నలదమయంతుల కథ
దమయంతీ స్వయంవరం – వివాహం
భాగం:8
నలుని లాగే వేష భూషణాలతో అయిదుగురు రాజులు దమయంతి ఒక్కొక్క రాజునే చూచుకుంటూ ముందుకు వెళ్ళసాగింది. కాని ఒక స్థానం దగ్గరకు వెళ్ళి, ఆశ్చర్యంతో ఆగి చూచింది, చిత్రం! నలుని రూపాల్లో కూర్చోవడం చూచింది.
నలుడెవ్వరో తెలియరాలేదు. ఆ అయిదుగురిలో ప్రతి ఒక్కరూ అచ్చంగా నలుడే అనుకొనే విధంగా ఉన్నారు. అందులో అసలు నలుడెవ్వరో తెలుసుకోవడం గగనమైపోయింది.
దమయంతి చాలా దుఃఖించింది. చివరకు దేవతలను శరణుకోరి, సత్యాన్ని గ్రహించాలని నిశ్చయించింది. రెండు చేతులనూ జోడించి దేవతలను ప్రస్తుతించ సాగింది.
"దేవతలారా! నేను హంస ముఖతః నలుని అందచందాల వర్ణన విని, ఆయనను నేను పతిరూపంగావరించాను. నేను మనస్సుతో, వాక్కుతో నలుని మాత్రమే కోరుకుంటున్నాను.
ఆయనతప్ప మరొకరిని కోరుకోవడంలేదు. నిషధేశ్వరుడగు నలుడినే నాకు పతిగా దేవతలు ప్రసాదించారు. కావున ఓ దేవతలారా! నలుని ఆరాధనే నావ్రతం ఈ నాసత్యశపథం బలంవల్ల మీలోఎవరు అసలునలుడో తెలుసుకునేవిధంగా అనుగ్రహించండి, ఆయననుచూపించండి.**
ఐశ్వర్యశాలురైన ఓ దిక్పాలకులారా! మీ రూపాలు మీరు దృగ్గోచరం చేయండి. అందువల్ల పుణ్యశ్లోకుడగు నలుని గ్రహించ గలిగెదను.”
దమయంతి ఆర్తిని, విలాపమును దేవతలు విన్నారు. ఆమె దృఢనిశ్చయం, నిజమైన ప్రేమ, ఆత్మశుద్ధి, బుద్ధి, భక్తి నలుని యందాసక్తి - వీటన్నిటిని చూచి ఆ దేవతలు దమయంతికి దేవతల, మనుష్యుల మధ్య తేడా గ్రహించ గలిగెడు శక్తిని ప్రసాదించారు.
No comments:
Post a Comment