Sunday, July 26, 2026

 నేటి…

              *ఆచార్య సద్బోధన:*
            ➖➖➖


*గు అనగా చీకటి! రు అనగా నశించడం. అజ్ఞానం అనెడి అంధకారమునుండి జ్ఞానమనెడి వెలుగులోకి నడిపించేవాడే గురువు.

*తల్లి దండ్రులు తమ పిల్లల్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తే, గురువు పిల్లలను తమ అంతరంగాన్ని పరిచయం చేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి వారిని జ్ఞానవంతులుగా,  ఆదర్శవంతులుగా, సేవకులుగా, నాయకులుగా తయారు చేస్తాడు.

*కనుకనే సమాజములో గురువుకు ప్రత్యేకమైన స్థానం దక్కింది.

*అయితే నేటి పరిస్థితులు పూర్తి భిన్నం. గురువుకు సరిఅయిన గౌరవము దక్కని చోట జ్ఞాన ప్రకాశానికి చోటులేదు.

*గురువులను అపహాస్యము చేసినవారు, గురువులను చిన్న చూపు చూసేవారు దైవము దృష్టిలో కూడా అపహస్యం చేయబడతారు, చిన్నచూపు చూడబడతారు.

*అయితే గురువు కూడా పేరుకు తగ్గట్టుగా శాంతంగా ఉండాలి. మంచి వేషం (డ్రెస్సింగ్) ధరించాలి. సదాచారం (ప్రవర్తన) పాటించాలి. మంచి బుద్ధి, మంత్ర తంత్రాల (పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు) పై చక్కని అభినివేశం ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి.

*ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు పార్వతికి చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి గురువులే.🙏

No comments:

Post a Comment