------
మట్టిపాట
------------
కొందఱు వచ్చారు
మన సంపదను కొల్లగొట్టారు;
కొందఱు వచ్చారు
మన ఆలయాల్ని కూల్చారు;
కొందఱు వచ్చారు
మన సంస్కృతిని ధ్వంసం చేశారు;
కొందఱు వచ్చారు
ఏదో కొడవలితో, సుత్తితో మనల్ని తీవ్రంగా గాయపఱిచారు;
కొందఱు వచ్చారు
మనల్ని విడదీశారు;
కొందఱు వచ్చారు
మన చదువును, జీవనాన్ని కల్మషం చేశారు;
కొందఱు వచ్చారు
మనల్ని పాడుచేశారు;
కొందఱు వచ్చారు
తమ మతాలతో మనకు హితం లేకుండా చేశారు;
కొందఱు వచ్చారు
మనల్ని మానసిక బానిసల్ని చేశారు;
కొందఱు వచ్చారు
మనల్ని మనకే కాకుండా చేశారు-
నేను ఉన్నాను,
నాకు నోరు ఉంది;
నా మట్టిపాటను
నేను పాడుకుంటూ ఉంటాను.
రోచిష్మాన్
9444012279
(ఒక చైనీస్ జానపద గేయం ప్రేరణతో)
No comments:
Post a Comment