Saturday, August 8, 2026

కామాఖ్య వెళ్లేవాళ్ళు వీటి బారిన పడకండి | Don't get cheated at Kamakhya | Nanduri Srinivas

కామాఖ్య వెళ్లేవాళ్ళు వీటి బారిన పడకండి | Don't get cheated at Kamakhya | Nanduri Srinivas

Author Name:Nanduri Srinivas - Spiritual Talks

Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rCFwU8QNOKE



Transcript:
(00:04) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ కామాక్ష క్షేత్రం గురించి మనం ఒక సిరీస్ చేసుకుంటున్నాం కదా అందులో కామాక్షలో చేయాల్సినవి ఏమిటి చేయకూడనివి ఏమిటి అని ముందు వీడియోలో చెప్పాను మీకు అలాగేనే ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే కొత్తగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మోసపోయేవి కొన్ని ఉన్నాయి అవి జరగకూడదు అని వీడియో చేస్తున్నాను అసలు ఇది చేయడానికి కారణం ఏమిటి అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఒక తల్లి కనిపించారు తెలుగువాళ్ళు చాలా మంది కనిపించారు అక్కడ నాకు కనిపించినప్పుడు ఆవిడు చాలా ఆనందంగా వచ్చి నాకు ఒక రెండు ఎర్రటి బట్టల ముక్కలు చూపించారు. చూపించి
(00:37) ఏమిటమ్మా ఇది అంటే ఏవండీ అమ్మవారి రజస్వలు అవుతారు కదా అంబు బాచి అప్పుడు అప్పుడు కప్పిన బట్టది ఇదిగో ఆ ముక్కలు రెండు ఒక పూజారి గారి దగ్గర కొనుక్కున్నాను ఒక్కొక్కటి 5000 ఇచ్చి కొనుక్కున్నాను అని ఆనందపడిపోతూ చెప్పారు. అయ్యో పిచ్చి తల్లి మోసపోయావమ్మా అనిపించింది. అందుకని ఈ వీడియో చేసి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి.
(00:59) ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ బట్టలు నాకు కూడా దొరికే ఇలాంటివి కానీ నేను కొనుక్కోలేదు ఎవరో ఇచ్చారు వీటిలో నిజాలు ఏమిటి అనేది చెప్తాను మోసపోకుండా ఉండాల్సినవి ఒక నాలుగైదు చెప్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిది ఏమిటంటే యోని పీఠం మీద కప్పినది అని అమ్ముతున్నారు చూడండి అందులో 95% మామూలు ఎర్రబట్ట దాని ముక్కల కింద చేసి అమ్ముతున్నారు ఏదైతే యోనిపీఠం మీద కప్పుతారో అది సామాన్యంగా మనకి దొరకదు అందుకని మీరేదో అమ్మవారికి గుర్తుగా తెచ్చుకుంటే తెచ్చుకోండి ఆ క్షేత్రంలో దొరికిన ప్రసాదం కింద అంతేగానీ ఆ ముక్క కోసం ఐదేవేలు పదేవేలు ఇచ్చేయకండి అది మోసపోతారు.
(01:34) కాకపోతే మీరు ఒక పని చేయండి కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు అక్కడ బట్ట కొనుక్కొని తీసుకువెళ్ళచ్చు ఆ పక్కనే అమ్ముతారు తీసుకువెళ్లి మీరే అమ్మవారి పీఠాన్ని తాకుతారు కదా తాకినప్పుడు ఆ బట్టని అక్కడ పెట్టి పీఠం మీద అక్కడ జలం వస్తూ ఉంటుంది అందులో తడుస్తుంది ఆ బట్ట చక్కగా కళ్ళకు అద్దుకొని తెచ్చుకొని ఇంట్లో ప్రసాదం కింద పెట్టుకోండి మేము అదే పని చేసిం ఇంకా రెండవది ఏమిటంటే యోని పీఠం విషయంలో మీకు గతంలో చెప్పాను కదా నెట్ లో చాలా పుకార్లు చాలా ఫోటోలు అవన్నీ వస్తాయి ఉదాహరణకి ఇక్కడ చూపించే ఫోటో ప్రతి వీడియోలోనూ పెడుతూ ఉంటారు కామాఖ్య యోని పీఠం అని అది
(02:06) పొరపాటు ఆ పీఠం ఫోటో ఇప్పటిదాకా బయటికి రాలేదు ఎవ్వరు తీయలేదు తీయని ఇవ్వరు కూడా తీయకూడదు కూడా మరి ఈ ఫోటో ఏమిటండి అంటే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అని ఉంది కదా అక్కడ దేవీపురం అని ఒక అమ్మవారి క్షేత్రం ఉంది అక్కడ న్యూక్లియర్ సైంటిస్ట్ ఒకాయన మహా శ్రీవిద్యోపాసకులు వారి పేరు నిష్టల ప్రహ్లాద శాస్త్రి గారు అని వారు ఆ ఆలయాన్ని కట్టించారు అక్కడ కూడా అమ్మవారి యోని పీఠం వెలసింది చాలా మార్మికమైన ఆలయం అది అసలు అమ్మవారు తంత్రశాస్త్రంలో చెప్పినట్టుగా ఉంటాయి అక్కడ అమ్మవారి స్వరూపాలు అన్నీ కూడా అయితే అక్కడ తీసిన ఫోటో ఇది కామాఖ్య ఫోటో అని చెప్పి అందరూ
(02:43) చూపిస్తున్నారు తప్ప కామాఖ్య ఫోటో ఇప్పటిదాకా బయటికి రాలేదు యోని పీఠం ఇంకా అలాగేనే YouTube లో చాలా చెప్పేస్తూఉంటారు బ్రహ్మపుత్ర నది నీళ్లుు ఎర్రగా మారిపోతాయి అంబుబాచి సమయంలోనో అమ్మవారి పీఠం నుంచి ఎర్రగా వస్తాయి నీళ్ళు ఇవన్నీ కూడా అసత్యమేను ఇదిగో ఇక్కడ రాజీవ్ శర్మ గారుని ఆలయంలో అర్చకులు ఒకరు వారు చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్ వారి వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి చూస్తే తెలుస్తుంది మీకు ఎవరైనా ఇలాంటివి చెప్పారంటే ఎందుకంటే ఆ యోనిపీఠం ఫోటోలు కామాఖ్య యోని పీఠం అని చెప్పి అమ్మేస్తున్నారట అవన్నీ అబద్ధమే మోసపోకండి ఇంకా మూడవది ఏమిటి అంటే కామాఖ్య
(03:16) దగ్గర బాగా అమ్మేది కామ సింధూరం లేకపోతే కామ్య సింధూరం అని పిలుస్తారు. అది ఏమిటి అంటే వాళ్ళు చెప్పేది ఆ పీఠం పైన ఆ సింధూరం లాంటిది ఎర్రగా ఫామ్ అవుతుంది ఫామ్ అయితే అది పేస్ట్ మీకు ఇస్తున్నామని చాలా అపురూపం ఇది అని దానికోసం వేలల్లో పెట్టి కొనేసుకుంటున్నారు ఏ కోరికైనా తీరిపోతుంది అది పెట్టుకుంటేను అని చెప్తున్నారు అలాంటిది ఏమీ లేదు అది అబద్ధం ఎలా చెప్తున్నారు అంటే అర్చకులే చెప్పారు నా రీసెర్చ్ లోని తెలిసింది ఇదిగో ఇక్కడ వెబ్సైట్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఆలయంలో అర్చకులు ఆ చండీ ఉపాసకులు వారే వెబ్సైట్ లో స్పష్టంగా
(03:50) రాసే ేసారు కూడా అది అబద్ధము నిజం కాదు అందుకని దానికి కూడా డబ్బులు పోగొట్టుకోకండి మోసపోకండి ఇంకా నాలుగోది ఏమిటంటే అక్కడ అందరూ డబ్బులు పోగొట్టుకునేది ఈ ఆలయం పైన మీ పేరు మీద కలశాలు పెడతాము బంగారపువి అని చెప్పి లక్షల్లో తీసుకుంటున్నారుట లేకపోతే బంగారపు పూత పూస్తాం ఆ కలశాలకి రెండు కూడా నిజం కాదు ఇప్పుడు ఆ పైన పెద్ద కలశం ఉంది కదా అది అంబానీలు ఎప్పుడో చేయించేసారు అది 15 20 కిలోల బంగారం పెట్టి దానికి తాపడం అన్నీ చేయించారు.
(04:21) ఆ తర్వాత ఆరు మీడియం సైజ్ కలసాలు ఉన్నాయి అవి కూడా ఎంతో మంది భారతదేశంలో ఉన్న ధనికులు కుటుంబాల వాళ్ళు చేయించేశరు ఆ తర్వాత చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా అన్నీ పెట్టేసారు అందువల్ల ఇప్పుడు మీ దగ్గర నుంచి కొత్తగా కలశం తీసుకువెళ్లి పెట్టడం అనేది ఉండదు అందుకని దానికి కూడా లక్షలు మోసపోకండి. వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్తా వినండి మోసం ఎప్పుడు ఎలా జరుగుతుందండి అంటే ఏముందండి మోసం చేసే వాళ్ళు ఉంటే జరుగుతుంది కాదు మోసపోయేవాడు ఉంటే జరుగుతుంది మోసం ఎప్పుడు వీడ ఇవతలవాడు మోసపోకపోతే అవతల వాళ్ళు ఎవ్వరు మోసం చేయలేరు మనకి ఎంతసేపు ఏమిటంటే
(04:55) కష్టాలు తీరడానికి షార్ట్ కట్స్ కావాలి ఏదో ఒక షార్ట్ కట్ దొరికితే దాంతో కష్టాలు తీర్చేసుకుందాం అని గుర్తుపెట్టుకోండి మన పాపాలు ఎవ్వడు భుజాల మీద మోయడు మన కర్మని మనమే కరిగించుకోవాలి మనమే మోసుకోవాలి కర్మ కరగాలి అంటే కష్టపడి సాధన చేయాలి కామాక్ష్య వేడికి తప్పకుండా దీక్ష తీసుకోండి సాధన చేయండి చేస్తే అమ్మవారు కరుణించి ఎలాంటి కష్టాలన్నైనా తీరుస్తారు అమ్మవారు ఎందుకంటే ఆవిడ పేరే కామాక్ష్య అంటే కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్తుంది ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేనిది ఏమీ లేదు అలా చేయండి తప్ప ఇలాంటి షార్ట్ కట్స్ కి వెళ్లి మోసపోకండి
(05:28) శ్రీమాత్రే అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మ వీడియోలని
(07:54) [సంగీతం] మూడు ఛానల్స్ గా విభజించాం. మొదటి ఛానల్ డండూరి శ్రీవాణి పూజ వీడియోస్ అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్ లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల నండూరి గారిని [సంగీతం] ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తూ వాటిలన్నిటికి నండూరి గారు [సంగీతం] ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్ లో ఉంటాయి.
(08:19) అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని [సంగీతం] ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్ మహాత్ముల చరిత్రల గురించి ఆలయాల రహస్యాల గురించి మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ [సంగీతం] ఈ ఛానల్ లో ఉంటాయి. ఈ మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.

No comments:

Post a Comment