Tuesday, April 7, 2026

రేపు మీరు లేకపోతే ఈ లోకం ఏడుస్తుందా | Build a legacy that never dies | Satyagrahi

రేపు మీరు లేకపోతే ఈ లోకం ఏడుస్తుందా | Build a legacy that never dies | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3XprxUP2ePM



Transcript:
(00:00) అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారా పొద్దున్నే లేవడం, పరిగెత్తటం, సంపాదించడం, తినటం, పడుకోవడం మళ్ళీ అదే లూప్ అన్నమాట. అందరూ చేసేది మనం చేస్తున్నాం. కానీ ఒక్క నిమిషం ఆగి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఒకవేళ రేపు పొద్దున్న మీరు ఈ లోకంలో లేకపోతే ఈ ప్రపంచం ఎందుకు గుర్తుంచుకోవాలి మిమ్మల్ని కేవలం మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఆస్తిపాస్తులు ఇవి మాత్రమేనా? మీ ఉనికి గుర్తులు నిజానికి మనం మనకోసం బతికినప్పుడు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే మిగిలిపోతాం.
(00:32) మన ఆలోచన మన మనసు దాటి బయట ప్రపంచానికి ఉపయోగపడనప్పుడు మన జీవితం ఒక నీటి బుడగ లాంటిది అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పేలిపోయిందో ఎవరికీ తెలియదు. మనలో చాలా మందికి ఒక బ్రమ ఉంటుంది. మనం చాలా బిజీగా ఉన్నామని గొప్పగా బ్రతుకుతున్నామని కానీ వాస్తవం ఏంటంటే మనం ఒక స్వార్థపు గీత గీసుకొని ఆ గీత లోపలే తిరుగుతున్నాం. మీరు చనిపోయిన తర్వాత కూడా ఈ లోకం మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే మీరు ఈ భూమ్మీద వదిలి వెళ్ళిన ముద్ర ఏమిటి? గాలిలో కలిసిపోయే మాటలా లేక మట్టిలో కలిసిపోయే శరీరమా మన సమస్య ఏంటంటే మనం నేను నాది అనే చిన్న గదిలో బంది అయిపోయాం.
(01:07) బయట ప్రపంచంలో ఆకలి ఉంది కన్నీళ్లు ఉన్నాయి. సాయం కోసం చూసే కళ్ళు ఉన్నాయి. అవేవి మనకి పట్టవు. మనం సంపాదించే ప్రతి రూపాయి మనం గడిపే ప్రతిక్షణం కేవలం మన సుఖం కోసమే అయితే మనం పోయాక ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ స్వార్థం ఈ చిన్న చూపు మనకి ఎక్కడి నుంచి వచ్చింది సమాజం మనల్ని ఇలా తయారు చేసింది చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఇదే బాగా చదువుకో మంచి ఉద్యోగం సంపాదించు పెళ్లి చేసుకో ఇల్లు కట్టుకో సెటిల్ అయిపో ఇక్కడ ఎక్కడైనా సరే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించు అని ఎవరైనా నేర్పారా లేదు అందుకే మన మైండ్సెట్ కూడా సర్వైవల్ మోడ్ లోనే ఉండిపోయింది. మనం
(01:41) భయపడుతున్నాం. నా దగ్గర ఉన్నది వేరే వారికి ఇస్తే నాకేం మిగులుతుంది అని నా సమయం ఇతరుల కోసం కేటాయిస్తే నా పనులు ఏమైపోతాయి అని ఈ కొరత అనే భావన మిమ్మల్ని ఇతరుల వైపు చూడనివ్వదు. సచ్చిదానంద స్వామి గారు తరచు ఒక మాట అంటారు ప్రేమ అనేది పనిచేయ కొద్ది పెరుగుతుంది. దాచుకుంటే కుళ్లిపోతుంది అని కానీ మనం ఏం చేస్తున్నాం మన ప్రేమని మన కరుణని ఒక బ్యాంక్ లాకర్ లో పెట్టి దాచేస్తున్నాం.
(02:04) మరో ముఖ్యమైన కారణం ఏంటంటే మరణం గురించి మనకున్న భయం. మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటామని చెప్పేసి అనుకుంటాం కానీ కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. మనం సంపాదించింది ఏది మన వెంట రాదు. అయినా సరే చనిపోయే వరకు ఆ వస్తువుల మీద ఆ హోదా మీద ఉండే మొహం మన కళ్ళని కప్పేస్తుంది. పక్కవాడి [సంగీతం] ఆకలి కంటే మన విలాసమే మనకు ముఖ్యం అనిపించినప్పుడు మనలోని మనిషి చనిపోయినట్లే ఈ లోకం మిమ్మల్ని గుర్తుంచుకోవట్లేదు.
(02:30) అంటే దానికి కారణం మీ దగ్గర ఏమీ లేకపోవడం కాదు మీ దగ్గర ఉన్నది మీరు ఇవ్వలేకపోవడం. మరి ఈ పరిస్థితి నుండి బయటపడటం ఎలాగా మనల్ని మనం అమరత్వం వైపు ఎలా తీసుకెళ్ళాలి దీనికి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయనక్కర్లేదు. కేవలం మీ దృష్టిని మార్చుకుంటే చాలు మీ జీవితం కేవలం మీకోసం మాత్రమే కాదు అని గుర్తించడమే మొదటి మెట్టు. మీరు ఈ సమాజం నుండి ఎంతో తీసుకున్నారు. గాలి, నీరు, ఆహారం, జ్ఞానం.
(02:53) మరి తిరిగి ఏమఇస్తున్నారు? త్యాగం అంటే సర్వం వదిలేసి అడవులకు వెళ్ళడం కాదు. మీకున్న దానిలో కొంచెమైన ఇతరులకి పంచటం అది ధనం కావచ్చు, సమయం కావచ్చు లేదా ఒక చిన్న ఓదరపు కూడా కావచ్చు. గుర్తుంచుకోండి మీరు ఇచ్చేది అవతలి వ్యక్తి జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం కచ్చితంగా మారుస్తుంది.
(03:14) ఎప్పుడైతే మీరు ఒక ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెడతారో ఎప్పుడైతే చదువుకోలేని ఒక బిడ్డకు పుస్తకం కొనిస్తారో అప్పుడు మీలో ఒక తెలియని ప్రశాంతత పుడుతుంది. దాన్నే ఆధ్యాత్మికత అంటారు. మనం చేసే చిన్న సాయం ఒక విత్తనం లాంటిది. అది మన కళ్ళ ముందే వృక్షం కాకపోవచ్చు కానీ దాని నీడలో ఎవరో ఒకరు సేద తీరుతారు. ఆ నీడలో మిమ్మల్ని వారు వెతుక్కుంటారు.
(03:36) ఒకప్పుడు ఒక మనిషి ఉండేవాడు ఆయన వల్ల నా జీవితం మారింది అని ఒక్కరు అనుకున్నా మీరు ఈ భూమ్మీద నిరంతరం బ్రతికున్నట్లే మీ ఉనికి వారి కృతజ్ఞతతో ప్రాణంతోనే ఉంటుంది. ఆలోచనను మార్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ పనులు మారుతాయి. అసలు విషయానికి వద్దాం. ఈరోజే ఇప్పుడే మీరు ఏం చేయగలరో ఒక అద్భుతమైన నియమాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి.
(03:56) మీ సంపాదనలో కానీ మీ 24 గంటల సమయంలో కానీ కనీసం కనీసం 5% ఇతరుల కోసం కేటాయించండి. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు మీ శ్రమ కావచ్చు, మీ విద్య కావచ్చు మీ ఇంటి పక్కన చదువుకోవాలని తపన ఉండి ఫీజు కట్టలేని పిల్లలు ఎవరైనా ఉన్నారా వారికి అండగా నిలబడండి. మీ దగ్గర స్తోమత ఉంటేనే రోడ్డు మీద ఆకలితో అలమటించే ముసలివారు కనిపిస్తే మీ వంతుగా కడుపు నింపండి. ఇదేదో గొప్ప కోసం చేసే పని కాదు.
(04:21) ఇది మన బాధ్యత. మనం ఇతరులకు చేసే సాయం నిజానికి మనకి మనం చేసుకుంటున్న సాయం ఎందుకంటే అది మనసులోని అహంకారాన్ని తగ్గిస్తుంది. మనల్ని మనుషులుగా నిలబెడుతుంది. నేటి నుంచే మారండి. నా దగ్గర డబ్బులు వచ్చాక సేవ చేస్తాను అని అనుకోకండి. సేవ చేయడానికి కావాల్సింది డబ్బు కాదు. ఒక మనసు కావాలి. మీరు పంచే ప్రతి రూపాయిలో ఒక దీవన ఉంటుంది.
(04:43) మీరు గడిపే ప్రతి నిమిషం ఒక కన్నీరు తుడిస్తే ఆ కన్నీటిలో మీ ప్రతిబింబం శాశ్వతంగా ఉండిపోతుంది. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు 10 మందికి శ్వాస ఇవ్వడం మీ వెనుక ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళండి. అది ఆస్తుల వారసత్వం కాదు ఆదర్శాల వారసత్వం. ఈ ప్రపంచం మిమ్మల్ని చూసి గర్వపడాలి. మట్టిలో కలిసిపోయే లోపు మరికొన్ని మట్టి దీపాలు వెలిగించాలి.
(05:06) బేసికల్గా ఎవరు ఏమన్నా సరే మిమ్మల్ని ఈ భూమి మీదకి పంపినందుకు దేవుడే గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషి లబ్ది పొందిన తర్వాత అది కూడా వాళ్ళ జీవితంలో అన్ని ఆశలు పోయిన తర్వాత చివరి దశలో మీరు వచ్చి వాళ్ళ జీవితంలో ఒక చిన్నపాటి వెలుగును క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళనే మాట ఏంటంటే మీరు దేవుడిలా వచ్చారు అని. సో మిమ్మల్ని పంపించిన దేవుడు కూడా ఆ మాట విన్న తర్వాత ఎంతో ఆనంద పడతాడు.
(05:32) మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజుంతా వాళ్ళ దగ్గర గడపాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న దాంట్లో ఒక 5% లేదా 1% ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. బాయ్

No comments:

Post a Comment