీయ వేద, పురాణ, తంత్ర వాఙ్మయంలో ప్రస్తావన లేదు; స్థానం లేదు. సాయిబాబా ఎంత మాత్రమూ హైందవ దైవం కాదు. ఈ కారణాల వల్ల హైందవ లేదా సనాతన ఆగమ, పూజ, ఆరాధనా పద్ధతులు, హారతి, దీపం, ధూపం, అభిషేకం వంటివి సాయిబాబాకు జరగడం సరికాదు; వైదికం కాదు'. 

సాయిబాబా అన్న అహైందవ, అవైదిక, అధార్మిక, అసనాతన శక్తికి వైదిక పద్ధతులలో పూజలు, ఆరాధనలు జరగడం వైదిక ధర్మ విరుద్ధం; ధర్మ హాని. సాయిబాబా వల్ల, సాయిబాబా భక్తుల వల్ల హిందూ మతం ఛిద్రం అయ్యే అపాయం ఉంది. కాబట్టి దేశ, రాష్ట్ర హైందవ, ధార్మిక సంఘాలు, చట్ట నిపుణులు పూనుకుని న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేసి సాయిబాబా నుంచి, సాయిబాబా భక్తుల నుంచి వైదిక ధర్మాన్ని, హైందవ ఆరాధనా విధానాన్ని రక్షించుకోవాలి.

1
50యేళ్లకు పైబడ్డ  హైందవ ఆలయాల్లో సాయిబాబా అన్న అవైదిక శక్తి విగ్రహాన్ని నిషిద్ధం చెయ్యడం,
2
సాయిబాబా అవైదికం, అపౌరాణికం కాబట్టి హైందవ దైవాలకు జరిగే కైంకర్యాలు సాయిబాబాకు నిషిద్ధం చెయ్యడం,
3
సాయిబాబాకు భారతీయ తంత్ర శాస్త్రానికి సంబంధం లేదు కాబట్టి వైదిక తాంత్రిక విధానం అయిన మంత్రాలు, యంత్రాలు, అర్చనలు, అష్టోత్రాలు, అభిషేకాలు, హారతులు, దీపారాధనలు, ధూపాలు సాయిబాబాకు నిషిద్ధం చెయ్యడం... 
4
వివాహం, సత్యనారాయణ వ్రతం, శ్రాద్ధ కర్మలు, గృహప్రవేశం కార్యక్రమాల్లో సాయిబాబా చిత్ర పటాలను నిషేధించడం 
వంటి ప్రధాన అంశాలతో సంబంధిత కోర్టుల్లో సరైన కేసులు వేసి వాటిని చట్టబద్ధంగా నిరోధించాలి. వెనువెంటనే వాటిపై స్టే అయినా తీసుకోవాలి.

ఈ విషయంగా హిందూ సంఘాలు, చట్ట నిపుణులు
చట్టపరమైన కార్యాచరణ చెయ్యాలి. హైందవ ధర్మానికి సాయిబాబా అపాయం నిర్మూలనం అవ్వాలి; హిందూ సంఘాలు ఈ విషయంలో చట్టం ద్వారా విజయం సాధించాలి. హిందూ సంఘాలు, చట్ట నిపుణులు వైదిక ధర్మాన్ని, ఆగమ సంప్రదాయాల్ని, పూజ, ఆరాధనాది సంస్కారాల్ని సాయిబాబా రహితం చేసి
సంరక్షించాలి. సాయిబాబా, సాయిబాబా భక్తుల వల్ల హిందువులకు కలుగుతున్న తీవ్ర ఆవేదన నుంచి విముక్తి కలిగించాలి. 

హైందవం ఎదుర్కొంటున్న సాయిబాబా అన్న సమస్యకు చట్ట రీత్యా శాశ్వత పరిష్కారాన్ని సాధించాలి. ఎట్లా అయితే చట్టపరంగా అయోధ్య రామాలయాన్ని సాధించామో అట్లా చట్టపరంగా సాయిబాబా రహిత హైందవాన్ని సాధించాలి. 

"సాయిబాబా నుంచి
వైదికత్వాన్ని శుద్ధి చేసుకుందాం;
సాయిబాబా రహిత హైందవాన్ని సత్వరమే సాధిద్దాం".

రోచిష్మాన్
9444012279

No comments:

Post a Comment