Marriage Problems ki Bhagavad Gita lo వున్న Solution ఏంటి? #marriage #problem #bhagavadgita #krishna
Author Name:చిత్రవధ
Youtube Channel Url:https://www.youtube.com/@UNU_CHITRAVADHA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XY3eNOKi3tA
Transcript:
(00:02) [సంగీతం] చిత్ర స్వాగతం మిత్రులారా చాలా మంది జీవితాల్లో అండి పెళ్లయ్యే టైంలో అన్నీ బాగానే ఉంటాయి. భార్యా భర్తలు ఇద్దరు హ్యాపీగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒకరినఒకరు రెస్పెక్ట్ చేస్తూ జీవితం మొదలు పెడతారు. కానీ స్లోగా ఏమవుతుంది ప్రాక్టికల్ ఇష్యూస్ మొదలవుతాయి. దాని వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల అనుకోండి లేకపోతే కొత్త ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోవడం వల్ల అటు పక్క ఇటు పక్క ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల లేకపోతే బయట నుంచి ఇన్ఫ్లయెన్స్ లైక్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళద్దరి మధ్యన ఈగో
(00:36) క్లాషెస్ నువ్వు గొప్ప నేను గొప్ప నేనే గొప్ప రైట్ కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఒకరి నుంచి ఒకరికి ఈ ఆశించేది ఈ స్థాయిలు పెరిగిపోతా ఉంటాయి మించిపోతా ఉంటాయి ఎక్సీటెడ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా మనకి అచీవ్డ్ ఎక్సీటెడ్ ఇలా అన్నమాట ఇవి మిస్ అయిపోవడం వల్ల అవి ఒక్కసారిగా పెద్ద ప్రాబ్లం కాదు కానీ స్లోగా అక్యములేట్ అవుతూ అవుతూ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ పెద్ద బంతులా తయారవ్వ ఇద్దరి మధ్యన పెద్ద గోడ కట్టేస్తాయి.
(01:04) సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందండి ఒకదాని తర్వాత ఒకటి ఆ గొడవ పెద్దదాయి పెద్దదాయి పెద్దదా ఏదో ఒక రోజునాడు అది పోలీస్ కంప్లైంట్స్ వరకు పోతున్నాయి అవి లీగల్ కేసెస్ అవుతున్నాయి కోర్టుకి చుట్టూ తిరగడం మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీలో లేకపోతే పెద్దలో లేకపోతే మీడియేటర్స్ లేకపోతే కోర్టు కూడా చెప్తుంది ఏంటి ఒకటి సెటిల్ చేసుకోండి లేదా కలిసి ఉండండి అదే విడిపోండి లేకోతే కలిసి ఉండండి కానీ ఏది చేసినా ప్రశాంతంగా ఉండండి.
(01:28) కానీ ఒక కామన్ వెరీ ఇంపార్టెంట్ సిచువేషన్ ఏమవస్తుందంటే అండి భార్యా భర్తలు ఇద్దరిలో ఒకరు కలిసి ఉండడానికి గాని లేకపోతే విడిపోవడానికి గాని రెడీగా ఉంటారు. ఓకే ఇంకొకరు ఏం చెప్తారు? పూర్తిగా రెఫ్యూజ్ చేస్తారు వద్దు నాకు ఇష్టం లేదు కలిసి ఉండటం ఆర్ డబ్బులు ఇవ్వటం ఏదో ఒకటి ఇష్టం లేదు. లేదా అన్రియలిస్టిక్ కండిషన్స్ పెడతారు ఓకే నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటా కానీ ఫాలోడ్ బై ఈ కండిషన్స్ నువ్వు ఒప్పుకుంటే లేకపోతే కొంచెం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటారు రిజల్ట్ ఏంటండి? ఇద్దరికీ ఏడిపే ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇద్దరికీ టైం పోతుంది డబ్బులు పోతాయి అనవసరమైన మెంటల్
(02:02) ప్రెజర్ మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి సిచువేషన్ లో ఇలాంటి ప్రాక్టికల్ సిచువేషన్స్ లో దానికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏమన్నా ఉందా భగవద్గీత చెప్తుంది నీకు అర్థం చేసుకోగలిగే శక్తి ఉంటే భగవద్గీత చెప్తుంది కొన్ని శ్లోకాలు చూద్దాం ఒకటి జస్ట్ మూడు ఒక మూడు శ్లోకాలు చూద్దాం ఎంత బాగుంటుందో రైట్ మొట్టమొదటిది మీ ఇంద్రియాల పైన మీకు నిగ్రహం లేకుండా పోవడం వల్ల కోరికల వల్ల పడతారు.
(02:31) రైట్ నేను ఉన్నది సంస్కృతి చెప్పట్లేదండి తెలుగు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీ ఇంద్రియాల పైన నిగ్రహం కోల్పోవడం వల్ల కోరికల వల్ల పడతారు ఆ కోరిక తీరక అది కోపంగా మారుతుంది కోపం వల్ల మోహం కలుగుతుంది అంటే మాయలో పడతారు. మోహం వల్ల వివేకం తగ్గుతుంది అంటే ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి తగ్గిపోతే సరైన నిర్ణయం ఎలా తీసుకుంటారు? క్రమంగా మనిషి నాశనం అవుతాడు.
(02:52) ఇది ఎంత పర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది అంటే మీ సంసారం మీ స్నేహం మీ బాంధవ్యం మీరు చేసే వ్యాపారం ఉద్యోగం ఏదైనా సరే నాశనం అయిపోయింది అంటే మూలం అక్కడే ఉంటుందండి ఎక్కడ ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల ఇప్పుడు నాకు లేటెస్ట్ మోడల్ ఎస్వ కావాలి ఇండివిడ్యువల్ హౌస్ కావాలి డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ సరిపోదు నాకు మనం ఎందుకు వాళ్ళ బతకలేకపోతున్నాం అందరూ ఎదుగుతున్నారు కానీ మా ఆయనకి ఎందుకు జీతం పెరగట్లేదు మా పెళ్ళప్పుడు మా ఆవిడికి రెండు ఎకరాలు పొలం ఇచ్చారు.
(03:18) ఇప్పుడు మా మరదలకేమో మూడు ఎకరాలు కట్నం ఇస్తున్నారు ఇదేంటిది ఇది ఎక్కడ అన్యాయం ఇలా ఉంటుంది మీ గోల రైట్ ఇప్పుడు ఫెయిల్ అయిపోతున్న పెళ్లిళ్లు చూడండి వాళ్ళ మధ్యలో వచ్చిన సమస్య వల్ల కాదు ఫెయిల్ అయిపోతుంటా ఆ సమస్య వచ్చినప్పుడు ఎమోషనల్ గా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం సరిగ్గా లేక ఫెయిల్ అయిపోతున్నాయి భార్య మీద చెయ్యి చేసుకోవడం లేకపోతే ఆవిడ ఆవిడే ముందుగా కోపగించి పుట్టింటికి వెళ్ళిపోవడం పోలీస్ కంప్లైంట్ చేయడం ఒకరి మీద ఒకరు దారుణమైన నిందలు వేసుకోవడం ఇదే కదా మూలం చాలా జంటల్లోనండి దారుణమైన విషయం విషయం ఏంటంటే వాళ్ళు విడిపోయాక 48 గంటల లోపు
(03:50) కేసులు ఫైల్ చేస్తున్నారు. ఆరు నెలలు తిరిగేసరికి ఒకరినొకరు మిస్ అవుతారు కానీ అప్పటికే కథ చాలా దూరం వెళ్ళిపోతుంది. ఈ శ్లోకం చెప్పి కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తాడో తెలుసా తాత్కాలికంగా అంటే టెంపరరీగా నీకు కలిగే ఇబ్బందికి నువ్వు కోపంలో తీసుకునే నిర్ణయం వల్ల పర్మనెంట్ గా డ్యామేజ్ జరుగుతుంది అది కోపం అయి ఉండొచ్చు ఎమోషనల్ డామేజ్ అయ్యి ఉండొచ్చు దాని వల్ల తీసుకునే నిర్ణయం కంప్లీట్ గా డామేజ్ చేసేస్తుంది మిమ్మల్ని ఇప్పుడు జరుగుతుంది అదే కదండీ అందుకే వెంటనే రియాక్ట్ అయిపోకూడదండి కొంచెం టైం తీసుకోండి మీకు మీరుగా ఆలోచించుకోండి మీ భార్య లేదా మీ భర్త
(04:24) ఎలాంటివాళ్ళు అని చెప్పి మీకు తప్ప బయట వాళ్ళకి తెలియదు కదా అలాంటప్పుడు ఏం చేయాలనే నిర్ణయం మీరే తీసుకోవాలి బయట వాళ్ళ మీద వదిలి పెట్టొద్దు. ఇంకొకటి చూద్దాం దిస్ ఇస్ మై ఫేవరెట్ నువ్వు చేసే పని మీద తప్ప దాని వలన వచ్చే ఫలితం పైన నీకు ఎటువంటి నియంత్రణ అంటే కంట్రోల్ ఉండదని చెప్పి చెప్తారు. పక్క పక్కలే ఉండేయి ఇద్దరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇద్దరు బీటెక్ చదువుకున్నారు క్యాంపస్ లో ఒకే కంపెనీలో ఒకే ఊళలో జాబ్ ఒకే జీతం తర్వాత తర్వాత కూడా ఒకలానే ఉంటుందా ఒకడు విదేశాల్లో సెటిల్ అవ్వచ్చు ఇంకొకడు ఇక్కడే ఉండి ఏ వ్యాపారమో చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ పెళ్లిళ్లు
(04:57) వాళ్ళ పిల్లలు చేసే ఉద్యోగం వ్యాపారం భవిష్యత్తు ఐశ్వర్యం ఆయుష్షు ఏది ఒకేలా ఉంటదండి చెప్పగలమా మనం ఇప్పుడు భార్యాభర్తలు గొడవే తీసుకుందాం అండి కోర్టులో కేసులు ఉన్నాయి సెటిల్మెంట్ చేసుకోండి నాయనా అని చెప్తున్నారు కానీ వింటారా కూర్చుంటారండి ఎలా ఉంటుందంటే ముందు ఆమె నా మీద వేసిన కేసులన్నీ తీసేయాలి తీసేస్తే అప్పుడు సెటిల్మెంట్ గురించి మాట్లాడదాం అని ఈయన అంటాడు ఆవిడేమో ముందు అతను వచ్చి అతను చేసిన తప్పక అందరి ముందు క్షమాపణ చెప్పాలి అలా మంకు పట్టు పట్టుకొని కూర్చుంటే ఇవన్నీ అయ్యన పనిలేనండి అసలు ఏది కరెక్ట్ ఏది ధర్మమో అది చేయండి అంతే ఫలితం దాని దారిన
(05:29) అదే వస్తుంది ఎప్పుడు ఇప్పుడు కేస వేసి ఇలా సెటిల్ చేసుకోవడం ధర్మం ఎలా అవుతుంది అని అడగొచ్చు చాలా మంది అడగొచ్చు కేస్ వేస్తే లీగల్ గా వెళ్ళడం కదా కరెక్ట్ అది కదా ధర్మం బయటికి వచ్చి సెటిల్ చేసుకోవడం ధర్మం ఎలా అవుతుంది ఇద్దరు ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ధర్మమేనండి మీరు తప్పు చేశారు క్షమాపణ చెప్పడం ధర్మమే అవుతుంది.
(05:47) మీ మధ్యన డబ్బులు అవి సెటిల్ చేసుకోవడం ఎవరికి ఎంత తక్కాలో వారి అర్హతకు తగినట్టు హక్కుల్ని లెక్కగట్టి ఇచ్చేయడం ధర్మమే అవుతుంది. అది ఇద్దరికీ కూడా అన్యాయం అనిపించకూడదు అన్యాయంగా అనిపించకూడదు ఇద్దరికీ అటు పక్క ఇటు పక్క బాలెన్సింగ్ గా ఉండటం బాలెన్స్ చేయడమే కదా ధర్మం అంటే ఓకే మీ భర్త నుండి మీకు రావాల్సింది మాత్రం అడగండి. మీ భార్యకి బాధ్యత ఎంతవరకో అంతవరకు మీరు ఇచ్చేసేయండి.
(06:07) సరే పెళ్లి పెళ్లి ఫెయిల్ అయింది కనీసం విడిపోయే ప్రక్రియ అన్న సరిగ్గా ఉండాలి కదా ఇలా కోట్ల చుట్టూ ఎన్నాళ్ళు జరుగుతారు ఎందుకు ఇదంతా జరుగుతుంది మీరు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం వల్లే కదా ఇప్పుడు ఇతని మధ్యన గొడవ జరిగినప్పుడు కానీ లేదా అది పెద్దదై సెటిల్మెంట్ అప్పుడు కానీ అందరూ కూర్చుంటారు మధ్యలో వాళ్ళ బాధ్యతని అంటే రెస్పాన్సిబిలిటీని కూర్చోబెట్టాల్సిన స్థానంలో సింహాసనం వేసి మరి అహంకారాన్ని కూర్చోబెడతారు.
(06:33) తమలపాకుతో నువ్వు కొట్టు తాడి చెక్కతో నేను కొడతాను అంటే ఎప్పుడు సెటిల్ అవుతుందండి అది ఈ కోపాలు ఎప్పటికీ తెల్లారు ఆ గొడవలు ఎప్పటికీ తెల్లారు. నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను అవతల వాళ్ళు ఎందుకు కొంచెం కూడా కరగడం లేదు ఇక్కడే అర్థం చేసుకోవాలి నీ ఎఫర్ట్స్ పెట్టడం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే నీ చేతుల్లో ఉంది అవతల పక్కల రెస్పాన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది.
(06:52) వాళ్ళకు నిన్ను పార్ట్నర్ గా పొందేంత అర్హత ఉంటే వాళ్లే వస్తారు ముందుకి సహనంతో అప్పటి వరకు ఉండగలిగితే ఉండు లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి చేసుకుంటూ వెళ్ళిపో అంతే మనసులో ప్రతీకారం కానీ విద్వేషం కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు నేను ప్రయత్నించాను అవ్వలేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను సింపుల్ ఇంకో శ్లోకం మనశశాంతి లేకుండా సుఖం అనేది ఉండదు ఇది చాలా బాగుంటది చాలా చక్కని పరిస్థితిలో చెప్తాడు అర్జునుడు ఎంత కాన్ఫ్లిక్ట్ లో ఉంటాడు ఆ టైంలో చెప్తాడు మనశశాంతి లేకుండా అంటే అంటే మీరు ప్రతిరోజు ఇంట్లో బయట పని చేసే చోట రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ
(07:26) ఉంటారు అవునా ప్రతిసారి ఒక సమస్య వచ్చినప్పుడు మీ మైండ్ చాలా డేటా ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య అదేంటి అసలు అవతలి వాళ్ళు మీకంటే బలవంతులా బలహీనులా ఇంతకుముందు ఇలాంటి సమస్య ఎప్పుడైనా ఎదురైందా? అయితే అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మీరు ఇలా చేస్తే నెక్స్ట్ ఏం జరగొచ్చు? ఇంకో అలా చేస్తే అప్పుడు ఏం అవ్వచ్చు కాన్సిక్వెన్సెస్.
(07:47) ఇన్ని రకాలు ఆలోచిస్తుందని మైండ్. కొంతమందిలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది కొంతమందికి ఇది టైం పడుతుంది నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తారు అవునా కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి అంటే నువ్వు ఒక జంక్షన్ లో నిలబడ్డావు నీ ఎదురుగా మూడు రెండు లేదా అంతకంటే ఎక్కువ దారులు ఉన్నాయి ఏ దారిలో వెళ్లాలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి అవునా మరి ఏది ఎంచుకోవాలి అప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు మనశశాంతి ఏ దారిలో దొరుకుతుందో అదే ఎంచుకోవాలి.
(08:13) ఇప్పుడు తప్పుడు పని చేస్తే మనశశాంతి దొరకదు ఖచ్చితంగా దొరకదు. రైట్ ఇప్పుడు ఏదో పని చేసి పెట్టడానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడండి అనుకుందాం వాడికి ఆఫర్ చేశారు తీసుకోవాలా వద్దా తీసుకుంటే తాత్కాలికంగా ఒక లగ్జరీ ఏదో సుఖం దొరుకుతుంది కానీ భవిష్యత్తులో నువ్వు తప్పు చేశవ్ ఆ డబ్బులతో నీ పిల్లలకి ఏదో కొన్నావ్ ఆ గిల్ట్ ఉంటుంది ఆ తర్వాత ఆ డబ్బుతో నువ్వు ఏం చేసినా సరే అది తిప్పి తిప్పి తిప్పి తిప్పి మళ్ళీ ఒక భయంకరమైన మార్గంలోకి తీసుకెళ్లి వదిలేస్తుంది అది నిన్నో నీ పిల్లల్నో నీ మనవల్నో భార్యా భర్తల మధ్య గోడల్లో కూడా
(08:45) చూసుకున్నా అంతే కదా కదా మీరు హై లెవెల్ వ్యూ చూసుకుంటే ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని అది అమలు పరిచాక అటువాళ్ళు గాని ఇటు వాళ్ళు గాని మనశశాంతితో ఉంటారండి నిజం చెప్పండి కేస్ ఫైల్ చేసిన వాళ్ళు గాని దాన్ని ఎదుర్కుంటున్న వాళ్ళు గాని ఎవ్వరన్నా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారా మీ మధ్య గొడవలు అయ్యాయి మనస్పర్ధలు ఉన్నాయి మీ భర్త మిమ్మల్ని కాపురానికి తీసుకొని వెళ్లటం లేదు లేకపోతే మీ భార్య కాపురానికి రావటం లేదు ఏం చేస్తారు అప్పుడు కేసులు ఫైల్ చేస్తారా వెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతారా సెటిల్ చేసుకుంటారా ఏది ఎప్పుడు చేయాలో తెలియాలి కదా ఇప్పుడు
(09:14) మొన్న రైట్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది అమెరికా వచ్చి హార్మోన్స్ జల సంధి తెరిపించి తీరుతాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుందండి మొన్నటిదాకా తెరుచుకునే ఉందిగా నువ్వేగా యుద్ధం మొదలు పెట్టింది అక్కడ పెంట చేసేసి దాన్ని మూతపడేలా చేసి ఇప్పుడు తెరిపిస్తే ఏం తగ్గోల మీ భార్యా భర్తల మధ్య గొడవలు కూడా ఇంతేనండి మీ ప్రయత్నం ఎలా ఉండాలి వీలైనంత సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవాలి కుదరలేదు అప్పుడు కూడా పరిష్కారం చేసుకునే మార్గం సెటిల్మెంట్ గేట్ ఓపెన్ చేసే పెట్టండి పెట్టి కేసులు ఫైల్ చేయండి అవతల వాళ్ళకి నొప్పి తెలుస్తుంది మొదట్లో బానే పంతం
(09:47) పడతారు తర్వాత మెల్లిగా దారిలోకి వస్తారు. కేసులు ఎందుకు ఫైల్ చేసావ అని మిమ్మల్ని అడగలేరు ఎందుకంటే నీ దగ్గర సమాధానం ఉంది నాతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మరి నేను ఏం చేయాలని సమాధానం చెప్తావ్ ఎందుకు ఇంత ప్రిపరేషన్ ఎందుకంటే మీ జీవితం బాగుండాలి కాబట్టి రైట్ ఎప్పుడు కూడా అండి డబ్బు పదవి పేరు ప్రతీకారం వర్సెస్ మానసిక ప్రశాంతత అని వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండే మార్గాన్ని మాత్రమే ఎంచుకోండి.
(10:12) ఎందుకంటే అది లేకుండా మిగతావన్నీ కూడా శుద్ధ దండగా సింపుల్ అండి నేను మాత్రమే కరెక్ట్ అని నిరూపించాలి అనే పట్టుదల మీరు ఏ రోజైతే వదిలేస్తారో ఆ క్షణం నుంచి నీకు మానసిక ప్రశాంతత మొదలవుతుంది ప్రతి చోట ఇదే కదా నేనే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ నన్ను నేను జస్టిఫై చేసుకుంటాను నేను చేసిన పనిని ఇదేగా గోల ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది చివరిగా అండి భగవద్గీత ప్రాబ్లమ్స్ రాకుండా చేయిస్తుందా తప్పు తప్పు అది అపోహ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేయాలని మాత్రమే చెబుతుంది.
(10:49) రైట్ భార్యా భర్తల మధ్యన గొడవలు వచ్చినప్పుడు అది మీ భవిష్యత్తు ఆర్ మీ పెళ్లి మీ బంధాన్ని విద్వంసకరంగా మార్చేస్తుంది ఎప్పుడు నాలుగే నాలుగు కారణాలండి ఒకటి అహంకారం రెండు కోపం మీ మీద వేరే వాళ్ళ ప్రభావం అన్నయ్య చెప్పాడనో అక్క చెప్పిందనో ఇంకెవరు చెప్పారనో స్నేహితులు చెప్పారనో లేకపోతే వాళ్ళని చూసి నిన్ను నువ్వు పోల్చుకున్నావ్ అది నాలుగోది ప్రతీకారభావం మైండ్సెట్ విపరీతంగా రివెంజ్ పెంచేసుకుంటారు విపరీతంగా ద్వేషం వాళ్ళు ఎలా అన్నా సరే వాళ్ళు అంతు చూడాలి ఇది వర్కవుట్ అవ్వదు నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నట్టు అవుతుంది. పస్మాసుర హస్తం ప్రతీకారం అనేది
(11:22) మరి వాటిని బెస్ట్ ఆప్షన్స్ ఏంటి పరిష్కరించుకోవడానికి భగవద్గీత చెప్పేది ఏంటి ధర్మం ధర్మం అంటే ఏముందండి వీలైనంత నిజాయితీగా ఉంటే చాలు అదే ధర్మం వీలైనంత సున్నితంగా, వీలైనంత నిజాయితీగా అబ్బా ఎందుకు వచ్చిన గొడవరా బాబు రెండు చేతులెత్తి దండం పెట్టేస్తే అయిపోయాయి. రెండోది మీ ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం చాలా మంది తగలబెట్టేసారు ఇక్కడే ఎమోషన్స్ కంట్రోల్ లో లేకే రైట్ మూడోది కొద్దిగా జాలి అవతల పక్కవాళ్ళ పక్కన కరుణ ఓకే వాళ్ళ పట్ల కొంచెం కరుణ సరే పోనీ వాళ్ళ పాపని వాళ్ళే పోతారు వదిలేద్దాంలే ఈ వదిలేద్దాంలే అని ఎప్పుడైతే అనుకుంటావో వాళ్ళని వదలట్లే
(11:56) నువ్వు నిన్ను నువ్వు వదులుకుంటున్నావ్ హాయిగా అంటే నీలో ఉన్న పనికిమాలిన క్వాలిటీస్ అన్నిటిని వదిలేస్తున్నావ్ రైట్ చాలా ఈజీ అయిపోతుందండి లైఫ్ ఒక్కసారి క్షమించి చూడండి ఒక్కసారి వాళ్ళని వదిలేసి చూడండి ఇగ్నోర్ చేయండి చాలా ఈజీగా ఉంటది అంటే వాళ్ళు చేసిన తప్పు నేను చెప్తుంది. నాలుగోది అతి ముఖ్యమైనది గెలుపు పైన ఎటువంటి ఆసక్తి లేకపోవడం ఓకే నేనే గెలవాలి నా నాకు అర్థం కాక అడుగుతా మీరు భార్యా భర్తలు ఇద్దరు కోర్టుకి వచ్చారంటే ఇద్దరు ఓడిపోయినట్టే ఆల్రెడీ మీరు పెళ్లి బంధంలో ఓడిపోయారు కాబట్టి అక్కడికి వచ్చారు ఇంకేంది గెలిసేది గాడిది గుడ్డు ఎవరు
(12:31) గెలవరు అక్కడ ఓకే ఇద్దరు వచ్చారు బాలెన్స్ చేసి పంపిస్తుంది సిస్టం ఎప్పుడు బాలెన్స్ చేస్తుంది అంతే అండి మీరు గెలిచావు ఓడిపోయావు ఇదే ఇదేమనా ఏంటి ఏమనుకుంటున్నారు ఏమనా హచ్చా నేనేమా రైట్ ఇదండీ విషయాలు భగవద్గీతలో చాలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటాయండి మీకు కరెక్ట్ గా చదవటం మొదలు పెడితే దాని అర్థం నేర్చుకుంటే అప్లికబుల్ అంటే మీ లైఫ్ కి మీరు అప్లై చేయడం మొదలు పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఈ మూడు నాకు బాగా నచ్చి చెప్పాను మళ్ళీ వాయిదాలు కలుద్దాం అండి అంతవరకు సెలవు ధన్యవాదాలు
No comments:
Post a Comment