Sunday, February 15, 2026

దారకారక అంటే అసలు నిజం ఇది (ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదు)Hidden Darakaraka Indicators#astrology

దారకారక అంటే అసలు నిజం ఇది (ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదు)Hidden Darakaraka Indicators#astrology

https://www.youtube.com/watch?v=Rn543zI0eB8



Transcript:
(00:04) సో ధారకారకుడికి ఉన్నటువంటి ఇంకొ కోణం నాకు తెలిసి ఇది ఎవరు చెప్పలేదు అనుకుంటా తెలుగులో సో ఫస్ట్ టైం మనమే చేస్తున్నాము అండ్ మనం దారకారక అనేది ఉంటది. కానీ దారకారక అనేదాన్ని మనం జనరల్ గా ఏమనుకుంటాం మన స్పౌస్ అంటే భార్య లేదా భర్త వీరిని సూచించేది ఈ దారకారక అని మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటాం దాని మీద చాలా వీడియోస్ అనేది ఉన్నాయి.
(00:31) ఈవెన్ నేను కూడా రెండో ఏమో చేసి ఉన్నాను. కానీ దారకారక అంటే భార్య లేదా భర్త మాత్రమే కాకుండా ఇంకా ఏదైనా సూచించేది ఉంటాయా అనే డౌట్ నాకు వచ్చినప్పుడు నేను దాని మీద వెతుకుతూ నా రీసెర్చ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు అండ్ ప్రాక్టికల్ గా కూడా కొన్ని విషయాలు అనేవి పరిశీలనలోకి తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంది అంటే దారకారక భార్య లేదా భర్త లేకపోతే వాళ్ళ లక్షణాలు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలు సూచిస్తూ ఉంటాడు.
(01:05) సో ఈరోజు నేను ఆ విషయాలు ఏంటి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దారకారక జస్ట్ ఒక పార్ట్నర్షిప్ కి ఒక పెళ్లికి లేదా స్పౌస్ కి మాత్రమే అనవయించుకోవడం కాదు ఇంకా చాలా ఉన్నాయి అండ్ అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతుఉన్నాను. అండ్ ఇన్ కేస్ ఈ కొద్దిగా డిస్టర్బెన్స్ కనుక ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఒకటి జరుగుతా ఉంది.
(01:33) మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అది పెట్టాను కానీ అది ఎంతవరకు నాయిస్ క్యాన్సల్ అవుతుందో నాకైతే తెలియదు. సో అది హలో అందరికీ వెల్కమ్ టు ఆస్ట్రాలజ్ తెలుగు అండ్ దారకారక ఈ దారకారక మనకి స్పౌస్ ని పెళ్లిని మాత్రం కాకుండా ఇంకా ఏమేమి సూచిస్తాడు అనింటే మన ఈగో ఎక్కడ తలదించుకునిద్ది ఎక్కడ ఎండ్ అయిపోతుంది అనేది సూచిస్తాడు దానితో పాటు మనం ఎవరికి సరండర్ అవుతాం ఏ విషయాల్లో తలంచుకుంటాం ఏ తలంచుకుంటాం అంటే అవమానంతో కాదు ఇప్పుడు చూడండి కొంతమంది ఈవెన్ రాజులైనా సరే సరే ఎంత పెద్ద గొప్ప వాళ్ళయినా సరే వాళ్ళ అమ్మ మాటకు కట్టుబడి ఉంటారు లేదా తండ్రి మాటకు కట్టుబడి ఉంటారు
(02:14) లేదా భార్య మాటకు కట్టుబడి ఉంటారు లేదా బిడ్డ మాటకి కట్టుబడి ఉండొచ్చు లేదా తమ్ముడు మాటకో అన్న మాటకో కట్టుబడి ఉండొచ్చు ఏ మరి ప్రపంచం మొత్తం చెప్పినా కూడా వినని మనిషి ఈ ఒక్క మనిషి చెప్తే వింటారు. ఇది మనం కూడా మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కదా సో ఇదే దారకారక ఈ దారకారక ఏ ప్లానెట్ అయితే ఉంటుందో ఆ ప్లానెట్ ఆయా కారకత్వాల విషయాలలో వీళ్ళు సరండర్ అయిపోతారు అక్కడ వాళ్ళకి ఈగో ఉండదు అక్కడ వాళ్ళు సరెండర్ అవుతారు సరే అని చెప్పి మాట వింటారు ఎందుకు అంటే దారకారక ఇస్ ద వీకెస్ట్ పాయింట్ వీకెస్ట్ పాయింట్ అంటే ఎలా అంటే మనకి రాహు కేతువులు కాకుండా
(02:57) ఈ కారకులుగా మిగిలిన సెవెన్ ప్లానెట్స్ ని మనం తీసుకున్నాం ఆత్మకారక ఆమాత్యకారక జ్ఞాతికారక ఇట్లాగా ఇది ధారకారక అనేది అన్నిటికంటే చిట్ట చివరి ఉన్నటువంటి డిగ్రీస్ చిట్టచివర డిగ్రీస్ ఇన్ ద సెన్స్ హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఏదైతే ఉందో అది ఆత్మకారక అయితే లోయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి ప్లానెట్ే ధారకారక ఈ ధారకారక ఏ ప్లానెట్ అయితే ఆయా కారకాలలో మనకి ఈగో ఉండదు అక్కడ మనక మనకొక చిన్న వీక్నెస్ ఉంటుంది.
(03:31) అక్కడ మనం సరండర్ అయిపోతాము అంటే వాళ్ళ మాట వింటాము. ఓకే అండ్ ఇంకొక రకంగా ఏ ప్లానెట్ అయితే దారకారకుడిగా ఉంటుందో ఆయా కారకత్వాలు పట్ల మనకి అట్రాక్షన్ ఉంటది ఆకర్షణకు గురవుతాం. ఎందుకంటే అది మన దగ్గర ఉండదు జస్ట్ లైక్ ఇప్పుడు మనకి మన దగ్గర ఐఫోన్ లేదనుకోండి కానీ మీకు ఐఫోన్ చాలా ఇష్టం అది పొందాలని బాగా కోరిక. ఎవరి దగ్గర అయితే ఐఫోన్ ఉంటుందో మీ కళ్ళు ఆటోమేటిక్ గా అతని మీదకి వెళ్ళిపోతాయి లేదా ఆవిడ మీదకి వెళ్ళిపోతాయి లేదా ఏ వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి అండ్ ఐఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాయి.
(04:05) అదంతే లేదు మీకు ఇంకొక వస్తువు ఏదో కావాలి మీరు ఎప్పుడు దానికోసం వెతుకుతూ ఉంటారు దాన్ని చూస్తా ఉంటారు అది ఎక్కడైనా కనిపిస్తే అలానే రెండు నిమిషాలు ఆగిపోయి చూస్తారు. ఎందుకు ఆకర్షణకు గురవుతారు. ఎందుకు అది లేదు అది కావాలనే కోరిక అది కావాలనే అట్రాక్షన్ ఉంటది. అది పొందాలనే ఇది ఉంటది.
(04:30) సో దారకారక వీటిని సూచిస్తాడు అంటే మనకి ఏదైతే లేదో అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆత్మకారక మనకి ఉన్నటువంటి పూర్తి సంపూర్ణ నాలెడ్జ్ నో లేకపోతే ఆ ఎనర్జీనో మన ఆత్మలో నింపేసి ఉంటది అంటే ఆయా విషయాల పట్ల మనకి చాలా అనుభవం ఉంది. ఆయా విషయాల పట్ల మనం చాలా తెలుసు అంటే అది ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటది. అలాగే దారకారక అనేది మనం అసలు అనుభవించంది మనకి ఆ టెర్రిటరీ అంటే అక్కడ ఏమఉంటది అనేది మనకు తెలియదు మనం పూర్తిగా సంపూర్ణంగా అనుభవించలేదు దాన్ని సో అది ఎప్పటికైనా నేను అనుభవించాలి నాకు అది కావాలి అనేటువంటి కోరిక అనేది అక్కడ ఉంటది.
(05:08) సో ఎప్పుడైతే వాళ్ళు పొందలేరో ఎప్పుడైతే కొన్ని విషయాలు మనం పొందలేమో ఆ విషయాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ వ్యక్తులకి మనం ఆకర్షణకు గురవుతాం. లేదంటే ఆ వ్యక్తులు చెప్పిన మాట మనం వింటాం వాళ్ళ దగ్గర మనకు ఈగో అనేది చూపించలేవు. సో ఇవన్నీ కూడా దారకారక సూచిస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాము ఒక రిలేషన్షిప్ పాటర్న్ కూడా మనం ఇక్కడ గమనించొచ్చు అంటే ఒక వ్యక్తి ఒకే రకమైనటువంటి స్వభావము లేదా లక్షణాలు లేదంటే కొన్ని విషయాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే 24 గంటలు అట్రాక్ట్ అవుతారు అంటే వాళ్ళు ఒక రెండు మూడు రిలేషన్షిప్స్
(05:53) మార్చిన వాళ్ళు ఒకే కామనాలిటీ అనేది ఉంటది ఆ రెండు మూడు రిలేషన్షిప్స్ వాళ్ళు ఉన్న వ్యక్తులు ఆ డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులయినా సరే వాళ్ళు వాళ్ళందరికీ ఒక ఒక కామనాలిటీ ఉంటది వాళ్ళందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూర్యుడు ధారకారుగుడు అయ్యాడు అనుకోండి ఒక మనిషి ఒక నాలుగైదు రిలేషన్షిప్స్ వాళ్ళ జీవిత కాలంలో ఒక 30 35 ఇయర్స్ మొత్తం అతని జీవితకాలం అనుకుందాం 35 ఏళ్ల వ్యక్తి అనుకుందాం.
(06:23) ఆ వ్యక్తి తన పూర్తి జీవితంలో ఒక 16 సంవత్సరాలు అప్పుడు ఒకసారో లేకపోతే 20 సంవత్సరాలు ఒకోసారి ఒక పాతిక సంవత్సరాలు ఒకసారి 30 సంవత్సరాలు ఒక నాలుగు రిలేషన్షిప్స్ లో ఉన్నాడు అనుకుందాం ఊరికే రిలేషన్షిప్స్ ఇన్ ద సెన్స్ పెళ్లి కాదు జస్ట్ రిలేషన్షిప్ో లేకపోతే క్రషో ఇట్లాంటివి ఎవరికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు సన్ దారకారక అయినప్పుడు అవతల వ్యక్తి రెస్పాన్సిబుల్ గా పవర్ ఫుల్ గా నలుగురిలో గౌరవాన్ని పొందిన వాడై ఉండి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అతని వ్యక్తిత్వంలో ఉన్నవాడై ఉండిప మంది గౌరవించేవాడై ఉండి ఇలాంటి వ్యక్తి ఇలాంటి లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి
(07:00) ఎక్కువగా అట్రాక్ట్ అవుతా ఉంటారు. ఎందుకంటే అవన్నీ వీరికి కావాలి ఎందుకంటే ఇవన్నీ వారికి తీరని కోరికలు. సో వాళ్ళు తీర్చుకోవాలనే తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి అవన్నీ పొందాలని అనుకుంటారు. నేను గొప్ప ప్లేస్ లో ఉండాలి ఒక లీడర్షిప్ స్టేట్ లో ఉండాలి ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్ లో ఉండాలి నేను వస్తే 10 మందిని నుంచోవాలి ఇట్లాంటివన్నీ కూడా ధారకారక సూర్యుడు అయినప్పుడు తన లోపల ఉండేటువంటి కోరికలు ఇవన్నీ అండ్ తను ఒకవేళ ఇన్ కేస్ ఏ కారణం చేతనైనా అవి తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అవి ఎవరికైతే ఉంటాయో ఆ వ్యక్తి మీద ఆకర్షణ
(07:41) అనేది ఉంటుంది. అది అంటే ఇలానే అనే కాదు ఈవెన్ దో ఒక హీరో ఉన్నాడు ఆ హీరోని చూసి ఇతను ఆ హీరో లాగే చేస్తా ఉంటాడు. అది కూడా ఒక రకమైన ఆకర్షణే ఎందుకు అతను అది కావాలని కోరుకుంటున్నాడు. సో ఇలాగ ఉంటుందన్నమాట. సో ధారకారకుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తీవ్రమైనటువంటి కోరిక ఆకర్షణ ఉంటది అది మన వీక్ స్పాట్ అండ్ ఆల్సో అది అక్కడ మనకి ఈగో ఉండదు.
(08:09) అక్కడ మనం సరండర్ అయిపోతాము అక్కడ మనం వినయంగా ఉంటాము అండ్ ఆల్సో అక్కడ మనం బాధ కూడా పడుతూ ఉంటాం ఎందుకంటే అంత తేలిగ్గా రాదు కదా ఇక్కడ ధారకారకుడు ఎక్కడైతే ఉంటాడో ఎవరైతే ఎవరైతే ఉన్నాడో అంటే సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు వాట్ఎవర్ ఇట్ మైట్ బి ఏ ప్లానెట్ అయితే ఉందో అండ్ ఎక్కడైతే ఉన్నాడో ఆయా భావనలో ఆ ప్లానెట్ కి సంబంధించిన విషయాలలో మనం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి.
(08:37) అండ్ ఇక్కడ మనం కంట్రోల్ చేయడానికి మనం పెత్తనం చలాయి ఇచ్చలేమ అన్నమాట ఓకే అండ్ ఇక్కడ మనకి మెచూర్ మైండ్సెట్ అనేది ఉండాలి ఇది బాధ పెడతది కన్నీళ్లు తెప్పిస్తది ఓకే ఇవన్నీ వస్తది అక్కడ మనకి ఒక భయం అనేది ఉంటది ఆయా విషయాలలో దానితో పాటు ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నువ్వు గొప్పవాడివి కాదు అన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అక్కడ చూయించుకోలేము ఓకే అక్కడ గ్రోత్ అనేది రావడానికి మనం చాలా హంబుల్ గా అంటే వినయంగా ఉండాలి బాధలకి గురవ్వాలి భయాలను ఎదుర్కోవాలి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది దాన్ని
(09:18) కూడా ఎదుర్కోవాలి అసంతృప్తి అనేదాన్ని కూడా ఎదుర్కోవాలిఅన్నమాట దారకారకుడు ఎక్కడ ఉంటే అక్కడ కొద్దిగా అసంతృప్తి అనేది ఉంటూ ఉంటుంది. ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టే సూర్యుడు గనుక ధారకారకుడు అయితే తండ్రి తండ్రి పట్ల విషయాలు లేకపోతే గవర్నమెంట్ లేకపోతే అధికారులు ఎవరైతే ఉంటారో ఆయా విషయాల పట్ల మనకు అసంతృప్తి ఉంటుంది.
(09:39) సో ఇట్లాంటివ అన్నీ కూడా అలాగే తండ్రి దగ్గర ఈగో చూయించలేరు వాళ్ళు తండ్రి దగ్గర హంబుల్ గా వినయంగా ఉండాల్సిందే వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకోలేరు ఆ తండ్రే ఇతన్ని డామినేట్ చేయాలి తప్ప ఇతను సరిగ్గా చెప్పను కూడా చెప్పలేడు అన్నమాట కొన్ని కొన్ని విషయాలు ఎందుకంటే అది వీక్ స్పాట్ కాబట్టి ఇట్లాగా చాలా ఉంటాయి.
(10:02) సో ధారకారకుడికి ఉన్నటువంటి ఇంకో కోణం నాకు తెలిసి ఇది ఎవర చెప్పలేదు అనుకుంటా తెలుగులో సో ఫస్ట్ టైం మనమే చేస్తున్నాము సో అది అండ్ ఈ వీడియోకి మంచి వ్యూస్ అండ్ మంచి రెస్పాన్స్ కామెంట్స్ అవన్నీ వస్తే పుష్ అయితే నేను ఇలాంటిది ఇంకా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉంటాను. అండ్ ఇది దారకారకుడికి ఉన్నటువంటి మరొక కోణం ఎవరో చెప్పని ఇంకొక కోణం సో అది విషయం అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ థాంక్యూ నమస్తే జై హింద్

No comments:

Post a Comment