Sunday, July 26, 2026

Emotionless Avvadam Ela? | Emotional Mastery Explained in Telugu

Emotionless Avvadam Ela? | Emotional Mastery Explained in Telugu

Author Name:Dark.mindcontrol

Youtube Channel Url:https://www.youtube.com/@Dark.mindcontrol

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WmxO991O0k0



Transcript:
(00:00) ఇది అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకే ఈ వీడియోలో హుక్ కూడా ఉండదు, ఇంట్రో కూడా ఉండదు. ఒక్కటే చెప్తా. నిజంగా ఎమోషన్లెస్ అవ్వాలంటే ముందు ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే స్టెప్ బై స్టెప్ ఎలా ఎమోషన్లెస్ అవ్వచ్చో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
(00:22) స్పెషల్ గా నాలుగో పాయింట్. అది మిస్ అయితే నష్టం నాది కాదు నీదే. ఎమోషన్ [గొంతు సవరించుకోవడం] అంటే ఏంటి? ఎమోషన్ అంటే ఏదైనా సిచువేషన్ కి రెస్పాన్స్ గా నీ లోపల పుట్టే ఫీలింగ్ సింపుల్ గా చెప్పాలంటే ఎమోషన్ అనేది నీ లోపల ఒక రియాక్షన్ అది నువ్వు ఏదైనా విషయాన్ని ఎలా ఫీల్ అవుతున్నావో చెప్తుంది. ఎవరైనా నిన్ను హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఏదైనా చెప్తే నీ లోపల ఒక లైట్ ఎనర్జీ వస్తుంది మొహం వెలిగిపోతుంది.
(00:47) ఇదే హ్యాపీనెస్ ఎమోషన్. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేసినా బ్యాడ్ గా మాట్లాడినా లోపల మంట లేదా కోపం వస్తుంది. ఇదే యాంగర్ ఎమోషన్. సింపుల్ గా చెప్పాలంటే ఎమోషన్స్ అనేవి నీ మైండ్ మరియు హార్ట్ ఇచ్చే ఒక సిగ్నల్ ఏదైనా విషయం నీకు నచ్చిందా లేదా అనేది చెప్పడానికి ఉదాహరణ రాత్రి ఒక వీడియో అప్లోడ్ చేశవు ఉదయం లేచి చూస్తే లక్ష వ్యూస్ వచ్చాయి.
(01:09) వెంటనే నీ మొహం ఆటోమేటిక్ గా నవ్వుతుంది ఎనర్జీ పెరుగుతుంది. ఇది హ్యాపీనెస్. అదే వీడియోలో ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే నీ మూడ్ వెంటనే డౌన్ అవుతుంది. లోపల కోపం కొద్దిగా బాధ వస్తుంది. ఇది యాంగర్. ఒక్క విషయం గమనించు సిచువేషన్ సేమ్ ప్లాట్ఫామ్ లోనే జరిగింది కానీ రియాక్షన్ వేరు అంటే ఎమోషన్ సిచువేషన్ వల్ల పుట్టదు. ఆ సిచువేషన్ ని నువ్వు ఎలా ఫీల్ చేస్తావ్ దానికి ఏం మీనింగ్ ఇస్తావ్ దాని వల్ల పుడుతుంది.
(01:34) పాజిటివ్ మీనింగ్ ఇస్తే ఎమోషన్ మంచిదవుతుంది. నెగిటివ్ మీనింగ్ ఇస్తే ఎమోషన్ చెడ్డది అవుతుంది. ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి. బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ప్రతి పనికి వేరే సిస్టం ఉంటుంది. అందులో ఒకటి థింకింగ్ సిస్టం. ఏది కరెక్టో ఏది కాదో డిసైడ్ చేస్తుంది. ఇది లాజికల్ పార్ట్ ఇంకోటి ఫీలింగ్ సిస్టం దీన్నే లింబిక్ సిస్టం అంటారు.
(01:57) అందులో ఒక చిన్న ఏరియా ఉంటుంది అమిక్డాల ఇదే మన ఎమోషన్ సెంటర్ ఎవరైనా నీకు థాంక్యూ చెప్పినా నీ మీద అరిచిన ఆ సిగ్నల్ మొదట బ్రెయిన్ కి వెళ్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ సిగ్నల్ ముందు అమిలాకి అంటే ఎమోషనల్ బ్రెయిన్ కి వెళ్తుంది. ఆ తర్వాతే థింకింగ్ బ్రెయిన్ కి వెళ్తుంది. అంటే నువ్వు ముందు ఫీల్ అవుతావు తర్వాత ఆలోచించి రియాక్ట్ అవుతావు.
(02:19) ఉదాహరణ రోడ్డు మీద నడుస్తున్నావ్ అకస్మాత్గా ఒక కుక్క నీ మీద మురిగింది. ఆ క్షణంలో నువ్వు కూర్చుని ఈ కుక్క ఫ్రెండ్లీనా డేంజరస్ అని ఆలోచించవు కదా వెంటనే వెనక్కి తగ్గుతావు లేదా రియాక్ట్ అవుతావు. ఇది ఆటోమేటిక్ రియాక్షన్ అమిక్డాల వెంటనే ఫియర్ [సంగీతం] సిగ్నల్ పంపిస్తుంది. బాడీ ప్రొటెక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. బ్రెయిన్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది కానీ హార్ట్ దాన్ని ఫీల్ చేస్తుంది.
(02:42) బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది ఇది మంచిదా చెడ్డదా అని బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. హార్ట్ బీట్ పెరగడం చేతులు వణకడం కళ్ళలో నీళ్లు రావడం లాంటివే. అంటే ప్రాసెస్ ఇది. సిచువేషన్ వస్తుంది, బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది. ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది, నువ్వు ఫీల్ చేస్తావు. అదే ఎమోషన్ గా బయటిక వస్తుంది. మనం చేసే పెద్ద తప్పు కోపం బాధ ఫియర్ లేదా యంజైటీ వచ్చినప్పుడు మన నాచురల్ హ్యాబిట్ ఏంటంటే రియాక్ట్ అవ్వడం లేదా దాన్ని అణచి పెట్టడం కానీ నిజం చెప్పాలంటే రెండు తప్పే రియాక్ట్ అవ్వడం అంటే నీ ఎమోషన్ నిన్ను కంట్రోల్ చేస్తుందని అర్థం.
(03:14) అణచి పెట్టడం అంటే ఆ ఎమోషన్ ని ఇగ్నోర్ చేస్తున్నావ అని అర్థం. దానివల్ల అది ఇంకా స్ట్రాంగ్ గా బయటిక వస్తుంది. అందుకే మొదటి స్టెప్ అవేర్నెస్ అంటే జడ్జ్ చేయకుండా అబ్సర్వ్ చేయటం ఉదాహరణ నీకు కోపం వచ్చింది. నార్మల్ గా అయితే నువ్వు రియాక్ట్ అవుతావ్ అరుస్తావ్ జస్టిఫై చేసుకుంటావ్ లేదా ఎవరి మీదైనా ఆ కోపం చూపిస్తావ్ కానీ ఈసారి ఆగిపో ఏం మాట్లాడుకో ఏం ఆలోచించకో కేవలం ఫీల్ చెయ్ నీ లోపల ఏం జరుగుతోందో గమనించు హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుందా శ్వాస చిన్నగా అవుతుందా కేవలం అబ్సర్వ్ చెయ్ అవును నా లోపల కోపం ఉంది అనుకో కానీ దాన్ని నాది అనుకోకు నాకు కోపం వచ్చింది
(03:54) అని ఆలోచించకు కేవలం కోపం వస్తుంది అని ఆలోచించ ఈ చిన్న మాటలో చాలా పెద్ద తేడా ఉంది. ఎందుకంటే నువ్వు అబ్సర్వ్ చేసినప్పుడు నువ్వు ఎమోషన్ లోపల ఉండవు ఎమోషన్ పైన నిలబడతావు. ఈ గ్యాప్ లోనే దాగుంది నీ అసలు పవర్ అవేర్నెస్ ఏం చేస్తుంది అది నీ ఎమోషన్ కి నీ రియాక్షన్ కి మధ్య ఒక గ్యాప్ ఇస్తుంది. ఈ గ్యాప్ లోనే నీ పవర్ దాగుంది.
(04:17) నువ్వు ఎంతసేపు అబ్సర్వ్ చేస్తే అంతగా ఎమోషన్ దాని ఇంటెన్సిటీని కోల్పోతూ ఉంటుంది. కొన్ని సెకండ్ల తర్వాత ఆ కోపం లేదా బాధ నెమ్మదిగా కరిగిపోవడం నువ్వే చూస్తావు. ఇది మ్యాజిక్ కాదు ఇది నీ కాన్షియస్నెస్ కంట్రోల్. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. మైండ్ఫుల్నెస్ అంటే ఎమోషన్ ని ఫీల్ చేయడం కానీ దాన్ని అనిచి పెట్టకపోవటం లోపల ప్రతిదీ ఫీల్ చేయడం కానీ ఎమోషన్స్ కి బానిస అవ్వకపోవటం ఫోన్ లో నోటిఫికేషన్స్ లాగే ప్రతి నోటిఫికేషన్ కి రియాక్ట్ అయితే నువ్వు డిస్టర్బ్ అవుతావ్ కానీ కేవలం చూసి ఎప్పుడు ఏం రెస్పాండ్ చేయాలో నువ్వే డిసైడ్ చేస్తే నువ్వు
(04:52) కంట్రోల్ లో ఉంటావ్. ప్రతి ఎమోషన్ కి ఒక మూలం ఉంటుంది. ప్రతి ఎమోషన్ ఒక థాట్ నుండి పుడుతుంది. ఎమోషన్స్ గాలిలోనుంచి రావు. వాటికి ఒక సోర్స్ ఉంటుంది అదే నీ ఆలోచన ఎవరో నన్ను ఇగ్నోర్ చేశారు అని నువ్వు అనుకున్నప్పుడు అది కేవలం నీ థాట్ కానీ నీ మైండ్ ఆ థాట్ చుట్టూ ఒక కథ కట్టేస్తుంది నేను వాళ్ళకి ముఖ్యం కాదు వాళ్ళకి నా అవసరం లేదు అని [నిట్టూర్పులు][ఆశ్చర్యం] ఈ కథ నుండే పుడుతుంది బాధ ఇన్సెక్యూరిటీ ఒంటరితనం కానీ కొద్దిగా ఆగి అబ్సర్వ్ చేస్తే ఇది కేవలం ఒక మెంటల్ మూవీ అని అర్థమవుతుంది.
(05:27) రియాలిటీలో జరిగింది ఒక్కటే ఎవరో నిన్ను ఇగ్నోర్ చేశారు. మిగతా అంతా నీ మైండ్ క్రియేట్ చేసిందే ఎమోషన్ లెస్ అవ్వటం అంటే థాట్స్ రావటం ఆగిపోతాయి అని కాదు థాట్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే బ్రెయిన్ ఒక మిషన్ లాంటిది ప్రతి సెకండ్ కి వేల ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. కొన్ని నిజం కొన్ని అబద్ధం కొన్ని కేవలం ఇమాజినేషన్ వాటిని నువ్వు కంట్రోల్ చేయలేవు.
(05:48) కానీ వాటితో అటాచ్ అవ్వాలా డిటాచ్ అవ్వాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోగలవు. ఎమోషన్ లెస్ అవ్వటం అంటే ఏ థాట్ ని యాక్సెప్ట్ చేయాలో ఏది ఇగ్నోర్ చేయాలో నువ్వు డిసైడ్ చేయటం. నువ్వు బిలీవ్ చేయనంత వరకు నీ థాట్స్ నిన్ను లాగలేవు. నాలుగో పాయింట్ నీ మూడ్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడే వీడియో ఓపెనింగ్ లో చేసిన వార్నింగ్ కాల్ బ్యాక్ చేయొచ్చు.
(06:09) ఇది మిస్ అయితే నష్టం నీదే అని చెప్పింది ఇక్కడి కోసమే నువ్వు నీ వాల్యూని ఇతరుల ఒపీనియన్ మీద వదిలేసినప్పుడే ఎమోషన్స్ ఎక్కువగా ఎక్స్ప్లోడ్ అవుతాయి. ప్రజలు నిన్ను అర్థం చేసుకోవాలి అప్రిషియేట్ చేయాలి యక్సెప్ట్ చేయాలి అని నువ్వు కోరుకున్నంత కాలం నీ ఎమోషనల్ స్టేట్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తే బాధ ఫీల్ అవుతావ్.
(06:30) ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతావ్. అంటే నీ మూడ్ వాళ్ళ యాక్షన్ల రిమోట్ తో కంట్రోల్ అవుతుంది. ఈ రిమోట్ వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం నువ్వు ఎప్పటికీ ఎమోషనల్ గా ఫ్రీ కాలేవు. ఎమోషన్ లెస్ అవ్వడం అంటే ఎవరి గురించి పట్టించుకోకపోవడం కాదు. దీని అర్థం నీ సెల్ఫ్ వర్త్ ఇక ఎవరి బిహేవియర్ మీద ఆధారపడదు. నీ వాల్యూ నీకు తెలుసు ఎవరైనా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నీ స్థానం నుండి కదలవు.
(06:56) ఒక్క లైన్ గుర్తుంచుకో ఎక్స్పెక్ట్ నథింగ్ కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత తక్కువ ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎక్స్పెక్టేషన్ ఒక హిడెన్ డిమాండ్ లాంటిదే. నువ్వు నేను కోరుకున్నట్టు బిహేవ్ చేయాలి అని. ప్రపంచం నీ ఇష్ట ప్రకారం నడవనప్పుడు నీ మైండ్ రియాక్ట్ అవుతుంది.
(07:15) అదే నెమ్మదిగా ఫ్రస్ట్రేషన్ గా బయటిక వస్తుంది. కానీ నువ్వు ఎక్స్పెక్టేషన్స్ వదిలేసినప్పుడు పీస్ దొరుకుతుంది. ఎందుకంటే నీ లోపలి బ్యాలెన్స్ ని బద్దలు కొట్టలేదు. లాజికల్ షీల్డ్ నీ ఫైనల్ ప్రొటెక్షన్ ఎమోషన్స్ డేంజరస్ గా మారేది ఎప్పుడంటే నువ్వు వాటి బేస్ మీద డిసిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఆ మూమెంట్ లో ఎమోషన్ నీ గైడ్ కాదు నీ ట్రాప్ గా మారిపోతుంది.
(07:39) కోపం గిల్ట్ లేదా ఫియర్ లో తీసుకున్న డిసిషన్స్ చాలాసార్లు రిగ్రెట్ గా మారతాయి. ఎందుకంటే అవి క్లారిటీ నుంచి కాదు ఇంపల్స్ నుంచి వస్తాయి. అందుకే నీ మైండ్ లో ఒక లాజికల్ షీల్డ్ బిల్డ్ చేసుకోవడం చాలా అవసరం. ఒక మెంటల్ ఫిల్టర్ ప్రతి ఎమోషన్ పాస్ అవ్వడానికి ముందు ఇలా అడగాలి. ఈ ఫీలింగ్ యూస్ఫుల్ గా ఉందా దీనివల్ల నా గ్రోత్ దొరుకుతుందా జవాబు నో అయితే ఆ ఎమోషన్ ని యక్నాలెడ్జ్ చెయ్ కానీ దాని దిశలో వెళ్ళకు నీ లాజిక్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ఎమోషన్స్ వాటి లిమిట్ లో ఉంటాయి.
(08:08) నీ రీజనింగ్ వాటిపైన ఒక ఇన్విజిబుల్ ఆర్మర్ లా పనిచేస్తుంది. నిన్ను ఇంపల్సివ్ యాక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. డిసిషన్ ని గ్రౌండెడ్ గా ఉంచుతుంది. అందుకే మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూల్ గా కనిపిస్తారు. కానీ నిజానికి వాళ్ళు ఎమోషనల్ గా డిసిప్లిన్డ్ వాళ్ళు ఫీల్ చేస్తారు కానీ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.
(08:30) దీన్నే అంటారు రియల్ ఎమోషనల్ మాస్టరీ. నీ లాజిక్ నీ అవేర్నెస్ కలిసి ఒక ఆర్మర్ క్రియేట్ చేసినప్పుడు ఎమోషన్ లోపలికి రావచ్చు కానీ నిన్ను బద్దలు కొట్టలేదు. అప్పుడే నీకు అర్థంవుతుంది. నీ ఎమోషన్ నిన్ను కంట్రోల్ చేయడం లేదు నువ్వే దానికి డైరెక్షన్ ఇస్తున్నావ్. ఇదే నీ లాజికల్ షీల్డ్ నీ ఫైనల్ ప్రొటెక్షన్ ఇవి కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ ఇవి నీకు మెంటల్ గా ఎమోషన్స్ కంట్రోల్ చేయడం నేర్పిస్తాయి.
(08:53) ఇప్పుడు నిర్ణయం నీది నువ్వు ఎమోషన్స్ కి బానిస అవుతావా లేదా వాటి మాస్టర్ అవుతావా? నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో అడుగు తప్పకుండా రిప్లై చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో లైక్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఈ చిన్న ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ కొత్తది నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది.

No comments:

Post a Comment