Thursday, August 27, 2026

 *ప్రార్థన 🀊*

*_మన ప్రార్థన ఎలా ఉండాలి??_*

నిను చూడవలెనంచు కనులు మూయుదుగాని/ఎద్దియో వచ్చి నా ఎదుట నిలుచు
నిను దలపంగ గోరి మనసు నిల్పుదు గాని/ తలపు లేవియో వచ్చి కలత పెట్టు
నిను గొల్వ తలపోసి  నియమమూనుదు గాని / యేదియో దాని నిట్టిట్టె చెరచు
నిను జేర నొకవేళ నిర్గమింతును గాని  /కఠిన బంధము లేవొకాళ్ళ తగులు
కనులు దర్శింప భావింప   నిను భజింప  /నన్ని వేళల నిన్ను నే ననుగమింప
కలుగు భాగ్యంబు వొసగుమో కరుణ సింధు /ఇష్ట ఫలసిధ్ధి నొసగుమో ఈశ నాకు!!...

ఓ దేవ దేవా !!...
నాకు ఈ జన్మను ప్రసాదించావు, ఈ దేహాన్ని సంరక్షించుకోవడానికి సమయానుకూలంగా అన్ని సమర్పిస్తున్నావు, 
కానీ ఈ భువి పైకి వచ్చిన పనిని మరిచిపోయి, సంసార సాగరం లో పడి, నీకు దూరం అవుతున్నాను, ఈ జన్మకు కావలిసింది , నాకు తెలుపు, నిన్ను శరణు వేడేది అదే స్వామి,
పరబ్రహ్మ వు నీ వద్ద లేనిదంటూ ఏమీ లేదు, కానీ నేను అడిగేది తుచ్ఛమైన కోరికలు, అవి కాదు, నాకు ఈ జన్మకు ఏమి నాకన్న బాగుగా నీకే తెలుసు, కాబట్టి అది ప్రసాదించు స్వామి...
అని ప్రార్థించాలి, మరి ఆయనను ఇన్ని అడుగుతున్నప్పుడు మనకు కూడా పొందే అర్హత ఉండాలి కదా!!...
ఆయనకు కావలసిందల్లా నిస్వార్థ సేవ, నిర్మల హృదయం, అది ఉంటే చాలు , మనకు అర్హతలు ఉన్నట్లే!..

   *_🌷శుభమస్తు🌷_*

No comments:

Post a Comment