బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారు? | CRIME PSYCHOLOGY || PRATIKULA VEDAM
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x7u0GvuG3-U
Transcript:
(00:00) కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు చెప్పబోయే లాజిక్ ని ఒక్కసారి ఆలోచించండి. [సంగీతం] మీకు ఇంట్లో ఒక సంబంధం కుదిర్చారు. కానీ ఆ పెళ్లి చేసుకోవడం మీకు ఏ మాత్రం ఇష్టం [సంగీతం] లేదు. ఎందుకంటే అప్పటికే మీకు ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు పైగా నాలుగు నెలల క్రితమే మీరు అతన్ని సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మీ ముందున్న అతి పెద్ద సమస్య రేపు జరగబోయే ఈ కొత్త పెళ్లిని ఆపడం.
(00:22) అయితే మీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. [సంగీతం] ఆప్షన్ ఏ ధైర్యంగా ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేయడం. లేదా కనీసం ఆ చేసుకోబోయే అబ్బాయికైనా ఫోన్ చేసి చూడు బాబు నాకు ముందే పెళ్లిఅయింది. ఈ నాటకం ఇక నా వల్ల కాదు నన్ను క్షమించు అని చెప్పేయట. మహా అయితే ఏమవుద్ది రెండు రోజులు ఇంట్లో రచ్చ అవుతుంది బంధువులు నానా మాటలు అంటారు పరువు పోతుంది.
(00:44) అంతే కదా ఇక ఆప్షన్ బి ఆ చేసుకోబోయే వాడిని నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఒక కొండ మీదకి తీసుకెళ్లి లోయిలోకి తోసేసి చంపేయడం. [సంగీతం] ఏ నార్మల్ మనిషి అయినా ఎంత పిరికివాడైనా సరే కళ్ళు మూసుకొని ఆప్షన్ ఏ నేగా ఎంచుకుంటాడు. కానీ రీసెంట్ గా ఒక అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ తో కలిసి ఆప్షన్ బి ని ఎంచుకుంది. ఇది యాక్సిడెంట్ కాదు ఇదొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్.
(01:06) ఆఫ్కోర్స్ వాళ్ళద్దరు ఇప్పుడు జైల్లో ఉన్నారో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆ క్రైమ్ గురించి కాదు ఆ క్రైమ్ వెనక ఉన్న సైకాలజీ గురించి. అసలు వాళ్ళకి ఆ క్షణంలో ఆప్షన్ ఏ కంటే ఒక మనిషి ప్రాణం తీసే ఆప్షన్ బి నే ఎందుకు బెటర్ అనిపించింది ఒక నిండు ప్రాణం తీయడం కంటే సమాజం ముందు పరువు పోవడం అనేది వాళ్ళకి అంత పెద్ద భయంగా ఎందుకు అనిపించింది అసలు దీని గురించి ఎవ్వరూ మాట్లాడకుండా వదిలేసిన సైకాలజీ ఏంటి అనేదే ఈరోజు మన టాపిక్.
(01:38) [సంగీతం] పాయింట్ నెంబర్ వన్ మనం బ్రతుకుతున్న ఈ హిపోక్రిటికల్ సొసైటీలో మనందరికీ కలిపి ఒక జబ్బు ఉంది. అదేంటంటే మనం ఉన్నది ఉన్నట్టుగా బ్రతకం పక్కవాడికి నచ్చేటట్టుగా బ్రతుకుతాం. ఒక పెళ్లికి వెళ్తే ఎవ్వరి మొహాల్లో కూడా నిజమైన నవ్వయితే ఉండదు. అంతా ప్లాస్టిక్ స్మైల్స్ే ఈ ప్లాస్టిక్ స్మైల్స్ మధ్య సమాజం నా గురించి ఏమనుకుంటుంది అనే భయంతో పెరిగిన ఒక మైండ్సెట్ కి క్యాన్సిల్ అయిన పెళ్లి అనేది ఒక మనిషిని చంపడం కంటే పెద్ద నేరం లాగా అనిపిస్తుంది.
(02:09) శుభలకులు పనిచేసాం క్యాటరింగ్ కి అడ్వాన్స్ ఇచ్చేసాం ఇప్పుడు ఇలాంటి టైంలో పెళ్లి ఆగిపోతే బంధువుల ముందు తలెత్తుకోలేము అనే ఒక భయంకరమైన సోషల్ కండిషనింగ్ ఇది. సోక్రటీస్ ఒక అద్భుతమైన మాట అంటాడు మనం ఒక అబద్ధాన్ని ఎంతలా ప్రేమిస్తాం అంటే ఆ అబద్ధాన్ని కాపాడుకోవడానికి అబద్ధాన్ని నిజం చేయడానికే ఎంతటి దారుణం ఒడిగట్టడానికైనా వెనుకాడము అని ఇక్కడ అమ్మాయి మెయింటైన్ చేయాలనుకున్న అబద్ధం ఏంటి నేను ఒక పర్ఫెక్ట్ కూతురిని ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్లినే సైలెంట్ గా చేసుకుంటున్న ఒక పద్ధతైన అమ్మాయిని ఈ ఫేక్ ఇమేజ్ ని బతికించుకోవడానికి పాపం
(02:45) ఇదంతా తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్న ఒక అమాయకుడిని చంపేయాలని డిసైడ్ అయింది. ఇదొక ఎక్స్ట్రీమ్ నార్సిసిజం వాళ్ళ దృష్టిలో ఆ చనిపోయిన అబ్బాయి అసలు ఒక మనిషే కాదు వాళ్ళ దారిలో ఉన్న ఒక అడ్డంకి ఒక ఆబ్జెక్ట్ వాళ్ళు అనుకున్న దారికి అడ్డు వస్తున్నాడు కాబట్టి వాడిని జస్ట్ ఒక ఆబ్జెక్ట్ లాగా తీసి పక్కన పడేయాలి అంతే పికప్ పాయింట్ నెంబర్ టూ ఈ కేస్ లో నా మైండ్ బ్లాక్ అయిన పాయింట్ ఇంకోటి ఉంది.
(03:11) వీళ్ళు ఏదో క్షణికావేశంలో ఈ తప్పు చేయలేదు. దిస్ వాస్ కోల్డ్ క్లిక్లేటెడ్ అండ్ రూత్లెస్లీ ఎగజక్యూటెడ్ పూణేలో ఒక గుట్ట మీదకి వెళ్లి మనిషిని ఎలా తోసేయాలో రిహర్సల్స్ చేశారు. దొరికిపోకుండా ఉండడానికి స్నాప్షాట్ లో కోడ్ వర్డ్స్ వాడుకున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్ళ సీక్రెట్ మ్యారేజ్ తాలకు పబ్లిక్ నోటీస్ వాళ్ళ పేరెంట్స్ కి వెళ్ళకుండా బ్రాకర్లకి డబ్బులు ఇచ్చి మరి లీగల్ సిస్టం ని మేనేజ్ చేశారు.
(03:36) చూసారా మన మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టం ఎంత అద్భుతంగా పని చేస్తుందో వీళ్ళద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్లే కానీ ఆ చదువు వాళ్ళకి బేసిక్ ఎథిక్స్ ని నేర్పించలేదు. ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణ ఇవ్వలేదు. కేవలం వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్ ని మరింత షార్ప్ గా ఎలా వాడాలో మాత్రమే నేర్పించింది. ఒక చట్టానికి దొరికితే అందులో ఉన్న లొగులని పట్టుకొని ఎలా తప్పించుకోవాలో నేర్పించింది.
(03:59) అందుకే వాళ్ళకి పోలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్షన్ టెస్ట్ చేస్తామని పోలీసులు అడిగితే మాకు ఇండియన్ సిటిజన్స్ గా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మేము దానికి ఒప్పుకోము అని కోర్టులో నేర్ మొహమాటగా చెప్పారు. దిస్ ఇస్ ద అల్టిమేట్ డేంజర్ ఆఫ్ హై ఇంటెలిజెన్స్ కంబైన్డ్ విత్ జీరో ఎంపతీ చదువు అనేది బుర్రకైతే పొదున పెట్టింది కానీ హృదయాన్ని చంపేసింది.
(04:23) ఇక పాయింట్ నెంబర్ త్రీ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు బయట ఉన్న మీడియాను చూసి ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించింది. ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ప్రాణం పోయింది రెండు కుటుంబాలు నాశనమయ్యాయి తన జీవితం కూడా జైలు పాలయింది. అయినా సరే ఆమె మొహంలో ఎక్కడ యుసుమంత అయినా సరే నేను తప్పు చేశాను అన్న గిల్ట్ ఫీలింగ్ ఉందా లేదు ఎందుకు కారణం మన మోడర్న్ కల్చర్ లో నర నరాన జీర్ణించకపోయిన ఎంటైటిల్మెంట్ [సంగీతం] ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టోరీలో వాళ్లే హీరోలు.
(05:00) దీన్నే సైకాలజీలో మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళక కావలసింది వాళ్ళకి దక్కాలి దానికోసం అడ్డు వచ్చిన వాళ్ళని ఏమైనా చేసే హక్కు తమకి ఉంది అనే ఒక సైకలాజికల్ ఇల్యూజన్ లో బ్రతుకుతున్నారు. ఆ అమ్మాయి మైండ్ లో కూడా ఇదే సైకాలజీ రన్ అవుతుంది. తన డ్రామాలో తనని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ అమాయకుడు కేవలం ఒక సైడ్ ఆర్టిస్ట్. సో ఆ సైడ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది అంతే అంటే ఆమె చూపించిన మిడిల్ ఫింగర్ మీడియాకి మాత్రమే కాదు ఎమోషన్స్ ని చంపేసి ఈగోని పెంచి పోషించిన మన టోటల్ సిస్టం కి [సంగీతం] ఈ మొత్తం సైకాలజీని ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడానికి మీకో చిన్న కథ చెప్తా
(05:36) వినండి. ఒక బౌద్ధ సన్యాసి నది వడ్డున నడుస్తుంటాడు. అతనికి ఒక పెద్ద అందమైన చెక్క పెట్టు దొరుకుతుంది. కానీ ఆ పెట్టే చాలా బరువుగా ఉంటది. బట్ ఆ అందమైన పెట్టిని వదులుకోలేక దాన్ని తన నెత్తి మీద పెట్టుకొని నడవడం స్టార్ట్ చేశాడు. రోడ్డు మీద చుట్టూ ఉన్న జనాలు చూసి వావ్ ఎంత అందమైన పెట్టే ఎంత గొప్పగా మోస్తున్నావు అని పొగరడం స్టార్ట్ చేశారు.
(05:59) ఆ సన్యాసి ఆ పొగతలకి టెంప్ట్ అయిపోయి ఆ పెట్టిని తల మీదనే పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. అయితే కొంతసేపటికి ఆ పెట్టె బరువుకి అతని మెడనరాలు చిట్లిపోయి రక్తం కారుతుంటది. ప్రాణం పోయేలా నొప్పు వస్తుంటది. కానీ చుట్టూ ఉన్న జనాల చప్పట్ల కోసం ఆ ఫేక్ ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం అతను ఆ పెట్టిని కిందకి దించడు. చివరికి ఆ బరువుని ఇంక మోయలేక అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చచ్చిపోతాడు.
(06:25) ఈ కేసు లో ఆ అమ్మాయి మోసింది కూడా అదే ఫేక్ ఇమేజ్ అనే బరువైన పెట్టిని మంచి అమ్మాయి పద్దతైన కూతురు అనే సోషల్ ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం పరువు పోతుంది అనే బరువుని కిందకి దించలేక ఆ అమాయకుడి మీద ఆ బరువుని పడేసి దారుణంగా చంపేసింది. ఈ మొత్తం ఇష్యూలో ఆ అమ్మాయి ఒక క్రిమినల్ అందులో ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు చట్టం తని పని తాను చేసుకుపోతుంది.
(06:49) కానీ ఇక్కడ మనం వేసుకోవలసిన ఒక హార్డ్ హిటింగ్ ప్రశ్న ఒకటి ఉంది. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్స్ ని తయారు చేస్తున్నది ఎవరు మనమే ఎస్ [సంగీతం] మనమే మన పిల్లలు మన ముందుకువచ్చి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనో లేదా నేను ఈ డిగ్రీ చదవలేను నా వల్ల కాదు అనో చెప్పగానే మనం ఏమంటాం ఏంటి ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఈ విషయం తెలిస్తే మన చుట్టాలు ఏమనుకుంటారో మన పరువు ఏం కావాలి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రతి పేరెంట్ కూడా పరోక్షంగా ఇలాంటి నేరస్తులు పుట్టడానికి దారి తీస్తున్నారు.
(07:21) ఒక తప్పు జరిగినప్పుడు భయపడకుండా నిజం చెప్పే స్పేస్ ని మనం మన ఇళ్లలో ఇస్తున్నామా లేక నువ్వు లోపల ఎంత ఏడ్చినా పర్లేదు బయట వాళ్ళకి మాత్రం మనం పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కనిపించాలి అనే హిపోక్రసీని చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నామా? ఒక అబద్ధాన్ని బ్రతికించడం కోసం ఒక మనిషి అది మగవాడైనా ఆడదైనా ఎంత రాక్షసంగా మారగలరు అనేది ఒక చేదు నిజం.
(07:44) ఈ కేసు మనందరికీ కూడా ఒక పవర్ఫుల్ వార్నింగ్ బెన్ సమాజం ఏమనుకుంటుంది అనేది మనందరికీ పట్టిన పెద్ద జబ్బు దాన్ని వదిలేయండి. మీ ఈగోని ఆ ఫేక్ ఇమేజ్ ని మీకు మీరే మీ చేతులతోనే చంపండి. లేదంటే ఈ ఫేక్ ఇమేజ్ ని మెయింటైన్ చేయడం అనేది రేపు పొద్దున్న ఇంకొకరి ప్రాణాన్ని తీయడంతో పాటు మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది.
(08:09) చివరిగా నేను కన్వే చేయాలనుకుంటున్నది ఒకటే నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం లేనివాడు ఎప్పటికైనా ఒక సైకోపాత్ గా మారక తప్పదు అవునా కాదా ఆలోచించండి
No comments:
Post a Comment