పనికిరాని వాదనలకు
మౌనం సమాధానం
గెలవలేని యుద్దాలకు
మౌనమే ఆయుధం
కోపం వచ్చినపుడు
మౌనం ఉత్తమం
ఆవేశానికి ఆపుకోడానికి
మౌనమే ఆశ్రయం
బంధం నిలుపుకోడానికి
మౌనం మంచిదే!
మాట మీరక ఆపేది
మౌనం ఒక్కటే!
ప్రియతముల మధ్య
మౌనమే ధ్యానం
ప్రియమైన విషయంలో
మౌనమే సంతోషం
అన్యాయం జరుగుతుంటే
మౌనం అపరాధం
ఆక్షేపణలకు నవ్వుతో కూడిన
మౌనం అవసరం
ఆలోచనల ఆచరణకు
మౌనమే ముఖ్యం
పరిస్థితి అదుపులో లేకపోతే
మౌనమే శరణ్యం
మనసు విరిచే మాటకంటే
మౌనమెంతో వివేకం
మనసు తెలిసిన వారికి
మౌనం కూడా విదితమే!
ఆరాటం పెంచి
అలజడి రేపే చీకటికి
అరుణోదయ సమయమే
ఆనందమిచ్చే తరుణం
🌸🌸సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment