Friday, February 27, 2026

*****నీతిశాస్త్రము - ప్రథమభాగము, ద్రౌపది, శ్రీ కృష్ణ discussion

ద్రౌపది ఉవాచ

సుందరం పురుషమృష్ట్వా భ్రాతరం పితరంసుతమ్| 
యోని ర్దవతి పారీణాం తథ్యంమే బ్రూహి కేశవ॥ 8

తా. తోడబుట్టినవానిగాని, తండ్రినిగాని, కొమారునిగాని, రూప వంతుడైన పురుషుని జూచిన స్త్రీలకు యోని ద్రవించును. దీని తత్త్వమును ఓ కేశవా! నాకుఁ దెలుపుమని ద్రౌపది చెప్పెను.

పంచమే పతయస్సంతి మహ్యంషజ్ఞోపి రోచతే |
పురుషాణా మభావేన సర్వానార్యః పతివ్రతాః|| 9

తా. నా కైదుగురు పతులుండినను ఆఱవవానిమీఁద నిచ్చయున్నది.. కావున లోకమందలి స్త్రీలకు పురుషులు సందర్భపడకుండుటచేత బతివ్రతలై యున్నారని ద్రౌపది చెప్పెను.

శ్రీ కృష్ణ ఉవాచ

10 శ్లో॥ ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్। మత్స్యపాదంజలే పశ్యే న్న నారీహృదయస్థితమ్॥

తా. మేడిపువ్వులనైన గానవచ్చును. తెల్లని కాకినైనఁ గాన వచ్చును. నీళ్ళలోపల చేపల యడుగులనైనఁ గానవచ్చును స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను.

11 దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షేచ హిరణ్యదమ్ చతురోహంనమస్యామి రణేధీర మృణేశుచమ్|

తా. దుర్భిక్ష కాలమందు అన్నదానము చేయువానిని, సుభిక్షకాల మందు ధనమును దానము ఛేయువానిని, రణమందు ధైర్యముగల వానిని, ఋణమందు శుచిగలవానిని (అనఁగా నప్పులేనివానిని) ఈ నలుగురినిగూర్చి నేను నమస్కరించెదనని శ్రీకృష్ణుఁడు చెప్పెను.





Book name: నీతిశాస్త్రము - ప్రథమభాగము

No comments:

Post a Comment