కామి గాని వాడు మోక్షగామి కాలేడు 1
గమనిక: ఇటీవలి కాలంలో అతిగా వీర్యస్ఖలనం చేసుకున్న కూడా అనారోగ్య సమస్యలు ఉండవని ఈమధ్య అలోపతి వైద్యులు చెప్పడంతో వయస్సులో ఉన్న యువకులు యువతులు పెడదారి పడుతున్నారు. బ్రహ్మచర్య దీక్ష అనేది స్త్రీ పురుషులకు సంబంధించినది అని గ్రహించండి .పురుషుడు లో రక్తం ద్వారా వీర్యం తయారీ అయితే అదే స్త్రీ మూర్తి లో రక్తము ద్వారా అండాలు తయారవుతాయని గ్రహించండి. కాబట్టి యువత వీర్య స్తంభనయందు అమిత ఆసక్తి కలిగి ఉండాలి. బ్రహ్మచర్యము అంటే కామాన్ని అణచివేయడం కాదని కామాన్ని అదుపులో ఉంచుకుని మనస్సు నుండి దానిని విడిచి పెట్టమని గ్రహించండి. మైధునంలో పాల్గొన వద్దని చెప్పటం లేదు కానీ అతిగా పాల్గొనవద్దు.
అది గృహస్థులు అయితే నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మైధునంలో పాల్గొనాలి. బ్రహ్మచారి అయితే తనకి వివాహం అయిన తర్వాతనే సంయోగములో పాల్గొనాలి. వివాహం కాని బ్రహ్మచారి అయితే నెలకు ఒకసారి మాత్రమే స్వయంతృప్తి తో భావప్రాప్తి పొందాలి. అప్పుడే వీర్యము కాస్తా తేజస్సు గాను ఆపై ఓజస్సుగాను మారుతుంది. తద్వారా ఈ వీర్యములో అతిశక్తివంతమైన పదార్థాలు మరలా రక్తంలో కలిసి రక్తం ద్వారా శరీరం నాడులలోనికి ప్రవేశించి మనోధైర్యము మానసిక శారీరక ఆనందం పొందడం జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి. మనలో కలిగే భావాలను మనము బలవంతంగా ఇలా కామాన్ని అణిచివేయడం వలన అది కాస్తా అంతకంతకు బలవత్తరమై మనిషిని తప్పుడు మార్గాల్లో తొక్కిస్తుంది.అక్రమ సంబంధాల వైపు దారి తీస్తుంది. ఇలాంటి బలవంతపు బ్రహ్మచర్యము పాటించేవారికి నిద్రలో విశృంఖలమైన శృంగారపరమైన స్వప్నాలు వచ్చి అతిగా కలలోనే వీర్య స్కలనం జరిగే ప్రమాదం ఉంది. ఇలాగే అతిగా జరిగితే నరాల బలహీనత, ఉన్మాదము, పిచ్చి, అతి కోపం, ఆవేశాలునయం కాని వ్యాధులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువలన కామము అదుపులో ఉంచుకొని మనస్సులో విపరీతమైన ఆలోచనలు బాగా ఒత్తిడి చేస్తే నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే భావ ప్రాప్తి పొందండి. ఇది కూడా చేసుకోకపోతే ఖచ్చితంగా ఉన్మాదులుగా మారతారు అని గ్రహించండి. అలాగే అతిగా నిద్ర లోనూ మరియు బలవంతంగా అతిగా స్వయంతృప్తి చేసుకోవద్దు. ఏది అతిగా చేసిన మనకే ప్రమాదమేనని మితంగా చేసుకుంటే మంచిదని గ్రహించండి. కామం అనేది ఒక తీరని దాహం అని అది ఎడారిలో కనిపించే ఎండ మావులు లాంటిదని కామము అనేది ఎన్నటికీ మనిషికి నిజమైన దీర్ఘకాలిక తృప్తి ఇవ్వదని కేవలం క్షణిక తృప్తిని అదికూడా అసంతృప్తితో కూడిన క్షణిక తృప్తిని ఇస్తుందని గ్రహించండి.
- Paramahamsa Pavananda
Kapalamokshma blog contents:
No comments:
Post a Comment