Tuesday, January 6, 2026

 ---------
సాయిబాబా - హిందువుల మనోభావాలు
---------‌----

సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయట! ఈ మాట అంటున్న వాళ్లు అనుకుంటున్న వాళ్లు  సాయిబాబా భక్తుల వల్ల, సాయిబాబా వల్ల వైదికత లేదా సనాతనత్వం తీవ్రంగా దెబ్బ తింటోంది అన్న అపాయకరమైన, బాధాకరమైన వాస్తవాన్ని 'బుద్ధి'తో తెలుసుకోవాలి!!

సాయిబాబా మూలం ఏమిటి? సాయిబాబాకు మన హైందవానికి లేదా వైదికానికి సంబంధం ఏమిటి? అసలు సాయిబాబా ఎవరు? హైందవ దైవం కాదు కదా సాయిబాబా? ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, రాఘవేంద్రులు, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, తులసీదాస్, మహావతార్ బాబా ఇలాంటి మహనీయుల కాలిదుమ్ముకు సాటి కాగలడా సాయిబాబా? 

సాయిబాబా చరిత్ర ఏమిటి? జీవన స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి ఆ మహనీయుల ముందు ఏపాటిది? సనాతన ధర్మంలో ఆదిశంకరులలా సాయిబాబా చేసినదేమిటి? అసలు హైందవంలో సాయిబాబా భాగస్వామ్యం ఏమిటి? సరైన చదువుతో ఒక్కసారి ఆదిశంకరుల జీవితాన్ని, పరిశ్రమను, ఉద్యమశీలత్వాన్ని సాయిబాబా జీవితం, జీవనంతో పోల్చి చూడండి,
ఆలోచించండి సాయిబాబా భక్తులారా...  ఇది మీ మనోభావాల్ని కించపరచడం కాదు; సాయిబాబా అంధ భక్తితో మా హైందవ సంస్కృతిని మీరు ఎందుకు దెబ్బకొడుతున్నారు? అని ఆవేదనతో అడగడమే ఇది.

"అల్లాహ్ మాలిక్" అంటూ సగుణుతూ బతికిన సాయిబాబా మూలం అడిగితే "ఏరుల, పారుల మూలాలు అడగకూడదు" అంటూ వంచకులు సాయిబాబా మూలాన్ని దాచిపెడుతున్నారు. పవిత్ర గంగా నది మూలం గంగోత్రి. ఆ గంగోత్రి చాల పవిత్రమైంది. యమునకు యమునోత్రి.. ఇలా ప్రతి ఏరుకు మూలం ఉంటుంది. ఏ మూలమూ లేని ఏ ముదనష్టమో వచ్చి మన హైందవాన్ని దెబ్బకొట్టడం ఏమిటి? కొందరు ధూర్తులు, దగుల్బాజీలు, అమాయకులు, మూర్ఖులు, మనస్తత్వం బాగాలేని వాళ్లు సాయిబాబాతో హిందూత్వానికి ఎందుకు తీవ్రంగా హాని చేస్తున్నారు?

సాయిబాబాకు ఏ వైదిక శాస్త్రాల్లో ఆధారాలు, మూలాలు ఉన్నాయి? వైదిక ఆగమ శాస్త్రంలో సాయిబాబా ఉన్నాడా? లేడు! అలాంటప్పుడు ఏ ఆగమ శాస్త్ర ప్రమాణాలతో సాయిబాబా ఆలయాలు కట్టబడుతున్నాయి? వైదిక ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టడం ఏ విధంగా శాస్త్రీయం? సాయిబాబా హారతులు, సాయిబాబా అర్చనలు, సాయిబాబా అష్టోత్తరాలు ఏ శాస్త్ర ఆధారంగా వచ్చాయి? సాయిబాబా కాళ్ల కింద పవిత్ర హిందూ దేవీదేవతల విగ్రహాలు పెట్టడం ఎంత అమానుషం? ఎంత వైదిక ద్రోహం?

సాయిబాబా గాయత్రీ మంత్రం అన్నది మొత్తం సనాతన మంత్ర శాస్త్రానికే అవమానం. సాయిబాబా యంత్రం అనేది ఏ తంత్ర శాస్త్ర ప్రాతిపదికన రూపొందింది? సాయిబాబా ఏ ఋషి ప్రోక్తం? సాయిబాబా పూజా విధానానికి ఏ వైదిక గ్రంథం ఆధారం? సత్యనారాయణ వ్రతంలోకి అల్లాహ్ మాలిక్ అని అంటూ బతికిన సాయిబాబా ఎందుకు వచ్చాడు? చివరికి తద్దనాల సందర్భంలోనూ సాయిబాబాకు దీపం పెట్టే నీచం మనలో ఎందుకు వచ్చింది?  

ఆగమ శాస్త్ర విధానంతో ఒక హైందవ దైవానికి జరపాల్సిన సేవలు సాయిబాబాకు జరపడం దారుణం; ఘోరం; అమంగళం. సాయిబాబాకు వైదికత్వం లేదా సనాతనత్వానికి ఏ సంబంధమూ లేదు; లేదు; లేదు. 90యేళ్ల క్రితం సాయిబాబా హైందవంలో లేడు. అలాంటి సాయిబాబాకు వేలయేళ్ల నాటి హైందవ ఆరాధనా సంప్రదాయాలు ఎలా ఆపాదించబడుతున్నాయి? ఎందుకు వైదిక పద్ధతుల్లోకి సాయిబాబా చొప్పించబడ్డాడు. సాయిబాబా వైదిక జీవన విధానానికి పెనుహాని. 

సాయిబాబా అన్నది నిజ హైందవుల మనోభావాల్ని కాదు హిందూ మత విశ్వాసాల్ని, వైదిక విధానాల్ని తీవ్రంగా దెబ్బకొడుతోంది! అంత కన్నా అపాయకరంగా సాయిబాబా అన్నది వైదికత్వాన్ని లేదా సనాతనత్వాన్ని క్రమక్రమంగా నాశనం చేస్తోంది!! సాయిబాబా వల్ల తరతరాల హిందువుల మత, ఆరాధనా జీవనం గాడితప్పుతోంది!!!

ఎవరి నమ్మకాలు, ఎవరి మనోభావాలు వారివి. ఇలా సాయిబాబా పరంగా నిజాలు మాట్లాడడం, సాయిబాబా వల్ల హైందవానికి జరిగిన, జరుగుతున్న హాని గురించి ఆలోచన చెయ్యడం, ఆ హానిని నిర్మూలించుకునే ప్రయత్నాలు చెయ్యడం సాయిబాబా అంధ భక్తుల మనోభావాల్ని దెబ్బకొట్టడం కాదు; కాదు; కాదు. సాయిబాబా విషయంగా నష్ట నివారణ చర్యలు తీసుకోవడం సాయిబాబా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాదు. సాయిబాబా హానిని తొలగించుకోవడం ఇవాళ్టి రోజున హైందవానికి అత్యవసరం.

అసలు మనోభావాలు అన్నవి, అభిప్రాయాలు అన్నవి జ్ఞానానికి, చదువుకు సంబంధించినవి కావు. మనోభావాలు, అభిప్రాయాల వాళ్లు విషయ పరమైన, వాస్తవాల పరమైన చర్చలకు రాకూడదు. అంధ విశ్వాసమో, పిచ్చో, వెర్రో, ఆదాయ అవసరమో, వంచనో, దగుల్బాజీతనమో, సంపాదన ఉపాయమో, అమాయకత్వమో సాయిబాబా పేరుతో జరుగుతున్నవి హైందవానికి పెనుహానిగా పరిణమించిన, పరిణమిస్తున్న కాలంలో మనం ఉన్నాం. 

సాయిబాబా అన్నది హైందవానికి తగిలిన దెబ్బల్లో ప్రధానమైంది. సరైన ఆలోచనా సరళితో, ప్రణాళికతో, మంచి బుద్ధితో, చదువుతో, మామూలు మనిషిగా ప్రతి హిందువు సాయిబాబా అపాయం నుంచి తనను తాను రక్షించుకుంటూ, హైందవాన్నీ దక్కించుకోవాలి.

"హైందవం, హిందువుల వల్ల సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినడం కాదు; సాయిబాబా, సాయిబాబా మూఢభక్తుల వల్ల సనాతన భావాలు, హిందువుల ఆరాధనా విధానాలు, సంప్రదాయాలు దెబ్బతింటున్నాయి"

రోచిష్మాన్
9444012279

No comments:

Post a Comment