Kapala Moksham Part 21
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0NCkg9Fnd1U
Transcript:
(00:00) ల మోక్షం నిజ వెంకన్న భక్తుడి దర్శనం కర్ణ పిశాచి దెబ్బకి నా చదువు అటకెక్కింది. చదువులో విఘ్నాలు ఏర్పడ్డాయి. ఇంటిలో అవమానాలు అనుమానాలు ఏర్పడ్డాయి. నేను ఏదో చేస్తున్నాను అదేదో దాస్తున్నానని సందేహాలు నా తల్లిదండ్రులు వెంటాడినా కానీ నన్ను అడగలేదు. అలా నన్ను తిట్టకుండా ఉండలేరు. వయసుకు వచ్చిన ప్రతి వారికి ఎదురైన అనుమానపు అనుభవాలే అని నాకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది.
(00:33) ఇంతలో నా చదువుకు విజ్ఞాలు రావడంతో తిరిగి నేను గుడిలో పూజాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. దాంతో ప్రతిరోజు జిజ్ఞాసి నన్ను కలవడానికి గుడికి వచ్చేవాడు. రెండు లేదా మూడు గంటల పాటు ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుతూ గడిపేవాడిని నాకు ఆ ధ్యాస తప్ప వేరే విషయం ఉండేది కాదు అమ్మాయిలను చూసి చొంగ కార్చుకునే వయసులో ఉన్న మేము వారి మీద వైరాగ్య భావాలు ఎలా పెంపొందించుకోవాలి అనే ఆలోచనలు చేసేవాళ్ళు ఒకరోజు అనుకోకుండా జిజ్ఞాసకి నా శ్రీశైల క్షేత్రంలో జరిగిన అన్ని రకాల దైవధ్యాన అనుభవాలు చెప్పి నాలాంటి నిజభక్తుడిని నువ్వు ఇంతవరకు ఎవరిని చూసి ఉండవు అని చెప్పి వాడి వైపు
(01:14) గర్వంగా చూస్తూ చూశాను వాడు నన్ను చూసి అవునా నిజమా ఈ మంత్రాలకే నువ్వు నిజభక్తుడివి అనుకుంటే సరిపోతుందా మాకు తెలియాలి కదా మాకు అనిపించాలి కదా నిన్ను చూస్తుంటే పుస్తక వాక్యాలు చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగి లాగానే కనపడుతున్నావు. నువ్వు ఇంకా భక్తి మార్గంలోనికి ప్రవేశించలేదు లేదా జ్ఞాన మార్గంలోనూ ప్రవేశించలేదు అలాగే ధ్యాన మార్గంలో కూడా నీవు ప్రవేశించలేదు.
(01:43) ఏ మార్గంలో నువ్వు ఎక్కడ ప్రవేశించినట్లుగా నాకు అనిపించడం లేదు. ఏ సాధనా మార్గంలో లేనివాడివి నీకు నువ్వే నిజభక్తుడు అనుకుంటే సరిపోతుందా? కేవలం నువ్వు ప్రసాదాలు పంచే ప్రసాద భక్తుడివేనని తెలుసుకో అంతెందుకు నీకు నిజభక్తులను చూడాలంటే చెప్పు మా ఇంటి దగ్గరలో ఉన్న రమణ అనే తిరుపతి వెంకన్న నిజభక్తుడిని తీసుకొని వస్తాను ఆయనను చూసి నీవే తేల్చుకో నువ్వు నిజభక్తుడివో ఆయనో తేల్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు.
(02:15) దీని అమ్మ ఏమిటి నా ఊరిలో నాకు తెలియకుండానే వెంకన్న భక్తుడు ఉన్నాడా వామ్మో వాడు నన్ను మించిన భక్తుడా నామదేవుడికి గోరా భక్తుడి చేతిలో జరిగిన అవమానం రేపు నా జీవితంలో జరగదు కదా వామ్మో ఈ జిజ్ఞాస ఏదో ఒక మాట అనేసి నన్ను రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను జుట్టు పీక్కోవడమే తప్ప ఏమి చేయలేను. సరే రేపు ఏం జరుగుతుందో చూద్దాం అని ఆ రాత్రి నిద్రపట్టని రాత్రి అయింది.
(02:46) మరుసటి రోజు సాయంత్రానికి గుడికి జిజ్ఞాసి ఒక మధ్య వయస్సు ఉన్న వ్యక్తిని చేత పట్టుకొని వచ్చాడు. వెంకన్న స్వామి లాగానే నామాలు పెట్టుకున్నాడు వెంకన్న ఎత్తు లాగానే ఆరడుగులు ఉన్నాడు చేతిలో ఏకతార ఉన్నది బాగా జుట్టున్నా కూడా ముడి వేసుకున్నాడు. చూడగానే ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ తేజస్సు కొట్టొచ్చినట్లుగా కనపడసాగింది.
(03:10) సాక్షాత్తు తిరుపతి వెంకన్నను చూసినట్లుగా ఇతన్ని చూడగానే అనిపించింది. వామ్మో ఏమి మంత్రోపాసన సాక్షాత్తు వెంకన్నను తనలో ఇముడ్చుకున్నాడు. అతడు నవ్వుతుంటే ఏదో మోహన శక్తి నాకు ఆ నవ్వులో కనపడింది. అదే ముఖం చూడకుండా ఉండలేని స్థితి అదే ఆయన ఆడపిల్ల అయితే ముద్దు పెట్టుకోకుండా ఉండలేని స్థితి కచ్చితంగా ఎంతటి బ్రహ్మచారి కూడా అతను ఆడపిల్ల అయితే సంసారి కావాల్సిందేనని నాలో నేనే అనుకున్నాను.
(03:41) నా దీనావస్థను గమనించిన జిజ్ఞాస చిరునవ్వు నవ్వేసరికి నేను ఈ లోకమునకు రావడం జరిగింది. ఆయన అమాయకముగా తన పేరు రమణ అని తన సాధన భక్తి వివరాలు నాతో చెప్పడం చూస్తుంటే అతని నిశ్చల భక్తికి నేనే దాసోహం అవుతానేమో అని నాకు అనిపించింది. అతడు అన్నమయ్య రాగాలు ఆలపించే సరికి కళ్ళ ముందు లీలా మాత్రంగా తిరుపతి వెంకన్న స్వామి సజీవమూర్తిగా కనిపిస్తాడని ఆ దివ్య మంగళ రూపాన్ని మనసులో గుర్తు చేసుకొని ఆయన రూపమును ఒక తెల్లని దుప్పటి మీద ఆయన మనోరూపమును గీసినాడని నాతో చెప్పడం జరిగింది.
(04:14) దాంతో ఆయన గీసిన వస్త్రమును రేపు మరిచిపోకుండా తీసుకుని రమ్మని చెప్పి ప్రతిరోజు గుడికి రమ్మని చెప్పి నా జిజ్ఞాసి వైపు తిరిగి చిరునవ్వు నవ్వి ఆ రోజు మాత్రం మా సత్సంగానికి స్వస్తి పలికినాము. మరుసటి రోజు జిజ్ఞాసి మరియు రమణ ఇద్దరూ కలిసి గుడికి రావటం నేను కోరినట్లుగానే రమణ గీసిన వెంకన్న బొమ్మ ఉన్న దుప్పటి చూపించేసరికి నా మతి పోయింది.
(04:42) కావాలంటే ఆ ఫోటో నిజమైన తిరుపతి వెంకన్న ఫోటో అలాగే క్రింద పెట్టిన ఫోటో కూడా ఈయన గీసినట్లు ఈ రెండింటికి ఏ తేడా కూడా కనబడుతుందా లేదు కదా ఇంత దగ్గరగా తిరుపతి వెంకన్నను చూస్తున్నానని నాకు కొన్ని క్షణాల పాటు అనిపించింది. అంతవరకు ఆ గీసిన వెంకన్న దుప్పటిని చూడని జిజ్ఞాసి కూడా అదే పరిస్థితిలో ఉన్నారని నేను తెలుసుకునేసరికి నాకు నవ్వు వచ్చింది.
(05:08) ఆనందమేసింది. ఇలాంటి నిష్కామ భక్తుని చూసినందుకు కలిసినందుకు ఏదో తెలియని ఆనందానుభూతి కొన్ని క్షణాల పాటు ఉన్నది. మాటల మధ్యలో నేను జాతకాలు చెప్తానని తెలుసుకొని అతడు సాధనా జీవిత విషయాలను గతజన్మలో యోగి అని కానీ ఒక యోగిని వివాహమాడతానని ఆమెకు మాట ఇచ్చి ఆ జన్మలో ఆమెను వివాహము చేసుకోకుండా తనువు చాలించారని ప్రస్తుత జన్మలో ఆ యోగిని ఓ స్త్రీమూర్తిగా జన్మించి ఇతడు యోగ సాధనకు మాయగా మారుతుందని రాబోవు కాలంలో ఏ స్త్రీమూర్తిని వివాహమును చేసుకోకపోతే యోగ సాధన పరిసమాప్తి చెందుతుందని లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందని నా వాక్కు ద్వారా అతనికి చెప్పడం జరిగింది.
(05:52) నేను ఉన్నది ఉన్నట్లుగా ఏమీ దాచకుండా చెప్పినందుకు ఆయన సంతోషించి నన్ను పూర్తిగా నమ్మడం ప్రారంభించాడు. నన్ను ఒక యోగ సాధన గురువుగా భావించుకొని అతను సాధన ధర్మ సందేహాలు తీర్చుకునేవారు కానీ నాకు మాత్రం ఏమీ తెలిసేది కాదు కానీ నన్ను జిజ్ఞాసి అలాగే యోగిరమణ ఎన్నో ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు తీర్చుకునేవారు. ఎన్నో సాధనా సందేహాలు తీర్చుకునేవారు నాకున్న వాక్సిద్ధి వలన నాకే తెలియని ఎన్నో విషయాలు వాక్ నుండి అనర్గణంగా వచ్చేవి ఏం వస్తున్నాయో నాకు తెలిసేది కాదు.
(06:26) అలాగని గుర్తుపెట్టుకునే స్థితి ఉండేది కాదు వారు అడిగినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగి నా వాక్కు ద్వారా వారికి రావాల్సిన విషయాలు బయటకు వచ్చేవి. ఒకవేళ తెలియకపోతే వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయా పుస్తకాలు నా దగ్గర రావటం వాటిని చదవడం వారికి తెలియని విషయాలను తెలుసుకుని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రతిరోజు ముగ్గురం చర్చించుకునే వాళ్ళం వాదించుకునే వాళ్ళం ఒక సమాధానానికి కట్టుబడి ఉండేవాళ్ళం ఇలా మా ముగ్గురు స్నేహం జరుగుతున్న సమయంలో ఊర్లో వాళ్ళ దృష్టి అలాగే ఇంట్లో వాళ్ళ దృష్టికి మా ఆధ్యాత్మిక ప్రసంగాల విషయాలు తెలిసాయి. దాంతో వాళ్ళంతా సన్యాసులుగా
(07:04) కాకుండా సన్నాసులుగా మారతారు పుట్టుకలేని దేవుడి గురించి వివరించే స్థాయిలో మీరు ఉన్నారా అంటూ మా ముందే ఎగతాలి చేయడం ఆరంభించారు. మా మీద జోకులు వేసుకునే వాళ్ళు అయినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు మా ఆధ్యాత్మిక విషయం తప్ప మరే విషయము మా చర్చకు వచ్చేది కాదు మేము ముగ్గురము కలిస్తే కనిపించని దైవమును ఎలా కనిపిస్తాడని ఆలోచనలు చేసేవాళ్ళం.
(07:26) పుస్తకాల్లో చెప్పిన సాంప్రదాయాలు గ్రంథ పారాయణాలు చేసేవాళ్ళం కానీ ఎలాంటి అనుభవాలు కలిగేవి కాదు సంతృప్తినిఇచ్చేవి కావు ఇలాంటి స్థితిలో మేము ఉండగానే మీ ముగ్గురం కలుసుకోకూడదని ఎక్కడా కూడా మాట్లాడుకోకూడదని మా మీద ఆంక్షలు పెట్టేవారు మమ్మల్ని కలవనీయకుండా బంధించేవారు తిట్టేవారు రాను రాను మా మీద బాగా తీవ్రమైన ఒత్తిడి పెంచారు ఎక్కడ మేము సన్యాసులు అవుతామని వీళ్ళ భయం అని మాకు తెలిసింది.
(07:56) యోగం ఉంటే యోగి కాకుంటే ఎవరు ఆపలేరని నాకు ఒక్కడికే తెలుసు కానీ ప్రకృతి కూడా నాతో ఆడుకోవడం ఆరంభించింది. మేము మాట్లాడుకునే సమయానికి అకాల వర్షాలు లేదా అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కలిగి విఘ్నాలు ఉండేవి. దాంతో మాకు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి సమయం రాను రాను తగ్గిపోతూ వచ్చింది. ఉన్నత చదువుల నిమిత్తం జిజ్ఞాసి వేరే ఊరికి వెళ్ళిపోవడం అలాగే ఉన్నత ఉద్యోగం కోసం రమణ వేరే ఊరికి వెళ్ళిపోయేసరికి మా ఆధ్యాత్మిక పాండిత్యమునకు ఆటంకం ఏర్పడింది.
(08:25) వీరు లేకపోయేసరికి నన్ను పట్టించుకునేవాడు లేడు నన్ను గుర్తించేవాడు లేకపోయేసరికి నేను నా చదువు మీద ఏకాగ్రత పెట్టడం ఆరంభించాను. కొన్ని నెలల తర్వాత యోగిరమణ తల్లిదండ్రుల ఒత్తిడి మేర ఒక స్త్రీమూర్తిని ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం జరిపించినారని శోభనం గదిలో అమ్మాయిని చూసి అమ్మవారిలాగా భావించి స్తోత్రము చేయగానే ఆమె భయపడి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందే అని తెలిసింది.
(08:52) దాంతో అతను వైరాగ్యం చెంది మిడిమిడి జ్ఞానంతో పుస్తకంలో ఉన్న అన్ని రకాల యోగ సాధనలు చేసి ఉన్న దంతాలు కూడా ఊడిపోయేటట్లుగా సాధన చేసి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని సాధనా స్థితిలో ఉండి అయోమయానికి గురవుతున్నారని తెలిసింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియని స్థితి నాకు అందనంత దూరంలో ఉన్నాడని అనుకున్నాను. ఏమి చేయగలం విధిరాతను ఎవరు మార్చలేరని ఉన్నది తెలుసుకునే ఆచరించడం తప్ప ఏమి చేయలేని తెలిసిన జరిగేదాన్ని జరగకుండా ఎవరు కూడా ఏమి చేయలేరని ఆయన జీవితమే అందుకు ఉదాహరణగా నిలిచిపోయింది.
(09:29) వివాహ ప్రక్రియ వలన తన యోగ సాధన ఆగిపోతుంది. ఎన్నో సంవత్సరాలు ముందుగా తెలుసుకున్నా కూడా ఏం లాభం? కనిపించని దేవుడు అతనికి ప్రత్యక్ష అనుభవ అనుభూతి ఎంతకు కనిపించకపోయేసరికి ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోయినాడని తెలిసి ఏమి చేయలేని స్థితిలో మేమిద్దరం ఉండిపోయాము. ఇప్పుడు యోగిరమణ జీవితం లాగా మా యోగ సాధన జీవితం స్త్రీమూర్తుల మహామాయ దగ్గర ఆగిపోకూడదని మేము నిర్ణయించుకున్నాము.
(09:56) ఇలా అసలు మనము ఈయనకిలాగా నిజముగానే దైవచింతన దేనికి అసలు అవసరమా అనే సాధన సందేహం మా మదిలో వచ్చింది. దీనికోసం మేము పుస్తక గ్రంథాలు చదవడం ఆరంభించాము నేను అంటే నేను ఆధ్యాత్మిక శబ్ద పాండిత్యంలోనికి అడుగుపెట్టడం జరిగింది. నాకు వచ్చిన సాధన ధర్మ సందేహాలకి శబ్ద పాండిత్యము వలన సమాధానాలు దొరికాయి. నాకు వచ్చిన ధర్మ సందేహాలు ఏమిటో వాటికి నేను తెలుసుకున్న సమాధానాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా గమనిక యోగ సాధన చేయాలని అనుకునేవారు ఎన్నటికీ వివాహం చేసుకోవద్దు.
(10:38) ఒకవేళ చేసుకునే పరిస్థితి వస్తే మాత్రం యోగసాధన చేసేవారిని లేదా ఆధ్యాత్మిక విషయాల యందు అమితాసక్తి ఉన్నవారిని మాత్రమే వివాహం చేసుకోండి. లేదంటే మీ జీవితము ఇటు భోగ జీవితానికి లేదా యోగ జీవితానికి పనికి రాకుండా పోతుంది. అలాగే బ్రహ్మచారి పేరుతో లేదా గృహస్థ ధర్మం పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. పెట్టుకొని మీరు నాశనం అవ్వడమే కాకుండా కుటుంబ వ్యవస్థను అలాగే సమాజ వ్యవస్థను నాశనం చేసినారని అవుతారని గ్రహించండి.
(11:07) ఇలా తమ జీవితాలను నాశనం చేసుకున్న తల్లిదండ్రులను బ్రహ్మచారులను యోగ సాధకులను పీఠాధిపతులను మంత్రోపాసకులను నా స్వానుభవంలో చాలా మందిని చూడటం జరిగింది తస్మాత్ జాగ్రత్త ఇక యోగిరమణ విషయానికి వస్తే జిజ్ఞాసి నేను ఉన్నచోట తను ఉంటే నన్ను చూడటానికి మాత్రం వచ్చేవాడు కానీ యోగిరమణ మాత్రం నేను ఎక్కడ ఉన్నా అనగా ఊళలో ఉన్నా లేదా లేకపోయినా నేను ఉన్న చోటికి తెలుసుకొని అక్కడికి ప్రతి వారము నాకోసం వచ్చేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు వచ్చిన జన్మాంతర జ్ఞాన సిద్ధి వలన ఇతను నా పంచశిష్యుల్లో మరోవాడని మూడోవాడని ఇతనికి యోగిరమణ దీక్షానామంతో సాధన చేయించి మోక్ష
(11:46) ప్రాప్తిని మేము కలిగించాలని తెలుసుకున్నాం. ఇది కాస్త నాకు ప్రారబ్ధ కర్మగా మారడంతో మాతో పాటుగా ఇతనికి కాశీవాసం చేయించి అక్కడే కపాల మోక్ష ప్రాప్తి కలిగించాలని ఇతనికి మా యందు చూపిన భక్తి విశ్వాసమునకు సంతసించి పరమ గురువుగా మేము అనుగ్రహించిన వరము ఇక అతనికి ఈ యోగం ఉన్నదో లేదో అతనికే తెలియాలి కాలమే సమాధానం ఇవ్వాలి అందాక ఈ నిజ శిష్యుడి కోసము ఒక యోగ గురువుగా మేము ఎదురుచూడక తప్పదు కదా ఇతనికి ఉన్న తిరుపతి వెంకన్న నిజ నిజభక్తి వలన అదికాస్త గురుభక్తిగా మారి ఒక గురువే ఈ శిష్యుడి కోసం ఎదురుచూస్తున్నాడు అంటే నిజభక్తి ఎట్టిదో ఆలోచించండి
No comments:
Post a Comment