మనం ఎందుకు ఇంత వీక్ ఉన్నాం? 🚨 | WHY INDIANS ARE SO WEAK? 🧬| By Naresh Bukya 🔥
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I2hyBmDS2cE
Transcript:
(00:04) మీరందరూ ఎక్కడో అక్కడ రీల్స్ లో చూసే ఉంటారు. ఒక 70 ఏళ్ల ఫారెన్ ఉమెన్ మారథాన్ పరిగెడుతూ ఉంటుంది. ఇంకో 75 ఏళ్ల వ్యక్తి జిమ్ లో బరువులు ఎత్తుతూ ఉంటాడు. 80 ఏళ్ల బామ్మ సైకిలింగ్ చేస్తూ హైకింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితి చూస్తే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది.
(00:26) మన ఇళ్లలో 60 ఏళ్ళ వచ్చేసరికి చాలామంది మోకాళ్ళ నొప్పుల గురించి కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు. 65 ఏళ్ళు వచ్చేసరికి మెట్లు ఎక్కడం కష్టమైపోతుంది. 70 ఏళ్ళు వచ్చేసరికి చాలామంది ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా నేల మీద నుంచి లేవలేరు. దీనికి మనం చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు వాళ్ళ జీన్స్ వేరు మన దగ్గర ఇలాగే ఉంటుంది ఏజ్ అయిపోయింది కదా అని అదే టైంలో మనం ఇంకో మాట కూడా చెప్తాం.
(00:52) మన ఫుడ్ ప్రపంచంలోనే బెస్ట్ మనం నెయ్యి తింటాము పాలు తాగుతాము జొన్న రొట్టెలు తింటాము. [సంగీతం] అదే ఫార్నర్స్ అంతా కుల్లిపోయిన ప్యాకెట్ ఫుడ్ తింటారు అని. మరి ఈ రెండిట్లో ఏది నిజం? కుల్లిపోయిన ప్యాకెట్ ఫుడ్ తింటున్న ఫార్నర్స్ మనవాళ్ళ కంటే ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నారు? వాళ్ళు మనకన్నా ఎందుకు హెల్దీగా కనిపిస్తున్నారు రండి ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.
(01:18) ముందుగా చాలా కామన్ నెంబర్ అయిన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తో స్టార్ట్ చేద్దాం. అంటే ఒక మనిషి యవరేజ్ గా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు అనేది. జపాన్ లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాదాపు 84 ఇయర్స్ యూరప్ లోని చాలా కంట్రీస్ లో 81 టు 83 ఇయర్స్ ఉంది. సింగపూర్ సౌత్ కొరియాలో దాదాపు 83 ఇయర్స్ కానీ ఇండియాలో ఇది కేవలం 70 సంవత్సరాలు మాత్రమే. [సంగీతం] ఇండియాకి ఈ కంట్రీస్ కి మధ్య యవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో దాదాపు 13 నుంచి 14 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది.
(01:49) కానీ ఈ ఒక్క నెంబర్ మొత్తం స్టోరీని చెప్పదు. ఎందుకంటే అసలు క్వశ్చన్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు అనేది కాదు మీరు ఎన్ని సంవత్సరాలు హెల్దీగా బతుకుతారు మీ లైఫ్ ని ఎంత క్వాలిటీగా జీవిస్తారు అనేదే అసలు విషయం. దీనికోసం దగ్గర ఇంకో మెజర్మెంట్ ఉంది. దాన్నే హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. అంటే మీరు పూర్తి ఆరోగ్యంతో మీ పని మీరు చేసుకుంటూ బతికే సంవత్సరాలు.
(02:13) మీరు నడవగలగడం, మీరే లేచి కూర్చోగలగడం, ఒకరి మీద డిపెండ్ కాకుండా జీవించడం. ఈ నెంబర్ సింగపూర్ లో 73.6 ఇయర్స్ జపాన్ లో 73.4 ఇయర్స్ సౌత్ కొరియాలో 72.5 ఇయర్స్ వరల్డ్ యవరేజ్ హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాదాపు 63.7 ఇయర్స్ కానీ ఇండియాలో మాత్రం ఇది కేవలం 60 ఇయర్స్ మాత్రమే. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నుంచి హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మైనస్ చేయండి.
(02:45) దాంతో ఒక మనిషి తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు అనారోగ్యంతో వీక్నెస్ తో లేదా ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ గడుపుతున్నాడో తెలుస్తుంది. ఇది జపాన్ లో దాదాపు 10 ఇయర్స్ కానీ అది 84 ఇయర్స్ లాంగ్ లైఫ్ లో చివరి స్టేజ్ లో వస్తుంది. ఇండియాలో కూడా దాదాపు ఇది 10 ఇయర్స్ మాత్రమే. కానీ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఇయర్స్ మాత్రమే. అంటే ఒక జపనీస్ వ్యక్తి తన జీవితంలో దాదాపు 73 సంవత్సరాలు హెల్దీగా బతుకుతుంటే మన దేశంలో 60 సంవత్సరాలు మాత్రమే హెల్దీగా బతుకుతున్నాము.
(03:17) అంటే వాళ్ళు మనకంటే ఎక్కువ సంవత్సరాలు బతకడం మాత్రమే కాదు మనకంటే ఎక్కువ సంవత్సరాలు తమ కాళ్ళ మీదే నిలబడి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మన సొంత దేశానికి చెందిన చాలా ఇంపార్టెంట్ డేటాని చూద్దాం. దాని పేరే లాసి లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా ఇండియాలో వృద్ధుల మీద జరిగిన అతి పెద్ద స్టడీస్ లో ఇది ఒకటి ఇందులో 60 ఏళ్లకు పైబడిన దాదాపు 28వ000 నుంచి 31వ000 మందిని అనలైజ్ చేశారు.
(03:46) ఈ స్టడీలో వాళ్ళను క్వశ్చన్స్ మాత్రమే అడగలేదు. వాళ్ళ స్ట్రెంత్ ని కూడా మెజర్ చేశారు. వాకింగ్ స్పీడ్ ని చూశారు గ్రిప్ స్ట్రెంత్ ని కూడా మెజర్ చేశారు. రిజల్ట్ ఏంటంటే ఇండియాలో 60 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు 30% మంది ఫ్రెయిల్ అంటే ఫిజికల్లీ వీక్ గా ఉన్నారు. మెన్ లో ఇది దాదాపు 27% ఉమెన్ లో దాదాపు 32% ఉంది. అంటే మన దగ్గర ప్రతి ముగ్గురు ఎల్డర్లీ పీపుల్ లో ఒకరు ఫిజికల్లీ వీక్ గా ఉన్నారు.
(04:15) WHO ఇంటర్నేషనల్ రీసెర్చ్ లో చైనా, ఘానా, మెక్సికో, రష్యా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఈ ఆరు డెవలపింగ్ కంట్రీస్ ని కంపేర్ చేశారు. ఈ ఆరు కంట్రీస్ లో ఫ్రాల్టీ విషయంలో ఇండియా టాప్ లో ఉంది. మెన్ ఉమెన్ మధ్య డిఫరెన్స్ కూడా మన ఇండియాలోనే ఎక్కువగా ఉంది. ఈ ఫ్రాల్టీని ఐదు విషయాలతో మెజర్ చేస్తారు. ఒకటి ఫ్యాటిక్ రెండు వెయిట్ లాస్ మూడు గ్రిప్ స్ట్రెంత్ నాలుగు వాకింగ్ స్పీడ్ ఐదు ఫిజికల్ యక్టివిటీ లాసి డాటాలో మెన్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం గ్రిప్ స్ట్రెంత్ దాదాపు 79% మంది మెన్స్ కి గ్రిప్ స్ట్రెంత్ వీక్ గా ఉంది.
(04:53) 75 ఏళ్లకు పైబడిన గ్రూప్ లో ఇది ఏకంగా 95% వరకు ఉంది. ఉమెన్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫిజికల్ యాక్టివిటీ దాదాపు 82% ఉమెన్ లో యక్టివ్ గా ఉన్నారు. ఓల్డెస్ట్ గ్రూప్ లో ఈ నెంబర్ 93% వరకు ఉంది. లాసీలో హ్యాండ్ గ్రిప్ స్ట్రెంత్ ని మెషిన్ తో మెజర్ చేశారు. ఇండియాలో 60 ఏళ్లకు పైబడిన మెన్ యవరేజ్ గ్రిప్ స్ట్రెంత్ 32.26 kg ఉమెన్ లో 23.70 kg.
(05:21) ఈ గ్రిప్ స్ట్రెంత్ అంటే కేవలం చేతి బలం మాత్రమే కాదు. మొత్తం బాడీ స్ట్రెంత్ కి ఇది చాలా రిలయబుల్ మెజర్మెంట్. మీకు ఫ్యూచర్ లో డిసీజ్ వచ్చే రిస్క్ పడిపోయే రిస్క్ చివరికి లైఫ్ స్పాన్ ఎస్టిమేషన్ చేయడానికి కూడా ఈ గ్రిప్ స్ట్రెిన్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ చిన్న నెంబర్ మీ మొత్తం బాడీకి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఇప్పుడు బోన్స్ దగ్గరికి వద్దాం. ఒక ఇండియన్ రీసెర్చ్ లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో ఉమెన్ కి ఓస్టియోపోరోసిస్ అంటే ఎముకల బలహీనత ఎంత ఉందో చూశారు.
(05:50) 30 నుంచి 39 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 3% ఉంది. 40 ట 49 ఇయర్స్ ఏజ్ లో 3.4% ఉంది. 50 ట 59 ఇయర్స్ ఏజ్ లో 14.3 ఉంది. 60 ట 69 ఏజ్ లో 18.6% ఉంది. 70 సంవత్సరాలు దాటిన తర్వాత 36.4% 4% ఉంది అంటే 50 ఏళ్ల తర్వాత బోన్స్ చాలా వేగంగా డిక్లైన్ అవ్వడం మొదలవుతుంది. స్టియోపోరోసిస్ వేగంగా పెరుగుతుంది. ఇంకో పెద్ద ఇండియన్ రీసెర్చ్ లో సిచువేషన్ ఇంకా సీరియస్ గా ఉంది అని తెలిసింది.
(06:22) దాదాపు ప్రతి ఇద్దరు అడల్ట్ లో ఒకరికి ఓస్టియోపేనియా అంటే బోన్స్ వీక్ అవుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరికి స్టియోపోరోసిస్ ఉంది. మెనోపాస్ తర్వాత అంటే మహిళల్లో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోవడం తర్వాత దాదాపు ప్రతి ముగ్గురు ఉమెన్ లో ఒకరికి ఓస్టియోపోరోసిస్ ఉంటుంది. లాస్ డాటా ప్రకారం ఇండియాలో దాదాపు 11.5% ఎల్డర్లీ పీపుల్ గత కొన్ని సంవత్సరాల్లో పడిపోయారు.
(06:48) ఇందులో ఉమెన్స్ ఎక్కువగా ఉన్నారు. ఒక ఎల్డర్లీ పర్సన్ పడిపోవడం అంటే చిన్న విషయం కాదు. చాలాసార్లు ఆ ఒక్క ఫాల్ ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో మునుపటిలా నడవలేని పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది. ఇక ఇప్పుడు అసలు క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి సమాధానం మన రేస్ వీక్ మన జీన్స్ వీక్ అనేది కాదు.
(07:11) అదే నిజమైతే జపాన్, సౌత్ కొరియా కూడా ఏషియన్ కంట్రీస్ే మరి వాళ్ళు టాప్ లో ఎలా ఉన్నారు? సింగపూర్ లో పెద్ద మొత్తంలో ఇండియన్ పాపులేషన్ే ఉంటుంది. మరి అక్కడ హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రపంచంలోనే హైయెస్ట్ లెవెల్ లో ఎలా ఉంది? యూరప్ లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ కూడా ఎప్పటి నుంచో ఈ విధంగా ఫిట్ గా లేరు. ఈరోజు 70 ఏళ్ల యూరోపియన్ పర్సన్ రన్నింగ్ చేస్తున్నాడు.
(07:33) కానీ అతని గ్రాండ్ ఫాదర్ 70 ఏళ్ల ఏజ్ లో రన్నింగ్ చేయలేదు. ఈ చేంజ్ గత 40 50 సంవత్సరాల్లోనే వచ్చింది. పబ్లిక్ హెల్త్ పాలసీస్ రోడ్స్, పార్క్స్, లైఫ్ స్టైల్ విజన్ ఇవన్నీ కలిపి ఆ చేంజ్ ని తీసుకువచ్చాయి. అంటే ఈ మార్పు అనేది జెనటిక్స్ వల్ల వచ్చింది కాదు హ్యాబిట్స్ వల్ల వచ్చింది. అయితే మన దగ్గర హ్యాబిట్స్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాయి. దానికి నాలుగు మేజర్ రీజన్స్ ఉన్నాయి.
(07:56) రీజన్ నెంబర్ వన్ మనం పీక్ ని బిల్డ్ చేసుకోలేదు. మన బాడీ తన మాక్సిమం మజల్ మాస్ స్ట్రాంగెస్ట్ బోన్స్ ని దాదాపు 25 నుంచి 30 ఏళ్ల ఏజ్ లో బిల్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత లైఫ్ మొత్తం అదే సేవింగ్ నుంచి స్పెండ్ చేస్తూ ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకి కొంచెం కొంచెంగా మజిల్ అండ్ బోన్ స్ట్రెంత్ తగ్గుతూ ఉంటుంది.
(08:18) అంటే మీరు 70 ఏళ్ల ఏజ్ లో ఎలా ఉంటారు అనేది చాలా వరకు మీరు 25 ఏజ్ లో ఎలా ఉన్నారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మన దగ్గర 25 ఏళ్ల ఏజ్ లో ఏం జరుగుతుంది? స్టడీస్ ఎగ్జామ్స్ జాబ్స్ మ్యారేజ్ స్ట్రెస్ ఉంటుంది. కానీ ఫిజికల్ ఫిట్నెస్ కి ఎటువంటి ప్లాన్ ఉండట్లేదు. ఒక పెద్ద ఇండియన్ స్టడీలో 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 71% ఇండియన్స్ మజిల్ హెల్త్ పూర్ గా ఉంది.
(08:44) [సంగీతం] అంటే మనం పీక్ నే లోగా బిల్డ్ చేసుకున్నాం. ఆ తక్కువ సేవింగ్ తోనే తర్వాత 40 సంవత్సరాలు స్పెండ్ చేస్తున్నాము. రీజన్ నెంబర్ టూ మన దగ్గర స్ట్రెంత్ కల్చర్ లేదు. మన దగ్గర హెల్త్ అంటే వాకింగ్ మార్నింగ్ పార్క్ లో వాకింగ్ చేయడం మంచిది హార్ట్ కి కూడా అది మంచిది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాకింగ్ తో మజిల్ బిల్డ్ కాదు.
(09:04) మజిల్ బిల్డ్ కావాలంటే బాడీకి రెసిస్టెన్స్ కావాలి. ఏదైనా వెయిట్ ని లిఫ్ట్ చేయాలి పుష్ చేయాలి. ఏదైనా రెసిస్టెన్స్ కి అగైన్స్ట్ గా ఫోర్స్ ని అప్లై చేయాలి. కానీ మన దగ్గర ఎల్డర్లీ పీపుల్ అది చేయరు. 60 ఏళ్ల వ్యక్తికి కొంచెం వెయిట్ లిఫ్ట్ చేయండి. స్క్వాట్స్ చేయండి అంటే ఇంట్లో వాళ్ళు వెంటనే ఈ ఏజ్ లో ఇవన్నీ ఎందుకు ఇంజూరీ అవుతుంది మీరు రెస్ట్ తీసుకోండి అనేస్తారు.
(09:28) కానీ సైంటిస్ట్లు దీనికి ఎగజాక్ట్లీ అపోజిట్ చెప్తున్నారు. ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ మజల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఒక ఎల్డర్లీ పర్సన్ పడిపోకుండా ప్రొటెక్ట్ చేసే మూడు మెయిన్ థింగ్స్ ఇవి. రీజన్ నెంబర్ త్రీ ఇప్పుడు మనం నెయ్యి మిల్క్ దగ్గరికి వద్దాం.
(09:52) మిల్క్ కర్డ్ అండ్ నెయ్యి ఇవి చెడ్డవి కాదు మిల్క్ లో కాల్షియం ఉంది ప్రోటీన్ ఉందిబి12 కూడా ఉంటుంది. ఈ మూడు బోన్స్ మజల్స్ కి చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మన ట్రెడిషనల్ ఫుడ్ సిస్టం కరెక్ట్ గానే ఉంది. కానీ మనం రెండు విషయాలు మర్చిపోయాం. నెంబర్ వన్ నెయ్యిలో కాల్షియం ప్రోటీన్ దాదాపు జీరో నెయ్యి ఒక ఫ్యాట్ అది ఎనర్జీ ఇస్తుంది. ఫుడ్ టేస్ట్ ని పెంచుతుంది.
(10:17) కానీ నెయ్యి తినడం వల్ల మజల్ బిల్డ్ కాదు బోన్స్ కూడా స్ట్రాంగ్ అవ్వవు. రెండో విషయం ఇది చాలా ఇంపార్టెంట్. మన ట్రెడిషనల్ ఫుడ్ సిస్టం కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ కోసం తయారయింది. పంజాబ్ హర్యానాలో ఈ ఫుడ్ కల్చర్ డెవలప్ అయినప్పుడు వ్యక్తులు రోజంతా పొలంలో ఉండేవాళ్ళు పొలం దున్నేవాళ్ళు బరువులు ఎత్తేవాళ్ళు కిలోమీటర్ల వరకు నడిచేవారు చేతులతో ఫిజికల్ వర్క్ చేసేవారు.
(10:41) అప్పుడు నెయ్యి ఈ హార్డ్ వర్క్ కి ఫ్యూయల్ గా పని చేసేది. కానీ ఇప్పుడు మన ప్లేట్ సేమ్ నెయ్యి సేమ్ కానీ హార్డ్ వర్క్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి వర్క్ మొత్తం చైర్ మీదే జరిగిపోతుంది. [సంగీతం] అంటే మనం ఎప్పటిలాగే ట్రెడిషనల్ ఫుడ్ తింటున్నాము కానీ ఫిజికల్ హార్డ్ వర్క్ ని కంప్లీట్ గా వదిలేసాము.
(11:02) అందుకే పంజాబ్ హర్యాణ లాంటి స్టేట్స్ లో ఒబేసిటీ డయాబెటీస్ దేశంలోనే హైయెస్ట్ లెవెల్ లో ఉన్నాయి. అక్కడ ఎల్డర్లీ పీపుల్ పాపులేషన్ కూడా అంత స్ట్రాంగ్ కండిషన్ లో లేదు. ఇక రీజన్ నెంబర్ఫోర్ సన్లైట్ అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇండియాలో దాదాపు 70 నుంచి 90% మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అది కూడా ప్రపంచంలోని మంచి సన్లైట్ ఉన్న కంట్రీలో ఒకటైన ఇండియాలో వైటమిన్ డి లేకపోతే మీ బాడీ క్యాల్షియం ని ప్రాపర్ గా అబ్సర్బ్ చేసుకోదు.
(11:32) మీరు ఎంతైనా మెల్క్ తాగండి కర్డ్ తినండి. వైటమిన్ డి లేకపోతే ఆ కాల్షియం బోన్స్ వరకు ప్రాపర్ గా చేరదు. దీంతో పాటు ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా మేజర్ ఫ్యాక్టర్ ఇండియాలో యవరేజ్ ప్రోటీన్ ఇంటేక్ రోజుకు దాదాపు 47 గ్రామస్ వరల్డ్ యవరేజ్ దాదాపు 68 g ఇప్పుడు ఈ నాలుగేటిని ఒకేసారి చూడండి. లో పీక్ మజల్ అండ్ బోన్ స్ట్రెంత్ స్ట్రెంత్ ట్రైనింగ్ లేదు.
(11:56) ట్రెడిషనల్ హై ఎనర్జీ ఫుడ్ ఉంది కానీ పాత ఫిజికల్ వర్క్ లేదు. దానిపైన వైటమిన్ డి ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా ఉంది. రిజల్ట్ ఏంటి? 60 ఏళ్ల ఏజ్ లోనే నేల మీద నుంచి లేవడానికి ఇంకొకరి సపోర్ట్ వెతుక్కోవాల్సిన సిచువేషన్ ఉంది. కానీ దీనికంటే డీప్ గా ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అది మెడికల్ కాదు కల్చరల్ ప్రాబ్లం. మన దగ్గర ఎల్డర్లీ పర్సన్ ని రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి? మీరు కూర్చోండి మీరు ఏ పని చేయొద్దు.
(12:24) మీరు బరువులు ఎత్తొద్దు మీరు మెట్లు ఎక్కొద్దు మీరు బయటకు అలోన్ గా వెళ్ళొద్దు. ఇదంతా ప్రేమతోనే చేస్తాం. ఇంటెన్షన్ బ్యాడ్ కాదు కానీ మన బాడీ యొక్క రూల్స్ చాలా క్రూయల్ గా ఉంటాయి. అదే యూస్ ఇట్ ఆర్ లూస్ ఇట్ మీరు యూస్ చేయని మజల్ తగ్గిపోతుంది. మూవ్ చేయని జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి. నడవని మనిషి నడవడం మర్చిపోతాడు.
(12:46) అంటే మనం ఎల్డర్లీ పీపుల్ కి రెస్ట్ ఇచ్చి రెస్పెక్ట్ చేస్తున్నాము అనుకుంటున్నాం. కానీ అదే రెస్ట్ వాళ్ళ స్ట్రెంత్ ని స్లోగా తీసేస్తుంది. అదే యూరోప్ లో దీనికి కంప్లీట్ అపోజిట్ జరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. హైకింగ్ క్లబ్ లో జాయిన్ అవుతారు సైకిలింగ్ చేస్తారు. ఎల్డర్లీ పీపుల్ కోసం సెపరేట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రోగ్రాం్ ని గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది.
(13:07) అక్కడ రిటైర్మెంట్ అంటే ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ ఉండాలి అని అర్థం. అదే మన దగ్గర రిటైర్మెంట్ అంటే రెస్ట్ తీసుకోండి అని అర్థం. మరి దీన్ని చేంజ్ చేయగలమా అంటే 100% చేయగలము. ఎందుకంటే మజల్ అనేది ఏ ఏజ్ లో అయినా మళ్ళీ బిల్డ్ చేయగల టిష్యూ 80 90 ఏళ్ల ఏజ్ లో కూడా ప్రాపర్ ట్రైనింగ్ తో స్ట్రెంగ్త్ ని తిరిగి పొందవచ్చు. బోన్స్ బాలెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
(13:29) అంటే 25 ఏళ్ల ఏజ్ లో బిల్డ్ చేసుకోలేని సేవింగ్స్ కొంత భాగాన్ని 60 ఏళ్ల ఏజ్ లో కూడా తిరిగి బిల్డ్ చేసుకోవచ్చు. దానికి మూడు విషయాలు చేయాలి. నెంబర్ వన్ వాకింగ్ తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి. నెంబర్ టూ ఫుడ్ లో ప్రోటీన్ యాడ్ చేయండి. ఘీ మాత్రమే యాడ్ చేయడం కాదు ప్రతి మీల్ లో కొంత ప్రోటీన్ ఉండాలి.
(13:51) దాల్, కర్డ్, మిల్క్, పన్నీర్, ఎగ్స్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ కి ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ త్రీ వైటమిన్ డి అండ్ బోన్ చెకప్స్ 50 ఏళ్ల తర్వాత ఉమెన్ కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మెనోపాస్ తర్వాత బోన్ స్ట్రెంత్ చాలా వేగంగా డిక్లైన్ అవుతుంది. అందుకే మీకు ఇష్టం లేకున్నా కష్టంగా ఉన్న ప్రతిరోజు ఉదయం ఎండలో తిరగండి.
(14:13) మీ బాడీలో వైటమిన్ డి ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ విషయాలన్నీ మీకు చెప్పి మన భారతీయులని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మనలో ఉన్న ఒక మిస్ కాన్సెప్షన్ బ్రేక్ అవ్వాలి. మన ఫుడ్ే బెస్ట్ మనమే హెల్దీగా ఉన్నామని మనం అనుకుంటున్నాము. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఒక కంట్రీ హెల్త్ ని అక్కడి పీపుల్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు అని ఒక నెంబర్ తో మెజర్ చేయకూడదు.
(14:35) వాళ్ళు తమ లైఫ్ లో చివరి 20 సంవత్సరాలు కూడా తమ కాళ్ళ మీద నిలబడి ఇంకొకరి సపోర్ట్ లేకుండా జీవిస్తున్నారా లేదా అనేది అసలైన విషయం. ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే మనం దీన్ని రివర్స్ చేయొచ్చు. ఈ విషయాలు ఈ వీడియో చూస్తున్న మీ అందరి పేరెంట్స్ కి తెలియాలి. కాబట్టి వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మీ పేరెంట్స్ చివరి వరకు హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళ హ్యాబిట్స్ ని మార్చండి.
(15:00) లైఫ్ స్టైల్ ని కూడా చేంజ్ చేయండి. వాళ్ళను యక్టివ్ గా ఉండేలా మోటివేట్ చేయండి. ఎందుకంటే ఏజ్ పెరగడం మన చేతిలో ఉండదు. కానీ ఏజ్ పెరిగిన తర్వాత మన బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. చివరగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న మీరు మీ చివరి రోజుల్లో ఇండిపెండెంట్ గా మీ పనులు మీరు చేసుకునేలా ఉండాలి అనుకుంటున్నారా లేదా మీ పిల్లల పైన మీ మనవల పైన ఆధారపడి దుర్బరమైన జీవితం గడపాలి అనుకుంటున్నారా కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి.
(15:30) ఇఫ్ మీరు హెల్దీగా బతకాలి అనుకుంటే ఈ విషయాలన్నీ ఫాలో అవ్వండి. అండ్ 10 మందికి హెల్ప్ అయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.
No comments:
Post a Comment