Sunday, July 26, 2026

మోహం మనిషిని ఎలా బంధిస్తుంది? | Swami Sevyananda | కథామృతం 252 | Sri Ramakrishna Prabha |

మోహం మనిషిని ఎలా బంధిస్తుంది? | Swami Sevyananda | కథామృతం 252 | Sri Ramakrishna Prabha |

Author Name:Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Youtube Channel Url:https://www.youtube.com/@sriramakrishnaprabha

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3UIRYQdHG6o



Transcript:
(00:00) శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయచ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం శ్రీ రామకృష్ణులు స్త్రీల మోహిని శక్తి ఎలాంటిదో చూడండి నేను చెప్పేది అవిద్యా స్వరూపిణీలైన స్త్రీల గురించి వారు పురుషులను మూర్ఖులుగా చేసి పడేస్తారు పురు పురుషులలోని సార పదార్థాన్ని లాగేస్తారు.
(00:39) అందుకే స్త్రీ పురుషులు ఒకచోట కూర్చొని ఉండడం చూస్తే నేను అమ్మయ్య వీరి పని ఇంతటితో సరి అంటూ ఉంటాను. మా వైపు చూస్తూ హారు ఎంత మంచి బాలుడు పాపం అతన్నని భూతం ఆవహించింది. అందరూ ఒకరోజు అరే హారు ఎక్కడ హారు ఎక్కడ అంటూ అతడి కోసం వెతకసాగారు. తీర చూసేసరికి అతడు మర్రి చెట్టు కింద మౌనంగా కూర్చొని ఉన్నాడు. అతడిలో ఇదివరకు ఉన్న అందం, వర్చస్సు, సంతోషం ఇప్పుడు లేవు.
(01:20) పాపం మర్రి చెట్టులోని భూతం అతన్ని ఆవహించింది. ఒకసారి అక్కడికి వెళ్ళరాదు అని భార్య భర్తతో చెప్పగానే వెంటనే అతడు లేచి నిలబడతాడు. కూర్చో అనగానే కూర్చుంటాడు. ఒక వ్యక్తి తన ఉద్యోగం పోయినందున క్రొత్త ఉద్యోగం కోసం ఒక కంపెనీ కి దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ అధికారి ప్రస్తుతం ఉద్యోగాలు ఖాళీ లేవు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు అన్నాడు పాపం ఆ వ్యక్తి చాలా రోజుల పాటు చెప్పులు అరిగేలా అధికారి చుట్టూ తిరిగాడు కానీ అతడికి సదా ప్రస్తుతం ఖాళీలు లేవు తర్వాత చూద్దాం అనే సమాధానమే ఎదురయింది.
(02:04) చివరకు ఆ వ్యక్తి విసిగి వేసారిపోయి నిరాశతో స్నేహితుడికి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆ స్నేహితుడు అతడితో నువ్వు ఎంత మూర్ఖుడివి ఆ అధికారి చుట్టూ అలా పిచ్చి కుక్కలా ఎందుకు తిరుగుతావు నువ్వు వెళ్లి గులాబీని పట్టుకో రేపే నీ పని జరిగిపోతుంది అన్నాడు. ఆ వ్యక్తి అలాగే ఆమె వద్దకు ఇప్పుడే వెళ్తాను అంటూ బయలుదేరాడు. గులాబీ ఆ అధికారి ఉంపుడుగెత్తే ఆ వ్యక్తి ఆమె వద్దకు వెళ్లి ఇలా ప్రాధాయ పడ్డాడు అమ్మ నేను పేద బ్రాహ్మణుని నాకు పెద్ద కష్టం వచ్చి పడింది.
(02:46) నన్ను ఈ కష్టం నుండి మీరే గట్టెక్కించాలి. అమ్మ చాలా రోజులుగా పని లేదు ఇంట్లో పిల్లలు తిండి లేక మాడిపోతున్నారు. మీరు ఒక్క మాట చెప్పినట్లయితే నా పని జరిగిపోతుంది. ఆ బ్రాహ్మణుడి దుస్థితి చూసి గులాబీ జాలిపడింది. అయ్యో పాపం ఈ బ్రాహ్మణుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి అనుకొని అది సరే కానీ నాయనా నీ పని జరగాలంటే ఎవరికి చెప్పవలసి ఉంటుంది అని అడిగింది.
(03:18) బ్రాహ్మణుడు అమ్మ ఆ కంపెనీ అధికారికి కేవలం ఒక్క మాట చెబితే చాలు నా పని కచ్చితంగా జరిగిపోతుంది అన్నాడు. అప్పుడు గులాబీ ఆ అధికారితో నేను ఇవాళే మాట్లాడి నీ పని జరిగేలా చూస్తాను సరేనా అంది. మరుసటి రోజు ఉదయమే ఆ బ్రాహ్మణుడి ఇంటికి కంపెనీ బంట్రోతు ఒకడు వచ్చి ఇవాల్టి నుండే పనిలో చేరమని మీకు ఉత్తర్వు వచ్చింది అన్నాడు.
(03:51) ఆ సదరు అధికారి కంపెనీ యజమానితో ఇతడు యోగ్యుడు ఇతడికి నేను మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను. ఇతడి వల్ల మన కంపెనీ లాభిస్తుంది అని చెప్పి ఆయన్నను ఒప్పించాడు. అందరూ కామినీ కాంచనాలలోనే మునిగి ఉన్నారు కానీ వాటిని నేను ఖాతరు చేయను భగవంతుడు తప్ప అన్యమైనదిఏది ఎరుగనని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. ఒక భక్తుడు మహాశయ నవహుల్లోల్ అంటూ ఒక కొత్త ధార్మిక శాఖ ప్రారంభమయింది.
(04:25) లలిత్ చటర్జీ దానిలో సభ్యుడు శ్రీరామకృష్ణులు ఆ పలు మతాలు ఉన్నాయి అవన్నీ ఆ ఒకే భగవంతుని చేరటానికి వేరు వేరు మార్గాలు కానీ అందరూ నా మతమే సరిైనది నా గడియారమే సరైన సమయం చూపిస్తోంది అనుకుంటారు. గిరీష్ మాతో పోప్ చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదా దిస్ విత్ అవర్ జడ్జ్మెంట్స్ యస్ అవర్ వాచెస్ నన్కో జస్ట్ ఎలైక్ ఎట్ ఈచ్ బిలీవ్స్ హిస్ ఓన్ శ్రీరామకృష్ణులు మాతో ఏమయ్యా దీని అర్థం ఏమిటి? మా ప్రతి ఒక్కరు తమ గడియారమే సరిైనదని తలుస్తారు
(05:11) కానీ ఏ గడియారము మరో గడియారంతో సరిపోదు. శ్రీరామకృష్ణులు గడియారాలు తప్పు సమయం చూపుతాయి కానీ సూర్యుడు సరిగ్గానే నడుస్తాడు కదా అందువల్ల మన గడియారాన్ని సూర్యుడితో సరిచూసుకోవాలి. ఒక భక్తుడు ఫలానా వ్యక్తి సదా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అతడు వట్టి అబద్ధాలు పుట్ట అనుకోండి. [గురకలు] శ్రీరామకృష్ణులు సత్యం పలకడమే కలియుగానికి తపస్సు కలియుగంలో ఇతర తపస్సులు చేయడం ఎంతో కష్టం సత్యాన్ని అంటి పెట్టుకొని ఉంటే భగవంతుని పొందగలము. తులసీదాస్ దోహ ఒకటి ఇలా ఉంది.
(05:54) సత్యకథా అధీనత పరస్త్రీ మాతృసమాన్ ఇస్సే హరి నామిలేతో తులసి జూడ్ జబాన్ సత్యం వచించటం భగవంతునిపై ఆధారపడి ఉండటం పరస్త్రీని తల్లిగా దర్శించడం వీటి ద్వారా భగవంతుడు లభించినట్లయితే తులసీదాస్ అసత్యవాదియే కేశవసేన్ తండ్రి చేసిన అప్పులను తీర్చే భారాన్ని తన మీద వేసుకున్నాడు. వ్రాత పత్రాల వంటివి ఏవి లేవు మరి ఎవరైనా అయితే నాకు తెలియదు పొమ్మని అని ఉండేవాళ్ళు ఒకసారి నేను జోరాసాంకో కలకత్తాలో ఒక వీధి జోరా సాంకో లోని దేవేంద్రుని సమాజం
(06:40) చూడటానికి వెళ్ళాను. ఆ సమయంలో కేశవసేన్ వేదికపై కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అతడు ప్రాయంలో ఉన్నాడు. అది చూసి నేను మధుర బాబుతో ఇలా అన్నాను. ఇక్కడ ధ్యానం చేస్తున్న వారందరిలో ఈ యువకుని గాలపు బెండు మాత్రమే నీటిలో మునిగి ఉంది. చేప గాలం వద్ద తచ్చాడుతోంది. అంటే కేశవ్ ధ్యానం ప్రగాఢమైనదని అతడు తన ధ్యయానికి దగ్గరగా ఉన్నాడని భావం ఫలానా వ్యక్తి పేరు చెప్పను కానీ అతడు 10వేల రూపాయల కోసం న్యాయస్థానంలో అబద్ధం చెప్పాడు. వ్యాజ్యం గెలవడానికి నాతో
(07:28) కాళిమాతకు అర్గ్యాన్ని సమర్పింప చేశాడు. అతడు నాతో బాబా ఈ అర్గ్యాన్ని అమ్మకు సమర్పించు అన్నాడు నేను పసిపిల్లవాడిలా అతడి మాటలు నమ్మి అర్గ్యాన్ని సమర్పించాను భక్తుడు అతడు గట్టివాడేనండి శ్రీరామకృష్ణులు కానీ అతడికి నా పట్ల ఎంతో విశ్వాసం ఉండేది నేను అర్గ్యాన్ని సమర్పించినట్లయితే అమ్మ అతడి ప్రార్థనలను తప్పక ఆలకిస్తుందని అతడికి కి గట్టి నమ్మకం లలిత్ బాబు విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు.
(08:11) అహంకారం అంత సులభంగా వదిలి పెడుతుందా ఏమిటి? అలా అహంకారం లేని వాళ్ళు ఏదో ఒకరిద్దరు మాత్రమే తారస పడతారు. అలాంటి వారిలో బలరాం ఒకడు ఒక భక్తుడిని చూపిస్తూ ఇతడు మరొకడు వీరి స్థానంలో వేరే ఎవరైనా ఉంటే అహంకారంతో విర్రవీగిపోయి ఉండేవాళ్ళు జుట్టుకు పాపిటలు తీసి తమ తమో గుణాలను ప్రదర్శించి ఉండేవారు. వారు తమ పాండిత్యాన్ని చూసుకొని ఎంతగానో గర్విస్తారు చూడు ఆ లావు బాపనయ్యకు ప్రాణకృష్ణకు ఇంకా కొద్దిగా అహంకారం ఉంది మాతో మహిమా చక్రవర్తి అనేక శాస్త్రాలను అధ్యయనం చేసిన
(08:57) వ్యక్తి ఏమంటావు? మా అవునండి అతడు ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు. శ్రీ రామకృష్ణులు నవ్వుతూ అలాంటప్పుడు అతన్నని గిరీష్ ఘోష్ కు పరిచయం చేస్తే బాగుంటుంది. ఇద్దరూ చర్చించుకుంటూ ఉంటే చూడాలని ఉంది. గిరీష్ నవ్వుతూ సాధనలు చేయడం ద్వారా అందరూ శ్రీకృష్ణుని ఇలా కావచ్చని అతడు అంటాడట కదా శ్రీరామకృష్ణులు పూర్తిగా అలాగని కాదు కానీ ఆ ధోరణిలోనే ఏదో అంటూ ఉంటాడు.
(09:34) ఇక్కడ శ్రీరామకృష్ణులు అవిద్యా సంసారం నుండి కామినీ కాంచనాల నుండి దూరంగా ఉండాలని అదేవిధంగా ఈ కలియుగంలో సత్యం పలకడమే తపస్సు సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే భగవంతుని పొందగలమని చెప్తున్నారు అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలి అంటే అహంకారం నుండి దూరంగా ఉండాలని చెప్తున్నారు అందరికీ నమస్కారం

No comments:

Post a Comment