కుండలినీ శక్తిని నిద్రలేపటానికి తాంత్రిక శృంగారం అవసరం అవుతుందని, ఆ సాధనలో యోగినీల యొక్క సహకారం కావాలని మత్వేంద్రనాధ్ ఉద్దాటించారు. గోరఖ్ - అన్ని విషయాలలోను తన గురువుని అనుసరించినప్పటికీ, తాంత్రిక సంభోగాన్ని సంపూర్తిగా తిరస్మరించాడు. అందుకు కారణం ఏమంటే, “కుండలినీ” సాధనకోసం ప్రీతో సంభోగాన్ని ప్రారంభించే సాధకుడు కొద్ది రోజుల తరువాత సాధన విషయం మర్చిపోయి పరిపూర్ణంగా శృంగారానికి బానిసకావటం అందువలన తంత్ర సాధకులు, స్ర్తీకి సంపూర్తిగా దూరంగా ఉండాలని గోరఖ్‌నాధ్ శాసించాడు.
ఏ సాధకుడు, అయితే తనలోని శృంగార వాంఛలను దహించివేస్తాడో, ఆశల్ని వదిలివేస్తాడో, తనను నిరంతరం కమ్ముకుని ఉండే మాయను తొలగించుకుంటాడో అలాంటి సాధకుడి యొక్క పాదాలను కడగటానికి సాక్షాత్తు మహావిష్ణువు కూడా సిద్ధపడతాడు అని గోరఖ్‌నాధ్ తాను వ్రాసిన ఒక వేదాంత శాస్త్ర సంబంధ గ్రంధంలో తెలియజేసాడు.
కుండలినీ సాధనలో (ప్తీల పాత్ర ఏమాత్రం ఉండరాదని గోరఖ్‌నాథ్ ఉద్దాటించాడు. స్త్రీని సాధకుడికి ప్రమాదాన్ని కలిగించే క్రూరమైన జీవిగా పేర్ళొన్నాడు. గోరఖ్‌నాధ్, స్త్రీ గురించి కొంత కఠినంగానే చెప్పటం జరిగింది. అది ఎలాగంటే... “గృహస్తు” అని పిలువబడే పురుషుడు తన ఇంట్లో “భార్య” అనే పేరు గల ఒక ఆడ పులిని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక రాక్షసిని పోషిస్తున్నాడు. ఆమెతో సంభోగం జరుపుతూ స్వర్గాన్ని పొందుతున్నట్లుగా భ్రమకు గురి అవుతున్నాడు. ఆ రాక్షసి యొక్క యోని, ఒక రక్తం త్రాగే పిశాచి. ఆ పిశాచికి (యోనికి) దంతాలు, కోరలు ఉండవు, కానీ, తనతో సంభోగం జరిపే పురుషుడియొక్క జీవశక్తిని అతడి వీర్యం ద్వారా పీల్చివేస్తుంది. సాధకుడు తన భార్యతో లేదా సంభోగ భాగస్వామితో వళ్ళు, వళ్ళు రుద్దుకుని ఆనందపడుతూ తన కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు.
మహాగురు గోరఖ్‌నాధ్ అసాధారణమైన అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నాడని చెబుతారు. ఆయున, (వ కృతిని నియం(త్రించగలడని, ఆకాశంలో ఎగరగలడని, నీటిమీద నడవగలడని, మట్టిని బంగారంగా మార్చగలడని చెబుతారు. ఆయన ్రికాలజ్ఞాని.
Book reference: Mahayanam Author: Sreedharan Kanduri, Page No - 11, 12
https://archive.org/details/mahayanam-author-sreedharan-kaamdoori_202410/Mahayanam%20Author%20Sreedharan%20Kaamdoori/page/10/mode/2up
https://archive.org/details/mahayanam-author-sreedharan-kaamdoori_202410/Mahayanam%20Author%20Sreedharan%20Kaamdoori/page/12/mode/2up
https://archive.org/details/mahayanam-author-sreedharan-kaamdoori_202410/Mahayanam%20Author%20Sreedharan%20Kaamdoori/page/12/mode/2up
Book download link - https://archive.org/compress/mahayanam-author-sreedharan-kaamdoori_202410/formats=TEXT%20PDF&file=/mahayanam-author-sreedharan-kaamdoori_202410.zip
No comments:
Post a Comment