జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు
ఒక మనిషిని బయట నుంచి మాత్రమే కాదు… లోపల నుంచీ కూడా పూర్తిగా మార్చేస్తాయి.
సంతోషంగా, అందరిని నమ్మే మనసున్న వ్యక్తి కూడా కొన్ని అనుభవాల తర్వాత అనుమానంతో, భయంతో, దూరంగా ఉండే స్వభావాన్ని అలవరుచుకుంటాడు.
ఇది అతని తప్పు కాదు అతను ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావం.
ఉదాహరణ
1 ఒక పాము నడుముపై పెద్ద బండరాయి పడితే, అది బయటకు రావడానికి ప్రాణం పెట్టి ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యంకాకపోతే, అది బాధతో, భయంతో, కోపంతో ఉంటుంది.
అప్పుడు ఎవరైనా దానికి సహాయం చేయాలని దగ్గరకు వెళితే కూడా అది బుసలు కొడుతుంది. ఎందుకంటే అది ఆ వ్యక్తిని శత్రువుగా చూస్తుంది.
దానికి సహాయం చేయాలనే మన ఉద్దేశ్యం ఉన్నా… దాని దృష్టిలో మాత్రం అది ప్రమాదం. ఎందుకంటే అది ఉన్న స్థితి బాధ, భయం, అసహాయం.
1 మనుషుల జీవితాలు కూడా అంతే.
ఒక వ్యక్తి మోసానికి గురైతే, అతని మనసులో ఒక గాయం పడుతుంది. ఆ గాయం బయటకు కనిపించకపోయినా, లోపల మాత్రం మానదు. ఒకసారి నమ్మిన వారు మోసం చేస్తే, “ఇంకెవరినీ నమ్మకూడదు” అనే భావన గట్టిగా కూర్చుంటుంది.
అతనికి ఎదురుగా ఎంత మంచివాళ్లు వచ్చినా, అతను వారిని నమ్మలేడు. ఎందుకంటే అతని గత అనుభవం అతనికి చెబుతుంది “నమ్మకం అంటే ప్రమాదం”.
3. ఒక అమ్మాయి అత్యంత క్రూరమైన అనుభవం అత్యాచారానికి, ఎదురైతే ఆమె మనసులో ప్రపంచం మొత్తంపై నమ్మకం కూలిపోతుంది.
ప్రతి మగవాడిని అనుమానంతో చూస్తుంది. ఇది ఆమె బలహీనత కాదు ఆమె తనను తాను రక్షించుకునే సహజమైన ప్రయత్నం.
ఆమెకు ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా, ఆమె వెంటనే నమ్మలేడు. ఎందుకంటే ఆమెకు తెలిసిన నిజం “ఒకసారి మోసం జరిగితే, అది జీవితాంతం గుర్తుండిపోతుంది”.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లను మనం చాలా సార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. “ఎందుకు నమ్మడం లేదు?”, “ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?” అని అనుకుంటాం. కానీ వారి మనసులో జరుగుతున్న యుద్ధం మనకు కనిపించదు.
వారు బయటకు కనిపించేది కోపం, దూరం, అనుమానం మాత్రమే. కానీ లోపల మాత్రం బాధ, భయం, ఒంటరితనం ఉంటుంది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే
నమ్మకం కోల్పోయిన వ్యక్తికి మాటలు కాదు, సమయం మరియు నిజమైన ప్రవర్తనే ఔషధం.
ఒక పాముకు సహాయం చేయాలంటే, దాని మీద బలవంతంగా చేయలేం. నెమ్మదిగా, జాగ్రత్తగా, దాని భయాన్ని తగ్గిస్తూ సహాయం చేయాలి.
అలాగే మనుషుల విషయంలో కూడా
వారిని బలవంతంగా మార్చలేం… వారిని నమ్మమని ఒత్తిడి చేయలేం…
కానీ
మన నిజాయితీతో, సహనంతో, ప్రేమతో నెమ్మదిగా వారి మనసును గెలుచుకోవచ్చు.
మనిషి మోసపోవడం వల్ల మారిపోతాడు. కానీ అదే సమయంలో, నిజమైన ప్రేమ, నిజమైన నమ్మకం, నిజమైన సహాయం అతనిని మళ్లీ మార్చగలవు.
అయితే ఆ మార్పు ఒక్కరోజులో రాదు. అది ఒక ప్రయాణం సహనం, సమయం, అర్థం చేసుకోవడం అనే మూడు సూత్రాలపై నడిచే ప్రయాణం.
1 ప్రతి కోపం వెనుక ఒక బాధ ఉంటుంది…
2 ప్రతి అనుమానం వెనుక ఒక మోసం ఉంటుంది…
3 ప్రతి దూరం వెనుక ఒక గాయం ఉంటుంది.
.
అందుకే మోసపోయిన వారు
గాయపడిన వారు
అన్యాయానికి గురైన వారు ఎవరిని నమ్మలేరు.
.
No comments:
Post a Comment