12 సంవత్సరాల అఖండ బ్రహ్మాచర్యం యొక్క లాబాలు | Brahmacharya motivation telugu | brahmacharya journey
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AOD7FXLcxMU
Transcript:
(00:00) [సంగీతం] 12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం దీన్ని నాలుగు స్టేజెస్ గా డివైడ్ చేశారు మొదటిగా ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్యం ఇలాంటి వారిలో శారీరక శక్తి బాగా పెరుగుతుంది రెండవది మూడు సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం ఇలాంటి వారిలో శారీరక బలంతో పాటు గొప్ప తేజస్సు కూడా ఉంటుంది ఇలాంటి వాడు జనం మధ్యలో ఉన్నప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తాడు మూడవది ఆరు సంవత్సరాల పాటు అఖండ బ్రహ్మచర్యం ఇలాంటి వారిలో గొప్ప శారీరక బలం అగ్ని లాంటి తేజస్సుతో పాటు ఇంటలెక్చువల్ అంటే మేధాశక్తి కూడా బాగా
(00:47) పెరుగుతుంది ఇలాంటి వాడు ఏ విషయాన్ని అయినా సరే ఒక్కసారి చూస్తే చాలు గ్రహించగలుగుతాడు వీటినే ఓజాస్ అని అంటారు నాలుగవది 12 సంవత్సరాలు సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం దీనికి మాత్రం చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు ఇలాంటి వారు కేవలం సంకల్పం చేస్తే చాలు ఏ కార్యాన్ని అయినా సాధించగలుగుతారు ఇలాంటి వారికి గొప్ప శారీరక బలం అపారమైన తేజస్సు అపరిమితమైన మేధాశక్తితో పాటు గొప్ప వాక్ చైతుర్యం కూడా ఉంటుంది వీళ్ళు మాట్లాడే మాటలు అవతల వాడికి తూటాలాగా తగులుతాయి ఆధ్యాత్మికతకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు వీర్యాన్ని బయటకు పంపించకుండా శరీరంలో
(01:37) ఉంచగలిగితే అది ఓజాస్ గా పరిమితి చెంది సుషుమ్న నాడి ద్వారా బ్రెయిన్ వరకు చేరుతుంది ఈ సుషుమ్న నాడి అనేది మూలాధార చక్రం దగ్గర నుండి మొదలై వెన్నుపూసతో సమానంగా పై వరకు వెళ్లి బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది మనలో మెమరీ పవర్ బాగా పెరగాలంటే మన బ్రెయిన్ కి కావలసిన మైక్రో న్యూట్రియంట్స్ అంటే మెగ్నీషియం జింక్ కాల్షియం ఇలాంటి వాటితోనే సీమెన్ తయారవుతుంది కాబట్టి వీర్యశక్తిని మనం పైకి పంపించగలిగితే అది మన బ్రెయిన్ కి ఇంధనం లాగా పనిచేస్తుంది అందుకనే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య లాభః అంటాడు పతంజలి నువ్వు నీ జీవితంలో
(02:25) బ్రహ్మచర్యాన్ని ప్రతిష్టించగలిగితే నీకు వచ్చే లాభం ఏంటి అంటే వీర్యశక్తి దాన్ని నువ్వు సుషుమ్న నాడి ద్వారా ప్రాణాయామాది వ్యాయామాలు చేసి పైకి పంపించగలిగితే అది ఓజస్సుగా మారి నీ లక్ష్యాన్ని సాధించడానికి సాయపడుతుంది అంటే మనం నిజంగానే వీర్యాన్నే పైకి పంపిస్తున్నామని అర్థం కాదు ఆ హార్మోనల్ ఎనర్జీ ఏదైతే ఉందో లేదా ఆ ఓజాస్ దాన్ని మాత్రమే టాప్ ఆఫ్ ది హెడ్ వర్క్ కి పంపిస్తున్నాం కావాలంటే మీరు ఎవరైనా గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్ని చూడండి వాళ్ళు చేసిన డిస్కవరీస్ అన్నీ కూడా వాళ్ళు కఠినమైన బ్రహ్మచర్యం అనే అవస్థలో ఉన్నప్పుడే జరిగాయి అంతే తప్ప రాత్రంతా
(03:12) భార్యతో రమించి తెల్లారే ల్యాబ్ లో చేసిన ఆవిష్కరణలు కాదు అవన్నీ ఎందుకంటే వాళ్లకు కూడా తెలుసు బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల మేధాశక్తి బాగా పెరుగుతుందని వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి పైథాగరస్ అరిస్టాటిల్ లాంటి మేధావులు కూడా గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించారు ఇంతటి గొప్ప ఆచారం పుట్టిందేమో మన దగ్గర కానీ మనం దాని మహత్వాన్ని గుర్తించలేకపోయాం కానీ వెస్టర్న్ కంట్రీస్ దాన్ని ఒక సాధన పరికరంగా వాడుకుని వాళ్ళ లక్ష్యాన్ని సాధించగలిగారు ఇప్పుడు మనకి ఎలాంటి ఆచారం నడుస్తుంది అంటే నేను మగాన్ని అనిపించుకునే ఆచారం ఒక స్త్రీ నాకంటే
(03:57) బలహీనమైనది కాబట్టి నేను ఆమెని బలవంతంగా అనుభవించి ఆ తరువాత చిత్ర హింసలు పెట్టి ఆమెను చంపేస్తాను కాబట్టి నేను మగాన్ని ధర్మశాస్త్రం మనకి ఎవడు మగాడు అని చెప్తుందంటే ఎవడైతే ఇంద్రియాలకు వసుడైపోకుండా వాటిని నిగ్రహిస్తాడో ఎవడైతే అవతల ఉన్నవాడు తన శత్రువు అయినా సరే ఆ శత్రువులో ఏదైనా గొప్ప లక్షణం ఉంటే గుర్తించగలుగుతాడో వాడు అసలైన మగాడు ఇప్పుడు మీరు అడగొచ్చు ఎక్కడ చూసిన బూతునే చూపిస్తున్నారు కదా అందుకే జనాలు దాని వల్ల ప్రభావితం చెంది బయట కూడా అదే చేస్తున్నారు ఇందులో ఆశ్చర్యం ఏముంది అని మీరు అడగొచ్చు అసలు అవన్నీ చూడమని ఎవడు
(04:43) చెప్పాడు పైగా మనలాంటి సాధకులకి అవన్నీ నిషిద్ధం కూడా అయినా సరే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటే ఇక మీ ఇష్టం అందుకనే వివేకానందుడు మన దేశం గురించి ఒక మాట చెప్తాడు మనకి ఆలోచన తక్కువ ఎక్కువ అడ్డమైన ఆచారాలు ఎక్కువ కానీ వెస్టర్న్ కంట్రీస్ లో అలా కాదు వాళ్ళు దేన్ని అంత తేలిగ్గా నమ్మరు ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తారు అందుకే వాళ్ళ దగ్గర వైజ్ఞానిక శాస్త్రం ఎక్కువగా [సంగీతం] పెరిగింది మనం బ్రహ్మచర్య ఫలితాల్ని పొందలేకపోవడానికి పెద్ద అడ్డుగోడ ఈ నైట్ ఫాల్ పైగా దీనివల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ నో ఫ్యాప్ సీమన్ రిటన్ పెద్ద
(05:31) స్కాము అసలు రిజల్ట్స్ ఏమి కనిపించడం లేదు ఒకవేళ మీకు తరచు నైట్ ఫాల్ అయితే మీకు ఎలాంటి రిజల్ట్స్ కనిపించవు పైగా నేనే మీతో చాలాసార్లు చెప్పాను ఒక్కసారి వీర్యపతనం జరిగిన సరే మీ బ్రహ్మచర్యం పోతుంది మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేయాలి అని ఉదాహరణకి మీరు ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్యాన్ని పాటించారు ఆ తర్వాత మీకు నైట్ ఫాల్ అయింది సంవత్సరం అంటే చాలా తక్కువ ఇలాంటి తక్కువ డ్యూరేషన్ సాధనలో మీకు ఈ సంవత్సర సాధనకి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే వస్తాయని చెప్పడం కూడా కష్టమే కాబట్టి మీరు ఎంత కాలం అయితే ఆ బ్రహ్మచర్య అవస్థలో ఉంటారో అంత కాలం
(06:16) మాత్రమే మీలో ఆ శక్తి ప్రవాహం అనేది ఉంటుంది ఎప్పుడైతే నైట్ ఫాల్ అవుతుందో ఆ తేజస్సు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు అయితే ఏమైంది కంటిన్యూ చేస్తే సరిపోతుంది కదా మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేయడం ఎందుకు అని ఒకవేళ మీకు నెలకి లేదా రెండు నెలలకి నైట్ ఫాల్ అయితే మీరు మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని మొదలు పెట్టొచ్చు కానీ సంవత్సరం లేదా మూడు సంవత్సరాల తర్వాత నైట్ ఫాల్ అయితే అంటే నా ఉద్దేశం నైట్ ఫాల్ అంటే రాత్రి మాత్రమే జరుగుతుంది అని కాదు అది ఎప్పుడైనా జరగొచ్చు ఆ పదాన్ని వాడితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి వాడుతున్నాను
(06:55) కాబట్టి మూడు లేదా ఆరు సంవత్సరాల తర్వాత అయితే అసలు ముందు మీ తేజస్సు బయటికి పోతుంది అన్నిటికీ మించి అసలు మీరు అందులో నుంచి తేరుకోవడం చాలా కష్టం ఎందుకంటే మీకు నా సొంత అనుభవం చెప్తాను నా ఆరు సంవత్సరాల సాధనలో నేను కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే నైట్ ఫాల్ అవ్వకుండా బ్రహ్మచర్యాన్ని పాటించగలిగాను అసలు సగం ప్రాణమే బయటకు పోయినట్టు ఉంటుంది అందులోంచి తేరుకోవడానికే మూడు నుండి ఆరు నెలలు పడుతుంది ఎందుకంటే మళ్ళీ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మంచి ఆహారం తీసుకోవాలి ఇప్పుడున్న కల్తీ ఆహారాన్ని బట్టి అది ఇంకా టైం పట్టొచ్చు మీకు ఇంకా వివరంగా
(07:39) చెప్పాలంటే అసలు కొన్ని ఆశ్రమాల్లో రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయి అంటే ఉదయం పూట స్టూడెంట్స్ అందరూ అసెంబుల్ అవుతారు ఆ ప్రార్థన మందిరంలో ప్రేయర్ చేయడానికి ఎవడికైతే నైట్ ఫాల్ అవుతుందో వాడిని గురువు కనిపెట్టగలుగుతాడు ఒరేయ్ నీ మొహం నల్లగా అయిపోయింది నీ తేజస్సు నశించింది కాబట్టి నువ్వు ఒక సంవత్సరం పాటు నాకు కంటపడొద్దు అంటాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నైట్ ఫాల్ అయితే ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది మునుపటి లాగా ఉండదు కాబట్టి నాకు మూడు సంవత్సరాల తర్వాత నైట్ ఫాల్ అయింది కానీ నేను 12 సంవత్సరాల అఖండాన్ని పాటించాలనుకున్నాను మరి ఇప్పుడు నేను
(08:20) తిరిగి డే వన్ నుంచి స్టార్ట్ చేయాలా అంటే అక్కర్లేదు నేను మిమ్మల్ని భయపెట్టడానికే అలా చెప్పాను ఎందుకు అంటే మీరు మరింత జాగ్రత్తగా గా ఉంటారు అని ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి మరి స్వామి వివేకానంద లాంటి మహాపురుషులు 12 సంవత్సరాలు ఎలా చేయగలిగారు వాళ్ళందరూ కూడా ముందు పునాదిని బలంగా చేసుకున్నారు నైట్ ఫాల్ ని కంట్రోల్ చేసే వ్యాయామ సాధనలు శరీరానికి అలవాటు చేశారు నేను ఏం చెప్తానంటే ఆరు నెలల నుండి సంవత్సరం పాటు మీరు ఈ నైట్ ఫాల్ ని పర్మనెంట్ గా కంట్రోల్ చేసే ఎక్సర్సైజెస్ చేయడానికే కేటాయించాలి అప్పుడు మాత్రమే మీ బ్రహ్మచర్య సాధన ఎలాంటి అవరోధాలు లేకుండా
(09:07) మీకు ఫలితాన్ని ఇస్తుంది మీరు అనుకోవచ్చు నైట్ ఫాల్ ఎంత దాని బ్రతుకు ఎంత దానికి వన్ ఇయర్ వేస్ట్ చేయడం అవసరమా అని అలా అయితే ఈ పాటికే చాలా మంది మహాపురుషులు తయారయ్యే వాళ్ళు ఎక్కడో కోట్లలో ఒక్కడు ఉంటాడు ఏక సంతాగ్రాహి స్వామి వివేకానందుడి లాగా కాబట్టి మనం ఉదయం నిద్ర లేవడం దగ్గర నుండి మొదలు పెడదాం సాధకుడు అనేవాడు ఖచ్చితంగా నాలుగు గంటలకు లేవాలి దానికి తగ్గట్టే మీరు పెందలకాడ నిద్ర పోవాలి లేదండి మేము కష్టపడితే గాని ఇంట్లో గడవదు రాత్రి చాలా లేటుగా నిద్రపోతామంటే ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవచ్చు ఇక రెండవది వ్యాయామం రోజుకి కనీసం రెండు గంటలైనా సరే
(09:54) కఠినమైన వ్యాయామం చేయాలి ఏదో రెండు గంటలు వాకింగ్ కి వెళ్తానంటే కుదరదు బాగా శ్రమించి లేకపోతే బ్రహ్మచర్యం నిలబడదు అంటే నా ఉద్దేశం మిగతా వారితో పోలిస్తే మనలో కామశక్తి లేదా వీర్య శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి శరీరం అంత శక్తిని భరించలేదు దాన్ని మీరు ఏదో రకంగా ఖర్చు పెట్టాలి మనం దాన్ని సెక్స్ చేయడానికో లేదా రొమాన్స్ చేయడానికో ఖర్చు పెట్టకుండా వ్యాయామాలు చేయడానికి వాడాలి దీన్నే సెక్సువల్ ఎనర్జీ ట్రాన్స్మిటేషన్ అంటారు మూడవది స్నానం ఇది ఎంత చెప్పుకోదగిన విషయం కాకపోయినా సరే శరీరంలో కామ ప్రచోదన ఎక్కువైనప్పుడు దాంట్లో నుంచి బయటకు
(10:41) రావడానికి కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం అనేది ఒక మార్గం అని చెప్పొచ్చు అయినా సరే మీకు కామాగ్ని చల్లారకపోతే మీరు అలా వాకింగ్ కి వెళ్ళండి ఎప్పుడైతే మీరు జనం మధ్యలో ఉంటారో అప్పుడు కామం పటాపంచలు అవుతుంది కానీ ఇందులో ఇంకొక సమస్య కూడా ఉంది మనం అనుకోకుండా అలా చూస్తుంటే అక్కడ ఒక స్త్రీ ఉండొచ్చు అంటే అంత నిగ్రహం లేని వాళ్ళమా అని నా ఉద్దేశం కాదు సన్యాసాశ్రమంలో ఒక మాట చెప్తారు ఎవరైనా ఒక స్త్రీని ఒకసారి చూస్తే అది సహజం అదే స్త్రీని రెండవ సారి తలతిప్పి చూస్తే అది కోరిక మళ్ళీ మూడవ సారి కూడా అదే స్త్రీని తలతిప్పి చూస్తే అది కామం కాబట్టి మనం ఆ
(11:27) సహజ స్థితిలోనే ఉండాలి మరి అంత అందంగా ఉంటే ఆవిడ సౌందర్యాన్ని చూడవచ్చు కామ కోరికలు పెట్టుకోకూడదు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే విషయానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి అంతే తప్ప మీ నెంబర్ అంతా మీరు ఎక్కడ ఉంటారు అని అడగకూడదు అన్నిటికీ మించి ఎక్కడ విషయాన్ని అక్కడే వదిలేయాలి అందుకనే ఈ తలనొప్పి అంతా ఎందుకు వైరాగ్యాన్ని అలవాటు చేసుకో అంటాడు వివేకానందుడు ఇక నాలుగవది ఆహారం నిజానికి తినడానికి తిండి లేక దేవుడా రాముడా అని చచ్చే వాళ్ళు చస్తుంటే మన పరిస్థితి ఎలా తగలడిందో చూడండి వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలా నాన్ వెజ్ తింటే కామ కోరికలు ఎక్కువగా
(12:13) వస్తాయంటగా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం కోరికలు వస్తాయి నేను మీకు లాస్ట్ టైం చెప్పాను అయినా సరే మీరు నా మాట వినలేదు కాబట్టి ఒక వ్యక్తిని మీకు ఉదాహరణగా చూపిస్తాను అప్పుడు మీ లక్ష్యాన్ని బట్టి ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తేటతెల్లంగా అర్థమవుతుంది ఆ వ్యక్తి పేరు మైక్ టైసన్ ఈయన కూడా చాలా గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించాడు సాధారణంగా ఈ ఆటగాళ్ళందరూ కాంపిటీషన్ కి రెండు లేదా మూడు నెలల ముందు సీమన్ రిటెన్షన్ చేస్తారు కానీ మైక్ టైసన్ ఐదు సంవత్సరాల పాటు సీమన్ రిటెన్షన్ చేశాడు ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు మీకన్నా ముందు పెద్ద పెద్ద
(12:56) ఛాంపియన్స్ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంతకాలం చేయలేదు దానికి టైసన్ అంటాడు నేను వాళ్ళకన్నా పెద్ద ఛాంపియన్ అవ్వాలి అనుకున్నాను అందుకే ఫైవ్ ఇయర్స్ పాటు చేశాను ఇది కల్మషం లేని స్వార్ధం నిజానికి ఇలాంటి స్వార్ధం అందరికీ ఉండాలి అప్పుడే వాళ్ళ కెరియర్ లో ఎక్సెల్ అవ్వగలుగుతారు మరి ఈయన ఒక నాన్ వెజిటేరియన్ మీరు అన్నట్టు నాన్ వెజ్ తింటే కామ కోరికలు ఎక్కువగా వస్తే ఆయనకి నైట్ ఫాల్ అవ్వాలి లేదా సెక్స్ చేయాలి కానీ ఆ రెండు విషయాలు జరగలేదు ఎందుకంటే ఆ కామశక్తిని ఆయన ట్రాన్స్మిట్ చేశాడు ఎలాగ అంటే వ్యాయామాల ద్వారా రోజుకి 24 గంటలు అయితే ఆయన 12
(13:44) గంటలు వ్యాయామాలకే కేటాయిస్తాడు ఒకవేళ మీరు కూడా ఇలాంటి గేమ్స్ ని మీ కెరియర్ గా ఎంచుకుంటే మీరు నాన్ వెజ్ తినొచ్చు అసలు మాకు ఎలాంటి కెరియర్ అక్కర్లేదండి మేము కేవలం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాం మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అన్నా సరే దానికి పవిత్రత చాలా ముఖ్యం ఆ పవిత్రతకి పరమావస్థ అనేది ఏదైనా ఉంటే అది బ్రహ్మచర్యమే అని చెప్పాలి వేదాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే ఎవడైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడో వాడి చుట్టూ మనుషులు కాదు దేవతలు సంచరిస్తారు అంటే దాని అర్థం వాళ్ళ పనులన్నీ మానేసి మీ పక్కనే కూర్చుంటారు
(14:28) అని కాదు మీ ప్రార్థన త్వరగా ఆలకిస్తారు అని కాబట్టి మీ ఆహార నియమం వేరుగా ఉంటుంది అసలు దీనికి దానికి సంబంధం ఉండదు మీలాంటి వారు యోగులు తీసుకునే ఆహారాన్ని స్వీకరించాలి ఒక యోగి తన ఆహారాన్ని రోజు రోజుకి తగ్గిస్తాడు అందుకే యోగులు చెప్పే మాట ఏంటి అంటే లంకనం పరమౌషధం అంటే ఉపవాసం పరమ ఔషధం కేవలం యోగులు మాత్రమే కాదు ఎవరైనా సరే వారానికి కనీసం ఒక్క రోజైనా లంకనం పాటించొచ్చు ఎందుకంటే ఆ రోజు కేవలం నీళ్లు తీసుకోవడం ద్వారా నేచురల్ ఎనిమా చేసుకుని ప్రేగుల్ని శుభ్రం చేసుకోవచ్చు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు అంటే
(15:14) సగానికి పైగా రోగాలు ఈ ప్రేగుల్లో ఇరుక్కుపోయిన మలం కారణంగానే వస్తున్నాయి అని ఇక ఐదవది నైట్ ఫాల్ ని పర్మనెంట్ గా కంట్రోల్ చేసే ఎక్సర్సైజ్ దీని పేరు అశ్విని ముద్ద ఈ ఎక్సర్సైజ్ ఎంత పవర్ఫుల్లో మీకు తెలియాలి అంటే అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాలి అశ్విని అంటే గుర్రం అది మలరంంతో కాంట్రాక్షన్ ఎక్స్టెన్షన్ చేస్తుంది దానివల్ల అది ప్రాణవాయువుని బయటకు పంపించకుండా కాసేపు శరీరంలోనే ఉంచగలుగుతుంది అది ఎలాగా అంటే మనం పీల్చుకునే ప్రాణవాయువు కేవలం ముక్కులో నుంచి మాత్రమే బయటకు వెళ్ళదు అది నవరంద్రాల్లో నుంచి బయటికి వెళ్తుంది
(15:59) వీటన్నిటిని లో కల్లా మలరం నుండే ఎక్కువ ప్రాణవాయువు బయటికి పోతుంది అందుకనే గుర్రం దాని మలరంధ్రాన్ని సంకోచిస్తుంది అప్పుడు ప్రాణవాయువు మొత్తం నెర్వస్ సిస్టం లోకి వెళ్లి దానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది అందుకే అది ఎంత దూరం పరిగెత్తినా సరే ఒకే స్పీడ్ ని మెయింటైన్ చేయగలుగుతుంది పైగా ఈ అశ్విని ముద్ర జననేంద్రియాల దగ్గర ఉన్న కండరాల్ని దృఢంగా చేస్తుంది సాధారణంగా ఈ జననేంద్రియాల దగ్గర ఉన్న కండరాలు వయస్సు పెరిగే కొద్దీ బలహీనం అవుతాయి ఈ ఎక్సర్సైజ్ ద్వారా అవి మరింత దృఢంగా అవుతాయి అప్పుడు నైట్ ఫాల్ అయ్యే అవకాశమే లేదు అందుకనే మహారాణ ప్రతాప్
(16:44) లాంటి వీరులు కూడా అశ్విని ముద్రని రోజు ప్రాక్టీస్ చేసేవారు ఇక ఆరవది నేను ఇందాక చెప్పినట్టు వీర్యశక్తి అనేది ఓజస్సుగా పరిమితి చెంది సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్తుంది అయితే ఈ సుషుమ్న నాడిని మరింత ప్రభావితం చేయడానికి అంటే బెటర్ గా పని చేసేలా చేయడానికి ప్రాణాయామం చేయాలి అని యోగ శాస్త్రం చెప్తుంది నిజానికి మనకి ఇందాక అశ్విని ముద్రలోనే ప్రాణాయామం కూడా పూర్తవుతుంది కానీ ప్రాణాయామంలో చాలా రకాలు ఉంటాయి నాడి శోధన అనే ప్రాణాయామం ద్వారా సుషుమ్న నాడి మరింత ప్రభావితం చెందుతుంది ఇది అందరికీ మాండేటరీ ఇంకా
(17:30) కాదు మాకు 200 పనులు ఉంటాయండి కుదరదు అంటే స్కిప్ చేయొచ్చు కానీ అశ్విని ముద్రని మాత్రం రోజుకు రెండు మూడు సార్లు అయినా సరే పావు గంట చొప్పున ప్రాక్టీస్ చేయాలి ఇక ఏడవది మీ స్లీపింగ్ పొజిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జననేంద్రియాలకి ఒత్తిడి లేదా రాపిడి తగిలేలా పడుకోకూడదు అదేంటి నిద్రలో మాకెలా తెలుస్తుంది అంటే కుదరదు శరీరానికి అలవాటు చేసి చేయాలి లేకపోతే మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా సరే వ్యర్థమే మీకు ఖచ్చితంగా నైట్ ఫాల్ అవుతుంది ఇది మీకు అలవాటు అవ్వడానికి మూడు నుంచి ఆరు నెలలు పట్టొచ్చు ఎలాగో మనం నైట్ ఫాల్ ని కంట్రోల్ చేయడం అనే పునాది
(18:15) వేసుకోవడానికే సంవత్సరం కేటాయిస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మీకు అలవాటు అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎప్పుడైతే నైట్ ఫాల్ అవుతుందో అప్పుడు మీరు కొన్ని విషయాల్ని అబ్సర్వ్ చేయండి మీరు ఏ పొజిషన్ పొజిషన్ లో పడుకున్నారు దానివల్ల వైటల్ ఆర్గాన్స్ కి ఏదైనా ఒత్తిడి తగిలిందా లేదా మీ బ్లాడర్ ఫుల్ గా ఉందా ఒకవేళ బ్లాడర్ ఫుల్ గా ఉన్నా సరే అది ఎరోటిక్ డ్రీమ్స్ కి దారి [సంగీతం] తీస్తుంది ఇక ఎనిమిదవది ఇది అందరికీ తెలిసిన విషయమే మ్యూజిక్ హీల్స్ సంగీతం స్వస్థపరచగలదు మీరు కామ వికారం నుండి బయటకు రావడానికి సంగీతాన్ని ఒక మాత్రగా
(19:02) వాడొచ్చు పెద్ద పెద్ద క్రీడాకారులు కూడా వాళ్ళ ట్రైనింగ్ సెషన్ లో ఉత్తేజాన్ని కలిగించే సాంగ్స్ వింటారు ఏదో అలాంటి వాళ్ళ ఫోటోల్ని డిపి గానో వాల్పేపర్ గానో పెట్టుకుంటే కుదరదు వారిలాగా నిరంతర సాధన చేయాలి అందుకే వివేకానందుడు అంటాడు చరిత్ర చదవడం మురిసిపోయి చంకలు కొట్టుకోవడం కాదు నువ్వు చరిత్ర కాగలవా ఇక తొమ్మిదవది మొన్న ఒకాయన ఒక ప్రశ్న అడిగాడు ఇన్ని సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తే రేపు పెళ్లైన తర్వాత ఏదైనా ఇబ్బందా అని ఎలాంటి ఇబ్బంది లేకపోగా మీ సామర్థ్యం మరింత పెరుగుతుంది ఒకవేళ మీకు ఇబ్బంది అయితే అది భార్యని ఎలా ప్రేమించాలి అన్న విషయంలోనే అవ్వాలి
(19:48) దానికి మీరు కామసూత్రాన్ని ఫాలో అయితే సరిపోతుంది అందులో కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు స్త్రీ పురుషులు ఎలాంటి భంగిమల్లో సెక్స్ చేయొచ్చో అలాంటి సెక్స్ పొజిషన్స్ అన్నీ కూడా వాత్సయనుడు చెప్తాడు మనకి కామసూత్రాలు అసలు నిజంగా భార్య భర్తలు అనేవాళ్ళు ఈ కామసూత్రాన్ని ఫాలో అయితే వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది కానీ ఆ మూర్ఖులు అడ్డమైన చెత్త చూస్తారు అందులో కేవలం ఎలా కామించాలో చూపిస్తారు కానీ ఇందులో ప్రేమ కామం రెండూ ఉంటాయి ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కామసూత్రం అనే మహా గ్రంథాన్ని రాసినవాడు ఆ జన్మ బ్రహ్మచారి
(20:34) చివరిగా ఈ బ్రహ్మచర్య సాధన గురించి నేను మీతో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అన్నది లెక్కలోకి రాదు నీ లక్ష్యం మంచిదా చెడ్డదా అన్నది కూడా లెక్కలోకి రాదు కేవలం నువ్వు సాధన సరిగ్గా చేస్తున్నావా లేదా అన్న విషయం మాత్రమే లెక్కలోకి వస్తుంది దానికి రావణాసురుడే గొప్ప ఉదాహరణ వీడు మూడు లోకాల్ని చిత్ర హింసలు పెడతాడు అని బ్రహ్మ గారికి తెలియదా అయినా ఎందుకు వరాలు ఇచ్చాడు అంటే చేసిన సాధన అంటే తపస్సు అటువంటిది ఆయన అక్కడితో ఆగలేదు భగవంతుడు ప్రత్యక్షం కాలేదని ఆ పది తలలు నరికి
(21:20) అగ్నికి ఆహుతి ఇచ్చాడు అంటే లక్ష్యం పట్ల ఎంత తెగింపో చూడండి కొందరు తపస్సు అంటే విశ్వామిత్రుడు అంటారు కానీ ఆయన కూడా ఇంద్రియాలకి వసుడు అయ్యాడు కానీ రావణాసురుడి తపస్సులో అలాంటివి జరగలేదు కాలు కింద చెప్పుల్ని తొక్కి పెట్టినట్టు తొక్కి పెట్టాడు ఇంద్రియాల్ని అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు ఈ హార్మోన్స్ అన్ని ఒకచోట మీటింగ్ పెట్టుకున్నాయట ఏంట్రా ఇది మనం విశ్వామిత్రుడిని కూడా ఓడించాం కానీ ఈ రావణాసురుడి చేతిలో ఓడిపోయాం అని రెండోసారి మళ్ళీ దాడి చేశాయట వరాలు వచ్చేసాయిగా ఈసారి నిగ్రహించలేక వాటి కారణంగానే బలి అయిపోయాడు కాబట్టి ఇంద్రియాలను
(22:04) నిగ్రహించకపోతే పది తలలు ఉన్నవాడే నిలబడలేకపోయాడు మనమెంత చచ్చిపోతాం అని నా ఉద్దేశం కాదు చరిత్ర సృష్టించలేము అని నా బాధ కాబట్టి మీ బ్రహ్మచర్య జర్నీ ఏదైతే ఉందో మీ ధ్యాస అంతా రోజులు లెక్కపెట్టడం మీదే కాకుండా మీ లక్ష్యాన్ని సాధించే వరకు మీ జీవన శైలిలో భాగం చేసుకునే ప్రయత్నం చేయండి
No comments:
Post a Comment