🛑 30 ఏళ్లు దాటాక ఒళ్ళు వదులైపోతుందా? దానికి కారణం 'వయసు' కాదు, !
చాలామంది 30 లేదా 40 ఏళ్లు దాటగానే చర్మం వదులవ్వడం (Sagging Skin), నీరసం రావడం సహజం అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తోందో తెలుసా? మీరు మీ కండరాలను వాడకపోవడం వల్ల, మీ శరీరం తన కండరాలను తానే తినేస్తోంది. దీన్నే మెడికల్ భాషలో "సర్కోపెనియా" (Sarcopenia) అంటారు.
మీరు బరువు తగ్గాలని అన్నం మానేసి, కడుపు మార్చుకుని డైటింగ్ చేస్తే.. తగ్గేది కొవ్వు కాదు, ఉన్న కొద్దిపాటి కండరాలు మాత్రమే.
నిజాలు లాజికల్‌గా మాట్లాడుకుందాం: 📉 వాస్తవం 1: 30 ఏళ్ల తర్వాత ప్రతి 10 ఏళ్లకు మీరు 8% కండరాలను కోల్పోతున్నారు. గ్యారేజ్ లో వాడకుండా పెట్టిన కారు ఎలా తుప్పు పట్టి నాశనం అవుతుందో, మీ శరీరం కూడా అంతే దారుణంగా లోపల పాడవుతోంది. 🔥 వాస్తవం 2: కండరాలు మీ బాడీలో క్యాలరీలను కాల్చే "ఇంజన్లు". కొవ్వు కేవలం ఒక స్టోరేజ్ గిడ్డంగి. ఇంజన్ లేకుండా మీరు ఎంత తక్కువ తిన్నా లావు అవుతూనే ఉంటారు. వదులైన చర్మంతో "స్కిన్నీ ఫ్యాట్" (Skinny Fat) లాగా తయారవుతారు.
దీనికి పరిష్కారం ఏంటి? కేవలం వాకింగ్ చేస్తే కండరాలు రావు. మీ కండరాలకు ఒక సిగ్నల్ ఇవ్వాలి, దానికి సరైన ఇటుకలు (ప్రొటీన్) అందించాలి.
సరిపోని ప్రొటీన్: ఉదయం ఇడ్లీ/దోశ, మధ్యాహ్నం రసం అన్నం.. ఇందులో ప్రొటీన్ ఎక్కడుంది? పెట్రోల్ ట్యాంక్‌లో నీళ్లు పోసి బండి నడవాలి అంటే ఎలా నడుస్తుంది? మీ బరువుకు తగ్గట్టు ప్రతి కేజీకి 1.2g - 1.5g ప్రొటీన్ తీసుకోవాలి. అంటే 70 కేజీల వ్యక్తికి కనీసం 84 గ్రాములు కావాలి!
పంపిణీ (Meal Timing): రాత్రి ఒక్కసారే భారీగా నాన్-వెజ్ తింటే ప్రొటీన్ రాదు. మీ బాడీ ఒకేసారి 25-30 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్‌ను కండరాల కోసం వాడలేదు. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమానంగా ప్రొటీన్ పంచాలి.
బరువులు ఎత్తండి: ఏసీ గదుల్లో కూర్చుంటే సరిపోదు. వారానికి కనీసం 2-3 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్ (బరువులు ఎత్తడం) చేయాలి. 40 ఏళ్ల తర్వాత వ్యాయామం అనేది ఆప్షన్ కాదు, అది మీ జీవితానికి ఇన్సూరెన్స్!
❌ ముసలితనం అనేది ముడతలు పడిన చర్మం వల్ల రాదు, కదిలే శక్తిని కోల్పోవడం వల్ల వస్తుంది. మీ స్వేచ్ఛను కోల్పోతారా? లేక ఇప్పటి నుండే బాడీని నిర్మించుకుంటారా? ఛాయిస్ మీదే!
👇 మీ బరువుకు తగ్గట్టు మీరు రోజుకు ఎంత ప్రొటీన్ తినాలో, ఆ 84 గ్రాముల ప్రొటీన్ ఫుడ్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే... కామెంట్స్‌లో "PROTEIN" అని టైప్ చేయండి లేదా నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి! నేను పర్సనల్ గా గైడ్ చేస్తాను.
మీ పూజారి భారతి కృష్ణ lifestyle coach 8978190369
No comments:
Post a Comment