Monday, January 5, 2026

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘‍♀️భక్తుడు : ధ్యానంలో నా మనస్సు నిశ్చలంగా ఉండటం లేదు, ఎందువల్ల ?_*
*_🦚 మహర్షి : మనస్సు చలించినప్పుడెల్లా, దాన్ని మళ్ళీ మళ్ళీ లోనికి మళ్ళిస్తూనే ఉండు._*
*_🧘‍♀️భక్తుడు : దుఃఖంలో ఉన్నప్పుడు సాధన కష్టముగా  అనిపిస్తుంది. ఎందువలన ?_*
*_🦚 మహర్షి : మనస్సు బలహీనం, కాబట్టి మనస్సుని దృఢం చెయ్యి._*
*_🧘🏼‍♂️భక్తుడు : ఎటువంటి సాధన ద్వారా ?_*
*_🦚 మహర్షి : సత్సంగం, ఈశ్వర ఆరాధన, ప్రాణాయామం ద్వారా.._*
*_🧘🏼‍♂️భక్తుడు : అప్పుడు ఏం జరుగుతుంది !_*
*_🦚 మహర్షి : దుఃఖం తొలగుతుంది. లక్ష్యం దుఃఖాన్ని తొలగించడమే కదా! సుఖం నీవు క్రొత్తగా పొందేది గాదు; నీ సహజ స్వభావం సుఖమే గనుక.  ప్రయత్నమంతా దుఃఖాన్ని తొలగించటానికే. దుఃఖాన్ని తొలగించడానికి పైన చెప్పిన సత్సంగం, ఈశ్వర ఆరాధన, ప్రాణాయామం ఉపయోగపడతాయి !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘‍♀️ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment