Tuesday, April 7, 2026

టాక్సిక్ రిలేషన్స్ తో బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో

టాక్సిక్ రిలేషన్స్ తో బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1bV-5a8G0Rk



Transcript:
(00:03) హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా సూపర్ గా ఫెంటాస్టిక్ గా ఉన్నాను. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఎప్పట్లాగా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తో నేను వీడియోని చేయబోతున్నాను.
(00:22) అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా ఎవరైతే టాక్సిక్ పీపుల్ తోటి లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతో యూస్ఫుల్ గా ఉండబోతుంది. మీ లైఫ్ లో ఎవరైనా టాక్సిక్ పీపుల్ ఉన్నారా మీరు వాళ్ళతోనే ట్రావెలింగ్ చేస్తున్నారా అయితే ఈ కష్టంలో నుంచి మీరు ఎలా బయటపడాలి బయటపడాలనే ఉద్దేశం మీకు ఉందా ఉంటే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉండే టిప్స్ అయితే ఇందులో చెప్పబోతు ఉన్నాను.
(00:50) అసలు మీరు టాక్సిక్ పీపుల్ తో ఉన్నారా నార్మల్ పీపుల్ తో ఉన్నారా అన్న విషయం కూడా చాలామందికి అవగాహన లేకుండా లైఫ్ ని కంటిన్యూ చేస్తూంటారు. అటువంటి వాళ్ళ కోసం కనువిప్పు కలిగించే ఈ వీడియో మీకోసమే అయితే మనం కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోలని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనింటే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నారు అనింటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు వచ్చేస్తాయి.
(01:18) అంతే కాదు ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే మీకు గనుక నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి అని ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నామ అంటే మీలాంటి బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల వెళ్లి చేరుతుందన్నమాట ఎక్కువమందికి చూసే అవకాశాన్ని YouTube కల్పిస్తుంది కాబట్టి అర్థం చేసుకొని మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బాధల నుంచి విముక్తి అవ్వాలని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే వీడియోని కచ్చితంగా లైక్ చేయండి అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్
(01:52) అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. [గురకలు] లాస్ట్ టైం మనం చేసిన ఒక వీడియో చాలా మందికి రీచ్ అయిందండి కనెక్ట్ అయింది చాలా సంతోషం అందరూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియోస్ చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. మీ అభిమానానికి హాట్స్ అవ్వండి. ఇలాగే గనుక మీరు సపోర్ట్ చేశారు అంటే చాలా మందికి యూస్ఫుల్ గా ఉండే వీడియోస్ మన నుంచి వస్తూనే ఉంటాయి ఎప్పటికీ కూడా ఆగవన్నమాట చాలా ఉన్నాయి దాచం తీస్తాం బయటికి తీస్తాం ఓకేనా అయితే మనం టాపిక్ చూసేద్దాం మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారా లేదా అన్న విషయం మీకు ఇప్పటివరకు తెలియదా ఒకవేళ తెలియకపోతే
(02:37) చూసేయండి మరి మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారా లేదా నార్మల్ రిలేషన్ లో ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఇక్కడఫైవ్ ఫైవ పాయింట్స్ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ఫైవ్ పాయింట్స్ లో మీకు ఒక ఫోర్ పాయింట్స్ మ్యాచ్ అయినా సరే మీ బంధం టాక్సిక్ రిలేషన్ తో ముడిపడి ఉంది అని అర్థం దాంట్లో నుంచి మీరు ఎలా బయటపడాలో అనే విషయం కూడా నేను కచ్చితంగా లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(02:59) ఇప్పుడైతే నెంబర్ వన్ మీ భాగస్వామి మిమ్మల్ని అతిగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ ఎవరైనా సరే మిమ్మల్ని చాలా ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళకి చెప్పి వెళ్ళాల్సిందే ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి చెప్పి చేయాల్సిందే ఎప్పటికప్పుడు మీ ఫోన్ ని వాళ్ళు చెక్ చేయాల్సిందే ఎప్పటికప్పుడు మీ మెసేజెస్ ని కాల్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ లైఫ్ లో ఏదైతే ఉందో ప్రతిది వాళ్ళతోటి మీరు చెప్పి చేయాలి.
(03:24) ఫ్రెండ్స్ మనం ప్రేమలో ఉండటం చాలా మంచి అనుభూతినండి కాదనట్లేదు కానీ అదే ప్రేమ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంటే మిమ్మల్ని దిగజారుస్తుంటే మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే అది నిజమైన ప్రేమ అని మీరు అనుకుంటున్నారా అటువంటి ప్రేమ నుంచి బయట పడడం చాలా అవసరం అన్నమాట దీనినే టాక్సిక్ రిలేషన్స్ అని అంటూ ఉంటారు. ఇక పాయింట్ నెంబర్ టూ చూద్దాం మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక చిన్న తప్పు జరిగింది అని అనుకోండి అది మీ నెత్తి మీద వేసేస్తారు మొత్తం వాళ్ళు ఏమాత్రము దానిని అంగీకరించరు దానికి మొత్తం మీరే బాధ్యత అని చెప్పేసి మీతో వాదిస్తూ ఉంటారు. నేను కాదురా ఈసారి
(03:57) నువ్వు నీ బాధ్యత అని చెప్పేసి మీరు అన్నా సరే ఏమాత్రం పట్టించుకోరు అవతలు ఉన్నది లేడీ అయినా సరే జెండర్ అయినా సరే మీతో వితండ వాదన చేస్తూ ఉంటారు చివరికి ఆ జరిగినది విషయం ఏదైతే ఉందో దానివల్ల అంతా మీదే తప్పు అని మీరు ఒప్పుకున్నదాకా మీతో వాదనలాడుతూనే ఉంటారు చివరికి మీరు శక్తిహీనులైపోయి వాళ్ళతోటి వాదించలేక అవును నిజమే తప్పంతా నాదే ఈసారికి వదిలేసేయ్ అని చెప్పేసి మీరు అంగీకరించేలాగా ఆ పరిస్థితిని మీకు తీసుకొస్తూ ఉంటారు.
(04:26) చూసారా ఫ్రెండ్స్ టాక్సిక్ రిలేషన్ అంటే మన అభిప్రాయాలని గౌరవించరు వాళ్ళు చెప్పిన మాటనే వినాలి. అసలు వాళ్ళు ఎలా ఉంటారు అనిఅంటే వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసిందే న్యాయం వాళ్లే నిజం మిగతా వాళ్ళంతా కూడా అబద్ధం ఈ ప్రపంచంలో అంతా కూడా అబద్ధం వాళ్ళు మాత్రమే నిజం వాళ్ళు మాత్రమే కరెక్టు వాళ్లే పెద్ద తోపు అనుకుంటా ఉంటారున్నమాట ఈ టాక్సిక్ పీపుల్స్ ఇట్లాంటి వాళ్ళు ఇంకా మనల్ని చాలా చాలా హింసిస్తూ ఉంటారు.
(04:54) ఇక పాయింట్ నెంబర్ త్రీ చూద్దాం నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తూ ఉండటం మీరు ఏ పని చేసినా సరే వాళ్ళకి నచ్చదు అది ఎంత కరెక్ట్ గా ఉన్నా సరే ఇదేంటి ఇలా చేశవు దీన్ని కొంచెం బెటర్ గా చేయొచ్చు కదా నీకు ఏమి చేత కాదు నీకు అసలు ఏమీ రాదు నువ్వు ఏదైనా చేసే ముందు నన్ను అడిగి ఉండవచ్చు నా సలహా తీసుకుని ఉండవచ్చు నువ్వు నన్ను సంప్రదించకుండా చేయడం వల్లే ఈ పని మొత్తం చెడిపోయింది అని చెప్పేసి మీరు ఎంత బాగా పని చేసినా సరే దానిని విమర్శిస్తూ ఉంటారు వంకలు పెడుతూ ఉంటారు వేలెత్తి చూపిస్తూంటారు టారు మిమ్మల్ని తక్కువ చేస్తూ ఉంటారు మీకు అసలు ఏమి చేత కాదు అని
(05:27) చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి అదంతా నిజమే అనుకొని నమ్మేసి మీకు ఏమి చేత కాదేమో అన్న మైండ్ సెట్ లోకి కూడా వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నిటిని మనల్ని తక్కువ చేసి చూపించడమే కాకుండా అందరి ముందు మనల్ని ఏమాత్రం గౌరవించరు మనకు మనకు అసలు విలువ ఇవ్వరు ఎదుటి వ్యక్తుల ముందు వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అవతలి వ్యక్తుల ముందు మనల్ని ఒప్పుకోవాలండి అప్పుడైతేనే మనకి సమాజంలో విలువ దక్కుతుంది వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఒప్పుకోకపాగా అందరి ముందు మిమ్మల్ని విమర్శిస్తూ
(05:59) మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ మీ పరువు తీసేస్తూ మీకు విలువలన్నీ తీసేస్తూ మిమ్మల్ని ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ టైంలో మీరు ఏమైనా చెబదామని అంటే కూడా వినే పరిస్థితి అసలు ఉండదు. వాళ్లే కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఉంటారు కాబట్టి పాయింట్ నెంబర్ ఫోర్త్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అవునండి వాళ్ళు చెప్పిన మాట కనుక మీరు వినలేదు అని అనుకోండి.
(06:22) అట్లా అయితే నేను చచ్చిపోతా లేదంటే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. మీరు వాళ్ళు ఎక్కడ ఏమైపోతారు అన్న ఉద్దేశంతోటి మీకు ఇష్టం లేని పనులను కూడా వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి టాక్సిక్ రిలేషన్ లో ఇది మెయిన్ థింగ్ అండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇష్టం లేని పనులని వాళ్ళు చేపిస్తూ ఉంటారు చేయకపోతే చచ్చిపోతానని బెదిరిస్తారు లేదంటే ఇంకేమైనా బెదిరిస్తూ ఉంటారున్నమాట కానీ ఈ టాక్సిక్ పీపుల్ అంత తేలిక చావరండి ఎదుటి వ్యక్తులను చంపడానికి పుట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి అలాగని ఈ టాక్సిక్ మైండ్ ఉన్నవాళ్ళని నేను తక్కువ చేసి
(06:54) మాట్లాడట్లేదు అది వాళ్ళ మానసిక పరిస్థితి అన్నమాట దానిని వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళ తప్పు ఏమిటో వాళ్ళు గ్రహించలేకపోతూ ఉంటారు. వాళ్లే కరెక్ట్ అన్న మైండ్సెట్ లో ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి మనకి ఎట్టి పరిస్థితిలోనూ లొంగే పరిస్థితి ఉండదు మనల్ని లొంగ తీసుకోవడమే వాళ్ళ పని. పాయింట్ నెంబర్ ఫైవ్ మిమ్మల్ని ఒంటరిని చేయడం మీ నుంచి మీ ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని మీ కుటుంబంిని ఇక మీకు ఎవరెవరైతే దగ్గరగా ఉంటారో మీతో ఎక్కువగా ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటారో చనువుగా మాట్లాడినా మాట్లాడకపోయినా మీతో ఎవరైతే కాస్త ఫ్రెండ్షిప్ గా క్లోజ్ గా ఉంటూ
(07:28) ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా మీ నుంచి దూరం చేసేసి మిమ్మల్ని ఒంటరిని చేసేస్తారు. మీకు ఏమైనా అయినా సరే వాళ్ళు వచ్చి అడిగే అవకాశం ఉండకుండా చేసి మిమ్మల్ని ఒంటరిని చేసి వాళ్ళు మాత్రమే మీకు గతి అనే ఒక పరిస్థితిని తీసుకొచ్చేసి మీరు అందులో బతికేలాగా చేస్తూ ఉంటారు ఇక నాకు వెళ్ళటానికి ఏ దారి లేదు అందరూ చెడిపోయారు కదా అందరిని చెడగొట్టేసారు కదా బాధలో ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్లి కాస్త సేద తీరటానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఉండేలాగా మిమ్మల్ని ఒంటరిని చేసి ఆడుకుంటూ ఉంటారు.
(07:58) ఫ్రెండ్స్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ బంధం అయినా సరే మనకి మానసిక ప్రశాంతతో కూడినదే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బంధం వల్ల అయినా మనకి మనసు బాగాలేదు ప్రశాంతత లేదు పీస్ ఫుల్ పోతుంది మైండ్ ఖరాబ్ అయిపోతుంది మనం ఏ పని చేయలేకపోతున్నామో ఎవరితోటి మింగల్ అవ్వలేకపోతున్నామో ఎవరితోటి కలవలేకపోతున్నామో మన ఎమోషన్స్ దెబ్బతింటున్నాయి మన కాన్సంట్రేషన్ మొత్తం పోతుంది అని అంటే అది కచ్చితంగా టాక్సిక్ పీపుల్ వల్లనే జరుగుతుంది అట్లాంటి బంధంలో నుంచి బయట పడే అవకాశం ఉందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు చూశరంటే ఈ
(08:32) వీడియో నచ్చి ఉంటుంది దయచేసి లైక్ చేయండి. మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుందాము అనిఅంటే వాళ్ళు దానికి ఓకే అని చెప్పరండి. అందుబాటులోకి రారు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడదాము అనింటే వాళ్ళతోటి కూడా గొడవలాడేసి పంపించేస్తూ ఉంటారు. ఇక మీకు సపోర్ట్ ఎవరు ఉండరు కాబట్టి చచ్చినట్టు వాళ్ళతోనే ఉంటారు అనేది వాళ్ళ ధైర్యం.
(08:52) ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ నేను ఫైవ్ పాయింట్స్ చెప్పానండి సిక్స్త్ పాయింట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అదేమిటంటే మీరు వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలి విడిపోవాలి అసలు వాళ్ళని వదిలించేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్న వెంటనే మారిపోయినట్టుగా నటిస్తారు మీ కాళ్ళు పట్టుకుంటారు బ్రతిమిలాడతారు ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయను మనసు కష్టపెట్టను నువ్వు ఏది చెప్తే అదే వింటాను అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటారు అన్నమాట మీరు మారిపోతారులే అన్న ఉద్దేశంతోటి మనసు మార్చుకొని మళ్ళీ వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ సడన్ గా వాళ్ళ విశ్వరూపం చూపిస్తూ ఉంటారు
(09:22) ఈ టాక్సిక్ పీపుల్ అంటే ఫైనల్ గా వీళ్ళ మెంటాలిటీ ఏంటయ్యా అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అన్నమాట ఇట్లాంటి వాళ్ళ నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా సెవెంత్ పాయింట్ గా మనం ఇది కూడా చూసేద్దాంండి ఉందండి కచ్చితంగా ఉంది ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రూమ్ ఉంది ఒక చిన్న రూమ్ అన్నమాట ఆ రూమ్లో ఫుల్గా మనం గాజు పెంకులన్నీ కూడా పగలకొట్టి వేసేసాం మొత్తం నడవడానికి కూడా అవకాశం లేకుండా రూమ్ నిండుగా కూడా గాజు గాజు పెంకులతో ఉంది.
(09:54) ఈ టాక్సిక్ పీపుల్ తో రిలేషన్ ఎలా ఉంటుంది అనింటే ఆ రూమ్లో మీరు నడుస్తూనే ఉండాలి. గాజు పెంకులు నిరంతరం గుచ్చుకుంటూనే ఉంటాయి. కాళ్ళ నుంచి రక్తాలు కారుతూనే ఉంటాయి. అయినా సరే మీరు కాలు తీసి కాలు వేయాలి అనింటే మళ్ళీ గాజు పెంకుల మీదే వేయాలి కానీ అక్కడ వేరే ప్లేస్ అనేది ఉండదున్నమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఆధారం ఉంటుందండి ఆ రూమ్ కి అటువైపున ఒక దారి ఇటువైపున ఒక దారి ఉంటుంది.
(10:17) ఇటు నుంచి అటు చివరికి మీరు నడిచి వెళ్ళేటప్పటికీ గాజు పెంకులన్నీ అయిపోతాయి అవతల ఒక గుమ్మ ఉంటుంది అది దాటి కాలు బయట పెట్టారు అనుకోండి పచ్చని పచ్చిక మెత్తదనం చిరుగాలి ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ మీరు అవన్నీ కనిపించినా సరే బయటికి రాలేదు ఎందుకో తెలుసా వాళ్ళ బందీలో మీరు ఉండిపోయారు వాళ్ళ సెంటిమెంట్స్ లో ఇరుక్కుపోయారు వాళ్ళ కబంద హస్తాల్లో ఉండిపోయారు కాబట్టి మీకు ఈ చిన్న విషయం కూడా బుర్రకి తట్టదండి ఇంకొక్క అడుగు జస్ట్ మనం అవతల వేసామంటే ఇందులో నుంచి బయట పడొచ్చు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది మన జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది ఇందులో
(10:55) నుంచి మనం వదిలి చేసుకుందాం అనేసి అవకాశం ఉన్నా సరే మీరు రారు. మళ్ళీ రిటర్న్ అయ్యి అదే గాజు బెంకుల మీద నడుచుకుంటూ ఇటు చివరి వరకు వస్తారు ఇటు చివర కూడా మీకు ఇంకా అవకాశం ఉంటుంది ఇంకొక గుమ్మం తెరిచే ఉంటుంది ఇటువైపు వెళ్ళినా సరే మీకు సేమ్ పచ్చని పచ్చిగా చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అయినా సరే మీరు మాత్రం రారన్నమాట ఎందుకంటే అందులో బందీగా అయిపోయారు.
(11:20) ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి కనుక మీరు వాటన్నిటిని వాళ్ళు పెట్టే టార్చర్ ని తలుసుకొని ఆ గాజు పెంకుల మీద నుంచి ఉన్న అడుగు లాస్ట్ అడుగు ఏదైతే ఉందో గుమ్మం అవతల పచ్చిక మీద గనుక వేశరు అని అనుకోండి మీ కాళ్ళకు ఉన్న రక్తం అలానే ఉంటుంది. గాజు పెంకులు ఉంటాయి. వన్స్ మీరు బయటికి వచ్చేసిన తర్వాత వాటన్నిటిని రిమూవ్ చేసేసి మీ కాళ్ళకి రెస్ట్ ఇచ్చారునుకోండి కొద్ది రోజులకి కచ్చితంగా హీల్ అవుతుంది.
(11:49) కాలము ఏ బాధ నుంచి అయినా సరే మనల్ని విముక్తి చేయగలిగే పవర్ ని కలిగి ఉంటుంది. ఒకసారి మీరు అడుగు బయట పెట్టిన తర్వాత మీ కాళ్ళకుఉన్న గాయాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోవడం మీరే గమనిస్తారు. ఏదో ఒక రోజు గాయాలన్నీ కంప్లీట్ గా తగ్గిపోతాయి మీరు సంతోషంగా మారిపోతారు. వన్స్ మీరు కాలు బయట పెట్టడమే మీ చేతుల్లో ఉన్నదన్నమాట కానీ చాలా మంది కూడా అందుకు రెడీగా ఉండరండి కాలు తీసి మళ్ళీ గాజు పంకల మీద పెడుతూ ఉంటారు మీరు ఇలా ఎంతసేపు నడిచినా సరే మీ జీవితం మొత్తం కూడా ఆ రూమ్లో మీరు ఉన్నంతవరకు మీ కాళ్ళ నుంచి రక్తం కారుతూనే ఉంటుంది.
(12:25) మీ మనసు గాయపడుతూనే ఉంటుంది. మీ గాయాలు హీల్ అయ్యే అవకాశం ఉండదు వన్స్ బయటక వస్తేనే ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది ఆ తర్వాత లైఫ్ ఎంత అందంగా ఉంటుందో మీకే అర్థం అవుతుంది. దీనిని మీరు ఈ టాక్సిక్ పీపుల్ దగ్గర అనుభవిస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నేను అందరినీ విడిపోమని చెప్పడం ఉద్దేశం కాదు టాక్సిక్ పీపుల్ తో ఇంక నేను ఈ లైఫ్ ని ఈడ్చలేను ఇక నా వల్ల కాదు నా సహనం చచ్చిపోయింది.
(12:52) నేను దీని నుంచి బయట పడాలి అని అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ గాజు పెంకులతో నిండిన గది నుంచి బయటికి రండి మీకోసం భగవంతుడు మరో మంచి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాడు అని అనుకోండి అలా వద్దండి నేను ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను ఈ వ్యక్తులు ఈ ప్రేమలు ఇవన్నీ రిలేషన్స్ నాకు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి.
(13:17) వీటన్నిటిని తెలుసుకోకుండా చాలామంది సంవత్సరాల తరబడి టాక్సిక్ పీపుల్ తోటి టార్చర్ అనుభవిస్తూ అక్కడే ఆగిపోతూ ఉన్నారు. బయటపడే అవకాశం ఉన్నప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ బయటికి రాలేరు ఎందుకంటే వాళ్ళకి బంధాలు ఉంటాయి పిల్లలు ఉంటారు అవన్నీ కూడా ఆపేస్తూ ఉంటాయండి ఈ రోజుల్లో పిల్లలు ఉన్నా సరే బంధాలు వెనక్కి లాగుతున్నా సరే మానసిక క్షోభకి గురవుతూ బతకవలసిన అవసరం లేదు.
(13:42) మనకంటూ స్వేచ్ఛగా బతకడానికి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ జీవితం మనకి ఒక అవకాశం ఇచ్చింది సంతోషంగా జీవించమని అంతేకానీ ఇలాంటి వ్యక్తుల చేతిలో చిక్కుకొని జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ సంతోషం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా బ్రతికే చాలా మంది ఉన్నారండి అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో అది ఫ్రెండ్స్ ఈ టాక్సిక్ పీపుల్ తో బ్రతికే వాళ్ళు అందులో నుంచి బయటపడాలి అనింటే మనల్ని మనం హీల్ చేసుకోవాలి అనింటే మార్గాలు ఉంటాయి కచ్చితంగా మనం వాటిల్ని కావాలి అంటే చేజికించ కోవచ్చు అక్కర్లేదంటే అక్కడే నరకాన్ని అనుభవిస్తూ జీవితాన్ని వెళ్లదీయవచ్చు.
(14:22) ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాను. మీలో ఎవరైతే టాక్సిక్ రిలేషన్స్ లో ఉండి కష్టపడుతూ ఉన్నారో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అంటే కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప ఈ కాన్సెప్ట్ ఎక్కడికక్కడ మనకి యూస్ అవుతూనే ఉంటుందండి. ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే ఒక అడుగు ముందుకు వేసి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకొని చూడవచ్చు.
(14:52) నెక్స్ట్ టైం మరో మంచి అందరికీ యూస్ఫుల్ గా ఉండే వీడియోతో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.

No comments:

Post a Comment