ఐదు ప్రశ్నలు Full Story | ఎవరూ చెప్పలేని ఈ ప్రశ్నలకు రాకుమారుడు సమాధానాలు ఎలా కనుక్కున్నాడు?
Author Name:naatinundinetivaraku
Youtube Channel Url:https://www.youtube.com/@naatinundinetivaraku
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-FN9e43cLSs
Transcript:
(00:05) [సంగీతం] పూర్వకాలమందు కౌసాంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగసంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునే వాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది.
(00:32) ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరుల పాలైపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోనేకూడదు అని నిశ్చయించుకున్నది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకొని అందులో ఉండసాగింది.
(00:57) సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకొనమని ఒత్తిడి చేయనారంభించారు. వారి మాట తీసివేయడానికా వీలు లేదు తనకా పెళ్లాడటం ఇష్టం లేదు. కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. ఐదు ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరిైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లాడతాను. అని ఆమె అనేసరకు అందరూ బాగున్నదంటే బాగున్నది అన్నారు. ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతో మంది వచ్చారు.
(01:29) వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మాతరం కాదు అంటూ వచ్చిన దారినే పోతూ వచ్చారు. సులోచనకు కావలసిందే ఇది. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవ్వళ్ళు జవాబు చెప్పలేరు కదా అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా నా ఏర్పాటు సబువుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం.
(01:54) ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది [గురకలు] రాజకుమారులు జవాబు చెప్పలేక తలవంచుకొని వెళ్ళిపోయారు. తరువాత చివరకు ఒక రోజున నేపా రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకామె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను గానీ మరియొకసారి చూడాలనున్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి.
(02:25) ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నవో వాటి ఆంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు పోయి పోయి ఒక కీ కారణ్యం ప్రవేశించాడు.
(02:52) కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినబడింది. వాటి వద్దకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకవి అయ్యా ఇక్కడికి ఒక కోసెడు దూరంలో ఒక కొండ ఆ కొండలో ఒక గుహ ఆ గుహలో ఖడ్గమృగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పేవరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్లి ఆ గుహ చేరుకున్నాడు.
(03:18) అతను వెళ్లేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. [సంగీతం] నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదు అని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపైన పుంచి ఉన్నాడు. మరి కొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బ్రద్దలు కొట్టాడు.
(03:40) ఖడ్గమృగం గిలగిల తన్నుకొని చచ్చింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు రాజకుమారా నీ ఉపకారం మేము ఎన్నటికీ మర్చిపోలేము. మా వల్ల నీకు కావలసిన సాయం ఏంటో చెక్ చేతులు కట్టుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేవరకు అతను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్క దంపతులు నీవంటి సాహసికి యుక్తిశాలికి ఉపకారికి అసాధ్యంఅనేది లేదు.
(04:08) నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్లి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పినాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మండుటెండండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడని చతికలమడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా రెండు పాములు కనబడినాయి.
(04:31) పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది. ఈ అన్యాయం చూచి ధీరసింహుడు చిన్న పామును రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ రెండు పాములు అదృశ్యమై వాటికి బదులుగా ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయ్ రాజకుమారా మేము చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం. నేను వంటపాటుగా ఉండటం చూచి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు.
(05:00) అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ సుద్దులు చెప్పి రాజీ కుదిర్చే వరకు వారు అమితంగా సంతోషించి రాజకుమారా ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నించున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము.
(05:25) దీనికి జవాబు చెప్పడానికి నిజంగా నీవే తగినవాడవు. కొంచెం ముందుకు వెళ్లి కుడి వైపు మళ్ళినట్టయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తర్వాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళాడు. కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు.
(05:47) విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపలి నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చెయ్యి పప్పుకొని లోపలికి తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కనుపండు చేసే ఆ పచ్చడి చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యవి సెలయేళ్లుు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి.
(06:10) నేలంతా పచ్చలతో తాపటం చేసినట్టుంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మెలమెల మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకొని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుడిని ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు నాలుగు వైపులా గోడలకు అందమైన రాజకుమారుల పటాలు వేలాడుతున్నాయి.
(06:34) ఒకచోట మాత్రం ఒక పటానికి సరిపడేంత ఖాళీ స్థలం కనబడింది. అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాల్లో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దెదిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్నా ఆకలి తీరలేదు.
(06:57) అక్కడి సెలయళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్య భవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి దీపాలు వాటంతటవే వెలిగినాయి. గోడలను వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలను బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు.
(07:28) అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలోంచి చీమలబారు పాకుతూ బయటకు రావడం కనపడింది ధీరసింహునికి అతను కన్నం దగ్గరికి వెళ్లి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర అందులో ఒక పాత తాళం చెవి కనబడింది. దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్లి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పడలేదు. దానితో చివరి నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు.
(07:56) అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్ట మాత్రం ఉన్నది. ఆ పెట్ట తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడ తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెండి మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడి పడటంతోనే ఇనుపు పెట్ట గభీమని తెరుచుకున్నది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టలో ఏమున్నదో అని చూచాడు.
(08:23) దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు ఆ రాగిరేకు పైన ఇలా వ్రాసి ఉన్నది. ఇదంతా మాయ. ఎవ్వడైతే ఈ తోట మధ్యనే ఉన్న బంగారు చెట్టును పెల్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగిరేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది కానీ అతను దాన్ని పెల్లగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగి పోబోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది.
(08:55) బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకని ధీరసింహుడు చిన్న చెట్టును పెల్లగించాడు. చిన్న చెట్టు పెల్లగించడం తోటే పెళా పెళా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతటదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోటా లేదు మేడా లేదు పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు.
(09:23) అప్పుడు ధీరసింహుడు మీరెవరు ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపైన కోపగించి మమ్మల్నిందరిని ఈ భవనంలో బంధించాడు అయితే మా గతి ఇంతేనా అని అడిగేవరకు మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు అటువంటి సమర్ధుడు లభించే వరకు కనిపెట్టుకొని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనపడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు.
(10:06) వారి కోరిక విని ధీరసింహుడు ఓ నాగకన్యలారా మీ కథ తెలిసి సంతోషించాను. కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాచకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచడానికే వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని వెళ్ళండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు మాత్రం అతన్ని వదలలేదు.
(10:32) వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు అతని వెనక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూచాను గానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపించినాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు మాత్రం ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చినాయో ఆ దిక్కుకు పోయి చూచే వరకు దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు.
(11:00) ఎవరు నువ్వు అబ్బాయి ఎందుకలా విచారిస్తున్నావ్ అని అతన్ని అడిగాడు. ఆ రాజకుమారుడు ఈ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్ళలో నేను ఒకడిని అక్కడ ఉండే నాగకన్యల్లో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు.
(11:23) అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుని వెంటబెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్లి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తర్వాత అతను సులోచన వద్దకు పోయి మాయా మందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పేవరకు అవును నా ప్రశ్నకు ఇదే జవాబు ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఒప్పుకొని సరే రెండవ ప్రశ్న చెబుతాను రేపు రావలసిందే అని చెప్పి అతన్ని సాగనంపింది.
(11:57) [సంగీతం] [సంగీతం] మరుసటి రోజు ధీరసింహుడు అక్కడికి వెళ్ళగానే సులోచన అతన్ని కూర్చోబెట్టి తన రెండవ ప్రశ్న చెప్పడం మొదలు పెట్టింది. ఇక్కడి నుంచి పడమర దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలోని నీరు ఎప్పుడూ రక్తంలా ఎర్రగా ఉంటుంది. ఆ నది ఎక్కడ పుట్టింది దాని నీరు ఎర్రగా ఎందుకుంది అనే వివరాలన్నీ నాకు కావాలి అని చెప్పగానే ధీరసింహుడు మళ్ళీ కొంత గడువు తీసుకొని ఎంతో ఉత్సాహంగా బయలుదేరాడు.
(12:32) అతను చాలా దూరం నడిచిన తర్వాత ఆ రక్త నది కనిపించింది. ఆ నదిని చూసి అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. నది ఒడ్డునే చాలా దూరం నడుస్తూ వెళ్ళగా అతనికి ఒక భయంకరమైన అడవి ఎదురైంది. ఎన్నో భయంకరమైన పరిస్థితులను దాటుకుంటూ ధీరసింహుడు ఎలాగోలా ఆ అడవి చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పై నుంచి రక్తనది ప్రవహిస్తున్నట్లు గమనించి అతను మెల్లగా ఆ కొండ ఎక్కాడు.
(12:58) కొండ శిఖరానికి చేరుకునే సమయానికి అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. అక్కడ ఒక పెద్ద కొలను ఆ కొలను మధ్యలో ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మలకు 100 మంది స్త్రీల తలలు వేలాడుతూ ఉన్నాయి. అతను ఎంతో ఆశ్చర్యంతో అక్కడే కూర్చొని వాటి వైపు చూస్తుండగా ఆ తలలన్నీ ధీరసింహుడిని చూసి పకపక నవ్వడం మొదలు పెట్టాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే ఒక మాయ వెలుగు ఆ ప్రదేశమంతా నిండిపోయి పట్టపగల్లా మారిపోయింది.
(13:26) చెట్టుకొమ్మల నుంచి వేలాడుతున్న తలలన్నీ ఒక్కొక్కటిగా కొలంలోకి జారిపోయాయి. కొద్దిసేపటిలోనే అక్కడ ఎన్ని తలలు ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను వడ్డుకు వచ్చారు. వారందరిలో ఒక అమ్మాయి మాత్రం నక్షత్రాల మధ్య చంద్రుడిలా అపురూపమైన అందంతో మెరిసిపోతోంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ వరుసగా కూర్చున్న ఆ స్త్రీలకు పరిచారికలు రకరకాల రుచికరమైన వంటకాలను తీసుకువచ్చి వడ్డించారు.
(13:54) ఆ స్త్రీలు ధీరసింహుని కూడా తమతో కలిసి భోజనం చేయమని పిలవడంతో అతను వారి దగ్గరకు వెళ్ళాడు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా భోజనం చేశారు. ఆ తర్వాత వారంతా ధీరసింహుని చుట్టూ చేరి తెల్లవారే వరకు నాట్యాలు పాటలతో అతన్ని ఆనందంలో ముంచెత్తారు. తెల్లవారేసరికి ఆ కన్యలందరూ మళ్ళీ తలలుగా మారిపోయి ఎప్పటిలాగే చెట్టుకొమ్మలకు వేలాడటం మొదలు పెట్టారు.
(14:19) తనని ఇంతగా ఆదరించిన ఆ కన్యలు నిజం చెప్పకుండా ఉంటారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి? ఈ తలల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ అతను ఎన్నిసార్లు అడిగినా వారు ఇదంతా మాయ అని మాత్రమే చెప్పి మౌనంగా ఉండిపోయేవారు. చీకటి పడగానే ఆ తలలు కన్యలుగా మారడం ధీరసింహునికి నిందు చేసి నాట్యాలు పాటలతో అతన్ని ఆనందింపజేయడం తెల్లవారేసరికి ఆ కన్యలు మళ్ళీ తలలుగా మారిపోయి చెట్టుకొమ్మలకు వేలాడడం ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది.
(14:50) కానీ ధీరసింహుడు ఎంతగా బతిమాలినా వారు ఆ రహస్యాన్ని మాత్రం బయట పెట్టలేదు. పట్టుదల కలిగిన ధీరసింహుడు ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ రాత్రింబవళ్ళు ఎన్నో కొండలను దాటుకుంటూ వెళ్తుండగా ఒక కొండ గుహలో తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి కనిపించాడు. తాను వచ్చిన పని ఈ మహానుభావుడి వల్ల తప్పకుండా నెరవేరుతుంది అని ధీరసింహుని కనిపించింది.
(15:14) మూడు రాత్రులు మూడు పగళ్ళు అతను అక్కడే కదలకుండా కూర్చొని ఉండగా నాలుగో రోజు ఆ మహర్షి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తనకు జరిగిన విషయమంతా చెప్పగానే ఆ మహర్షి అతనితో ధీరసింహ నీకు కనిపించిన స్త్రీలలో అందరికంటే అందంగా ఉన్న కన్య కమలాకరుడు అనే ఒక మాంత్రికుడి [సంగీతం] కూతురు ఆమెకు పెళ్లి వయసు వచ్చినప్పుడు తనకు వివాహం చేయమని తండ్రిని కోరింది.
(15:43) కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేకపోవడంతో ఆమెపై కోపంతో ఈ మాయనంతా సృష్టించి తన కూతురిని ఆమె చెలికెత్తలతో సహా బంధించాడు. ఎవరైనా ఈ మాయను ఛేదించి కమలాకరుడిని చంపగలిగితే మాత్రమే వారికి విముక్తి లభిస్తుంది. లేకపోతే వారు ఎప్పటికీ అలాగే ఉండిపోవాల్సిందే అని చెప్పాడు. అది విన్న ధీరసింహుడు మునీశ్వర మీ దయ ఉంటే నేను ఆ మాంత్రికుడిని చంపి ఆ స్త్రీలకు విముక్తి కలిగిస్తాను అని చెప్పగానే మహర్షి అబ్బాయి ఈ పని చేయడానికి నువ్వు తగినవాడవని నాకు ముందే తెలుసు నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తున్నంత కాలం నీపై ఎలాంటి మాయలు పని చేయవు నీకు తప్పకుండా విజయం లభిస్తుంది
(16:26) వెళ్ళు అంటూ అతనికి ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మహర్షికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహిస్తున్న పర్వతం వైపు బయలుదేరాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతం కూడా ఒక మాయ పర్వతమే దాని మీద ఉన్న చెట్లు సంవత్సరంలోని 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏడాది పొడవున పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండపైకి చేరుకునేసరికి మాయపులు మాయసింహాలు భయంకరంగా గర్జిస్తూ [సంగీతం] వచ్చి అతనిపై పడి మింగడానికి ప్రయత్నించాయి.
(17:02) ఆ మాయ పర్వతం మీద నిలబడిన ధీరసింహుని కాళ్ళు అయస్కాంతానికి ఇనుము అంటుకున్నట్లు నేలకు అంటుకుపోయి ఎంత ప్రయత్నించినా కదలలేదు. అప్పుడు ధీరసింహుడు తన గురువును తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించగానే అక్కడున్న జంతువులన్నీ అక్కడికక్కడే మాయమైపోయాయి. అతని కాళ్ళు కూడా నేల నుంచి విడిపోయి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయకోటలో కూర్చొని తన మంత్ర పుస్తకాన్ని తెరిచి చూసేసరికి తాను [సంగీతం] సృష్టించిన మాయను ఛేదించడానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది.
(17:34) వెంటనే అతను తన కూతురిని అచ్చంగా పోలిన ఒక మాయ స్త్రీని సృష్టించి ఆమెను చెలికత్తలతో సహా ధీరసింహుని దగ్గరకు పంపించాడు. అక్కడ వాళ్ళు రకరకాలుగా నాట్యం చేస్తుండగా అతను ఇదేమిటి? ఇప్పటివరకు చెట్టుమీర కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయ కన్యలు తమ నాట్యంతో ధీరసింహుని ఆకర్షించి అతను ఆనందంగా ఉన్న సమయం చూసి రకరకాల పానీయాలు తాగించారు.
(18:05) అతను మత్తులోకి వెళ్ళగానే బంధించి కమలాకరుని దగ్గరకు తీసుకెళ్ళారు. పూర్వకాలంలో హిరణ్యకసిపుడు ప్రహ్లాదుని ఎన్నో బాధలు పెట్టినట్లుగా కమలాకరుడు కూడా ధీరసింహునికి అనేక కష్టాలు కలిగించాడు. పెద్ద పెద్ద జ్వాలలు ఎగసి పడుతున్న మంటల్లో అతన్ని వేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొర్లించాడు. కానీ ధీరసింహుడు తన గురువును తలుచుకొని మంత్రం జపించడం వల్ల మంటల్లో పడేసిన అతని శరీరం కాలలేదు.
(18:32) కొండ మీద నుంచి దొర్లించిన అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఇక ఏం చేయాలో తెలియక కమలాకరుడు అతన్ని చెరసాలలో బంధించి ఉంచాడు. తెలివైన ధీరసింహుడు సుధాకరుడు అనే కాపలాదారుని తనవైపు తిప్పుకొని అబ్బాయి నువ్వు నన్ను ఈ చెర నుంచి విడిపిస్తే నేను కమలాకరుడిని చంపి ఆ రాజ్యానికి నిన్నే రాజుగా చేస్తాను అని చెప్పగానే ధీరసింహుని తెలివితేటలు ముందే తెలిసిన సుధాకరుడు అతన్ని చెరసాల నుంచి తప్పించాడు.
(18:59) తెల్లవారేసరికి ధీరసింహుడు చెరసాల నుంచి తప్పించుకున్నాడనే వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవికి చేరింది. వెంటనే అతను తన మంత్ర పుస్తకాన్ని తెరిచి చూసి ముందు జరగబోయే విషయాలన్నీ తెలుసుకొని ధీరసింహుడిని పట్టుకొని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న సుధాకరుడు వెంటనే వెళ్లి ధీరసింహుడిని ఆశ్రయించాడు. ధీరసింహుడు అతనితో నీకు ఎలాంటి భయము అవసరం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుడు నివసించే ప్రదేశానికి సంబంధించిన రహస్యాలను అడగానే అతను ఇలా చెప్పాడు.
(19:32) కమలాకరుడు దేవుని నమ్మని వ్యక్తి అతను చాలా క్రూరమైనవాడు. అతన్ని ఓడించడం దాదాపు అసాధ్యం. అతను నివసించడానికి ఈ మాయకోటను మాత్రమే కాకుండా ఈశ్వరుని కూడా జయించాలనే ఉద్దేశంతో 30వేల అడుగుల ఎత్తులో ఒక మాయ ఆకాశాన్ని నిర్మించి అందులో సూర్యచంద్రులను నవగ్రహాలను కూడా సృష్టించాడు. శత్రువు తనపై దాడికి వచ్చినప్పుడు ఇంద్రజీతుల ఆ కోటను వదిలిపెట్టి ఆ మాయా ఆకాశంలోకి వెళ్లి దాక్కుంటాడు.
(20:02) అందుకే అతన్ని ఓడించడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు అని చెప్పాడు. అది విన్న ధీరసింహుడు సుధాకర దేవుని నమ్మిన వారికి అసాధ్యమన్నది ఏదీ ఉండదు. ముందు అతని కోటకు వెళ్లే దారి చూపించు ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అంటూ సుధాకరుని వెంట తీసుకొని బయలుదేరాడు. దారిలో ఎన్నో వింతవింత చెట్లు కనిపించాయి. వాటి గురించి ధీరసింహుడు అడగగానే ఇవి నిజమైన చెట్లు కావు.
(20:28) కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా చెట్లుగా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. తన గురువును తలుచుకొని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన పైకి వస్తున్నాడని తెలుసుకున్న కమలాకరుడు యుద్ధానికి సిద్ధమై అప్పటికప్పుడు కొత్త కొత్త మాయలు చేయడం మొదలు పెట్టాడు.
(20:51) అతని మాయల కారణంగా భూమి కంపించడం మొదలైంది. చుట్టూ దట్టమైన చీకటి కమ్ముకుంది. దాంతో ధీరసింహుని వెంట ఉన్న వారందరూ భయపడి కేకలు వేశారు. ధీరసింహుడు తన గురువును తలుచుకొని మంత్రం జపించగానే చీకటి తొలగిపోయి మళ్ళీ వెలుగు వచ్చి భూమి కంపించడం కూడా ఆగిపోయింది. కోపంతో కమలాకరుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఎవసిపడే మంటలను పంపించాడు. ధీరసింహుడు వరుడాస్త్రాన్ని ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో ఆర్పేశడు.
(21:23) అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయ పర్వతాన్ని ధీరసింహుని మీదకు విసిరాడు. ఆ పర్వతం తనను తాకక ముందే ధీరసింహుడు ఏకాగ్రతతో మంత్రం జపించగానే మంత్రశక్తి వల్ల ఆ పర్వతం వెనక్కి తిరిగి వెళ్లి కమలాకరుని సైన్యాన్నే నాశనం చేసింది. కమలాకరుడు మాత్రం వెంట్రుకవాసిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. చివరకు తీవ్రమైన కోపంతో కమలాకరుడు మాయపాములను వదిలాడు.
(21:49) ధీరసింహుడు తన గురువును తలుచుకొని శక్తివంతమైన గరుడాస్త్రాన్ని ప్రయోగించగానే ఆ మాయపాములన్నీ వెనక్కి తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటు వేయడం మొదలు పెట్టాయి. ఇక ధైర్యం కోల్పోయిన కమలాకరుడు తన మంత్రశక్తితో అదృశ్యమైపోయాడు. అది చూసిన మిగిలిన సైన్యం అంతా ధీరసింహుని పక్షంలో చేరిపోయింది. కమలాకరుడు తన మాయ ఆకాశంలో దాక్కొని ఉంటాడని గ్రహించిన ధీరసింహుడు ఏకాగ్రతతో మంత్రం జపించగానే ఆ మంత్ర ప్రభావంతో మాయ ఆకాశం పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయి ఒక్కసారిగా కూలిపోయింది.
(22:19) కమలాకరుడు అతనితో పాటు కొద్దిగా మిగిలిన సైన్యం కూడా దాని కింద పడి చనిపోయారు. ధీరసింహుడు తన అనుచరులతో కలిసి ఆనందంగా కోటలోకి ప్రవేశించగానే అక్కడ ఎన్నో అద్భుతమైన బంగారు మేడలు, అందమైన పూల తోటలు కనిపించాయి. అంతేకాకుండా అక్కడున్న బజార్లో దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు [సంగీతం] కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువులను అమ్మడానికి అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదు.
(22:45) [సంగీతం] ధీరసింహుని అనుచరులు తీవ్రమైన ఆకలితో ఉండటంతో కంటికి ఆకర్షణీయంగా కనిపించిన మిఠాయి దుకాణాల పైకి ఎగబడ్డారు. కానీ కొద్దిసేపటికే వారందరికీ కళ్ళు తిరిగి ఒక్కొక్కరుగా కింద పడిపోయారు. వారి పరిస్థితిని చూసిన ధీరసింహుడు అర్థమైంది. ఈ మిఠాయిలు తినడం వలనే వీళ్ళు ఇలా పడిపోయి ఉండాలి. ఇవి బహుశా మాయ మిఠాయిలు కావచ్చు అని అనుకొని దగ్గరలో ఉన్న ఒక కొలనులో నుంచి నీళ్లు తీసుకొచ్చి వాటిపై మంత్రం జపించి ఆ మంత్ర జలాన్ని వారిపై చల్లగానే అందరికీ స్పృహ వచ్చింది.
(23:14) నిద్ర నుంచి ఒక్కసారిగా మేల్కొన్న వారిలా అందరూ వెంటనే లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలాన్ని చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు గుర్తుకైనా కనిపించకుండా పూర్తిగా నాశనమయ్యాయి. ధీరసింహుడు తానిచ్చిన మాట ప్రకారం సుధాకరునికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత పర్వతం దగ్గర ఉన్న కొలను వద్దకు వెళ్లి ఆ కన్యల కలలు వేలాడుతున్న చెట్టు దగ్గరకు చేరుకున్నాడు.
(23:41) అక్కడ కూర్చొని కొంతసేపు మంత్రం జపించగానే అక్కడ ఉన్న కొలను చెట్టు రెండు మాయమైపోయాయి. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిలబడి ఉన్నారు. అతను కమలాకరుని కూతురితో అమ్మాయి [సంగీతం] నీ తండ్రి చాలా దుర్మార్గుడు నిన్ను మాత్రమే కాకుండా ఏ తప్పు చేయని ఎంతో మంది అమాయకులను కూడా కారణం లేకుండా హింసించాడు. అందుకే అతన్ని చంపాల్సి వచ్చింది.
(24:02) ఇక నీ కష్టాలన్నీ ముగిసిపోయాయి. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించు అని చెప్పి వారందరినీ కోటకు తీసుకెళ్ళాడు. ఆ మాంత్రికుడి కూతురు సుధాకరు తన భర్తగా ఎంచుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించింది. అప్పటినుంచి ఆ నదిలోని నీరు మామూలు నీటిలా స్వచ్ఛంగా ఉండటం మొదలు పెట్టింది. ధీరసింహుడు తనకు మంత్రం నేర్పించిన గురువు దగ్గరకు వెళ్లి సెలవు తీసుకొని సులోచన నివసిస్తున్న నగరానికి బయలుదేరాడు.
(24:28) అతను తిరిగి వచ్చిన విషయం తెలియగానే సులోచన రెండు కుర్చీలు వేయించి ధీరసింహుడిని ఎంతో గౌరవంగా ఆహ్వానించింది. అతను నెమ్మదిగా తాను చూసి వచ్చిన విషయాలన్నీ వివరంగా చెప్పగా ఆమె సంతోషించి అవును ఇప్పుడు ఆ నదిలోని నీరు ఎర్రగా కాకుండా స్వచ్ఛంగా మారినట్లు నాకు కూడా తెలిసింది. నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజమే అని ఒప్పుకొని రేపు నా మూడవ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుడిని పంపించింది.
(25:00) [సంగీతం] [సంగీతం] రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు దగ్గరకు వెళ్లి నీ మూడవ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన ఇక్కడి నుంచి దక్షిణ దిక్కున 100 యోజనాల దూరంలో ఒక స్మశానం ఉంది. అక్కడి నుంచి ప్రతి శుక్రవారం రాత్రిపూట అయ్యో ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినిపిస్తోంది దాని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటో పూర్తి వివరాలతో నాకు చెప్పాలి అని చెప్పింది.
(25:33) సరేనని చెప్పిన ధీరసింహుడు సులోచన దగ్గర కొంత గడువు తీసుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. అతను ఒక కాలి బాటలో చాలా దూరం నడుస్తూ వెళ్లి బాగా అలసిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చోట కూర్చోబోతుండగా దగ్గరలోనే ఒక నగరం కనిపించింది. తనలో మిగిలిన శక్తినంతా కూడగట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరానికి చేరుకున్నాడు.
(25:57) అతను నగరంలో అడుగు పెట్టగానే ఇద్దరు సైనికులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వారిని చూస్తే మనలాంటి మనుషుల్లాగాను లేరు రాక్షసుల్లాగాను లేరు. దేవలోకానికి చెందిన ఏదో వింత జాతి వారిలా కనిపించారు. సైనికులారా నేను ఏ తప్పు చేశానని నన్ను పట్టుకుంటున్నారు నేను నా పని మీద వెళ్తూ ఈ నగరం మధ్య నుంచి వెళ్ళాల్సి వచ్చింది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంటూ ధీరసింహుడు బతిమాలాడు.
(26:21) కానీ వారు అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా తమ రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజ్యసభలో రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. రాజు ఏదో తీవ్రమైన బాధతో బాధపడుతున్నట్లు ధీరసింహుడు గమనించాడు. సైనికులను చూడగానే రాజు ఇతనెవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని విసుగ్గా ప్రశ్నించాడు. అందుకు సైనికులు మహాప్రభు ఇతను మన నగరంలోకి అడుగుపెట్టిన పరాయి దేశస్తుడు.
(26:51) మన దేశ నియమం ప్రకారం ఇతన్ని ఉరితీయడానికి తీసుకొచ్చాము అనగానే మహారాజు ఏమి మాట్లాడకుండా తలవంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు అక్కడి పరిస్థితినఅంతా ఒక్క క్షణంలో అర్థం చేసుకుని మహారాజా మీరు భరించలేని ఏదో బాధను అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు అనుమతిస్తే ఒక్క వారంలోనే మీ బాధను నయం చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను మీతోనే ఉండి మీలో కనిపించే కొన్ని లక్షణాలను పరిశీలించాలి.
(27:16) దానికి మీరు అంగీకరిస్తే ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అని చెప్పాడు. రాజు ఎంతో సంతోషించి వెంటనే దానికి అంగీకరించాడు. తెలివైన ధీరసింహుడు రెండు రోజుల పాటు రాజు దగ్గరే ఉండి ఆయన అలవాట్లన్నింటిని జాగ్రత్తగా గమనించాడు. కానీ ఆయన బాధకు కారణం ఏమిటో మాత్రం తెలుసుకోలేకపోయాడు. మూడవ రోజున అతనికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది.
(27:42) ఆ రోజు అందరితో కలిసి రాజు భోజనం చేస్తుండగా మధ్యలో ధీరసింహుడు మహారాజా మీ పిడికిల్లిని తెరవండి అని చెప్పాడు. రాజు పిడికిలి తెరిచి చూడగా తన చేతిలో అన్నం మెతుకులకు బదులుగా చిన్న చిన్న రాళ్లుు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు మహారాజా ఇన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న బాధకు కారణం ఇప్పుడు అర్థమైందా? అందరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు వడ్డింపులో పక్షపాతం చూపించకూడదు అది చాలా పెద్ద పాపం మీకు ఇష్టమైతే ఒంటరిగా కూర్చుని మీకు నచ్చిన రుచికరమైన పదార్థాలను తినవచ్చు కానీ అందరితో కలిసి కూర్చున్నప్పుడు మీరు మాత్రమే మంచి పదార్థాలు తింటూ మిగిలిన
(28:20) వారికి చవకైన పదార్థాలు వడ్డించేలా చేయడంతో ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంది. అందుకే మీరు తినే రుచికరమైన పదార్థాలన్నీ ఇలా రాళ్లుుగా మారి మిమ్మల్ని బాధిస్తున్నాయి. నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వడ్డించండి లేదా మీరు ఒక్కరే వేరుగా కూర్చొని భోజనం చేయండి.
(28:48) అలా చేస్తే ఈ పాపం మిమ్మల్ని అంటదు. మీ బాధ కూడా ఉండదు అని చెప్పగానే రాజు అతను చెప్పినట్లే చేసి చూశాడు. ధీరసింహులు చెప్పినట్లుగానే రాజు బాధ పూర్తిగా నయమైంది. ఇహలోకంలోనూ పరలోకంలోనూ మేలు కలిగించే ఈ సలహాకు రాజు ఎంతో సంతోషించి ధీరసింహున్నని తన రాజ్యసభలోనే ఉండిపోవాలని బ్రతిమాలాడు. కానీ ధీరసింహుడు దానికి ఒప్పుకోలేదు.
(29:18) అయితే మీకు కావలసిన వరాన్ని కోరుకొని నన్ను సంతోష పెట్టండి అంటూ రాజు భక్తితో అడగగానే ధీరసింహుడు ప్రభువు మీ రాజ్యంలోకి అడుగుపెట్టిన పరాయి దేశస్తులను ఏ కారణము లేకుండా ఉరితిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చట్టం ఎంత తెలివి తక్కువ పని ఎంత అనాగరికమైన పద్ధతి ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి ఈ క్రూరమైన నిర్ణయాన్ని రద్దు చేస్తే అదే నాకు 10వేల వరాలతో సమానం నాకోసం ఇంతకంటే ఎక్కువగా కోరుకోవలసింది ఏమీ లేదు [సంగీతం] అని మనసులోని మాటను చెప్పగానే రాజు తాను చేసిన తప్పుకు సిగ్గుపడి అర్థం లేని ఆ క్రూరమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయించాడు.
(29:59) రాజులో వచ్చిన ఈ మంచి మార్పుకు సంతోషించిన ధీరసింహుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పాపం అతను మండుతున్న ఎండలో రోజుల తరబడి ప్రయాణం చేసి కనీసం నీళ్లు కూడా దొరకని ఒక భయంకరమైన ఎడారిలోకి చేరుకున్నాడు. ఆ పెద్ద ఎడారిలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన ఇసుక తుఫాను మొదలైంది. ఆ తుఫానులో వేగంగా వీచిన గాలికి అతను చాలా దూరం కొట్టుకుపోయి దక్షిణ దిక్కున ఉన్న ఒక చెట్టు కింద పడిపోయాడు.
(30:32) అతను అమ్మయ్య అనుకుంటూ తన కాళ్ళు చేతులు సరిచేసుకుంటుండగా దగ్గరలో నుంచే అయ్యో ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి సంగతి తర్వాత చూసుకోవచ్చని అనుకొని ధీరసింహుడు ఓహో నేను తెలుసుకోవలసిన కేక ఇదే అనిపిస్తోంది. నేను చేరుకోవలసిన ప్రదేశం కూడా ఇదే అయి ఉండాలి అని నిర్ణయించుకొని వెంటనే ఆ కేక వినిపించిన దిక్కుగా నడవడం మొదలుపెట్టాడు.
(31:01) అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద స్మశానం అందులో ఎన్నో సమాధులు కనిపించాయి. ఆ సమాధులలో ఒకదాని నుంచి ఆ కేక వినిపించిందని ధీరసింహుడు తన తెలివితో గుర్తించాడు. తాను అనుకున్నది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక సమాధి వెనక దాక్కొని అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ నిలబడ్డాడు. ఇంతలో గడియారం టంగ్ టంగ్ మంటూ 12 గంటలు కొట్టగానే సమాధుల మీద ఉన్న మూతలన్నీ తెరుచుకొని చనిపోయిన వారందరూ బయటకు వచ్చి నిలబడ్డారు.
(31:32) వారందరూ ఎంతో విలువైన వస్త్రాలను ధరించి ఉన్నారు. [సంగీతం] వారి దగ్గర నుంచి మంచి పరిమళం వెదజల్లుతోంది. వారి వేషధారణను చూస్తే వారందరూ ధనవంతులని చెప్పకుండానే అర్థమవుతోంది. ఆ తర్వాత వారందరూ వరుసలుగా కూర్చున్నారు. కానీ వారందరిలో ఒక్క వ్యక్తి మాత్రం మురికిగా ఉన్న చిరిగిపోయిన పాత బట్టలు ధరించి చాలా దరిద్రుడిలా కనిపిస్తున్నాడు.
(31:56) అతన్ని చూసి ధీరసింహునికి జాలి కలిగింది. చనిపోయిన వారందరూ వరుసగా కూర్చోగానే రకరకాల రుచికరమైన వంటకాలతో నిండిన బంగారు పళ్లాలు వాటంతటా అవే ఒక్కొక్కరి ముందు ప్రత్యక్షమయ్యాయి. అక్కడున్న [గురకలు] ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పళ్ళెం సరిపోగా అదరంగా మరొక పళ్ళం మిగిలి ఉంది. ఆ పళ్ళెం వైపు చేయి చూపిస్తూ చనిపోయిన వారిలోని ఒక వృద్ధుడు ధీరసింహ ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు చేయబడింది.
(32:30) వచ్చి కూర్చుని భోజనం చేయి అని చెప్పాడు. [సంగీతం] సరేనంటూ ధీరసింహుడు ఆ పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి చుట్టూ చూశాడు. అందరి ముందు ఉన్న పళ్లాలలో రకరకాల రుచికరమైన వంటకాలు ఉన్నాయి. కానీ ఆ దరిద్రుడి ముందు ఉన్న పళ్ళెంలో మాత్రం రాళ్లుు ఉన్నాయి. అందరి గిన్నెలలోనూ రుచికరమైన తెల్లటి పాలు ఉండగా అతని గిన్నెలో మాత్రం దుర్వాసన వస్తున్న మురికి నీళ్లు ఉన్నాయి.
(32:55) అందరూ ఎంతో రుచిగా భోజనం చేస్తుండగా అతను మాత్రం దేవుడా అంటూ కళ్ళు నలుపుకుంటూ బాధగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ధీరసింహుడు తన పక్కన ఉన్న వ్యక్తితో ఏమయ్యా ఇదేం న్యాయం మనతో కలిసి భోజనం చేస్తున్న ఒక వ్యక్తి విషయంలో ఇలా పక్షపాతం చూపించడం ధర్మమేనా అని అడగగానే అతను అయ్యా ఇది దేవుడి ఆజ్ఞ దానిని మార్చడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పాడు.
(33:24) ఈ రహస్యం ఏమిటో ఎలాగైనా తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనం ముగించి చేతులు కడుక్కుంటున్న సమయంలో ధీరసింహుడు వేగంగా ఆ దరిద్రుడు దగ్గరికి వెళ్లి మిత్రమా నువ్వఎవరు నీకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఏమిటి అని అడగగానే అతను [సంగీతం] అయ్యో ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ పెద్దగా కేక పెట్టి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
(33:53) అయ్యా ఇక్కడి నుంచి 10 యోజనాల దూరంలో ఉన్న వికాస నగరంలో నేను [సంగీతం] ఒక గొప్ప వ్యాపారిని నేను ఎంతో ధనం సంపాదించి కోట్లకు అధిపతినఅయ్యాను. కానీ నా జీవితంలో ఒక్కసారి కూడా ఎవరికీ దానం చేయలేదు. కనీసం పిల్లికి కూడా ఒక్క మెతుకు పెట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వారందరూ ఒకప్పుడు నా దగ్గర పని చేసిన పని వాళ్ళు.
(34:17) నేను వారి చేత కష్టపడి పని చేయించుకొని వారికి సరైన జీతాలు ఇవ్వకుండా హింసించి ఎన్నో ఇబ్బందులు పెట్టాను. కానీ వారు తమకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంలోనే దానధర్మాలు చేస్తూ దేవుని తలుచుకుంటూ జీవించారు. అందుకే ఇప్పుడు ఈ లోకంలో వారు సుఖంగా జీవిస్తున్నారు. నేను చేసిన పాపాల కారణంగా నా దగ్గర పని చేసిన వారి ముందే నేను ఇలాంటి నీచమైన జీవితం గడపాల్సి వచ్చింది.
(34:43) నేను చేసిన పాపాల కారణంగా నా ముగ్గురు కుమారులు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ విధి నగరంలో అడుక్కొని జీవించాల్సిన దుస్థితికి చేరుకున్నారు. అతని కథ విన్న వెంటనే ధీరసింహుడు అయితే నువ్వు సంపాదించిన ధనమంతా ఏమైంది? నీకు ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గం ఏదీ లేదా అని ఆత్రంగా ప్రశ్నించాడు. అందుకు అతను నువ్వు నాపై దయతో అడుగుతున్నావు కాబట్టి నిజం చెబుతున్నాను.
(35:14) నా ధనమంతా నా ఇంటి పెరట్లో తూర్పు వైపు ఉన్న ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో ఒక గొయ్యి తవ్వి పాతి పెట్టాను. ఈ రహస్యాన్ని నా కుమారులకు చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఎవరైనా పుణ్యాత్ముడు విడిసా నగదానికి వెళ్లి నేను సంపాదించిన ఆ పాపపు ధనాన్ని నాలుగు భాగాలుగా చేసి అందులో మూడు భాగాలను ధర్మ కార్యాలకు ఉపయోగించి మిగిలిన ఒక భాగాన్ని నా వ్యాపారి ముగ్గురు కుమారులకు సమానంగా పంచిపెడితే నాకు మంచి లోకాలు లభిస్తాయి.
(35:44) అప్పుడు నేను కూడా నా పనివాళ్ళతో కలిసి స్వర్గ సుఖాలు అనుభవించగలను అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు ఎంతో కష్టపడి విడిసా నగరానికి చేరుకొని ఆ వ్యాపారి ఇంటిని కనుక్కొని అతనికంటే కూడా తీవ్రమైన దరిద్రంలో జీవిస్తున్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగానే 20 సంవత్సరాల క్రితమే చనిపోయిన మా తండ్రి నీకు కనిపించడం ఏమిటి? నువ్వు ఆయన దగ్గర నుంచి రావడం ఏమిటి? చాలా వింతగా ఉందే అంటూ వారు ఎగతాళిగా మాట్లాడారు.
(36:17) అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన విషయాలను గుర్తులను వివరించి వారిని పెరట్లోకి తీసుకెళ్లి అక్కడ వెతికించాడు. పాతి పెట్టిన ధనం కనిపించగానే వారు ధీరసింహుడు చెప్పిన మాటలన్నీ నిజమేనని నమ్మారు. ఆ తర్వాత ధీరసింహుడు వ్యాపారి చెప్పినట్లుగా ఆ ధనంలో మూడు భాగాలను ధర్మ కార్యాలకు ఉపయోగించి మిగిలిన ఒక భాగాన్ని వ్యాపారి ముగ్గురు కుమారులకు సమానంగా పంచిపెట్టాడు.
(36:41) ఆ క్షణం నుంచి ఆ ముగ్గురు కుమారుల దరిద్రం తొలగిపోయి వారు సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు. ధీరసింహుడు తిరిగి స్మశానానికి వెళ్లి చూడగా ఆ వ్యాపారి ఇప్పుడు మిగిలిన మృతులందరితో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు. అతను ధీరసింహుడిని చూడగానే తనకు చేసిన సహాయానికి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అతన్ని ఆశీర్వదించాడు.
(37:06) ధీరసింహుడు ఆ వ్యాపారి దగ్గర సెలవు తీసుకొని తిరిగి కౌసాంభి నగరానికి చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవంగా కూర్చోబెట్టి అతను చెప్పిన విషయాలన్నింటిని ఎంతో శ్రద్ధగా విన్నది. చివరకు ఆమె నువ్వు చెప్పినదంతా నిజమే ఈ శుక్రవారం ఆ కేక కూడా వినిపించలేదు. నీ తెలివితేటలు ధైర్య సాహసాలు చూసి ఎంతో సంతోషించాను. రేపు వచ్చి నా నాలుగవ ప్రశ్న ఏమిటో తెలుసుకో అని చెప్పి [సంగీతం] ధీరసింహుడిని పంపించింది.
(37:37) [సంగీతం] మరుసటి రోజు ధీరసింహుడు సులోచన దగ్గరకు వెళ్ళగానే ఆమె అతనికి తగిన మర్యాదలు చేసి కూర్చోబెట్టి తన ప్రశ్నను చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయ స్నానాల గది ఉంది. అది ఎలా ఏర్పడింది దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో నాకు తెలుసుకొని చెప్పాలి అని చెప్పగానే ధీరసింహుడు ఎప్పటిలాగే కొంత గడువు తీసుకొని నైరుతి దిక్కుగా బయలుదేరాడు.
(38:12) కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం [సంగీతం] పొలిమేర దాటగానే అతనికి ఒక బావి కనిపించింది. ఆ బావి దగ్గర ఎంతో దుఃఖంగా ఉన్న ఒక ముసలి దంపతులు వారి చుట్టూ గుమి గూడిన చాలా మంది జనం కనిపించారు. అక్కడ ఏం జరిగిందో ధీరసింహుడు వారిని అడగగానే అయ్యా ఈ ముసలి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు వారం రోజుల క్రితం పాపం అతనికి పిచ్చి పట్టినట్లు అయ్యి ఒక్కసారిగా ఈ బావిలోకి దూకేశాడు.
(38:42) పోనీ అతను చనిపోయాడని అనుకుందాం అంటే ఇప్పటివరకు అతని శవం కూడా పైకి తేలలేదు. అందుకే ఈ ముసలి వాళ్ళు నిద్రాహారాలు మానేసి ఇలా ఏడుస్తున్నారు అని అక్కడున్న వాళ్ళు చెప్పారు. ధీరసింహుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వృద్ధులతో మీరు బాధపడకుండా ఇక్కడే వేచి ఉండండి. ఒక్క క్షణంలో మీ కొడుకుని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు.
(39:06) అతని సాహసాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అతను బావిలోకి దూకి చాలా లోతుకు వెళ్ళిన తర్వాత అతని కాళ్ళకు నేల తగిలింది. ధీరసింహుడు అక్కడ ఆగి చుట్టూ చూడగా ఒక రహస్య ద్వారం కనిపించింది. ఆ ద్వారం గుండా వెళ్లి అతను ఒక పూల తోటకు చేరుకున్నాడు. ఆ [సంగీతం] తోటలో ఒక అద్భుతమైన భవనం కనిపించగానే అతను ధైర్యంగా ఆ భవనంలోకి ప్రవేశించాడు.
(39:33) ఆ భవనం మధ్యలో ఒక పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంంతా ప్రకాశవంతమైన మణి దీపాలతో వెలిగిపోతోంది. అక్కడ చాలా మంది దేవతా స్త్రీలు కూర్చొని ఉన్నారు. వారి మధ్యలో నక్షత్రాల మధ్య చంద్రుడిలా అపురూపమైన అందంతో ఒక రాజకుమారి ఆమె పక్కన ఎంతో అందంగా ఉన్న ఒక యువకుడు కూర్చొని ఉన్నారు. ఆ రాజకుమారి దేవతా స్త్రీ కానీ ఆ యువకుడు మాత్రం మానవుడు. ఈ యువకుడే ఆ ముసలి దంపతుల కొడుకై ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించాడు.
(40:04) ఆ యువకుడిని పేరు పెట్టి పిలిచి అబ్బాయి నీ తల్లిదండ్రులు నీకోసం ఒకటే ఏణస్తూ బాధపడుతుంటే నువ్వు ఇక్కడ ఇలా విలాసంగా కాలం గడపడం న్యాయమేనా అని అడగగానే ఆ యువకుడికి తన తల్లిదండ్రుల సంగతి గుర్తుకొచ్చి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు ఆ ముసలి తల్లిదండ్రుల దుస్థితిని ఎంతో జాలి కలిగించేలా వివరించి చెప్పగానే రాజకుమారి మనసు కరిగిపోయింది.
(40:30) ఆ యువకుడు తన తల్లిదండ్రులను చూసి రావడానికి అనుమతించింది. ధీరసింహుడు ఆ యువకుడిని వెంట తీసుకొని వస్తూ అబ్బాయి అసలు నువ్వు ఈ బావిలోకి ఎందుకు దూకావు అని అడగగానే అతను ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ఒకరోజు నేను ఈ బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చి పట్టినట్లు అయింది.
(40:53) వారిని చూడకుండా ఉండలేక ఒకరోజు ఈ బావిలోకి దూకేశాను అని ఆ యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకొచ్చి అతని తల్లిదండ్రులకు అప్పగించాడు. బ్రతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూసుకున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. తమకు కొడుకును తిరిగి ఇచ్చిన ధీరసింహుడిని వారు ఎంతో పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన దారిలో బయలుదేరి వెళ్తుండగా మరో పట్టణం కనిపించింది.
(41:26) అక్కడ మాయస్నానాల గది గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదు అని మాత్రమే చెప్పారు. కానీ చివరకు ఒక వృద్ధుడు ధీరసింహుడిని చూసి నాయనా ఆ స్నానాల గదికి వెళ్ళిన వారిలో ఒక్కరు తిరిగి రాలేదు. అందుకే ఆ పట్టణపు రాజు ఆ గదిలోకి ఎవరూ వెళ్ళకుండా కాపలా పెట్టించాడు. అనవసరంగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు నా మాట విని వెనక్కి తిరిగి వెళ్ళు అని చెప్పాడు.
(41:52) ధీరసింహుడు ఏమాత్రం భయపడకుండా ఆ ప్రదేశానికి వెళ్లే దారి చెప్పకపోతే తాను వెళ్ళనని పట్టుబడ్డాడు. చేసేది లేక ఆ వృద్ధుడు మాయస్నానాల గది ఉన్న పట్టణానికి వెళ్లే దారిని చెప్పాడు. వృద్ధుడు చెప్పిన దారిలోనే వెళ్లి ధీరసింహుడు ఆ పట్టణానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు ప్రతిరోజు ఒక్కో రకమైన వింత బహుమతిని తీసుకుని వెళ్లి ఆ రాజుకు అందించేవాడు.
(42:21) ఆ బహుమతులను చూసి రాజు ఎంతో సంతోషించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాజు ధీరసింహునితో ప్రతిరోజు నువ్వే నాకు ఎన్నో బహుమతులు ఇస్తున్నావు కానీ నన్ను ఎప్పుడూ ఏమి అడగడం లేదేమిటి అని అడగగానే ధీరసింహుడు నేను కోరినది తప్పకుండా నెరవేరుస్తారా అని అడిగాడు. అందుకు రాజు ఏమాత్రం సందేహించకుండా అడుగు నా రాజ్యాన్ని కోరినా ఇస్తాను.
(42:47) చివరకు నా ప్రాణాలు అడిగినా అర్పిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాట తీసుకున్న ధీరసింహుడు అయితే మహారాజా ఆ మాయ స్నానాల గదిలోకి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు. పాపం రాజు ఇబ్బందిలో పడిపోయాడు. ధీరసింహుడు అక్కడికి వెళ్ళడం రాజుకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ తాని ఇచ్చిన మాటను తప్పడానికి కూడా వీలు లేదు. నీకు ఈ సలహా ఏ పాపాత్ముడు చెప్పాడో తెలియదు.
(43:12) ఆ మాయలో చిక్కుకున్న వారిలో ఒక్కరు తిరిగి రాలేదు. అందుకే ఇది తప్ప మరేదైనా కోరుకో అంటూ ఎన్నో విధాలుగా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ధీరసింహుడు వినలేదు. [సంగీతం] చివరకు చేసేది లేక రాజు బాధపడుతూనే ఒక అనుమతి పత్రం రాసిచ్చాడు. ఆ పత్రాన్ని తీసుకుని ధీరసింహుడు మాయ స్నానాల గది దగ్గరకు వెళ్ళాడు. ఆ ద్వారం దగ్గర ఒక పలకపై ఈ మాయలో చిక్కుకున్న వారిలో ఒక్కరు తిరిగి రాలేదు అని రాసి ఉంది.
(43:44) [సంగీతం] అక్కడ చాలా మంది కాపలాదారులు నిలబడి ఉన్నారు. వారు కూడా ధీరసింహుడిని ఎన్నో విధాలుగా ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు చేసేది లేక వారు తలుపులు తెరిచి ధీరసింహుడిని లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి అడుగు పెట్టగానే తలుపులు పెద్ద శబ్దంతో వాటంతటవే మూసుకుపోయాయి. అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తలుపులు లేవు గోడలు లేవు.
(44:11) మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మంగళ అతని ఎదురుగా వచ్చి ధీరసింహుడిని ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టెలో చల్లని నీళ్లు వేడి నీళ్ళు కలిపి రెండు చెంబులు నీళ్లు ధీరసింహునిపై పోసి అతని శరీరాన్ని తోమాడు. మూడవ చెంబు నీళ్లుు పోయగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి చుట్టూ చీకటి కమ్ముకుంది.
(44:37) ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మంగలి తొట్టే చెంబు అన్ని [సంగీతం] మాయమైపోయాయి. కానీ అక్కడున్న నీళ్లు మాత్రం క్రమంగా పెరుగుతూ ధీరసింహుని గొంతు వరకు వచ్చాయి. ఇదేమిటి భగవంతుడా అని అతను బాధపడుతుండగా గది పై తప్పు నుంచి వేలాడుతున్న ఒక గొలుసు కనిపించింది. ఒక్కసారిగా ఎగిరి ఆ గొలుసును పట్టుకొని బలంగా లాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దం వచ్చి చుట్టూ దట్టమైన చీకటి కమ్ముకుంది.
(45:08) ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆ గది కూడా లేదు నీళ్లు కూడా లేవు అతను ఒక కాళీ బంజరు నేలపై నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత దూరం నడిచినా ఆ ప్రదేశానికి అంతు కనిపించలేదు. అతనికి విపరీతంగా ఆకలి వేసింది. దగ్గరలో కొన్ని పండ్లు చెట్లు కనిపించడంతో వాటి పండ్లు కోసుకొని తిన్నాడు. కానీ ఎంత తిన్నా అతని ఆకలి మాత్రం తీరలేదు.
(45:34) అలాగే కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ [సంగీతం] వేల సంఖ్యలో రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. వాటిలో ప్రాణం లేకపోయినా చూడటానికి అచ్చంగా మనుషుల్లాగే ఉన్నాయి. ఆ మండపానికి ఎదురుగా ఉన్న ఒక రాతి అరుగుపై ఒక విల్లు బాణాలతో నిండిన అంబుల పొది కనిపించాయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్లి చూడగా దాని పైకప్పుకు ఒక పంజరం వేలాడుతూ ఉంది.
(46:02) ఆ పంజరంలో ఐదు రంగుల అందమైన రామ చిలుక ఉంది. దాని దగ్గర ఉన్న ఒక రాతి పలకపై ఇలా రాసి ఉంది. 1000 సంవత్సరాల క్రితం శ్రీహర్ష మహారాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక కొండ దగ్గర ఆయనకు అపురూపమైన జీవమణి దొరికింది. అలాంటి మణి ఈ భూమి మీద ఇంకెక్కడా లేదు. ఆయన చనిపోవడానికి ముందు ఆ మణిని ఈ చిలుక చేత మింగించి చిలుకను ఒక పంజరంలో బంధించాడు.
(46:30) తర్వాత ఈ మాయా స్నానాల గదిని సృష్టించి చిలుకను ఈ స్నానాల గదిలో ఉంచాడు. ఈ మాయను ఛేదించి ఆ మణిని పొందడానికి ఒక్కటే మార్గం ఉంది. రాతి అరుగుపై ఉన్న విల్లుకు బాణం ఎక్కించి మూడు ప్రయత్నాల లోపు చిలుక ఎడమ కంటికి తగిలించాలి. అలా చేయలేని వ్యక్తి వెంటనే రాతి విగ్రహంగా మారిపోతాడు. అది చదివిన ధీరసింహుడు చుట్టూ పడి ఉన్న రాతి విగ్రహాలను చూసేసరికి అక్కడ ఏం జరిగిందో పూర్తిగా అర్థమైంది.
(46:59) ఈ మాయలో చిక్కుకుని ఆకలి దాహంతో ఎలాగైనా చనిపోవాల్సిందే. అలాంటప్పుడు నా అదృష్టం ఎలా ఉందో ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకొని ధీరసింహుడు విల్లుకు బాణం ఎక్కించి గురి చూశాడు. బాణం తగలబోతుండగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని శరీరం మోకాళ్ళ వరకు రాయిగా మారిపోయి అతని కాళ్ళు కదలకుండా పోయాయి. ఎంతో కష్టపడి రెండవ బాణం వదిలాడు కానీ అది కూడా గురు తప్పింది.
(47:27) [సంగీతం] దాంతో అతని శరీరం నడుము వరకు రాయిగా మారిపోయింది. అయినా అతను పట్టు వదలకుండా మూడవసారి బాణం వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లి చిలుక ఎడమకంటికి తగిలింది. బాణం తగలగానే ఆ చిలుక పంజరం నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని మెరుపులు ఉరుములతో విపరీతంగా వర్షం కురవడం మొదలయింది. మొదట ధీరసింహుడు ఇక అంతే నేను కూడా పూర్తిగా రాతి విగ్రహంగా మారిపోయాను అని అనుకున్నాడు.
(48:00) కానీ కొద్దిసేపటి తర్వాత ఆ శబ్దాలన్నీ తగ్గిపోయాయి. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ స్నానాల గది చిలుక అన్ని మాయమైపోయాయి. కొంత దూరంలో మాత్రం ఒక మణి ఎంతో ప్రకాశంగా మెరుస్తూ కనిపించింది. ధీరసింహుడు పరిగట్టుకుంటూ వెళ్లి ఆ మణిని తీసుకొని ఒక్కొక్క రాతి విగ్రహానికి తాకించగానే వాటన్నింటికీ మళ్ళీ మామూలు రూపం వచ్చింది. ఆ మనుషులందరూ ధీరసింహుని చుట్టూ చేరారు.
(48:29) ఇన్ని సంవత్సరాల తర్వాత తమకు విముక్తి కలిగించిన ధీరసింహుని వారు ఎన్నో విధాలుగా పొగిడారు. ధీరసింహుడు వారందరినీ వెంట తీసుకొని వెళ్లి ఆ పట్టణపు రాజుకు జరిగిన విషయమంతా వివరించాడు. అది విన్న రాజు కూడా ధీరసింహుని సాహసం, పట్టుదల, ఇతరులకు సహాయం చేసే మనసు చూసి ఎంతో సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి ఎన్నో బహుమతులు ఇచ్చి ఘనంగా సన్మానించి, సులోచన ఉన్న నగరానికి తన సైనికులను తోడుగా పంపించాడు.
(48:59) ధీరసింహుడు తిరిగి వచ్చిన విషయం తెలియగానే సులోచన అతనికి తగిన మర్యాదలు చేసి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా ఎంతో శ్రద్ధగా విన్నది. చివరకు ఆమె ధీరసింహ ఆ మాయ స్నానాల గది గురించి నువ్వు తెలుసుకొని వచ్చిన అద్భుతమైన కథ అంతా నిజమే నీ వల్ల శాపం నుంచి విముక్తి పొందిన వారందరూ నీ గొప్పతనాన్ని దేశాలకు తీసుకెళ్లి చెబుతున్నారు.
(49:23) అసలు ఈ మాయను సృష్టించిన ఆ పట్టణపు రాజునే నువ్వు నీ తెలివితో మెప్పించగలిగావు. [సంగీతం] ఇంతవరకు అంతా బాగానే జరిగింది. నువ్వు రేపు మళ్ళీ వస్తే నా చివరిదైన ఐదవ ప్రశ్నను చెబుతాను అని చెప్పి సులోచన ధీరసింహుని పంపించింది. [సంగీతం] మరుసటి రోజు ధీరసింహుడు సులోచన దగ్గరకు వచ్చి నీ తర్వాత ప్రశ్న ఏమిటి? అని అడిగాడు.
(50:00) సులోచన అతనికి మర్యాద చేసి కూర్చోబెట్టి ధీరసింహ ఇక్కడి నుంచి ఈశాన్య దిక్కున శబ్దభేది అనే ఒక పర్వతం ఉందట. ఆ పర్వతం లోపల ఏ వింత దాగి ఉందో దాని అవతల ఏ దేశం ఉందో తెలుసుకొని రావాలి. ఇదే నా చివరి ప్రశ్న అని చెప్పింది. [సంగీతం] ధీరసింహుడు మునుపటిలాగే ఆమె దగ్గర కొంత గడువు తీసుకొని ఈశాన్య దిక్కుగా బయలుదేరాడు. చాలా దూరం నడిచిన తర్వాత ధీరసింహుడు ఒక వింత దేశంలోకి ప్రవేశించాడు.
(50:29) ఆ దేశంలో ఎక్కడ చూసినా ఒక్క సమాధి కానీ స్మశానం కానీ అతనికి కనిపించలేదు. ఈ వింతకు ఆశ్చర్యపోతూ ముందుకు వెళ్లి చివరకు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికి [సంగీతం] ధీరసింహునికి విపరీతంగా ఆకలి వేస్తుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఎదురుగా ఉన్న ఒక ఇంటి నుంచి ఒక గృహస్తుడు బయటకు వచ్చి అతని క్షేమ సమాచారాలు అడిగి ఎంతో ఆదరంగా తన ఇంటికి అతిథిగా తీసుకెళ్ళాడు.
(50:54) భోజనం వడ్డించారు. ఇద్దరు భోజనం చేస్తుండగా ఆ గృహస్తుడు ధీరసింహునితో మీ దేశంలో మీరు ఎన్నో రకాల వంటకాలు తిని ఉంటారు. కానీ ఈ పదార్థాన్ని మాత్రం ఎప్పుడూ రుచి చూసి ఉండరు అంటూ అతని విస్తరిలో ఉన్న ఒక వైపున ఉన్న పదార్థాన్ని వేలితో చూపించాడు. అయితే అది ఏమిటి? అని ధీరసింహుడు ఆశ్చర్యంగా అడిగాడు. అది నరమాంసం అని గృహస్తుడు చెప్పగానే ధీరసింహుడు పాపాత్ములారా మీ దేశంలో ఇలాంటి ఘోరమైన పనులు చేస్తారా అని కోపంతో లేచి వెళ్ళబోయాడు.
(51:24) అప్పుడు ఆ గృహస్తుడు అతన్ని శాంతింపజేస్తూ అయ్యా జబ్బు పడిన వారిని ముసలివారిని చంపి తినేయడు మా దేశపు ఆచారం అందుకే మీకు ఇక్కడ అలాంటి వారు ఎవ్వరు కనిపించరు. మీకు ఈ పదార్థం ఇష్టం లేకపోతే తినకండి అని చెప్పి అతనికి పాలు పండ్లు మరికొన్ని శాఖహార పదార్థాలు తెప్పించి పెట్టాడు. ఆ గృహస్తులు చెప్పిన విషయం విన్న తర్వాతే ఆ దేశంలో ఒక్క స్మశానం కానీ సమాధి కానీ ఎందుకు కనిపించలేదో ధీరసింహునికి అర్థమయింది.
(51:55) అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణ ప్రజలను శద్దభేది పర్వతం గురించి అడగగా ఇంకా 10 కోసులు దూరం వెళ్ళాలి అని చెప్పారు. సరేనని మళ్ళీ బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి మరో పట్టణం కనిపించింది. అక్కడ కూడా ఆ పర్వతం గురించి అడిగితే ఇంకా ఒక కోసు దూరం వెళ్లి అడుగు అని చెప్పారు. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళగా ఇంకొక పట్టణం కనిపించింది.
(52:18) ఆ ఊరి వారిని అడిగితే ఇక్కడి నుంచి ఇంకో మైలు దూరంలో ఆ పర్వతం ఉంది అని చెప్పారు. ధీరసింహుడు కొంతసేపు ఆ పట్టణంలోనే విశ్రాంతి తీసుకొని చివరకు శబ్దభేది పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎంతో కష్టపడి దాన్ని ఎక్కాడు. చూడటానికి ఆ పర్వతం మిగతా పర్వతాల్ లాగానే ఉంది కానీ అందులో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు కనీసం చెట్లు మొక్కలు కూడా లేవు పచ్చని గడ్డి మాత్రం పర్వతం అంతా పరుచుకొని ఉంది.
(52:46) గడ్డి లేని చోట్ల లోపల నుంచి ఎర్రటి రాళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. ఏదైనా వింత కనిపిస్తుందేమో అని ధీరసింహుడు చాలాసేపు అక్కడే ఎదురుచూశాడు. కానీ ఏమీ కనిపించకపోవడంతో విసుగిపోయి పర్వతం మీద నుంచి కిందికి దిగి వచ్చాడు. కిందికి దిగి వచ్చాడే కానీ పట్టుదల కలిగిన ధీరసింహుడు అంతటితో వదిలేస్తాడా ఎంతకాలమైనా సరే అక్కడే ఉండి ఆ పర్వతం వెనుక ఉన్న రహస్యాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
(53:15) ఈ నిర్ణయంతో అతను ఆ పట్టణంలోని ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వల్ల అక్కడున్న వారందరూ అతనికి స్నేహితులయ్యారు. వారిలో ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణ స్నేహితుడయ్యాడు. వారిద్దరూ ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా స్నేహితులయ్యారు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వీరవర్మ ధీరసింహుడు కలిసి ఆ పట్టణపు బజార్లో తిరుగుతుండగా చీకటి పడిపోయింది.
(53:45) కానీ బజార్ అంతా దీపాలతో కళకళలాడుతూ ప్రకాశిస్తోంది. ఆ ఇద్దరు స్నేహితులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బజార్లో నడుస్తుండగా శబ్దవేది పర్వతం ఉన్న దిక్కు నుంచి రా త్వరగా రా అనే ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక మనిషి గొంతులోనుంచి వచ్చినట్లుగా కాకుండా పర్వతం లోపల నుంచి వినిపించిన మేఘగర్జనలా ఉంది. వెంటనే ధీరసింహుడు వీరవర్మ ఎదురుగా తిరుగుతున్న జనసమూహంలోంచి ఒక వ్యక్తి ఆ కేక వినిపించిన దిక్కుగా పిచ్చివాడిలా పరిగెట్టడం మొదలుపెట్టాడు.
(54:17) ఆ సమయంలో అతని ముఖం పూర్తిగా మారిపోయింది. అతని కళ్ళు ఎక్కడికో చూస్తున్నాయి. తన శరీరం గురించి కానీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కానీ అతనికి ఏమాత్రం అవగాహన లేకుండా పోయింది. ధీరసింహుడు కూడా అతని వెనుక కొంత దూరం పరిగెత్తాడు. ఇంతలో నలుగురు వ్యక్తులు కలిసి అతన్ని పట్టుకొని ఆపడంతో అతను వెనక్కి తిరిగి వచ్చాడు.
(54:39) ఆ తరువాత ధీరసింహుడు అతనితో ఇంకెప్పుడూ ఇలా చేయకు అని మందలించి పంపించాడు. తరువాత తన స్నేహితుడైన వీరవర్మను చూసి ఆ కేక ఏమిటి ఆ మనిషి ఎందుకు అటువైపు పిచ్చివాడిలా పరిగెత్తాడు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో నాకు వివరంగా చెప్పు అని ఆత్రంగా అడిగాడు. అప్పుడు వీరవర్మ అతనితో మిత్రమా ఆ కేక ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అప్పుడప్పుడు ఆ పర్వతం నుంచి ఇలాంటి శబ్దం వస్తుందని మాత్రం అందరికీ తెలుసు.
(55:05) ఆ శబ్దం ఎవరిని పిలుస్తుందో ఆ వ్యక్తి ఈ ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి పర్వతం వైపు పిచ్చివాడిలా పరిగెత్తుతాడు. అలా పరిగెత్తి వెళ్ళిన వారిలో ఒక్కరు కూడా ఇప్పటివరకు తిరిగి రాలేదు. వారి కోసం బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే అలా వెళ్ళిపోయిన వారి గురించి ఈ పట్టణంలో ఎవరూ విచారించరు అని చెప్పాడు. ధీరసింహుడు చుట్టూ ఉన్న వారిని గమనించాడు.
(55:28) ఆ వ్యక్తి వెళ్ళిపోయిన విషయాన్ని నిజంగానే ఎవరూ పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. అది చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆలోచనలో మునిగిపోయి తన బసకు తిరిమి వెళ్ళాడు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత మరొకరోజు వీరవర్మ ధీరసింహుడు మామూలుగానే బజార్లో తిరుగుతున్నారు. ఆ రోజు కూడా మునుపటిలాగే శబ్దభేది పర్వతం వైపు నుంచి రా త్వరగా రా అనే కేక వినిపించింది.
(55:55) ఈసారి ఆ పిలుపు ఎవరిని ఉద్దేశించిందో ఎవరి వంతు వచ్చిందో తెలుసుకోవడానికి ధీరసింహుడు అక్కడున్న అందరినీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అతను అలా చూస్తుండగానే తన ప్రాణ స్నేహితుడైన వీరవర్మ తన చెయ్యిని విడిపించుకొని పర్వతం వైపు పిచ్చివాడిలా పరిగెత్తడం మొదలు పెట్టాడు. అప్పుడు ఈసారి వచ్చిన పిలుపు తన ప్రాణ స్నేహితుడైన వీరవర్మ కోసమేనని ధీరసింహుడు గ్రహించాడు. ఏమైతే అది అవుతుంది.
(56:21) ఈసారి మాత్రం ఈ పర్వతం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకొని తీరాలి అని నిర్ణయించుకొని తన స్నేహితుడైన వీరవర్మను వదలకుండా వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరు ఒకరి వెనక ఒకరు ఆ కొండ దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు [సంగీతం] పర్వతాన్ని ఎక్కడం మొదలు పెట్టారు. కొంత ఎత్తు ఎక్కిన తర్వాత ఒక పెద్ద బండరాయి వారికి అడ్డంగా వచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచును పట్టుకొని అవతలికి దూకగానే తెలివైన ధీరసింహుడు అతని కాళ్ళను పట్టుకొని అతనితో పాటే అవతలి వైపుకు దూకాడు.
(56:57) అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం ఆ మైదానంలో వారిద్దరు ఒకరి వెనుక ఒకరు పరిగెత్తుతున్నారు. ధీరసింహుడు ఎన్నిసార్లు పిలిచినా అతని స్నేహితుడు ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు. ఇలా మరికొంత దూరం వెళ్ళగా ధీరసింహుని ముందు కేవలం 10 గజాల దూరంలోనే ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో భూమి చీలిపోయింది. వీరవర్మ అందులో పడిపోయి మాయమైపోయాడు. వెంటనే భూమి మళ్ళీ మునపటిలాగే మూసుకుపోయింది.
(57:27) అక్కడ భూమి చీలిన గుర్తు కూడా కనిపించలేదు. ఆ ప్రదేశం మళ్ళీ పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉంది. ఇక చేసేదేమీ లేక పర్వతానికి అవతలి ఏముందో చూసి రావాలనే ఉద్దేశంతో ధీరసింహుడు ఆ దిక్కుగా నడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని కాళ్ళు కాలిపోతున్నట్లుగా అనిపించాయి. కళ్ళలో నుంచి మంటలు వస్తున్నట్లుగా బాధ మొదలయింది.
(57:52) అక్కడి నేలంతా విపరీతంగా వేడిగా ఉంది. ఒక్కో రాయి ఒక్కో పెనంలా కాలిపోతోంది. ఈ వేడికి కారణం ఏమిటో తెలుసుకోవాలని అతను మరికొంత దూరం వెళ్ళగా అతని కళ్ళ ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తూ కనిపించింది. ఆ నదిలోని మంటలు అలల్లా పైకి లేస్తూ ఆకాశాన్ని తాకుతున్నాయి. [సంగీతం] ఇలాంటి నదిని నేను ఎక్కడా చూడలేదు. దీన్ని ఎలా దాటాలి భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా ఆలోచిస్తుండగా కాలిపోయినట్లుగా కనిపిస్తున్న ఒక వింత పడవ ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది.
(58:24) ఈ వింతేమిటో చూద్దామని ధైర్యం చేసి దేవుణని తలుచుకొని ఆ పడవ ఎక్కి కూర్చున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోపే ధీరసింహుడు ఆ అగ్ని నదికి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నేలంతా వెండిలా ధగా మెరిసిపోతుంది. అక్కడ ఒక నది ప్రవహిస్తోంది.
(58:52) ఆ నదిలోని నీరు తెల్లగా వెండిలా కనిపిస్తోంది. ఈ నీరు తాగడానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు తన చేతిని నదిలో ముంచగానే ఆ చేయి మొత్తం వెండిగా మారిపోయింది. ఇంతలో ఆ నదిలో నుంచి ఒక పడవ వచ్చింది. సాహసవంతుడైన ధీరసింహుడు ఆ పడవలో ఎక్కి కూర్చున్నాడు. ఆ పడవలో మనుషులుఎవ్వరూ లేరు కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనం ఒక గ్లాసులో మంచి నీళ్లు మాత్రం సిద్ధంగా ఉన్నాయి.
(59:19) అతనికి ఆకలి వేస్తున్నప్పటికీ ఇవి ఎవరి కోసమో తెలియదు. మనం ఎందుకు తాకాలి అని అనుకొని వాటిని ముట్టుకోకుండా ఊరుకున్నాడు. అతను అలా సందేహిస్తుండగా నదిలోని ఒక చేప తలను బయటకు పెట్టి ధీరసింహ ఇవి నీకోసమే తీసుకొని తిను అని చెప్పింది. వెంటనే అతను అతని ఆకలి దాహం తీర్చుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు. తరువాత నిద్రలేచి కళ్ళు తెరిచి చూసేసరికి మునిపటి లాగే అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు.
(59:49) ఈ సంఘటనలన్నీ దైవశక్తి వల్లనే జరుగుతున్నాయని నమ్మి ధీరసింహుడు మళ్ళీ మునిపటి ఉత్సాహంతో ముందుకు నడిచాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నేలంతా స్వచ్ఛమైన బంగారంలా తళత మెరిసిపోతుంది. నేలపై నవరత్నాలు రకరకాల విలువైన మణులు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యానికి సమానమైన విలువ కలిగినది.
(1:00:16) ధీరసింహుడు తన పంచెలో పట్టినన్ని రత్నాలను మూట కట్టుకున్నాడు. కానీ ఇంతలో ధీరసింహ వాటిలో ఆరు రత్నాలను మాత్రమే నీ దగ్గర ఉంచుకో మిగిలినవన్నీ అక్కడే పారవేయి. ఈ రత్నాలు మనుషుల కోసం కావు ఆశపడి ఎక్కువ తీసుకెళ్ళావంటే నీకు కీడు జరుగుతుంది అంటూ [సంగీతం] ఒక అదృశ్య స్వరం వినిపించింది. ఆ స్వరం చెప్పినట్లుగానే ధీరసింహుడు ఆరు రత్నాలను మాత్రమే తన దగ్గర ఉంచుకొని మిగిలినవన్నీ అక్కడే విసిరి పారేసాడు.
(1:00:45) ఆ ఆరు రత్నాలను తీసుకొని ధీరసింహుడు కొంత దూరం వెళ్ళగా అతని ఎదురుగా మరో వింత నది ప్రవహిస్తోంది. ఆ నదిలోని నీరంతా బంగారం కరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ వింత ఏమిటో అని అతను ఆలోచిస్తుండగా ఒక బంగారు పడవ ఒడ్డుకు వచ్చింది. ధీరసింహుడు అందులో ఎక్కి మునిపటి లాగే ఆ నదిని దాటాడు. మరికొంత దూరం నడవగా ఇంకొక నది కనిపించింది.
(1:01:11) దగ్గరకు వెళ్లి చూడగా ఆ నదిలో మామూలు మంచి నీళ్లు ఉన్నాయి. ధీరసింహుడు ఆ నీటిలో చేతులు కడుక్కోగానే ఇంతకుముందు [సంగీతం] వెండిగా మారిపోయిన అతని చెయ్యి మళ్ళీ మామూలుగా మారిపోయింది. కానీ [సంగీతం] అతని గోళ్ళు మాత్రం వెండివిగానే ఉండిపోయాయి. ఆ తర్వాత అతను ఒక అడవిని దాటి మళ్ళీ ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకోగా సులోచన ఉన్న పట్టణం అక్కడికి చాలా దగ్గరగా ఉందని తెలిసింది.
(1:01:39) వెంటనే ధీరసింహుడు దారి తెలుసుకొని కౌసాంభీ నగరానికి చేరుకొని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు తిరిగి వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతన్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. ధీరసింహుడు శబ్దభేది పర్వతం గురించి తాను తెలుసుకొని వచ్చిన వివరాలన్నింటిని ఆమెకు పూర్తిగా చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏముందో తాను ఎలాంటి వింతలు అద్భుతాలు చూశాడో అన్ని వివరించాడు.
(1:02:05) తాను తీసుకువచ్చిన ఆరు రత్నాలను సాక్ష్యంగా ఆమెకు చూపించాడు. వెండి నదిలో తన చెయ్యిని ముంచడం వల్ల వెండిగా మారిపోయి ఇప్పటికీ వెండిగానే ఉన్న తన గోళ్ళను కూడా చూపించాడు. అవన్నీ చూసిన సులోచన ధీరసింహ నువ్వు చెప్పిన మాటలన్నీ అక్షరాలా నిజం. ఇప్పుడు నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నీ తెలివితేటలు చూసి ఎంతో సంతోషించాను. నువ్వు నిజంగా అసాధ్యాన్ని సాధించగలిగిన వాడివి కాబట్టే నేను అడిగిన అసాధ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని రాగలిగావు.
(1:02:37) ఈ ప్రపంచంలో నిన్ను మించిన సాహసవంతుడు గుణవంతుడు తెలివైనవాడు మరొకరు లేరు అంటూ ధీరసింహుడిని ఎంతో మెచ్చుకుంది. ఆ తరువాత పట్టణంలోని పెద్దల సమక్షంలో సులోచన ధీరసింహుల వివాహం ఘనంగా జరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ ఎంతో సంతోషంగా జీవించారు. [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(1:03:23) ఓ
No comments:
Post a Comment