Diogenes: The Truth About Nine to 5 Jobs & Freedom | Telugu Philosophy
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yV-78zDBguk
Transcript:
(00:07) డయోజెనీస్ ను జనం కుక్క అని పిలిచేవారు. ఎందుకంటే అతను కుక్కలా వీధుల్లో పడుకునేవాడు. కుక్కలా బహిరంగంగా తినేవాడు. సమాజం పెట్టిన సిగ్గు నియమాలు అతనికి పెద్దగా పట్టేవి కావు. అతని ఆలోచన చాలా సూటిగా ఉండేది. కుక్కల్ని చూడండి అవి అనవసరమైన ఒత్తిడితో జీవించవు ఆకలేస్తే తింటాయి నిద్రవస్తే పడుకుంటాయి. గతాన్ని పట్టుకొని బాధపడవు రేపటి గురించి భయపడవు కానీ మనిషి మాత్రం రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజునే కోల్పోతాడు.
(00:36) డయోజనీస్ ఒక మాట చెప్పేవాడు సమాజం నిన్ను నియంత్రించడానికి నియమాలు తయారు చేస్తుంది. అవి నీ మంచి కోసం కాదు 95 ఉద్యోగం కూడా అలాంటి ఒక నియమమే ఎవడు నిర్ణయించాడు పనికి 8:00 గంటలు అని ఎవడు నిర్ణయించాడు సోమవారం నుండి శుక్రవారం వరకే పని అని ఇది ఏ సహజ నియమం కాదు ఇది కొందరు మనుషులు మిగతా మనుషుల జీవితాలను నియంత్రించడానికి తయారు చేసుకున్న ఒక వ్యవస్థ నువ్వు దానిని ప్రశ్నించకుండా అంగీకరిస్తే నువ్వు ఆలోచన లేని బానిసవు డయోజెనీస్ అంటాడు నీ సమయం మీద నీకు అధికారం లేకపోతే నువ్వు రాజైన బానిసవే అని ఈరోజు 95 పని చేస్తున్నావ్ ఎందుకంటే రేపటి కోసం కానీ ఆ రేపు నిజంగా వచ్చినప్పుడు నీ
(01:14) శరీరం అలసిపోయి ఉంటుంది. నీ ఆరోగ్యం తగ్గిపోయి ఉంటుంది. ఆ డబ్బుని ఎంజాయ్ చేయడానికి శక్తి ఉండదు. డయోజినీస్ మనకు గుర్తు చేసేది ఇదే భవిష్యత్తు కోసం జీవించు కానీ భవిష్యత్తు కోసం ఈ రోజును చంపకు. చరిత్రలో అలెగ్జాండర్ పేరు ఎంత గుర్తుంటుందో డయోజినీస్ పేరు కూడా అంతే గుర్తుంటుంది. ఎందుకంటే ఎందుకంటే అతను తనకంటూ తన జీవితం బతికాడు.
(01:37) ఎవరి కోసమో బతకలేదు. ఇప్పుడు ఒక్కసారి నిజంగా ఆలోచించు నీ 9ట5 ఉద్యోగం నీ కలనా లేదా ఎవరో నీ మీద పెట్టిన భారమా ప్రతి ఉదయం అలారం మోగినప్పుడు నీకు లేవాలని అనిపిస్తుందా లేదా లేవక తప్పదని అనిపిస్తుందా జవాబు రెండోదయితే నువ్వు ఇప్పటికే బానిసవి డయోజినీస్ చెప్పే ఒకే ఒక పాఠం ఇది స్వేచ్ఛ అంటే ఎక్కువ సంపాదించడం కాదు స్వేచ్ఛ అంటే తక్కువ అవసరం ఉండటం నీ అవసరాలను తగ్గించు నీ ధైర్యాన్ని పెంచు నీ సొంత జీవితాన్ని బతకడం మొదలుపెట్టు ఎందుకంటే జీవితం ఒక్కటే దానిని వేరొకరి టైం టేబుల్ ప్రకారం వృధా చేయకు
No comments:
Post a Comment