కామి గాని వాడు మోక్షగామి కాలేడు
అంతెందుకు నా(Paramahamsa Pavanaananda) పరంగా చూస్తే ఎప్పుడైతే మా శ్రీమతి దీక్షాదేవి హిమాలయాల్లోని కైలాస పర్వత దర్శనమునకు వెళ్లిన సమయంలో మాకు హృదయ చక్రం ఉపాసన నవపాషాణం ఇష్ట లింగం రావడం జరిగినది. దానితో మా ఇద్దరిలోనూ ఒక తాపత్రయం సంపూర్తిగా తగ్గడం ఆరంభమైనది. అప్పుడప్పుడు నాకు మా దీక్షాదేవి మీద కామ కోరికలు కలిగినాయి. ఆ సమయంలో ఆమెకి దగ్గరకు చేరిన ఆమె మీద అప్పటిదాకా ఆమె మీద ఆలోచనలు ఉండేవి కాస్త “శృంగారం అవసరమా? ఈ అస్థిపంజర దేహముతో రతి సుఖం ఏమిటి?” అని వైరాగ్య భావాలు వచ్చేవి. ఆమెకి కూడా ఇలాంటి ఆలోచనలు కలిగేవి. అంటే శరీరము కోరుకుంటుంది కానీ మనస్సు కోరుకోవడం లేదని మా ఇద్దరికీ అర్థమైంది. మనస్సు లేని కోరికతో ఎంత సంసారం చేసిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే భావప్రాప్తి కలిగిన అందులో తృప్తికి బదులు అసహనం తో కూడిన అసంతృప్తి కలుగుతుంది. ఇంకా అలాంటప్పుడు శరీరాలు కలవడం ఎందుకు? ఇబ్బందులు పడటం ఎందుకు అనిపించేది. తృప్తి ఇవ్వలేని దాంపత్య సుఖమునకు మేమిద్దరము దూరమవుతూ వచ్చాము. కాని ఈ ప్రకృతి కలిగించే కామ ఆలోచన నుండి దూరం కాలేక పోయాను. శరీరాలు కలవకపోయినా కూడా సహనంగా ఉన్నాను కానీ కామ ఆలోచన వచ్చినప్పుడు దానిని తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. కానీ భార్య దగ్గరికి వెళ్లాలనిపించేది కాదు. అలాగని కామ భావాలు తగ్గేవి కావు. నా సామిరంగా. నా పరిస్థితి ఇది ఏమనాలో అర్థం అయ్యేది కాదు. తినాలనిపిస్తుంది. తినలేను. అంటే గడ్డివాము దగ్గర కుక్క కాపలా లాగా ఉంది. అంటే ఇది గడ్డి తినదు. తినే వాటిని దగ్గరికి చేరనివ్వదు. అలాగే నా పరిస్థితి అన్నమాట. కామ భావాలు విపరీతంగా కలుగుతాయి కానీ వాటిని తీర్చుకోలేను. భార్య సహకారం ఉన్నా కూడా తీర్చుకోలేని స్థితి. ఇలాంటి విచిత్ర స్థితి ఒకటి ఉంటుందని ఈ చక్ర స్థితివచ్చే దాకా నాకు తెలియదు. ఏమి చేయాలో అర్థం కాని స్థితి. ఆలోచించండి. తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ లో శృంగార దృశ్యాలు వీడియోలు చూసి భావ ప్రాప్తి పొందటం అలవాటయింది. కానీ ఇది కొంతమేర తృప్తినిచ్చేవి కానీ సంపూర్తిగా తృప్తినిచ్చేవి కావు. దీనితో దీనికన్నా భార్యతో సంసారసుఖం అనుభవించవచ్చు కదా అనిపించేది. కానీ దగ్గరికి వెళితే వైరాగ్య భావాలు కలిగేవి. నా సామిరంగా.అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి. అలాగని ఉండలేని స్థితి. నామీద నాకే అసహ్యం వేసేది. నా పరిస్థితి ఇలా ఉంటే యోగ మిత్రుడైన జిజ్ఞాసి కాస్త బ్రహ్మచారి గా ఉన్నాడు కదా. కానీ ఇది వరకు వారికి నెలకు ఒకసారి ఎప్పుడైనా కామసంబంధ వీర్య స్కలనము స్వప్నము నందు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోయేది. దానితో వారు పెద్దగా దీని గురించి ఆలోచించేవాడు కాదు. పైగా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైతే మన వాడు కూడా ఈ చక్ర స్థితికి వచ్చినాడో అప్పుడు ప్రతి మూడు రోజులు ఒకసారి విపరీతమైన కామ ఆలోచన కలిగేవి.దానితో మనవాడు శృంగార వీడియోలు చూస్తూ భావప్రాప్తి పొందిన కూడా సంతృప్తి కలిగేది కాదు. వాడికి కూడా ఏమి చేయాలో అర్థం కాని స్థితి. ఈ చక్ర స్థితిలో కలిగించిన కోరికైనా శృంగార ఆలోచన భావ స్థితికి సంసారికి అలాగే బ్రహ్మచారికి ఒకే విధంగా ఉంటాయని నాకు అర్థమైనది. వాడికి భార్య లేదు. నాకున్నా ఉపయోగం లేదు. దానితో మా ఇద్దరికీ ఏమిచేయాలో ఎలా చేయాలో అర్థం కాని స్థితి. ఇలా కాదనుకుని మేమిద్దరము కూడా శృంగార దృశ్యం వీడియోలు చూడటం ఆపివేశాము. దానితో నా సామిరంగా. విపరీతమైన అసహనంకు గురి అయ్యేవాళ్ళం. అకారణముగా కోపావేశాలు కలుగుతూ ఉండేవి. సహన శక్తిని పెంచుకోవడం అంటే ఇదేనని మాకు అర్థం అయినది.
ఇలా కామముతో ఉండకూడదని కుమారస్వామి లాగా ఉండాలని మనస్సుకు చెబుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ ప్రపంచంలో కామానికి మూలము అందము గదా.ఈ ప్రకృతిలో అందమైన పక్షులలో నెమలి ప్రధమస్ధానములో ఉంటుంది.ఈ అందమాయను దాటితే మనలో కామము పోతుంది.18సం.రాలు వయస్సు ఉండే శరీర అందము 80 సం.రాలు వయస్స వస్తే అపుడికేదాకా అందముగా కనిపించిన ఈ శరీరము కాస్త వడిలిపోయి అందహీనముగా ఉంటుంది గదా.అందుకే నెమలి చూడటానికి చాల అందముగా అధ్భతముగా కనపడుతుంది.కాని ఈ అందము దానికి శాశ్వతము కాదని తెలియదు.అలాగే మన శరీరాల అందాలు శాశ్వతము గాదని ఇవి అందాల మాయ అని మనకి చెప్పటానికి అలాగే శ్రీ కృష్ణుడి నెమలి పింఛను తల మీద పెట్టుకునే స్థాయికి అనగా అందము వలన వచ్చిన శృంగార భావాలు కలిగినప్పుడు మాత్రమే భావప్రాప్తి పొందటానికి సంసార సుఖములో ఉండేవాడు. అదే కుమారస్వామి అయితే ఆధీనము చేసుకుని వాహనముగా మార్చుకున్నాడు.అనగా ఈయన అందము మీద అలాగే కామము మీద స్మశాన వైరాగ్యము పొందాడు. అంటే ఈయన సంపూర్తిగా శృంగారము మీద పట్టు సాధించి దానిని ఆధీనము చేసుకుంటే శ్రీకృష్ణుడు మాత్రం దానిని అదుపులో ఉంచుకునే వాడు.అనగా కుమారస్వామి శృంగారం అనేది ఒకటి ఉన్నది అనే ఆలోచన లేని స్థితి అనగా స్త్రీ పురుషాంగాల తేడా తెలియని దిగంబరత్వం తత్వమునకు చేరుకుంటే శ్రీకృష్ణుడు మాత్రము మనస్సుకు శృంగార ఆలోచన వచ్చినప్పుడు దానిని అదుపులో ఉంచుకుని శృంగారంలో పాల్గొన్న కూడా వీర్యప్రాప్తి చెందకుండా ఉండేవాడు అన్నమాట. అంటే ఈయనికి స్త్రీపురుష బేధం ఉండేది, కుమారమంగళంకి ఈ భేద భావం ఉండేది కాదు. నేను ఇదే స్ధితిని పొందాలి అని నాకు అర్థం అయింది. సంసార సుఖానికి అలవాటైన మనస్సు కాస్త మాంసం తిన్న పులికి గడ్డి పెడితే తింటుందా? తినదు కదా. అలాంటిదే నా పరిస్థితి. కాకపోతే నా విషయంలో శ్రీ కృష్ణుడి లాగా కామము అదుపులో ఉంచుకునే స్థితిని పొందవచ్చును. అదే జిజ్ఞాసి బ్రహ్మచారి అయితే సాధన చేస్తే నిలకడ కలిగితే కుమారస్వామి లాగా కామ ఆధీనమును పొందవచ్చును. ఎందుకంటే బ్రహ్మచారికి ఆడ శరీర వాసన ఉండదు కదా. కేవలము మనస్సు కలిగించే కామ ఆలోచనలు మాత్రమే కలుగుతాయి.వీటిని అదుపులో ఉంచుకోగలిగితే కుమారస్వామి అవుతాడు. లేదంటే నికృష్టుడు అవుతాడు. విపరీతమైన కామవాంఛకి బలి అయి సంసార సుఖం ప్రాప్తి పొందడానికి నానా చంకలు నాకడం ఆరంభిస్తాడు. తప్పుగా ఇలా దాదాపుగా ఇలా శృంగార భావాలు తట్టుకోలేక నాశనం అయిన వారిలో ఒక పీఠాధిపతి, ఒక మఠాధిపతి, ఒక పరమ గురువు, ఒక పరమహంసను నేను నా స్వానుభవంలో చూడటం జరిగింది. పాపం వాళ్ళని ఏమి అనలేము. అడుగు దూరంలో సాధనా పరిసమాప్తి సమయంలో కలిగించే విపరీత ఉధృత శృంగార భావాలను ఆయన తట్టుకోలేక శిష్యులు మానాల మీద ఆశ పడటం మొదలు పెట్టినారు. ఆ మాయలో పడిపోయి సంయోగము నుండి సమాధికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ మోక్షగామి కాస్త కామిగామిగా మిగిలిపోయి పునర్జన్మలకి అలాగే ప్రారబ్ద కర్మలు పెంచుకుంటున్నారని తెలియని స్థితిలో ఉన్నారని నాకు అర్థమైనది. కారణం సన్యాసికి సంసారం ఉండకూడదు అని చెప్పినారు కానీ ఎందుకు అని ఎవరూ చెప్పలేకపోయారో మాకు ఈ చక్ర స్థితికి వచ్చే దాకా ఇలాంటి విచిత్ర శృంగార భావ స్థితి కలిగేదాకా అర్ధం కాలేదు. అది అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి. అలాగని ప్రశాంతత ఉండలేని స్థితి ఉంటుందని తెలియరాలేదు. ఈ స్థితి గురించి ముందే మన పూర్వీకులు మహర్షులు చెప్పి ఉంటే అసలు సాధనకు వచ్చే వాడిని కాను. కాకపోతే ఏమిటి. ఆకలి వేస్తుంది ఏమి తినకూడదు. తిన్నా కూడా ఆకలి తీరదు అంటే ఏమి చేయాలో చెప్పండి. ఇంకా ఆ బ్రతుకు ఎందుకు. నా బొంద. నా బూడిద. ఉంటే ఆకలి వేయకూడదు. ఆకలివేస్తే తీర్చుకోవాలి. కానీ ఆకలి వేస్తుంది కానీ ఆకలి తీరదు అంటే ఏమనాలి. నా బొంద.
- Paramahamsa Pavananda
Kapalamokshma blog contents:
Kamala moksham contents:
No comments:
Post a Comment