Friday, February 27, 2026

******లైంగిక ప్రవృత్తిని నిరోధించుట ఎట్లు ? - Bhagavan Ramana Maharshi

 85. లైంగిక ప్రవృత్తిని నిరోధించుట ఎట్లు ? నీవు, నిన్ను శరీరముగా భావించుచున్నావు. అందువలన వేరొక వ్యక్తిని కూడా శరీరముగా భావించుచున్నావు. లింగభేదము తలఎత్తుచున్నది. కాని నీవు శరీరమునకు ఆత్మగా వుండుము. అపుడు లింగభేదము అనుటయే వుండదు. కామ ప్రసక్తి వుండదు. అంతయు భావనలోనే వుంది. అందము, చందము యివన్నీ మనసు చేసే కల్పనలే. శరీరంలో వుండే వాస్తవ దోషాలను, కల్మషములను పరిశీలిస్తే, కామవాంఛపోతుంది. శరీరము తొమ్మిది చిల్లుల కుండ మాత్రమే. ఏ చిల్లి నుంచైనా వచ్చేది అసహ్యమే. కనుక నీ శరీరము మీద కాని, మరొక శరీరము మీద కాని వ్యామోహం లేకుండా వుండుము. చేతల్లో, మాటల్లోనే కాకుండా మనసులోనైనా లైంగిక వాంఛ వుండుట దోషమే. మన దృష్టి అసహ్యము మీదే వుంటుంది. అసహ్యంలోనే అందాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. ఏమిటో యీ మాయ, ఈ అజ్ఞానము.

ఇది తొలగేదెప్పుడో. సాధకులకు (స్త్రీ, పురుషులకు) మర్మాంగములు గుర్తుకు వచ్చినట్లైతే అది నా జన్మస్థానం అని పురుషులు, అది నా జన్మకు కారణమని స్త్రీలు తలంచితే కామభావన తొలగిపోవును. వాటికి ఒక నమస్కారం సమర్పిస్తే సరిపోతుంది. బాగా కృశించి వంగిపోయిన శరీరాలను గుర్తుకు తెచ్చుకోండి. ఇలాంటి శరీరం కొరకేనా నేను వెంపర్లాడింది అని అనిపిస్తుంది. ప్రతి స్త్రీని తల్లిగా పురుషులు, ప్రతి పురుషుని తండ్రిలాగ స్త్రీలు తలచవలెను. శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవిల దివ్య దాంపత్యమును గుర్తుకు తెచ్చుకొనవలెను. ఏవిధంగానైనా సరే నీ మనసు మహాశుద్ధమై పోవాలి. ఏవిధంగానైనా సరే నీ మనసు మహాశుద్ధమై పోవాలి. ఏవిధంగానైనా సరే నీ మనసు మహాశుద్ధమై పోవాలి. అందుకొరకు ఎంతైనా కష్టపడవలసినదే. మనసు మహాశుద్ధమైతేనే జ్ఞానోదయమౌతుంది. ఆత్మానుభవమౌతుంది. అపుడే మోక్షం. లైంగిక పరమైన ఆలోచనలు వచ్చినపుడు నా ఆలోచనలను భగవంతుడు గమనిస్తున్నాడని గుర్తుంచుకుంటే ఆ ఆలోచనలు మాయమైపోతాయి. నాకు క్షణికమైన ఆనందాన్నిచ్చేటువంటి తలపులు, పనులు నాకవసరంలేదు. నాకు శాశ్వతమైన ఆత్మానందమే కావాలి. ఆత్మనిష్టయే కావాలి అని మాటిమాటికి తలచుకొంటే కామభావన నశిస్తుంది. ఏవిధంగానైన వాసనలన్నీ సమూలంగా నశించవలసినదే. అపుడే మోక్షం. ఎంత చిన్న కోరిక మిగిలినా కూడా మళ్ళీ జన్మ తప్పదు. ప్రపంచం వైపునకు లాగబడక తప్పదు. నిజానికి పరిపూర్ణమైన, శాశ్వతమైన అందము, ఆనందము నీవే(ఆత్మే). A thing of beauty is a joy for ever.


- refernce from book: Bhagavan Bhoda




No comments:

Post a Comment