Saturday, August 8, 2026

 ఋషి ఋణం, పితృ ఋణం, దైవ ఋణం అంటే ఏమిటి? వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి?
మ ని షి పుట్టడంతోనే కొన్ని ఋణాలు ఏర్పడుతున్నాయి. ఋణం అంటేనే బాకీ గదా! ఋణం తీర్చక పోతే బంధమే గదా ! (జైలుశిక్ష) అంటే జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉండవలసినదే.

మన శరీరం— -తల్లి దండ్రుల అనుగ్రహంతో ఏర్పడింది,వాళ్ల చేతనే .వృద్ధి చేయబడింది. మనం ఏ పని చేసినా ఈ శరీరం ఉండబట్టే కదా!

శరీరం ప్రధానమైన ఉపాధి. దీనితోపాటు, శక్తి, సాధన సంపత్తి అంటే ధనం,,ఇతరవస్తువులూ సమకూడితేనే ఒక పనిని చేయగలుగుతాము

ఏదైనా సరే . దానధర్మాలు చేయాలన్నా ,పుణ్య కార్యాలు చేయాలన్నా జీవనోపాధి సంపాదించుకోవాలన్నా, ఏ పురుషార్థ సాధనకైనా, ముందు శరీరం ఉండాలి గదా. కాబట్టి ఈ శరీరం ఇచ్చిన తల్లి దండ్రులకు మొదట ఋణపడుతున్నాం..

"జనకునకున్ స్వామిత్వము

తనయోద్దేశమున కలిమి తథ్యము"….అయినా , తల్లి మాటను దానితో సదృశంగా పాటిస్తానంటాడు భీష్ముడు.

(.ఈ శరీరం తండ్రిది. ఆయన దీని స్వామి .అయినా తల్లి కి గూడా ఆ స్థానం, గౌరవం ఇస్తున్నాను )

స్వం అనేదే సొమ్ము. ఆ స్వం మీద అధికారం కలవాడు తండ్రి. అంటే నీ శరీరం తండ్రిది. ఆయన చలనరూపమైన ఆస్తి. దీన్ని ఏమైనా చేసుకోవచ్చు.యయాతి తన మాట వినని కన్న బిడ్డలను రాజ్య భ్రష్టులను చేశాడు. విశ్వామిత్రుడూ శపించాడు .అదీ స్వామిత్వము అంటే.

కొడుకు సంపాదించినదంతా తౕండ్రిదే శాస్త్ర ప్రకారం .

. పాండవులు కూడా తాము పరాక్రమంతో సాధించింది ధృతరాష్ట్రుడికే ఇచ్చి వేశారు. అపార ధన రాశులు సంపాదించి ధనంజయుడని అర్జునుడు పౌరుషనామం పొందినా , ఆ ధనమంతా అధికార పీఠంలో ఉన్న పెదతండ్రికే సమర్పించారు వాళ్లు.

తల్లి దండ్రులున్నంత కాలం సేవచేసినా పితృ ఋణం తీరదు (ఆస్తులు ఇచ్చి పోతే ఇంకా ఋణభారం పెరిగినట్టే)

పితరులు అంటే కేవలం తల్లి దండ్రులే కాదు. మన వెనకటి పది తరాలు గూడా. మనం ఇహమూ,పరమూ రెండూ నమ్ముతాం. పితరులకు సద్గతులు కలగడానికి వాళ్ల పేర పుణ్య కార్యాలు చేయడమూ, సత్సంతానం పొంది, పై తరాలను శ్రాద్ధ, తిల తర్పణాదుల ద్వారా ఊర్ధ్వగతులు పొందించడమూ పితృ ఋణవిముక్తికి మార్గం ( కామ పురుషార్థం దానిని ఉద్దేశించినదే.)_

____________________________________

రెండోది దైవ ఋణం . మన శరీరం పెరగడం ప్రకృతి శక్తుల వల్లనే. గాలి ఎండ,వాన పంట , అన్నం అన్నీ దేవతానుగ్రహం వల్ల నే సమకూరుతున్నాయి . కాబట్టి సూర్య చంద్ర అగ్న్యాది దేవతలను పూజా హోమాదులతోదులతో సంతుష్టులను చేయాలి

. పరోక్ష ప్రియా వై దేవాః కాబట్టి అతిథి, గురుజన అర్చన అందులో భా గ మే.

"దేవాన్ భావయతానేన, తే దేవా భావయంతు వః

పరస్పరం భావయంతః, శ్రేయః పరమవాప్స్యథ .".

అం టాడు శ్రీకృష్ణుడు.

_____________________________________________

ఋషి ఋణం— -జ్ఞాన సంబంధం.

తల్లి దండ్రుల నుంచి శరీరం ఏర్పడినా, తెలివి తేటలు జీవుడు తన వెనకటి జన్మల నుంచి తెచ్చుకుంటున్నాడు. తన జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోడానికి గురువులను ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి గురువులకూ మంత్రోపదేష్టలకూ బాకీ పడుతున్నాడు.

జ్ఞానాన్ని అందించిన కవులకు.,శాస్త్ర కారులకు,

పెద్దలకూ ఋణపడుతున్నాడు .

తాను నేర్చిన విద్య పలువురికి ఇవ్వడం, తానూ ఆ విద్యను ,శాస్త్రాన్ని

ఇతోధికంగా అభివృద్ధి చేయడం, ఆ ఋషులకు తర్పణం(తృప్తి పరచడం) చేయడం, నిత్యమూ నేర్చిన విద్యను ,నేర్పిన గురువులనూ జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా ఋషి ఋణ విముక్తుడౌతాడు జీవుడు.

________________________________________________

భారతం మానుష ఋణమని మరొక దానిని గూడా చెప్పింది.

మనిషి ఒంటరిగా బతక లేడు.

కావలసినవన్నీ —ఇ ల్లు, వాకిలి, ఉపకరణాలు, ప్రయాణ సాధనాలూ, కూరగాయలు,ధాన్యాలు, మందులుఅన్నీ ఎవరెవరో సిద్ధం చేసిపెడితే తాను హాయిగా జీవయాత్ర సాగిస్తున్నాడు. పరస్పర సహకారంతో గదా మనుగడ సాగడం..

అందుచేత మనుష్యులతో మీద దయాభావం కలిగి ,తప్పులు చేసినవాళ్ళ మీద దయ చూపడం ద్వారా మానవకోటి నుండి తాను పొందిన ప్రయోజనానికి ప్రతిగా చేసినవాడై ఋణ విముక్తుడవు తున్నాడు.

_________________________________

No comments:

Post a Comment