50 ఏళ్లలోనూ 30 లుక్‌తో మహేష్ బాబు — ఫ్రెష్‌గా కనిపించడంవెనుక నిజమైన రహస్యం! Dr. Mohana Vamsy
https://www.youtube.com/watch?v=n2lyHfCarcg
Transcript:
(00:00) శ్రీ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా రాజకుమారు నుంచి ఆయన్ని నేను గమనిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి నాకు వయసు పెరిగిపోయింది. కానీ ఆయన ముఖంలో తాజాతనం ఫిట్నెస్ అస్సలు మారలేదు. అలా ఉండడం అనేది అనుకోకుండా జరగలేదు. దాని వెనక ఆయన ఆహార క్రమశిక్షణ ఉంది. ఇవాళ దీని గురించి చెప్తాను. ఈ మధ్య ఒక వీడియోలో మహేష్ బాబు తను ఎప్పుడు కూడా ఈ బర్గర్స్ ఫ్రైస్ జంక్ ఫుడ్ తిననని స్పష్టంగా చెప్పారు.
(00:29) బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను. ఈ ఒక్క అలవాటే చాలా విషయాలను వివరిస్తుంది. జంక్ ఫుడ్ తినకపోవడం అంటే తక్కువ చెక్కర తక్కువ రిఫైన్డ్ ఆయిల్స్ చాలా తక్కువ ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ వయసు త్వరగా పెంచేవి. శరీరంలో వాపును పెంచి జీవక్రియను దెబ్బతీస్తాయి. శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
(00:51) శక్తి స్థిరంగా ఉంటుంది. పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హార్మోన్ సమతుల్యత కాపాడబడుతుంది. అందుకే ఆయన యవ్వన రూపం మొదటి సినిమా నుండి ఇప్పటివరకు దాదాపుగా అలాగే ఉంది. కానీ ఆయన తెరమీద మౌంటెన్ డ్యూ ప్రకటనలో కనిపించడాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది నటన సలహ కాదు. చక్కరతో నిండిన ఇలాంటి తీయని పానీయాలు లివర్ కి జీవక్రియకు హాని చేస్తాయి.
(01:16) సో ఆయన తెర మీద ఏది ప్రచారం చేస్తారో కాకుండా ఆయన నిజ జీవితంలో ఏది పాటిస్తారో దాన్నే మీరు అనుసరించండి. జంక్ ఫుడ్ మానేయండి నిజమైన ఆహారం తినండి నీళ్లు తాగండి శీతల పానీయాలకు దూరంగా ఉండండి. అలా చేస్తేనే యవ్వనం నిశశబ్దంగా రోజు నిరంతరంగా కాపాడబడుతుంది.
No comments:
Post a Comment