పెళ్ళంటేనే భయమేస్తున్నది. ఎందుకంటే... Afraid of Marriage, because...
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8vl3qjKlZRc
Transcript:
(00:01) సామాజిక మాధ్యమాల పుణ్యం అని చెప్పేసి ఇప్పుడు టీనేజ్ ఆడపిల్లలకో మోపిల్లలకి ఏ వయసులో ఏది తెలవకూడదో అది ముందే తెలిసిపోతున్నాయండి వీటిని ఆపలేము కూడాను సమాజం ఆపలేదు తల్లిదండ్రులు కూడాను ఆపలేరుఅన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలి అంటే సమాజం నుంచి కుటుంబం నుంచి కూడాను ఈ పరిస్థితిని విడదీయలేము అదంతే నా పాయింట్ ఏంటంటే ప్రస్తుత యువత పరిస్థితి ఇలా ఉంటే మరి ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లల కంటే 20 ఏళ్ళ తర్వాత టీనేజ్ పిల్లల పరిస్థితి ఏమిటి ఇంకా ఘోరంగా ఉంటుంది కదా అన్న ఒక భయం నాలో కూడా ఉందండి అయితే ఈ ప్రశ్నని నేను కొంతమంది యువతకు వేశను
(00:46) వేస్తే వాళ్ళు కూడా మాది కూడా అదే ఆలోచన సార్ మేము ఎంతో మందికి చెప్పాము మరి సోషల్ మీడియాలో వచ్చిందో లేదో తెలియదు అని అంటున్నారండి అప్పుడు అనిపించింది కరెక్టే నా భయం కూడాను యువత భయం మే కదా అని అనిపించిందండి నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నిజంగా చెప్పాలి అంటే సాహసిస్తున్నాను అన్నమాట నిజమేనండి ఈ పరిస్థితి ముందు ముందు ఘోరంగా ఉంటుంది కదా అని నేను నిజంగా నిజాయితీగా అన్నాను అనుకోండి వెంటనే దానికి సమాధానం ఏంటి పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు అని అంటుంది యువత కానీ అది ఎంతవరకు సబపం అన్న విషయాన్ని మనం ఇక్కడ చర్చించాల్సి
(01:30) ఉంటుందండి అంటే ఇక్కడ [గొంతు సవరించుకోవడం] పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ప్రశ్న కంటే పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో పిల్లల్ని సామాజిక మాధ్యమాల దృష్ట్య బాధ్యతగా పెంచి పెద్ద చేయగలమా అన్నది ముఖ్యమైన విషయం అన్నమాట ఇప్పుడు ఒకప్పుడు 16 17 18 ఏళ్ల వయసులో తెలిసే విషయాలన్నీ ఇప్పుడు 10 11 12 ఏళ్లకి తెలిసిపోతున్నాయి కదా ఈ సోషల్ మీడియా మీడియా మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ సమాచారం ఇవన్నీ కూడాను వీటి నియంత్రణ అసాధ్యంపోయింది.
(02:08) ఇంకొక విషయం ఏంటంటే పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా యువత దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రుల ప్రభావం కంటే పీర్ గ్రూప్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రెండ్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మన పిల్లలు మంచివాళ్ళే కావచ్చు మన పిల్లలకు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు చూశరా వాళ్ళు ఎప్పుడు ఏది చూస్తారో ఏం మాట్లాడుతారో తెలియదు.
(02:30) ఆ మాటలు మన మంచి పిల్లల మనసుల మీద నెగిటివ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేస్తున్నాయండి. ఇవన్నీ పిల్లలు వచ్చి మనకు చెప్పరు కదా మనం చెప్పరు కదా సో ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. తల్లిదండ్రులుగా మనందరం కూడాను ఆలోచించాలి. చరిత్ర తిరగవేస్తే ప్రింటింగ్ మిషన్స్ వచ్చినప్పుడు మంచి చెడు ఉంది అప్పుడు ప్రజానికి భయపడింది. సినిమాలు వచ్చినప్పుడు కూడాను కొంతమంది విజ్ఞులు భయపడ్డారు.
(03:03) బాగనే ఉంది కానీ ఇది వింతపుంతలు తొక్కితే రేపు పోతున్న పరిస్థితి ఎట్లా అని తొక్కింది కూడా కదా అట్లాగే టెలివిజన్ బ్లాక్ అండ్ వైట్ వచ్చినప్పుడు కూడాను మనం ఆనందించండి అని కొంతమంది ఆలోచించారు. అమ్మో ఈ మాధ్యమం ద్వారా కొన్ని చెప్పకూడని విషయాలు ఏమన్నా ఈ టెలివిజన్ ద్వారా ప్రసారం అవుతాయేమో అని ఆలోచన భయం కూడాను కొంతమందికి ఆ రోజుల్లో పట్టుకుందండి.
(03:28) ఇంటర్నెట్ మొబైల్స్ వచ్చినప్పుడు కూడాను నాకు బాగా గుర్తు ఒక పెద్ద సీనియర్ జర్నలిస్ట్ రవీంద్ర భారతిలా అన్నాడు. ఇది బాగానే ఉంది కానీ దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించాడండి అప్పటికి ఇంత విద్రృణం లేదు కానీ ఇప్పుడు మనకు నిజంగా యువత యొక్క మనసుల మీద ఇది విపరీత పరిణామాలను చూపెడుతున్నాయండి సామాజిక మాధ్యమాలు అన్నీ కూడా కానీ చిన్న ఆశ ఏంటంటే సమాజం మారింది మార్పునేటి ఆపలేం కాబట్టి మంచి మనుషులు కూడా ఇంకా అంతరించిపోలేదండి.
(04:09) ఇంకా మంచి ఉంది మంచి ఉంది మనకు కనపడటంలేదు కానీ మంచి ఎక్కువే ఉందండి. కాకపోతే ఏంటంటే చెడు కొంచెం ఎక్కువ ఉంది. లేకపోతే అసలు నేను మరి ఇటువంటి వీడియోలు ఎందుకు చేస్తాను చెప్పండి. మరి ఇంతమంది సబ్స్క్రైబర్స్ నాకు ఎందుకు ఉన్నారు ఇన్ని మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి ఇన్ని ఫోన్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది సమస్య కాదండి కానీ సరైన జ్ఞానాన్ని వెతికిపట్టుకొని అనువహించుకోవడంలో చెప్పటంలో ప్రచారం చేయటంలో ముందుకు తీసుకెళ్ళటంలో కునే సమస్య ఉంది.
(04:48) ఏదో అంటారు చూసారా మేధావుల మౌనమే సమాజానికి చేయటం అని చెప్పేసి ప్రస్తుతానికి అదే జరుగుతున్నదండి అంటే ఇప్పుడు పిల్లలకి ఏమైతున్నది అంటే సమాచారం ఎక్కువగా ఉంది అర్థం చేసుకుంటే పరిపక్వత చాలా తక్కువగా ఉంది. ఆ వయసులో ఉండదు కూడా ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని చూసి నేర్చుకునే క్రమంలో ఉన్నారు. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మరి వాళ్ళ బురలన్నీ కలుషితం అయిపోతూ ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి అటువంటప్పుడు బాధ్యత ఎవరిది ఎవరిది తల్లిదండ్రులదే కదా వాళ్ళ నుంచే మొదలవపోవాలి కదండీ వాళ్ళు మనక ఎందుకులే ఏదో ఫీజులు కట్టేసాము కాలేజీలో చేర్పించాము అంటే కాలేజీలో
(05:30) నిజంగా ఏదో చెప్తారు కానీ బయటికి వచ్చిన తర్వాత మీ ఫీజులు పనికవస్తాయా పిల్లలకి కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా కొంత ఉంది కదండీ మీరు మీ బాధ్యతను గనుక విస్మరిస్తే పిల్లలు రేపున సమాజానికి చేటుగా మారే అవకాశం ఉంది కదా ప్రపంచంలో సమస్యలు ఉన్నాయని ఈ కర్తవ్యాన్ని బాధ్యతని వదిలేయకూడదు కదండి అలా వదిలేస్తే అది పిరికితనమేగా బాధ్యత రాహిత్యమేగా నాకఎందుకులే నాకెందుకులే అంటే నీ పిల్లవాడు కూడా ఉన్నాడుగా ఆ యువతలో ఉన్నాడుగా ఆ సమాజంలో ఉన్నాడుగా అంతా పాటి ధైర్యం లేకపోతే నేను యువతకి ఒకటే చెప్తున్నానండి టెంపరరీగా పెళ్లిని వాయిదా వేయండి.
(06:18) అప్పటికీ ధైర్యం గనుక తాలకపోతే పెళ్లిని వదిలేయండి. యువత నుంచి వస్తున్న ప్రశ్నకు సమాధానంగా నేను చేస్తున్న వీడియోనండి తల్లిదండ్రుల ప్రసక్తి ఎటు నేను పట్టుకొచ్చాను అనుకోండి ఇప్పుడు యువతే సామాజిక మాధ్యమాల ద్వారా ఇంత ఘోరంగా ఉంటే రేపు పొద్దున అసలు మేము పిల్లల్ని గన 20 ఏళ్ల తర్వాత మా పిల్లల్ని నిజంగా పెంచగలమా అన్న భయం యువతలో ఉంది కానీ నేను గమనించాను ఈ మధ్యన నాకు కూడాను ఈ భయం కలిగింది కాబట్టి నేను యువత కూడా చెప్తున్నానండి టైం తీసుకోండి టైం తీసుకోండి ప్రపంచం ఇంకా చెడిపోలేదు.
(06:53) సమాజం ఇంకా అద్భుతంగా ఉంది. పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తక్కువైపోతున్న పుస్తకాలు మటకు విపరీతంగా ప్రింట్ అవుతున్నాయి. బుక్ ఎగ్జిబిషన్స్ లో ప్రతి సంవత్సరం కూడాను కొన్ని వేల పుస్తకాలు కొత్తవి వస్తున్నాయండి మానవాళ్ళకి దిశా నిర్దేశం చేస్తూ చదవడానికి టైం లేదంటే ఎలాగండి రాకలిగా ఉంది అన్నం వండుకోవడానికి టైం లేదు అన్నట్టుగా ఉంటుంది కదా నేను ప్రయాణంలో చాలా బిజీగా ఉన్నాను కానీ పెట్రోల్ పోసుకోవడానికి టైం లేదు అన్నట్టుగా ఉంటుంది.
(07:27) మీరు ఎంత బిజీగా ఉండేవ్వండి మంచి మడు విపరీతంగా ఉందండి చుట్టుపక్కల టైం తీసుకొని వాటిని స్పృషించగలిగితే ఆ పుస్తకాల్ని మీకు కూడాను కొంత జ్ఞానం కలుగుతుంది తల్లిదండ్రులుగా చెప్తున్నా తల్లిదండ్రులకు చెప్తున్నా యువత కూడా చెప్తున్నాను నేను ఉన్న మంచిని కొంత వెసులుబాటు తీసుకొని గ్రహించకపోతే మీకు అసలు జీవితంలో ధైర్యం ఎలా వస్తుంది ధైర్యం ఎలా వస్తుంది ఇది ఆలోచించాలండి ఇది ఆలోచించాలి లాభం లేదండి అని అనుకున్నారు అనుకోండి ఇబ్బంది ఏమీ లేదు అసలు పెళ్లే వద్దు [నవ్వు] పెళ్లేకపోతే జీవితాలు నడవవా చెప్పండి నడుస్తాయి కదా ఎన్నో మార్గాలు ఉన్నాయి వాటిని ఎందుకు ఎంచుకోకూడదు
(08:08) సేవా మార్గాన్ని ఎంచుకోండి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి సమాజంలో పరివర్తన కోసం ప్రవచనకర్తలుగా మారే ఏర్పాటు చేసుకోండి లేకపోతే నాలాగా ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ గానో లేకపోతే క్యారెక్టర్ బిల్డింగ్ యక్టివిస్ట్ గానో మారే ప్రయత్నం చేయండి. అంటే మరి ఈ పాత్రలు ని పోషించాలి అంటే విపరీతమైన డబ్బుఏమి అవసరం లేదుగా రోజు గడిచేంత సంపాదన ఉంటే సరిపోతుంది గా ఆ మాటకు వస్తే వేస్టేజ్ ని తగ్గించి పొదుపు చేసుకుంటూ ఉంటే బ్యాంకు బాలెన్స్ కూడాను పెరుగుతూనే ఉంటుంది కదా అసలు నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ పైన
(08:53) చెప్పిన పాత్రలన్నీ కూడాను గౌరవప్రదమైనవే కదండ కాబట్టి కాబట్టి భవిష్యత్తులో పిల్లలు చెడిపోతారు కాబట్టి పెళ్లి అవసరం అనే అనవసరం అనే వాదన తప్పు ఇది ఫలాయన వాదన కిందకి వస్తుంది నేను రిపీట్ చేస్తున్నాను అని మాటకు అనుకోవద్దు ఇది పెరిగితనాన్ని సూచిస్తుందండి. చెడు పెరుగుతున్న మాట నిజమే కానీ ఉన్న మనిషిని అన్వయించుకని ముందుకు పోలేమన్న పిరికితనం ఎందుకు ఉండాలి ఆలోచించండి ముఖ్యంగా యువత ఆలోచించాలి అలాగే తల్లిదండ్రులు కూడాను ఆలోచించాలి వాళ్ళు భయపడి వీళ్ళు భయపడి ఏం కావాలండి దేశం భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఏం కావాలి చెప్పండి చాలా సీరియస్ విషయం ఇది అసలు ప్రతి తరంలో
(09:40) సవాళ్లు ఉన్నాయండి సవాళ్లు లేని తరం అంటూ ఉంటుందా చెప్పండి వాటిని ఎదుర్కునే మనుషులు పుడతారు తప్పకుండా పుడతారండి అసలు వాళ్ళలో మీరు ఒక్కళ్ళ ఎందుకు కాకూడదు ఆలోచించండి ఎన్నో ఆవేశాలు జరిగినందువల్లనే కదా మనం ఆ సుఖాన్ని ఆ ఆనందాన్ని ఆ సౌకర్యాన్ని అనుభవిస్తున్నాము ఎవడు క్రియేట్ చేయకపోతే ఎలా ఉండేది ఆదికేతలో ఉండేవాళ్ళం కదా మనం కాబట్టి మీరే ఎందుకు నడువు బేగించకూడదు ఆలోచించండి.
(10:10) పెళ్లి అనేది సెకండరీ అనుకుంటే ఇప్పుడు పిల్లలు పుడితే ప్రపంచం వారిని మార్చేస్తుందేమో అని భయపడే కంటే ఒక మంచి కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు ప్రపంచాన్ని మార్చే శక్తివంతుడు కావచ్చుగా ఇప్పుడు అదే జరిగిందిగా అంటే నేను రాజకీయాలను తీసుకొస్తున్నాను అన్నమాట అనుకోవద్దండి మరి మోడీ గారి జీవితాన్ని పరిశీలించండి అమ్మేమో ఇళ్లల్లో పని చేసుకునేది ఆయనేమో మరి టీ అమ్ముతూ పైకి వచ్చాడు కదా ఇవన్నీ స్ఫూర్తి గాధలు కదా ఇటువంటి వాళ్ళ
(10:55) గాధల్ని మనం చదవకపోతే ఎలాగా చదివితే కదా ధైర్యం వచ్చేది కదండీ కాబట్టి ఎట్టి పరిస్థితులో కూడా నేను ఒకటే చెప్తున్నానండి ఆశలని ఎప్పుడు ఆవిరి చేసుకోవద్దండి పెరిగితనంతో ఉండొద్దు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ అదేంటంటే అసలు పిల్లలని పెంచే పరిజ్ఞానం తల్లిదండ్రుల్లో ఉందా అందరి తల్లిదండ్రులు ఎవరికి వారు ఆత్మ విమర్శ నిజంగా చేసుకోవాలి.
(11:27) సమాజం మారుతున్నది టెక్నాలజీ మారుతున్నది కానీ మీరు ఎంతవరకు అప్డేట్ అవుతున్నారు అప్డేట్ కాలేవండి అడప్పుడు ఎందుకు మరి పిల్లలు చెడిపోతున్నారు అని బాధపడటం అవకాశాలు అయితే ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఒక్కటండి కొన్ని కొన్ని విషయాలని మనం గురించి ఒప్పుకోవాలి ఇక్కడ అదేంటంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సంపాదన పరుగులో ఉన్నారు కదా సిస్టమ్స్ గా అతుక్కుపోయారు ఏరోజుక ఆరోజు అలిసిపోతున్నారు నిజమే కానీ నేను ఈ మాట చెబితే మీ అందరికీ కోపం వస్తుందేమో కదా ఒక జీవితాన్ని జీవించిన అనుభవం గడించిన ఈ తాతలు అమ్మమ్మలు ఉన్నారు కదా వాళ్ళు మిమ్మల్ని కనిపించారు కదా
(12:13) వాళ్ళు విలువలతో పెంచడం వల్లే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళని గౌరవించి దగ్గర పెట్టుకుంటే చిన్నప్పటి నుంచే పుట్టినప్పటి నుంచే మీ పిల్లలకి వాళ్ళు మంచి విషయాలు చెప్తారుగా విన్న నేర్పుతారుగా అలా నేర్పినప్పుడు వాళ్ళు ఇటుక మీద ఇటుకు పెట్టి పట్టిష్టమైన గోడ కట్టినట్టుగా పెరుగుతారు కదా మరి వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకోరు అంటే పట్టించుకోని వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నానండి ఆ మీరు ఎందుకు వాళ్ళని పట్టించుకోరు వాళ్ళ బరువా అడ్డమా శ్రమని ధారపోసారుగా మీకు తెలుసు కదా ఇవన్నీ నేను నిష్కర్షగా మాట్లాడుతున్నాను అన్నమాట కనుకోవద్దండి
(12:54) కొంతమంది యువతని మాత్రమే ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నప్పుడు అమ్మ నాన్న గనుక ఉంటే వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడాను ఎవరి మీద ఉంటాయి మనవాళ్ళు మనవరవాళ్ళ మీదే ఉంటాయిగా మీరు మీ పరుగులో ఉండండి ఎవరవద్దు అన్నారు ఇంకొకటి వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళక కూడా ఎన్నో తప్పులు చేసిన అనుభవం ఉంది.
(13:17) కానీ ఒప్పులు చేసుకోవడానికి జీవితం సరిపోవట్లేదండి అందువలన అలా చేయకుండా ఉంటే బాగుండేది. కానీ ఇలా చేస్తే బాగుండదని తల్లిదండ్రులు అనుకుంటారుగా వాళ్ళ అనుభవత్య ఆ జ్ఞానాన్ని ఇప్పుడు వాళ్ళు మీ పిల్లలకి అందిస్తారుగా వాళ్ళు బరువు అనుకున్నా ఎట్లా అండి రేపు పొద్దున మీ పిల్లలు కూడా మిమ్మల్ని బరువు అని అనుకుంటారుగా అందుకనే కదా అసలు వృద్ధాశ్రమాలు అవన్నీ వచ్చాయి కదండీ ఆలోచించండి ఆలోచించండి ఎప్పుడు కూడాను సంకుచి తత్వానికి పోతే ఎలాగా నేను నా భార్య నా పిల్లాడు నా ప్రయాణానికి ఒక సూట్కేస్ మేమే తిరుగుతాం అంటే ఎలాగండి తల్లిదండ్రులు కోనార్ వెళ్ళిపోతూ మంచంలో
(13:59) పడిపోతే అప్పుడు వెళ్లి ఆ 10 రోజులు నుండి డాక్టర్ ఎదురు చూపెట్టి లేకపోతే కర్మకాండాలకు పోయిచ్చే విధానం మారాలిగా ఆలోచన మారాలిగా నేను అందరినీ అంటలేదండి అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను కాబట్టి ఆదర్శ దంపతులు ఎలా అవ్వాలి పెద్దవాళ్ళని గౌరవిస్తే అయితారండి అంతే కదా అమ్మమ్మ వంటింటి చిట్కాలు నిజంగా గనుక పాటించినట్లయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ కి లక్షలు లక్షలు తగిలేసే అవసరం వస్తుందని చెప్పండి.
(14:31) సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం అనుకోండి ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉందండి అదేంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి. పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు పరిపూర్ణులు కావలసిన అవసరం లేదండి ఒక్కొక్కళ జీవితం భగవంతుడు పుట్టించినట్టుగా ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ ప్రతి జీవితానికి ఒక సామాజిక ప్రయోజనం ఉంటుందిగా ఉంటుంది కదా కాబట్టి తల్లి పిల్లల్ని మెచ్చటానికి తల్లిదండ్రులు పరిపూర్ణులు కావలసిన అవసరం లేదు ఆ మాటకు వస్తే ఈ భూమి మీద ఎవరు పరిపూర్ణులు కాదండి ఇంక్లూడింగ్ మటాధిపతులు కూడాను జస్ట్ నిజాయతి పరులు అయితే చాలండి కష్టపడి
(15:17) మనస్తత్వం ఉంటే చాలు అసలు ముఖ్యంగా పిల్లలతో సమయం గడపగలిగితే చాలు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పింది వినగలిగితే చాలు వాళ్ళని మాట్లాడనిచ్చి వాళ్ళు చెప్పింది వినగలిగితే ఆ పిల్లలకు ఆత్మస్థయం వస్తుందండి పిల్లలకి అలాగే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కదా అప్పుడప్పుడు పిల్లలు పెరుగుతూ ఉంటే కొన్ని కొన్ని విషయాలని అంటే వాస్తవ పరిస్థితిని వాళ్ళతో చర్చించినా కూడా చాలండి వాళ్ళు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
(15:49) అట్లాగే ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయగలిగితే బాధ్యతగా పెరుగుతారండి బాధ్యత పెరుగుతారు. మనమే బాధ్యతను విస్మరించామ అనుకోండి రేపు పొద్దున వాళ్ళ బాధ్యత పెరగాలి అన్న ఒక ఆశ హక్కు మనక ఏముంది చెప్పండి చిన్నప్పుడు పిల్లల్ని ఏ విధంగా అయితే ఇందాక నేను చెప్పినట్లుగా పెంచగలుగుతామో అవన్నీ వాళ్ళలో ముద్రలుగా పడతాయండి సవిటికి ఓర్పు నేర్పు కొంత ప్రేమ కావాలండి ఆస్పృహ ఉండాలి ఉండగలిగితే అద్భుతంగా పెళ్ళీలు చేసుకోవచ్చు పిల్లల్ని కనొచ్చు అద్భుతమైన ప్లానింగ్ ఉండాలండి ప్లానింగ్ ఉండాలి జీవిత భాగస్వామిని ఎన్ని కోటలో
(16:33) కూడాను ప్లానింగ్ ఉండాలి. పిల్లల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడాను మీరు చర్చించుకోవాలి కదా అమ్మో ఇన్ని మండల అనుకున్నారు అనుకోండి వద్దండి పెళ్లివద్దు నమస్కారం పెట్టి చెబుతున్నా పెళ్లవద్దు పిల్లలు వద్దండి అంటే అసలు ముందు మారుతున్న మార్పుకి అనుగుణంగా మనం కూడాను మారాలి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
(17:04) నేను ఎక్కడో చెప్పాను చాలా వీడియోలో కూడా చెప్పాను. మీరు తల్లిదండ్రులు అయ్యారంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం ఎందుకంటే ఒక తరం ఇంకో తరాన్ని సృష్టించడానికి 30 ఏళ్ళు పడుతుంది కదా ఈ 30 ఏళ్లలో సమాజం ఎంతో మారిపోతుంది గా ఇ ఎప్పుడు మారినట్టుగా మరి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండకపోతే ఎలా చెప్పండి ప్రశ్న వేసుకోండి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఆత్మ విమర్శ చేసుకోవాలండి అంటే ఈ ప్రశ్నన్నిటికీ నిజాయితిగా సమాధానం చెప్పుకోవడం అనేది పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయం కంటే కూడాను చాలా ముఖ్యమైన విషయం ఆత్మ విమర్శ ఏది ఏమైనా నిర్ణయతలు మీరేనండి నిర్ణయతలు
(17:45) మీరే చాలా ఆవేదనతో చేస్తున్న వీడియో ఇది పేరెంట్స్ మీరే భౌతిక సుఖాలు వెంబడిపడితే రేపు పొద్దున తప్పకుండా మీ పిల్లలు కూడాను భౌతిక ఆనందంలోనే ఉంటారుగా మీరు చెడ్డీలు వేసుకొని తిరుగుతుంటే రేపు పొద్దున మీ కూతుర్లు బితికినీలు వేసుకొని తిరుగుతూ ఉంటారుగా సముదర పొటన ఇప్పుడు అది కూడా జరుగుతున్నది కదండీ చెప్పేవాళ్ళు లేరు మనకఎందుకు గాని వేరేవాళ్ళు పక్కకు తొలిగి వెళ్ళిపోతున్నారు.
(18:17) ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా జరుగుతున్నది కొంచెం సున్నితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు సంపాదిస్తున్నారు నిజమే దాచుకుంటున్నారు నిజమే రేపు ఇదంతా నీకోసమే నాన్న నేను దాచిపెడుతున్నది అన్న భావన కూడాను అక్కడక్కడ చాలా మంది తల్లిదండ్రులు కలిగిస్తున్నారుగా అది ఎంత ప్రమాదకరం అండి అది ఎంత ప్రమాదకరం చెప్పండి అందుకనే ఇప్పుడు పిల్లల్లో ఏం జరుగుతున్నది అంటే నా తల్లిదండ్రులు దగ్గర డబ్బులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ మాకు ఖర్చు పెట్టట్లేదు అనే భావన ఉందండి అందుకనే పిల్లలు తల్లిదండ్రులని సత ఇచ్చేస్తున్నారు.
(18:59) అసలు మూలాన్ని తల్లిదండ్రులు కనిపెట్టలేకపోతున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు నిజమే నేను కాదంటలేదు కానీ ప్రతి విషయమే పిల్లలకు తెలవల్సిన పని లేదుగా మీరు ఆడంబరాలకి ఆనందాలకి పోతే మరి ఏ ప్రమేయం లేకుండా భూమి మీదకి వచ్చిన ఆ పిల్లలు వాటిని మరి అనుభవించాలిగా మరి వాళ్ళు కూడాను అరవలే కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో దాపరికం ఉండాలండి ఎంత సంపాదించామ అని కాదు పిల్లల్ని ఎంత భాగ్యతతో పెంచాం ఎంత ఆదర్శవంతమైన భావాలతో పెంచాం మన తల్లిదండ్రులని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఏ విధంగా గౌరవించాం రేపు పొద్దున భూమరాంగ కర్మ మన ఎంబడ పడుతుంది గా మన పిల్లలు కూడా పట్టించుకోరు
(19:42) ఇప్పుడు అదే జరుగుతున్నది కదా కొన్ని మాట సీరియస్ గా వెళ్తుంది కదండీ తప్పదండి ఎందుకంటే భారతదేశంలో వివాహ వ్యవస్థ బ్రతికి కితేనే భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంకా పెరుగుతుంది. అంతేగాన వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళిపోయి అదేదో పెద్ద గొప్ప అనుకొని మనం దాని వారసత్వంగా తెచ్చుకుంటే ఎలాగండి ఇప్పుడు వాళ్ళకి అక్కడ బోరు కొడుతున్నది.
(20:05) అందుకనే రమణమరి శాస్త్రమాలు ఎంబడి ఎన్నో దేశాల నుంచి యువత ఇదేదో చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇది కదా జీవితం అని అక్కడ తిరుగుతున్నారు మనమేమో అక్కడే బాతుకుపోయి ఓహో అదే గొప్పని మనం అనుకుంటున్నామఅండి కదా నా ఫ్యూచర్ కి డోక లేదు అన్న భావనతో పిల్లలు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు పెద్ద కష్టలు అయిపోతారండి మీరు ఎంత మంచి చెప్పినా కూడాను వాళ్ళకి నచ్చదు కదా కాబట్టి సంపాదించండి సమాజ సేవ కూడా వాళ్ళ చేత చేయించండి అభాగ్యుల కళ్ళల్లోని జాలిని కన్నీళ్ళని చూస్తే వీళ్ళలో చిన్న వయసులోనే ఏది కరగాలో అది కలుగుతుంది ఏది కదలాలో అది కదులుతుందండి
(20:51) అప్పుడు డబ్బు మీద వాళ్ళకి పెద్దగా వ్యామోహం ఉండదు జీవితం మీద వ్యామోహం పెరుగుతుంది. పొరపాట్లు చేస్తే మనం కూడా ఈ పరిస్థితికి వస్తామేమో జాగ్రత్తగా ఉండాలన్న భావన కలుగుతుందండి. కాబట్టి పిల్లల్ని డబ్బులు ఉన్నంత మాత్రాన వాళ్ళని అలా వదిలేయకూడదండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిందే వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లాల్సిందే అట్లాగే అభాగ్యులు ఉన్న ఆశ్రమాలకి తీసుకెళ్లాల్సిందే వాళ్ళని ఇన్వాల్వ్ చేయించాల్సిందే అసలు వాళ్ళ గాధలు 16 17 ఏళ్ళ పిల్లలకి బలవంతంగా తీసుకెళ్లి వినిపించవలసిందే అప్పటికి వాళ్ళకి ఒక భయం పడుతుందండి మనసులో కదా ఇవన్నీ గనుక చేయగలిగితే అంటే ఈ బాధ్యతని
(21:34) గనక తల్లిదండ్రులుగా మనం తీసుకోగలిగితే పిల్లలు చక్కటి పిల్లలు అయతారండి అయి వాళ్ళు కూడా మనం ఏదో ఒకటి చేయాలి కదా అని ఆలోచింతా ఉంటారు. అప్పుడు పెళ్లికి భయపడరండి పెళ్లికి భయపడరు చుట్టుపక్కల ఎంత విధ్వంసం జరుగుతున్నా దాంట్లో నుంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కొంతమందివి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఎదుగుతారండి.
(22:00) సో ఇదండి ఆశ పోతే జీవితం ఏమ ఉండదండి ఎందుకంటే ఆశే జీవితం జీవితమే ఆశ అండి సో ఇదండి ఈ వీడియోలోని విషయం వినందుకు కృతజ్ఞతలు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎంతో మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ పోరూరి పోరూరి మా ఇంటి పేరు YouTube లోకి వెళ్లి ఎంఆర్ టిహ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యుఆర్ఐ అని నా YouTube ఛానల్ ఓపెన్ అవుతుందండి.
(22:33) లైక్ బటన్ అంటారా లేకపోతే బెల్ ఐకాన్ అంటారా మీరు ఎటు నొక్కుతారు నాకు తెలుసు ఎందుకంటే మరి ఇన్ని వీడియోలు చేసిన నేను మీ మనసులో ఉండిపోయాను కదా అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎటు విన్నారుగా మంచి మెసేజ్ ని మీరు పెట్టండి మీ ప్రోత్సాహమే నన్ను ముందుకు తీసుకెళ్తుందండి. ఉంటానండి నమస్కారం.
No comments:
Post a Comment