-------------
బాధాకరంగా తిరుప్‌పావై
-------------------
తెలుగులో కనిపిస్తున్న తిరుప్‌పావై అనువాదాలు బాధాకరమైన అనువాదాలుగా ఉన్నాయి. తప్పుడు అనువాదాలతో, తప్పుడు లిపి అంతరీకరణలతో, తప్పుడు వివరణలతో తెలుగులో తిరుప్‌పావైకు అవమానం జరుగుతోంది.
పా'సు'రమ్ .. పా'శు'రం అయిపోయిన దగ్గర నుంచీ తిరుప్‌పావై తెలుగులో వికృతం అయిపోయింది. 'సింగం'.. 'శింగం' అయిన, 'సెన్దామరై'.. 'శెందామరై' అయిన వికారంతో
'తెలుగులో తిరుప్‌పావై తప్పిపోయింది'. ఆణ్డాళ్ చెప్పినది వేరు తెలుగులో మనకు తెలియవస్తున్నది వేరు. శోచనీయం; బాధాకరం ఇది.
తిరుప్‌పావై వంటి భక్తి రచనలు సరైన తెలివిడితో అనువాదం అవాలి. అనువాదకుల 'చాతకానితనం'తో, 'చదువులేమి'తో గొప్ప భక్తి సాహిత్యం తిరుప్‌పావై తప్పుడుతనంతో తెలుగులో స్థిరపడకూడదు; అణ్డాళ్ పలుకుకు, భావాలకు, తత్త్వానికి ద్రోహం జరగకూడదు. కానీ తెలుగులో అవే జరిగాయి.
1950ల నుంచే, మాయన్ అన్నది మాయావి, మాయదారివాడు అని అనువాదం అయిన దగ్గర నుంచే తిరుప్‌పావై తెలుగులో భ్రష్టుపట్టింది. తిరుప్‌పావై అనువాదం సరిగ్గా జరగాలి. అందుకు తమిళ్ష్ భాషపై, తెలుగు భాషపై, లిపి అంతరీకరణపై, వైష్ణవంపై, ఆణ్డాళ్ శైలిపై, శిల్పంపై, పద ప్రయోగంపై సరైన చదువుతో ఉండాల్సిన మేలైన అవగాహన ఉండాలి. తెలుగులో చదువు, అవగాహన లేకుండా తిరుప్‌పావై వచ్చేసింది.
తిరుప్‌పావై అనువాదం భక్తితో, నిజాయితీతో జరగాలి! తెలుగులో అలా జరగలేదు.
Madabhushi Sridhar ఇవాళ 18వ పాసురాన్ని అనువదించి చెప్పిన తీరును చూసి (ఆయన ఇంగ్లిష్ అనువాదమూ ఇంగ్లిష్ అన్న స్థితికి దూరంగా బాధాకరంగా ఉంటుంది)బాధను తట్టుకోలేక ఈ మాటలు చెబుతున్నాను.
అదేమిటో ఈ తెలుగు విద్వాంసులు, మేధావులు ఏ విషయాన్నీ సరిగ్గా తెలుసుకోరు; చెప్పరు. తెలుగు మేధావులకు తప్పుడుతనానికి ఈ అవినాభావ సంబంధం ఎలా ఏర్పడిందో? ఎలా బలంగా ముడిపడిందో??
అమ్మా ఆణ్డాళ్! నీ తిరుప్‌పావై మా తెలుగులో భ్రష్టుపట్టిందమ్మా... మమ్మల్ని క్షమించు తల్లీ... అమ్మా ఆణ్డాళ్! మా తెలుగుల విద్వత్తుకు, మేధకు అతీతంగా నీ తిరుప్‌పావైను నువ్వే తెలుగులో రక్షించుకో; స్థిరపఱుకుకో.
ఆణ్డాళ్ తిరువడిగళే స(శ)రణం
ఆవేదనతో
రోచిష్మాన్
9444012279
No comments:
Post a Comment