చెట్ల నుండి శక్తిని తీసుకోడం సాధన చెయ్యాలి.
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oqZfDsuZSKI
Transcript:
(00:05) మనం నిరంతరం యాంత్రికమైనటువంటి జీవితంతో ప్రాణం లేని వస్తువులతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో వాటి మధ్య ఉంటూ జీవిస్తూ మనం ప్రాణశక్తిని నిరంతరం కోల్పోతూనే ఉంటాం. చూడండి మనం దేనితో ఉంటే అదిగా మారిపోతూ ఉంటాం. ఎప్పుడు చూసినా ప్రాణం లేని మొబైల్ ఫోన్స్ తో టీవీస్ తో వాటితో సహవాసం చేస్తే మన ప్రాణశక్తి ఎప్పుడు కరిగిపోతూనే ఉంటుంది అందుకే మనుషులందరూ కూడా జీవం లేకుండా కళ లేకుండా ప్రాణం లేకుండా శక్తి లేకుండా వ్యాధులతో జీవిస్తూ ఉంటారు. మీరు ప్రకృతిలోకి రండి ఈ యొక్క
(00:52) అద్భుతమైనటువంటి మహా వృక్షాలు ప్రాణశక్తిని నిండుగా తమలో చేర్చుకొని దైవిక విభూతులుగా ఉంటాయి. మీరు ఒక చెట్టు నుంచి కూడా పూర్వం ఋషుల వలె మునుల వలె యోగుల వలె ప్రాణశక్తిని సంగ్రహించుకోవచ్చు సూర్యుని నుంచి సంగ్రహించుకోవచ్చు నీటిలో ఉంటూ నీటి నుంచి కూడా ప్రాణశక్తిని తీసుకోవచ్చు. మీరు ఒక చెట్టు నుంచి ప్రాణశక్తిని తీసుకోవాలనుకుంటే గనుక మీరు ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితిలో ఉండి నాలో ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఇందులో కూడా ఉంది.
(01:30) ఇందులో కూడా చైతన్యం ఉంది మనలో ఏదైతే ఆత్మ చైతన్యం ఉందో ఇందులో కూడా అదే ఆత్మ చైతన్యం ఉంది. మరి ఆ చైతన్యాన్ని మన చైతన్యంతో సంయోగం చెందిస్తే ఈ చెట్టుకు నాకు ఫ్రెండ్షిప్ కనెక్ట్ అవుతుంది. ఈ చెట్టు నాకు ప్రాణశక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు చెట్టును గట్టిగా వాటేసుకుని ఆ చెట్టులో నుంచి ప్రాణశక్తి మీ శరీరంలోకి అనువణువు ప్రవహిస్తున్నట్టు కొంతసేపు ధ్యానానుభూతిని పొందండి. భావన చెందండి.
(02:03) మీరు ఏ భావన చెందుతారో అది జరుగుతుంది యత్ భావం తద్భవతి ఎక్కడ అవకాశం దొరికినప్పుడు అల్లా ఇలాంటి చెట్టును మీరు ప్రేమగా ఇలాగ వాటేసుకొని ప్రాణశక్తిని సంగ్రహించండి.
No comments:
Post a Comment