ఒక్క వివాహం.. లక్షల ఏళ్ల మనిషి బతుకును ఎలా మార్చేసింది? | Human evolution | Out Of COVERAGE
Author Name:Out of COVERAGE
Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cPF1ebVFV7Q
Transcript:
(00:00) సుమారు ఐదారు వేల ఏళ్ల క్రితం ఒకరోజు సమయం అర్ధరాత్రి దాటినట్టుగానే ఉంది. బయట జోరున వర్షం కురుస్తోంది. గుడిసలో అందరూ నిద్రపోతున్నారు కానీ ఇంటి పెద్దగా ఉన్న ఆల్ఫా మేలుకు సరిగా నిద్ర పట్టట్లేదు. కాసేపు కురుకుపడుతుంది మళ్ళీ ఏదో పీడకలు వచ్చినట్టు దిగ్గున మేల్కొంటున్నాడు. అది ఆవేదన కాదు ఆందోళన. ఆయన మనసు కీడు శంకిస్తోంది.
(00:27) మరోసారి కన్ను అంటుకునే ప్రయత్నం జరుగుతోంది. అంతే అకస్మాత్తుగా ఒక మనుషుల గుంపు ఆ గుడిసె మీద పడిపోయింది. ఒక పెద్ద బండరాయితో తల బద్దలు కొట్టేసి ఎదురొచ్చిన వాళ్ళ కడుపులను ఈటలతో చీల్సేసి గుడిసెను లూటీ చేసుకొని వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు లూటీ చేసింది తిండి గింజల్ని కాదు పశువుల్ని కాదు ఇతర వస్తువుల్ని కూడా కాదు ఆ గుడిసెలోని ఆడవాళ్ళను ఉదయాన్నే గూడెం పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు గడిచిన వారం రోజుల్లో ఇది మూడో ఘటన.
(00:56) ఈ దారుణానికి అంతం పలకడం ఎలా అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి మీటింగలు అప్పటివరకు 3ల33వేల సార్లు జరిగాయి. ఆ తర్వాత మరో 4ల44వేల సార్లు కూడా జరిగాయి. కానీ పరిష్కారం అంత ఈజీగా దొరకలేదు. ఇది ఆ ఒక్క గూడెంలోనే కొనసాగిన తంతు కాదు ప్రపంచం మొత్తంలో ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అలా జరిగిన లెక్క లేనన్ని సమావేశాల్లో ఎన్నెన్నో అభ్యంతరాలు అనుమానాలు దాటి సలహాలు సూచనలు చేర్చి ఆఖరికి అంగీకారాలు ఆమోదాలతో ఎట్టకేలకు చిట్టచివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు.
(01:32) అందరూ దానికే కట్టుబడి ఉండాలని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తూ ఇతరులతో చేయిస్తూ వచ్చారు. అవే ప్రమాణాలు ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. దాన్నే నేడు పెళ్లి అని పిలుస్తున్నాం ఫాలో అవుతున్నాం. భౌతికవాదంలోని ప్రిన్సిపుల్ ఆఫ్ క్యాజువాలిటీ ప్రకారం చెప్పుకున్న భావవాదంలోని కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పుకున్న ఆన్సర్ ఒకటే వస్తుంది. కారణం లేకుండా ఏ పని జరగదు అని.
(01:58) సృష్టిలో జరిగే ప్రతి మార్పుకు ఇదే సూత్రం అప్లై అవుతుంది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రధానమైన పెను మార్పు పెళ్లి. మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది అని లోతుగా విశ్లేషిస్తే ప్రధానంగా రెండే రెండు కారణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ఆడవాళ్ళ కోసం మగాళ్ళ మధ్య వేల సంవత్సరాల పాటు కొనసాగిన రక్తపాతం రెండో రీజన్ వ్యవసాయం ఈ రెండు కారణాలతోనే పెళ్లి అనే వ్యవస్థ ఆవిర్భవించింది.
(02:28) ఇది శృంగారానికి ఇచ్చిన లైసెన్స్ గా భావిస్తారు చాలామంది మరి కొందరు మాత్రం పెళ్లి అనేది ఆర్థిక కారణం కూడా తోడైన ఒక బలమైన శాంతి ఒప్పందం అంటారు. మరి ఇందులో ఏది నిజం? అసలు పెళ్లి అనేది ఎందుకు పుట్టింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. మన ప్రస్తుత సమాజంలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడితే పంచాయతీలు పోలీసులు కానీ ఆదిమ కాలంలో మాత్రం ఒక్కటే పరిష్కారం మన ఇద్దరిలో ఎవడో ఒక్కడే బతకాలి వాడికే ఆమె సొంతం కావాలి.
(02:56) వేల ఏళ్ల పాటు ఇదే తరహా పచ్చి రక్తపాతం కొనసాగింది. క్రూరమైన మారణ హోమం రాజ్యం ఏలింది. మైట్ ఇస్ రైట్ అంటే ఖండబలం ఎవడికి ఉంటే వాడే కింగ్ ఎవడి ఆయుధానికి పదన ఎక్కువ ఉంటే వాడే ఆల్ఫా మేల్ ఆ గుంపులోని ఆ తెగలోని స్త్రీలందరిపై హక్కు వాడిదే ఆస్ట్రేలియాలో దొరికిన నియాండర్తల్ హోమో సేపియన్స్ అస్ పంజరాలను చూసిన శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు.
(03:22) అత్యధిక శాతం మంది మగవారి పుర్రెలు ఎముకలు భయంకరంగా పగిలిపోయి కనిపించాయి. రాళ్లతో పదునైన ఆయుధాలతో ముఖం తలలు పగిలిపోయేలా కొట్టుకొని చనిపోయారని గుర్తించారు. స్త్రీని దక్కించుకోవడం కోసం సాగిన సమరంలోనే వారంతా వీరమరణం పొందారని తేల్చేశారు. ఆ కాలంలో పరిస్థితులు ఎంత క్రూరంగా ఉండేవో చెప్పడానికి మరో తిరుగులేని ఉదాహరణ హారం రైడింగ్.
(03:46) గుంపులో లేదా సమూహంలో ఆల్ఫామేల్గా ఉండే వ్యక్తి కిందనే 10 20 అంటూ లెక్క లేనంత మంది ఆడవాళ్ళు ఉండేవారు. వారిని ఇతర మగాలు టచ్ చేయడానికి కూడా లేదు. తేడా వచ్చిందంటే శాల్తి లేచిపోతాయి అని ఆల్ఫా మేల్ హెచ్చరించేవాడు. దీంతో ఆ గుంపులోని ఇతర మగాళ్లకు స్త్రీలు దొరికేవారు కాదు. ఇదే పరిస్థితి ఇతర గుంపుల్లోనూ ఉండేది. ఇలాంటి బాధ్యతల్లో చాలా మంది ఆల్ఫాను ఎదిరించే దమ్ము లేక మౌనంగా అలా బతికేసేవాళ్ళు.
(04:13) మరికొందరు వారిని కాకాపరితోనో బతిమాలుకోనో అవసరాలు తీర్చుకునేవారు కానీ అందరూ ఇలా తలంచి బతికే వాళ్ళు ఉండరు తిరగబడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారంతా ఒక టీమగా ఏర్పడి రాత్రి వేళలో దాడులు చేసేవారు నిద్రిస్తున్న ఆల్ఫామేల్ మీద అతనికి మద్దతుగా నిలిచే ఇతర పురుషుల మీద కూడా దాడి చేసి దారుణంగా హతమార్చేవారు. ఆ తర్వాత అక్కడ స్త్రీలను కట్టు బట్టలతో బలవంతంగా లాకెళ్ళిపోయేవారు.
(04:40) దీన్నే హారం రైడింగ్ అంటారు. గుంపుల్లో అంతర్గత గొడవలు ఇలా ఉంటే ఆడవాళ్ళ కోసం ఏకంగా తెగల మధ్యనే భారీ స్థాయిలో భీకర యుద్ధాలు జరిగేవి అవి ఇంకా ఘోరంగా ఉండేవి రోగాలతో తమ తెగలో ఆడవాళ్ళు చనిపోవడం వల్ల కావచ్చు లేదంటే మగవాళ్ళు ఎక్కువగా పుట్టడం వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక కారణంతో స్త్రీల సంఖ్య తగ్గిపోతే ఆ తెగకు చెందిన పురుషులంతా ఆయుధాలు చేతబట్టి పక్క తెగపై దండయాత్రకు వెళ్ళేవారు.
(05:08) మగవారిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని నరికి పారేసి స్త్రీలను లూటి వస్తువులుగా తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోయేవారు. మగాడు ఇంతగా తెగబడడానికి కారణం అతని నాచురల్ స్వభావమే ఈ భూమ్మీద దాదాపుగా జంతువులన్నీ కేవలం సంతానాన్ని కనడానికి మాత్రమే ఆరమగా కలుస్తాయి. మిగిలిన సమయంలో అవి మీటింగ్ కు దూరంగా ఉంటాయి. కానీ మనిషి ఏడాదిలో 365 రోజులు శృంగారాన్ని ఎంజాయ్ చేసేలా పుట్టాడు.
(05:35) అతని శరీర నిర్మాణం అలా తయారయింది. మనిషి వయసు 12, 13 ఏళ్ళు దాటుతుండగానే బాడీలో హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి. మన ఆలోచన ద్వారా లేదా చూడ్డం ద్వారా లేదంటే టచ్ చేయడం ద్వారా లైంగిక కోరిక కలిగినప్పుడు వెంటనే బ్రెయిన్ లో డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన కోరికను త్వరగా తీర్చుకోవాలని ఆరాటాన్ని మరింతగా పెంచుతుంది.
(05:55) ఇలాంటి పరిస్థితుల్లో మెదడులోని హైపోతాలమస్ వెంటనే సిగ్నల్ ఇవ్వగానే వెన్నుపూస ద్వారా అటానమిక్ నర్వస్ సిస్టం యాక్టివేట్ అయిపోతుంది. మనం అపోజిట్ జెండర్ ను టచ్ చేసిన పక్కన నిలబడిన మన గుండె వేగం పెరిగిపోవడానికి కారణం ఇదే. ఆ సమయంలో ఒక్కసారిగా ఒంట్లో రక్తం ఫాస్ట్ గా ఫ్లో అవుతూ జననేంద్రియాల వైపు మల్లుతుంది. అలా మనిషి శరీరం సంభోగానికి సిద్ధమైపోతుంది.
(06:19) కానీ మేడింగ్ పార్ట్నర్ దొరకపోతే అప్పటికప్పుడు శాంతపడిన కోరిక మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు చాలా మంది ప్రత్యామనాయ మార్గాలు చూసుకుంటారు. అలా ప్రెజర్ ను బయటకు పంపాల్సిందే లేకపోతే ఇబ్బంది మొదలవుతుంది. బాడీలో అడ్రినలిన్ కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్స్ పెరిగిపోతాయి.
(06:41) ఈ పరిస్థితి మరింత తీవ్రమై ఎప్పుడైతే అదుపు తప్పి వరద ఉప్పొంగినట్టుగా ఉవ్వెత్తున ఎగిసి పడుతుందో తప్పు ఒప్పు అనే విచక్షణను డిసైడ్ చేసే ప్రిఫెంటల్ కార్టెక్స్ అనే భాగం స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంతే అప్పుడు అడ్డుగా ఉన్న దేన్నైనా బద్దలు కొట్టేసి మరి తన కోరిక తీర్చేసుకుంటాడు మనిషి. సమాజం విధించిన కట్టుబాట్లను దాటేసి జైలు శిక్షలు పడతాయని తెలిసినా కూడా అత్యాచారాలు చేయడానికి ప్రియుడి కోసం ప్రియురాల కోసం హత్యలు చేయడానికి కారణం ఇదే ఈ మానసిక పరిస్థితి కారణంగానే మనిషి అనేక దారుణాలకు ఓడిగడతాడు.
(07:13) వివాహ వ్యవస్థ ఏర్పడడానికి ముందు సమాజంలో చాలా మంది మగాళ్ళ పరిస్థితి ఇలాగే ఉండేది. ఆల్ఫా మేల్ గాళ్ళు స్త్రీలందరినీ తమ గుప్పిట పెట్టుకుంటే ఆడవాసన తగలక అల్లాడిపోయే వారంతా చావో రేవో తేల్చుకుందామని దాడికి సిద్ధమయ్యేవారు. ఇలా ప్రతిరోజు చంపడాలు, చావడాలు, భయం, రక్తపాతం నడుమ, మనుషులు నిరంతరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వచ్చేది.
(07:38) ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ఈ నిరంతర రక్తపాతానికి ముగింపు పలకడానికి మన పూర్వీకులు కనిపెట్టిన అద్భుతమైన ఆయుధమే పెళ్లి. ఇవాళ పెళ్లి అంటే పచ్చని తోరణాల మధ్య పసుపు బట్టల్లో సాగే సంతోషాల వేడుక కానీ ఇది పుట్టింది మాత్రం నెత్తుటి కాల్వల్లోంచే మగాల మధ్య సాగిన మారణ హోమాన్ని ఆపడానికి పూర్వీకులు కుదుర్చుకున్న ఒక అంతర్జాతీయ శాంతి ఒప్పందమే ఈ పెళ్లి అనుకోవచ్చు ఇవాళ పెళ్లికి 5వేల ఏళ్ల కారం చాలా మందికి తెలియదు మన వాళ్ళ పెళ్లి కాబట్టి వెళ్దాం అని కొందరు పోతే మన పెళ్లికి వచ్చారు కదా మనం వెళ్ళద్దాం అని ఇంకొందరు వెళ్తారు కానీ దీని వెనక అసలు ఉద్దేశం ఆ పెళ్లికి
(08:15) సమాజాన్ని సాక్షిగా ఉంచడమే ఆనాటి రోజుల్లో జంటను అందరి ముందు నిలబెట్టి ఇకనుంచి ఈమె ఈ పురుషుడికి మాత్రమే సొంతం ఇతను ఈమెకు మాత్రమే కట్టుబడి ఉంటాడు. ఇక మీదట ఏ మొగాడు ఈమెను చూడడానికి ముట్టుకోవడానికి వీలు లేదు. ఇదే విధంగా ఏ స్త్రీ కూడా ఇతనితో సంబంధం పెట్టుకోవడానికి వీలు లేదు అని అందరికీ తెలిసేలా ప్రకటించేవారు పెళ్లి అసలు లక్ష్యం ఇదే ఆ విధంగా ఎప్పుడైతే నలుగురు సమక్షంలో ఒక జంటను పెళ్లి పేరుతో ఒక్కటి చేయడం మొదలు పెట్టారో అప్పుడు వేరే పురుషులు ఆ పెళ్లి చేసుకున్న స్త్రీ వైపు చూడటం బలవంతంగానైనా సరే ఆపేయాల్సి వచ్చింది. ఆమెపై కోరికను
(08:54) వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా సొసైటీ సమిష్టిగా రాసుకున్న రాజ్యాంగం ఈ పెళ్లి అలా క్రమక్రమంగా పురుషుల మధ్య స్త్రీల కోసం జరిగే రోజువారి ప్రాణాంతక యుద్ధాలు ఆగిపోతూ వచ్చాయి. అలా సమాజంలో మొదటిసారి ఒక శాంతి ఒక స్థిరత్వం ఏర్పడ్డాయి. ఆ విధంగా మనుషులు భయం లేకుండా నిద్రపోవడం మొదలు పెట్టారు. ఇది పెళ్లి పుట్టడానికి మొదటి కారణం.
(09:21) ఇక రెండో బలమైన కారణం వ్యవసాయం. లక్షల ఏళ్ల పాటు అడవుల్లో సంచార జీవనమే సాగించిన మనిషి వ్యవసాయం కనిపెట్టడంతో ఒకే చోట స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వ్యవసాయం వల్ల రేపటి తిండి కోసం ఆందోళన పడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. నెలలు సంవత్సరానికి సరిపడా దాచుకునేంతగా ధాన్యం నిలువలు పెరిగాయి. పశువుల మందలు కూడా పెరిగాయి.
(09:43) అంతా బాగానే ఉంది కానీ మనిషిని మరొక కొత్త సమస్య వేధిస్తుంది. ఆ గుంపులోని వారంతా ఒకచోట చెట్లను తొలగించి వ్యవసాయం చేసుకునేవారు కానీ అందరూ సమానంగా పని చేసేవారు కాదు. ఇప్పుడు కూడా అంతే కదా మన చుట్టూ పనిమంతల కన్నా పని దొంగలే ఎక్కువగా ఉంటారు. ఆనాడు కూడా సేమ్ సీన్ ఒకడు పొలంలో గొడ్డులా కష్టపడుతుంటే మరొకడు పైపైన తూతు మంత్రంగా పని చేసేవాడు. కానీ తినేటప్పుడు మాత్రం ఆ పని దొంగ కూడా సమానంగా వాట ఇవ్వాల్సి వచ్చేది.
(10:09) ఈ విధంగా ఒక అసంతృప్తి మొదలైంది. ఇది పెరిగి ఆ గుంపులో కష్టపడి పని చేసే వాళ్ళంతా మరొక సమూహంగా ఏర్పడి వేరే చోట వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ కాలక్రమంలో ఇక్కడ కూడా మరో పెద్ద సమస్యను గుర్తించారు. అందరము కష్టపడి పని చేస్తున్నాం సరే బాగానే ఉంది కానీ నేను సంపాదించిన సంపద నా తర్వాత ఎవరికి వెళ్ళాలి అనే ప్రశ్న వచ్చింది. వారి గుంపులో పిల్లలు ఉండేవారు వారే దాన్ని అనుభవించేవారు కానీ వారిలో నా పిల్లలు ఎవరు నాటి రోజుల్లో మగాడికి ఎన్నటికీ సమాధానం తెలియని ప్రశ్న ఇది.
(10:39) నాటి సమాజంలోని లైంగిక స్వేచ్ఛ కారణంగా పుట్టిన బిడ్డకు తల్లి ఎవరు అనేది మాత్రమే అందరికీ తెలిసేది కానీ తండ్రి ఎవరు అనేది ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. ఈ పరిస్థితి మారాలని మగాడు బలంగా కోరుకున్నాడు. నా కష్టం నావారు తినాలి నా వారసులు తినాలి నా ఆస్తిని నా రక్తమే అనుభవించాలి. ఇవాళ ఈ గుంపులోని వాళ్ళని నేను మూలకు పడితే పట్టించుకోవట్లేదు.
(11:01) ఇదే నా వాళ్ళఅయితే నన్ను చూసుకుంటారు నాకు తిండి పెడతారు నాకు తోడుగా ఉంటారు. ఇలా తనను తన ఆస్తిని రక్షించుకునేందుకు కూడా మనిషికి పెళ్లి అవసరమైంది. ఈ విధంగా ఈ రెండు బలమైన కారణాలే పెళ్లికి ముహూర్తం పెట్టాయి. మరి పెళ్లిలో ఇప్పటిలాగా ఒకరికి ఒకరే అనే సిద్ధాంతం మొదటి నుంచి ఉందా అని అడిగితే దీనికి సమాధానం ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. అందులో డౌటే లేదు.
(11:27) వ్యవసాయం మొదలు పెట్టిన తర్వాత అధికారం పూర్తిగా మగాడి చేతిలోకి వచ్చేసింది. అప్పటివరకు శారీరక బలం మాత్రమే పురుషుడు సొంతం కానీ వ్యవసాయం తర్వాత ఆర్థిక బలం కూడా అతని సొంతమైంది. అలా మగాడు తిరుగులేని శక్తివంతుడయ్యాడు. ఆ విధంగా ఆల్ఫా మేల్కు అర్థం కూడా మారిపోయింది. అడవులో ఉన్నప్పుడు శారీరకంగా శక్తివంతుడిగా ఉండి కండలు తిరిగిన దేహం కలిగి బలంతో ఎదుటివారిని ఓడించగలిగేవాడే ఆల్ఫామేల్.
(11:53) వాడే తిరుగులేని మగాడు కానీ వ్యవసాయం వచ్చిన తర్వాత ఎవరి వద్దనైతే ధాన్యం పోగయిందో ఎవరి వద్దనైతే పశు సంపద పెరిగిందో ఎవరి వద్దనైతే ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయో వాడే ఆల్ఫామేల్ గా మారిపోయాడు. అంటే ఇప్పుడు ఆల్ఫా మేలు కావాలంటే కండలు తిరిగిన దేహం ఆరడుగుల ఆజానుబావుడిలో ఉండాల్సిన అవసరం లేదు. సంపద క్రియేట్ చేస్తే చాలు సొసైటీ ఆ విధంగా మౌల్డ్ అయిపోతూ వచ్చింది.
(12:18) అడవుల్లో ఉన్నప్పుడు ఆల్ఫామేల్ గాడు తన కిందనే ఎక్కువ మంది స్త్రీలను పెట్టుకున్నట్టుగా పెళ్లి తర్వాత ఈ సంపన్నుడైన కొత్త ఆల్ఫా మేలు గాడు కూడా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం అనేది కేవలం సెక్సువల్ డిజైర్ కోసం మాత్రమే కాదు ఎక్కువ మంది పిల్లల్ని కనడం దాని అసలు లక్ష్యం.
(12:38) నాటి రోజుల్లో ఏ వ్యాధితో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఇదొక కారణం అయితే శత్రువుల దారుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సొంత బలగాన్ని పెంచుకోవడం మరొక కారణం. సమిష్టిగా పనిచేసి ఎక్కువ సంపద క్రియేట్ చేయడం ఇంకో కారణం. ఈ పరిస్థితి గత 50 60 ఏళ్ల దాకా కూడా కొనసాగింది. కావాలంటే మీ తాతల తరాన్ని వారి ముందు తరాన్ని ఒకసారి చెక్ చేయండి. ఆ సమయంలో చాలా కుటుంబాల్లో సంతానం ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించొచ్చు.
(13:04) ఇలా పెళ్లి వ్యవస్థ అనేది లక్షల ఏళ్ల పాటు అరాచకంగా ఆందోళనగా అస్తవ్యస్తంగా సాగిన మనిషి జీవితాన్ని ఒక క్రమబద్ధం చేసింది. పెళ్లి లేనప్పుడు ఆడవారి కోసం పురుషుల మధ్య నిరంతరం సాగే ప్రాణాంతక యుద్ధాలను వివాహ వ్యవస్థ ఆపేసింది. సామాజిక స్థిరత్వాన్ని తెచ్చింది. మనుషుల బలగం పెరిగింది. బంధాలు విస్తరించాయి.
(13:26) మరీ ముఖ్యంగా పిల్లలకు సరైన రక్షణ దొరికింది. పెళ్లికి ముందు బిడ్డల బాధ్యత మెజారిటీగా తల్లిది మాత్రమే ఉండేది. కానీ వివాహం తర్వాత తల్లిదండ్రుల రూపంలో బిడ్డలకు మరింత రక్షణ బాధ్యత దొరికాయి. అలా నాలుగుఐదు వేల ఏళ్ల క్రితం మొదలైన పెళ్లితో కుటుంబాలు ఏర్పడ్డాయి గ్రామాలు పెరిగాయి నగరాలు దేశాలుగా విస్తరించి ఈరోజు మనం చూస్తున్న నాగరికత దాకా వచ్చాము.
(13:50) ఇదంతా పెళ్లి వల్ల జరిగిన మంచి కానీ ఇదే పెళ్లి వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగాయి. అందులో ప్రధానమైనది మానసిక సంఘర్షణ. బయలాజికల్లీ మనిషి శరీరం ఒక్కరితోన జీవితాంతం కాపురం చేసేలా డిజైన్ కాలేదు. ఇదే విషయాన్ని గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. అలాంటి మనిషిని ఈ సమాజం పెళ్లి అనే బంధంలో బలవంతంగా ఇరికించడం మొదలు పెట్టింది. దీనివల్ల గుడ్డిగా పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
(14:15) పెద్దలు తీసుకునే నిర్ణయాలకు బలవంతంగా తల వంచాల్సిన దుస్థితి వచ్చింది. చివరకు మనకు ఎలాంటి భాగస్వామి వస్తాడు అనేది అదృష్టం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కారణంగానే చాలా మంది ఈ పెళ్లి అనే బంధంలో ఫిట్ కాలేకపోతున్నారు. దాని వల్లే వివాహేతర సంబంధాలు నమ్మక ద్రోహాలు మానసిక ఒత్తిడి వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. అన్నీ సెట్ అయి సంతోషంగా ఉన్నవారికి పెళ్లి అనేది ఒక పవిత్ర బంధంగా మారితే తేడా కొట్టేసిన వారికి జీవితాంతం అనుభవించే నరకంగా మారిపోయింది.
(14:45) ఈ సమస్యలు ఆడ మగ ఇద్దరికీ ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసినప్పుడు పెళ్లి ద్వారా ఎక్కువగా నష్టపోయింది మాత్రం మహిళలే. కంటి రెప్ప వెనకున్న కన్నీటి ధారను దాచేస్తూ పంటి బిగువన భరిస్తున్న బాధను చిరునవ్వుతో కవర్ చేస్తూ ఏదో అలా కాలం గడిపేస్తున్నారు వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి మహిళ ఒకనాడు అందరినీ శాసించింది. మాతృస్వామిక వ్యవస్థలో మహారాణిలా వెరిగిపోయింది.
(15:08) మరి అలాంటి ఆమె నుంచి మగారు అధికారాన్ని ఎలా లాగేసుకున్నాడు? పితృస్వామిక వ్యవస్థ ఎలా మొదలైంది? అది సహజంగా వచ్చిన మార్పా లేదంటే పురుషుడు చేసిన నమ్మక ద్రోహమా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సెలవ్
No comments:
Post a Comment