Sunday, July 26, 2026

TIME vs MONEY || SEETAKANTH TALKIE #Success #Money #LifeLesson #time management #Motivation #family

TIME vs MONEY || SEETAKANTH TALKIE #Success #Money #LifeLesson #time management #Motivation #family

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bz9MkijEhCM



Transcript:
(00:00) రాత్రి ఒక విశాలమైన ఖరీదైన బిల్డింగ్ గోడలకి ఖరీదైన పెయింటింగ్లు నేలంతా పాలరాయి ప్రతి కార్నర్ లో సంపద కనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో వినిపించే ఒకే ఒక్క శబ్దం గోడగడియారం శబ్దం టిక్ టిక్ టిక్ ఆ నిశబ్దం మధ్య ఒక పెద్ద సోఫాలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు శ్రీకాంత్ వయసు 55 నెరిసిన జుట్టు అలసిన కళ్ళు చేతిలో ఒక పాత ఫోటో అందులో రెండేళ్ల చిన్న పాప నవ్వుతూ ఉంది ఆ ఫోటోని అతను చూస్తున్న తీరు చూస్తుంటే ఎవరో దూరమైపోయిన వాళ్ళని చూస్తున్నట్టు చూస్తున్నాడు.
(00:35) ఆ ఇంట్లో కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయి కానీ ఆ మనిషి పక్కన ఒక్క మనిషి కూడా లేడు మాట్లాడటానికి ఒక గొంతు కూడా లేదు. శ్రీకాంత్ నెమ్మదిగా తల్లెత్తి ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ వైపు చూశాడు దాని ముల్లు కదులుతుంది అది అతనికి నిర్దాక్షణంగా అనిపించింది. అతను తనలో తానే గొనుక్కున్నాడు ఎక్కడికి పోయాయి గడిచిపోయిన ఈ 23 సంవత్సరాలు నిన్నో మొన్నో మొదలు పెట్టినట్టు ఉంది తలెత్తేసరికి అంతా అయిపోయింది.
(01:01) సరిగ్గా అప్పుడు వెనక నుంచి ఒక గొంతు ప్రశాంతంగా స్థిరంగా శ్రీకాంత్ అని పిలిచింది. శ్రీకాంత్ ఉలికి పడ్డాడు ఆ ఇంట్లో తను తప్ప ఎవరూ లేరు తలుపులన్నీ మూసే ఉన్నాయి మరి ఆ గొంతు ఎక్కడి నుంచి వచ్చింది నెమ్మదిగా వెనక్కి తిరిగాడు అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు తెల్లటి గడ్డం ప్రశాంతమైన కళ్ళు పెదవుల మీద ఒక చిన్న నవ్వు గుర్తుపట్టావా శ్రీకాంత్ అని అడిగాడు అతన్ని చూడగానే శ్రీకాంత్ గుండె ఒక్క క్షణం ఆగింది ఎందుకంటే ఆ వృద్ధుడిని అతను 23 సంవత్సరాల క్రితం చూశడు సరిగ్గా ఇలాగే అదే గడ్డ అదే కళ్ళు అదే నవ్వు 23 ఏళ్లలో శ్రీకాంత్ ముసలివాడు అయ్యాడు కానీ
(01:44) ఆ వృద్ధుడు ఏమాత్రం మారలేదు ఒక్క ముడత కూడా పెరగలేదు శ్రీకాంత్ నోరు తడబడింది. నువ్వు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావ్ అని అడిగాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఆ చిన్న నవ్వుతూనే అన్నాడు ఇంకా మన డీల్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా ఉంటే చెప్పు మళ్ళీ మొదలు పెడదాం. ఆ మాట వినగానే శ్రీకాంత్ ఆవేశంగా లేచి నిలబడ్డాడు చేతిలో ఫోటో వణగుతుంది వద్దు మళ్ళీ ఆ డీల్ వద్దు నువ్వు నాకు ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో నేను నీకు ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేసేయ్ నాకు ఏది వద్దు.
(02:17) వృద్ధుడు నవ్వాడు నెమ్మదిగా జాలిగా అది కుదరదు శ్రీకాంత్ ఒకసారి తీసుకున్నది తిరిగి ఇవ్వడం కుదరదు ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోవడము కుదరదు కాలం ఎప్పుడు ఒకే వైపుకు నడుస్తుంది వెనక్కి కాదు అన్నాడు వృద్ధుడు శ్రీకాంత్ సోఫాలో కుప్పకూలి కూర్చుండిపోయాడు కళ్ళు మూసుకున్నాడు ఆ మాటలు అతన్ని 23 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళాడు ఆ రోజు ఆ ఒక్క రాత్రి వాళ్ళద్దరి మధ్య జరిగిన డీల్ ఏంటి అప్పటికి శ్రీకాంత్ వయసు 32 అప్పటికే అతను సక్సెస్ఫుల్ బిజినెస్ మన్ మంచి కంపెనీ మంచి ఇల్లు ప్రేమించే భార్య పేరు పద్మ రెండేళ్ల ముద్దులు కూతురు చిన్ని అని పిలుచుకుంటారు చూడటానికి ఒక మనిషికి
(03:00) కావలసినవన్నీ ఉన్నాయి కానీ శ్రీకాంత్ మనసులో మాత్రం తృప్తి లేదు ఎప్పుడూ ఒకటే ఆలోచన ఇది చాలదు ఇంకా కావాలి ఆ పక్క కంపెనీ వాడు నాకంటే పెద్దవాడయ్యాడు నేను ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా ఇంకా ఇంకా పద్మ ఎన్నోసార్లు చెప్పింది మనకు ఉన్నది చాలు శ్రీకాంత్ కొంచెం ఆగు చిన్ని పెరుగుతుంది తనతో టైం గడుపు కానీ శ్రీకాంత్ నవ్వి కొట్టి పారేసేవాడు ఆగినవాడు ఓడిపోతాడు పద్మ ఇప్పుడు కష్టపడితేనే రేపు హాయిగా ఉండగలం ఇదంతా మీకోసమే కదా అనేవాడు ఒక రాత్రి శ్రీకాంత్ ఒక పెద్ద డీల్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా తన ఆఫీస్ గదిలో కూర్చున్నాడు ఆ డీల్ ఓకే అయితే అతను ఆ
(03:36) సిటీలోనే తను చేస్తున్న బిజినెస్ లో నెంబర్ వన్ అవుతాడు కానీ దానికి కావాల్సిన డబ్బు సమయం కష్టం చాలా ఎక్కువ ఆ ఒత్తిడిలో తల పట్టుకొని కూర్చున్నాడు సరిగ్గా అప్పుడు మన కథలో మొదట్లో మాట్లాడుకున్న ఆ వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు ఖరీదైన దుస్తులు ప్రశాంతమైన కళ్ళు పెదవల మీద ఆ చిన్న నవ్వు నీకు కావాల్సింది నాకు తెలుసు శ్రీకాంత్ అన్నాడు సంపద పేరు అందరికంటే పైన ఉండాలన్న కోరిక నేను అవన్నీ ఇవ్వగలను నువ్వు పట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుంది నువ్వు అనుకున్నదల్లా జరుగుతుంది అన్నాడు వృద్ధుడు శ్రీకాంత్ అనుమానంగా చూశడు
(04:12) నువ్వు ఎవరివి నాకెందుకు ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నావ్ దీనికి బదులు నేను నీకేం ఇవ్వాలి అన్నాడు శ్రీకాంత్ వృద్ధుడు నవ్వాడు పెద్దగా ఏమి వద్దు నాకు కావలసింది ఒక్కటే నీ సమయం అన్నాడు వృద్ధుడు శ్రీకాంత్ ఒక్క క్షణం ఆగాడు తర్వాత పెద్దగా నవ్వాడు సమయమా అంతేనా ఆలోచించు ముసలాయన ఏ పని సాధించాలన్నా సమయం కావాలి అలాంటిది నీకు సమయం ఇస్తే నా పని జరిగిపోతుంది అంటే అంతకంటే నాకు కావల్సింది ఏముంది నాకు సమయం విలువ బాగా తెలుసు అది వృధా చేసేవాళ్ళని నేను ద్వేషిస్తాను దానికి బదులు నాకు ప్రపంచమే దక్కుతుంది అంటే ఇవ్వటానికి నేను రెడీ తీసుకో ఎంత సమయం కావాలంటే అంత
(04:50) వృద్ధుడు చెయ్యి చాచాడు శ్రీకాంత్ ఆ చేతిలో తన చేతిని కలిపాడు ఒప్పందం కరారయింది. వృద్ధుడు మాయమయ్యాడు. శ్రీకాంత్ నవ్వుకున్నాడు ఏదో కల చూశనేమో అనుకున్నాడు కానీ అది కల కాదు మరసటి రోజు నుంచి శ్రీకాంత్ పట్టుకున్నదల్లా ప్రతిదీ బంగారం అయింది ఆ పెద్ద డీల్ ఈజీగా తనకే వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఊహించని విజయం సాధించింది.
(05:11) శ్రీకాంత్ ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషంతో ఒకరోజు ఇంటికి వచ్చాడు తలుపు తీయగానే నిన్నటి వరకు నేల మీద పాకుతూ కనిపించిన చిన్ని తన కూతురు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని పిలిచింది. శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. మన పాప ఎప్పుడు నడక నేర్చుకుంది ఎప్పుడు మాట్లాడటం మొదలు పెట్టింది అని అడిగాడు పద్మని పద్మ విచిత్రంగా చూసింది. కొత్తగా అడుగుతున్నారు ఏంటండీ చిన్నికి మాటలు సంవత్సరం అవుతుంది.
(05:34) శ్రీకాంత్ నిచ్చేష్టుడు అయ్యాడు అదే షాక్ అయ్యాడు సంవత్సరమా అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయిందా అప్పుడు గుర్తొచ్చింది ఆ ప్రాజెక్ట్ లో పడి తన చుట్టూ ఏం జరుగుతుందో ఏది పట్టించుకోలేదు కానీ వెంటనే సద్ది చెప్పుకున్నాడు పనిలో ఉంటే గుర్తుండదులే ఏం పర్లేదు అనుకున్నాడు. మళ్ళీ కొత్త డీల్ మళ్ళీ మునిగిపోవటం ఈసారి తలెత్తేసరికి చిన్ని స్కూల్ కి వెళ్తుంది యూనిఫార్మ్ లో బుజాన బ్యాగ్ తో మళ్ళీ శ్రీకాంతు నా కూతురు ఎప్పుడు ఇంత పెద్ద అయిపోయింది అనుకున్నాడు కానీ చేతిలో కొత్త ప్రాజెక్టు ఈసారి నిచ్చేష్టుడు అవ్వటానికి కూడా తీరిక లేదు మళ్ళీ మునిగిపోయాడు.
(06:05) ఈసారి తలెత్తేసరికి చిన్ని సైకిల్ తొక్కుతుంది నాన్న చూడు నేను సైకిల్ నేర్చుకున్నా అని అరుస్తుంది. శ్రీకాంత్ దూరం నుంచి చూశడు ఒక క్షణం దగ్గరికి వెళ్లి చూద్దాం అనుకున్నాడు కానీ అప్పుడే ఫోన్ మోగింది మరో కొత్త డీలు ఇది ముఖ్యం చిన్ని సైకిల్ సంగతి తర్వాత చూద్దాంలే అని కార్ ఎక్కాడు. ప్రతిసారి అదే జరుగుతుంది ఆ ముసలి వ్యక్తితో కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీకాంత్ అనుకున్న పని జరిగిపోతుంది శ్రీకాంత్ కి తెలియకుండానే కాలం కరిగిపోతుంది.
(06:31) చిన్ని మొదటి అడుగు మొదటి మాట మొదటి పుట్టిన రోజు మొదటి స్కూల్ రోజు ఏది శ్రీకాంత్ ప్రత్యక్షంగా చూడలేదు. అన్ని పనిలో మునిగి ఉండగా జారిపోయాయి. పద్మ ఒకరోజు ఎదురుగా నిలబడింది కళ్ళల్లో నీళ్ళతో శ్రీకాంత్ ఆగు చిన్ని రోజు అడుగుతుంది నాన్న ఎక్కడ నాన్న ఎప్పుడు వస్తాడు అని తనకి నాన్న కావాలి నాన్న డబ్బు కాదు నీకు తను పెరుగుతున్నది కనిపించడం లేదా శ్రీకాంత్ విసుక్కున్నాడు నువ్వు అర్థం చేసుకోవడం లేదు పద్మ ఇప్పుడు ఆగితే అంతా ఆగిపోతుంది ఇంకొక్క డీల్ తర్వాత మనం జీవితాంతం హాయిగా గడుపుదాం ప్రామిస్ కానీ ఆ ఇంకొక్క డీల్ ఎప్పటికీ చివరిది కాదు ఒకటి పూర్తఅయ్యాక ఇంకొకటి
(07:07) దాని తర్వాత ఇంకొకటి ఆ తర్వాత అనేది అనేది ఎప్పటికీ రాదు. సంవత్సరాలు గడిచాయి ఒకరోజు రాత్రి శ్రీకాంత్ ఒంటరిగా ఆఫీస్ లో కూర్చొని ఉన్నాడు ఒక పెద్ద డీల్ పూర్తఅయిపోయింది. బ్యాంకు ఖాతాలో మళ్ళీ కోట్లు వచ్చి పడ్డాయి కానీ ఎందుకో ఆరోజు సంతోషం రాలేదు. గుండె బొరువెక్కింది ఏదో కోల్పోతున్నాను అన్న భావన మొదటిసారిగా కలిగింది.
(07:28) అతను తన ఫోన్ తీశడు అందులో చిన్ని పాత ఫోటోలు రెండేళ్ళ అప్పటివి ఆ తర్వాత ఇంకేమీ లేవు తను ఒక్క ఫోటో కూడా తీయలేదు తను ఒక్క క్షణం కూడా పక్కన లేడు. ఒక్కసారిగా భయం వేసింది ఎన్నేళ్ళ అయింది నేను చిన్నితో సరిగ్గా మాట్లాడి ఎన్నేళ్ళ అయింది పద్మతో కూర్చొని బోన్ చేసి ఆ క్షణం అతనికి అర్థమయింది తను డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటూ అసలు జీవితాన్నే జార విడుచుకుంటున్నాడు.
(07:50) ఆ వృద్ధుడు చెప్పిన మాట గుర్తొచ్చింది పెద్దగా ఏమీ వద్దు నాకు కావాల్సింది నీ సమయమే అని అడిగాడు అప్పుడు వృద్ధుడు అంటే గడిచిపోయిన సమయం నేను చెల్లించిన మూల్యం అన్నమాట ఇన్నేళ్ళు తను ఏం చెల్లిస్తున్నాడో ఇప్పుడు తెలిసి వచ్చింది శ్రీకాంత్ వెంటనే లేచాడు ఇక చాలు ఈ క్షణం నుంచి అంతా ఆపేస్తా చిన్నితో గడుపుతా అనుకొని ఆత్రంగా ఇంటి వైపు పరిగెత్తాడు.
(08:12) ఇంటికి చేరాడు చిన్ని చిన్ని చిన్ని ఎక్కడ అని అడిచాడు పద్మ నెమ్మదిగా బయటిక వచ్చింది జుట్టు నిరిసిపోయింది ముఖంలో అలసట చిన్ని ఇక్కడ లేదు కదా శ్రీకాంత్ తనకి ఇప్పుడు 18 ఏళ్ళు చదువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయింది పోయిన వారమే శ్రీకాంత్ ఈసారి మళ్ళీ నిత్యష్టుడు అయ్యాడు. వణకుతున్న చేతులతో ఫోన్ తీసి కూతురికి వీడియో కాల్ చేశాడు.
(08:35) అవతల చిన్ని కనిపించింది పెద్దమ్మాయి అయిపోయింది చెప్పండి నాన్న అని మర్యాదగా ప్రశాంతంగా అంది కానీ ఆ గొంతులో ఒక అపరిచితురాలి మర్యాద ఒక దూరం శ్రీకాంత్ తడబడ్డాడు. ఏంలే చిన్ని నాన్న గురించి ఎప్పుడూ అడుగుతుంటావు కదా అందుకే కాల్ చేశాను అని చెప్పాడు. చిన్ని చిన్నగా నవ్వింది పర్లేదు నాన్న అలవాటు అయిపోయింది అయినా మీరు కష్టపడుతుంది మాకోసమే కదా థాంక్యూ నాన్న అని ఫోన్ పెట్టేసింది.
(09:00) ఆ థాంక్యూ శ్రీకాంత్ గుండెని పిండిేసింది. అందులో ప్రేమ లేదు తండ్రి పట్ల ఉండే ఆ చనువు లేదు అది ఎవరో పరాయి మనిషికి ఏదో ఉపకారం చేసినందుకు చెప్పే ఒక పొడి కృతజ్ఞత తన కూతురు ఇప్పుడు తన లోకంలో లేదు ఎప్పుడో పరాయి లోకంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది శ్రీకాంత్ కి తను తన కూతురి 18 ఏళ్ల జీవితాన్ని సంపాదించి ఆమెక ఇచ్చాడు మంచి బట్టలు మంచి చదువు మంచి సౌకర్యాలు కానీ ఆ జీవితంలో ఎక్కడ తను లేడు ఆమె జ్ఞాపకాల్లో నాన్న అనే మనిషి లేడు అతను కోట్లు గెలిచాడు కానీ కూతురి బాల్యాన్ని శాశ్వతంగా ఓడిపోయాడు.
(09:34) గడియారం మళ్ళీ వినిపించింది టిక్ టిక్ టిక్ శ్రీకాంత్ కళ్ళు తెరిచాడు మళ్ళీ ఆ పెద్ద కాళీ ఇల్లు ఎదురుగా ఆ వృద్ధుడు శ్రీకాంత్ గొంతు వణకింది ఇన్నేళ్ళు నా జీవితం నాశనం చేసింది నువ్వే కదా చెప్పు నువ్వు ఎవరివి ఏ శక్తివి నువ్వు అని అరిచాడు గద్దించాడు వృద్ధుడు మెల్లగా శ్రీకాంత్ దగ్గరికి వచ్చాడు కానీ ఈసారి ఆ నవ్వులో జాలి లేదు ఒక ఎత్తి పొడుపు కౌంటర్ ఉంది ఏంటి శ్రీకాంత్ అప్పుడే అన్ని పోగొట్టుకున్నట్టు కూర్చున్నావ్ నేనెవరో నీకు తెలియదా నేను ఏ శక్తిని కాదు శ్రీకాంత్ నేను ఎప్పుడూ నీ లోపలే ఉన్నాను నేను నీలోని ఆశని ఇది చాలదు ఇంకా కావాలి ఇంకా ఇంకా కావాలి అని రోజు నిన్ను తరివిన
(10:15) ఆ గొంతుని ఆ రోజు నీకు సంపాదించింది నేనే నిన్ను ఇంత పైకి తీసుకొచ్చింది నేనే అలాంటిది ఇప్పుడు నీరసంగా కూర్చుంటావ ఏంటి లే ఇంకా ఆశపడు నువ్వు కోరుకున్నది సంపాదించుకోవడానికి ఇంకా ఎగబడు ఇదే అవకాశం ఇంకా వయసు మీరిపోతే ఆశ పుట్టినా చేయడానికి ఓపిక ఉండదు లే రెచ్చకొడుతూ మాట్లాడు మాట్లాడుతున్నాడు శ్రీకాంత్ నెమ్మదిగా తలెత్తాడు కళ్ళల్లో నీళ్ళు కానీ గొంతులో స్థిరత్వం ఒక స్టేబుల్నెస్ ఉంది.
(10:40) ఇక నా వల్ల కాదు ఇన్నాళ్ళు ఆశపడి నేను సంపాదించుకున్నది ఏది లేదు పోగొట్టుకున్నదే ఎక్కువ ఉంది నా కూతురు చిన్నతనం పోయింది నా భార్య యవ్వనం పోయింది నా జీవితమే పోయింది ఈ కోట్లు వాటిని తిరిగి తీసుకురాగలవా ఇక చాలు నాకు నీ ఆశ వద్దు. వృద్ధుడు పెద్దగా నవ్వాడు తలూపుతూ మీ మనుషులు అంతా ఇంతేనయ్యా ఆశతో ఏదో ఒకటి కోరుకుంటారు దాని వెనక పరిగెడతారు అంతా అయిపోయాక అన్ని చేజారిపోయాక అప్పుడు తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాప్ పెడతారు నువ్వేమి కొత్తవాడివి కాదు పూర్వం సరిగ్గా నీలాంటివాడే ఒకడు ఉండేవాడు యయాతి అని ఒక మహారాజు చంద్రవంశపు చక్రవర్తి అతనికి
(11:13) నీలాంటి ఆశ భోగాలు అనుభవించాలన్న తీరని దాహం ఎక్కువ ఒకసారి అతని మామ శుక్రాచార్యుడు ఒక పొరపాటుకి కోపగించి అతన్ని శపించాడు నీ యవ్వనం ఇప్పుడే పోతుంది ముసలివాడివైపో అన్నాడు క్షణంలో యయాతి వృద్ధుడైపోయాడు జుట్టు నిరిసిపోయింది శరీరం ముడతలు పడింది శక్తి క్షీణించింది కానీ అతని కోరికలు మాత్రం యవ్వనంలో ఉన్నట్టే ఉన్నాయి ఇంకా భోగాలు అనుభవించాలన్న కోరికలు తీవ్రంగా ఉన్నాయి.
(11:39) అతను శుక్రాచార్యుడు కాళ్ళ మీద పడ్డాడు ఇంకా నా కోరికలు తీరలేదు మామా ఈ ముసలతనం భరించలేను అని శుక్రాచార్యుని బతిమలాడాడు. శుక్రాచార్యుడు ఒక దారి చెప్పాడు నీ యవ్వనాన్ని ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకొని బదులుగా వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తే నువ్వు మళ్ళీ యవ్వనవంతుడు అవుతావు అని ఒక రిలీఫ్ ఇచ్చాడు. యయాతికి ఐదుగురు కొడుకులు అతను ఒక్కొక్కరిని అడిగాడు నాన్న కోసం నీ యవ్వనం ఇస్తావా అని నలుగురు కొడుకులు నిరాకరించారు మా యవ్వనం మాకు కావాలి నాన్న అన్నారు కానీ చిన్న కొడుకు పేరు పురువు తండ్రి కోసం తన యవ్వనాన్ని త్యాగం చేశాడు.
(12:09) తండ్రి ముసలితనాన్ని తను తీసుకున్నాడు. ఇప్పుడు యయాతి మళ్ళీ యువకుడు కొడుకు యవ్వనంతో ఇక చూసుకోవెయి సంవత్సరాలు అన్ని భోగాలు అనుభవించాడు రాజ్య సుఖాలు విలాసాలు ఏది కోరుకుంటే అది ఒకటి తీరగానే ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి వెయి సంవత్సరాలు ఆగకుండా కానీ చివరికి ఏమైందో తెలుసా అన్ని భోగాలు అనుభవించి అనుభవించి అలిసిపోయాక అతనికి ఒక చేదు నిజం అర్థమయింది.
(12:33) ఇన్ని భోగాలు అనుభవించిన ఈ కోరిక చావదేంటి పైగా నిప్పులో నెయ్యి పోసినట్టు అనుభవించిన కొద్ది ఇంకా ఇంకా పెరుగుతోంది కోరికలు ఎడిషన్ అవ్వట్లేదు మల్టిప్లై అవుతున్నాయి అని రియలైజ్ అయ్యాడు.వెయ్యి 1000 సంవత్సరాలు పట్టింది ఆ ఒక్క నిజం తెలుసుకోవడానికి అప్పుడు ఎతి కొడుకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి తన ముసలితనాన్ని తనే స్వీకరించాడు చూసావా ఇది మీ మనుషుల కథ 1000 సంవత్సరాలయినా 23 ఏళ్ళయినా అంతా కోల్పోయాకే జ్ఞానం వస్తుంది అప్పటికి సమయం మించిపోతుంది ఇది చెప్తున్న వృద్ధుడు మళ్ళీ నవ్వాడు అందుకే చెప్తున్నా నువ్వు యయాతిలా తెలివి తక్కువ పని చేయకు ఇంకా ఆలస్యం కాలేదు లే మళ్ళీ ఆశపడు మళ్ళీ
(13:05) మొదలు పెట్టు అన్నాడు. శ్రీకాంత్ లేచి నిలబడ్డాడు ఈసారి అతని గొంతులో ఎలాంటి ఒణకు లేదు అతనికి అర్థంఅయింది ఏయాతికి వేల సంవత్సరాలు పట్టింది నాకు 23 ఏళ్ళు పట్టింది కానీ ఒక్క విషయం నేను ఇంకా బతికే ఉన్నాను నా కూతురు ఇంకా బతికే ఉంది అది చాలు నాకు ఈ ఇంకా కావాలి ఇంకా కావాలి అనే పిచ్చి ఇక్కడితో చచ్చిపోయింది నాకు కోట్లు వద్దు పేరు వద్దు నీ ఆశ వద్దు మిగిలిన కాలం నా వాళ్ళతో గడిపితే చాలు ఇక నువ్వు వెళ్ళిపో నా ఆలోచనలో నీకు చోటు లేదు వెళ్ళిపో ఆ మాటలు అన్న క్షణంలో వృద్ధుడి ముఖం మీద ఆ ఎత్తిపుడుపు నవ్వు మాయమైంది అతని రూపం మెల్లగా పలచబడసాగింది ఎందుకంటే
(13:43) అతను ఎప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు అతను శ్రీకాంత్ లోని ఆశ మాత్రమే ఇప్పుడు ఆ ఆశ చచ్చిపోయింది కాబట్టి అతను కూడా నెమ్మదిగా గాలిలో కలిసిపోయినట్టు ఎప్పుడూ ఎగ్జిస్టెన్స్ లోనే లేనట్టు వృద్ధుడు మాయమైపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో శ్రీకాంత్ ఒక్కడే కానీ మొదటిసారి అతని మనసు తేలిగ్గా ఉంది అతను ఫోన్ తీశడు కూతురికి కాల్ చేశాడు చిన్ని నాన్నని మాట్లాడుతున్నానఅమ్మ రేపు నేను మీ దగ్గరికి వస్తున్నా అమ్మకు చెప్పు ఏ డీల్ కోసం కాదు కేవలం మీతో కాసేపు గడపడానికి ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది అన్నాడు అవతల ఒక క్షణం నిశబ్దం తర్వాత చిన్ని
(14:16) గొంతు ఈసారి అందులో పొడితనం లేదు చిన్నగా వణకుతూ నిజంగా నాన్న నిజంగా వస్తున్నారా అని అంది వెంటనే అతని భార్య ఫోన్ తీసుకొని నిజంగా వస్తున్నారా అని నమ్మలేనట్లుగా అడిగింది. శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లుు పెదవల మీద నవ్వు పోయిన కాలం తిరిగిరాదు కానీ మిగిలిన కాలం ఇంకా తన చేతుల్లోనే ఉంది.
(14:38) కథ ఇక్కడితో అయిపోయింది ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే శ్రీకాంత్ కథ మనలో చాలామందిది మనం రోజు దేని వెనక పరిగెడుతున్నాం డబ్బు మంచిదే డబ్బు అవసరం డబ్బు లేకపోతే జీవితం నడవదు కుటుంబం గడవదు కచ్చితంగా సంపాదించాలి. అది బాధ్యత కానీ ఇక్కడ ఒక సన్నని గీత ఉంది దాన్ని దాటినప్పుడే శ్రీకాంతులా అవుతాం. ఆ గీత ఏంటంటే డబ్బు మన అవసరాల కోసమా లేక మన దురాశ కోసమా అవసరం అనేదానికి ఒక అంతం ఉంటుంది దురాశకు అంతం ఉండదు ఏయాతికి వేల సంవత్సరాలు భోగాలు అనుభవించినా సరిపోలేదు శ్రీకాంత్ కి కోట్లు చాలలేదు ఎందుకంటే ఇంకా కావాలి అనే కోరిక ఒక ఎండమ్మావి ఎంత పరిగెత్తినా దాన్ని చేరలేం. ఇక్కడ ఒక
(15:14) అద్భుతమైన ఇంగ్లీష్ మాట ఉంది టైం ఇస్ మోర్ వాల్యబుల్ దన్ మనీ యు కెన్ గెట్ మోర్ మనీ బట్ యు కెనాట్ గెట్ మోర్ టైం డబ్బు కంటే సమయం విలువైనది పోయిన డబ్బుని మళ్ళీ సంపాదించవచ్చు కానీ పోయిన సమయాన్ని ఏ శక్తి ఏ సంపద తిరిగి తీసుకురాలేదు. శ్రీకాంత్ దగ్గర కోట్లు ఉన్నాయి కానీ కూతురి బాల్యాన్ని కొనగలిగే కరెన్సీ ఈ ప్రపంచంలో అతనికి దొరకదు.
(15:35) మనం ఒక పొరపాటు చేస్తుంటాం ఇప్పుడు కష్టపడతాను తర్వాత కుటుంబంతో గడుపుతాను అనుకుంటాం కానీ ఆ తర్వాత అనేది ఒక మోసం పిల్లలు తర్వాత కోసం ఆగరు వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు తల్లిదండ్రులు తర్వాత కోసం వాళ్ళు ఆగరు వాళ్ళకి ఇప్పుడు మనం కావాలి ఒక పువ్వు వికసించే క్షణాన్ని మనం చూడకపోతే మళ్ళీ ఆ క్షణం రాదు ఇక్కడ ఇంకో గొప్ప మాట ఉంది స్టీవ్ జాబ్స్ మరణానికి ముందు అన్నమాట ద వెల్దయస్ట్ మన్ ఇన్ ద సమిట్రీ ఇస్ నాట్ ద వన్ హూ మటర్స్ అంటే స్మశానంలో అందరికంటే ధనవంతుడు ఎవరు అన్నది ఎవరికీ అవసరం లేదు చనిపోయాక మనం ఎంత సంపాదించామ అన్నది కాదు మనం ఎంతమంది మనసుల్లో బతికి ఉన్నామ అన్నదే
(16:10) మిగులుతుంది. మన పిల్లల జ్ఞాపకాల్లో మనకు చోటు ఉందా అదే అసలైన సంపద అందుకే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి డబ్బు సంపాదించాలి తప్పకుండా సంపాదించాలి అది అవసరం కానీ ఎవరికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి భార్యకి తల్లిదండ్రులకి వాళ్ళ ఓట సమయం వాళ్ళకి దక్కనివ్వాలి ఎందుకంటే లోకంలో అత్యంత విలువైనది కాలం అంటాం కదా కానీ ఆ కాలాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకపోతే అదే కాలం కొన్నాళ్ళ తర్వాత లోకంలో అత్యంత విలువ లేనిదిగా మారిపోతుంది.
(16:38) మన చేతుల్లో ఉండి కూడా వృధ అయిపోతుంది. శ్రీకాంత్ కి చివరికి అర్థమైంది పోయిన కాలం తిరిగి రాదు కానీ మిగిలిన కాలం ఇంకా తన చేతుల్లోనే ఉంది. మన చేతిలో కూడా ఇంకా సమయం ఉంది దాన్ని సరిగ్గా వాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు తర్వాత మాట్లాడదాం అనుకుంటున్న ఒక మనిషి ఉన్నారా అమ్మ నాన్న భార్య పిల్లలు ఎవరైనా ఈ వీడియో ఆపి ఇప్పుడే వాళ్ళకి ఒక ఫోన్ చేయండి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్లి కాసేపు కూర్చోండి ఆ తర్వాత మీద మాత్రం ఆధారపడకండి ఎందుకంటే రేపటి గ్యారెంటీ ఎవరికీ లేదు మీ జీవితంలో మీరు కోల్పోయిన లేదా కాపాడుకున్న అమూల్యమైన సమయం గురించి కింద కామెంట్స్ లో
(17:11) రాయండి అది ఇంకెవరికో కళ్ళు తెరిపిస్తుంది. మరో పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు గుర్తుంచుకోండి డబ్బు సంపాదించండి కానీ కాలాన్ని కోల్పోకండి ఎవరికీ ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్

No comments:

Post a Comment