Tuesday, August 25, 2026

True Love vs Ego in Telugu: Relationship Psychology Explained

True Love vs Ego in Telugu: Relationship Psychology Explained

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2Won1_bJXCc



Transcript:
(00:00) నమ్మకం మంచిదే కానీ గుడ్డి నమ్మకం ప్రాణాలకే ప్రమాదం. ఒక మనిషి మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆ ప్రేమలో స్వార్థం లేదా ఈర్ష ఉండదని గ్యారెంటీ ఏంటి? ఒక మనిషి మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అనేది ముఖ్యం కాదు. ఆ ప్రేమ వెనుక దాగి ఉన్న అహంకారం ఎంత లోతుగా ఉందో గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే [సంగీతం] ప్రేమలో చనిపోయిన వాళ్ళ కంటే ప్రేమ పేరుతో చంపబడిన వాళ్లే ఈ ప్రపంచంలో ఎక్కువ.
(00:31) మనం ప్రేమ అని పిలిచే ఈ చాలా రిలేషన్స్ నిజానికి ప్రేమ కాదు అవి కేవలం సొంతం చేసుకోవాలనే [సంగీతం] కోరిక అధికారం కంట్రోల్ మాత్రమే అంటే నువ్వు నావాడివి నా దానివి అనే ప్రమాదకరమైన ఫీలింగ్ అన్నమాట నువ్వు నాతో లేకపోతే ఇంకెవ్వరితోనూ ఉండకూడదు [సంగీతం] అనే పిచ్చి చాలాసార్లు మనుషులు ప్రేమ కోసం చనిపోరు ప్రేమని సొంతం చేసుకోవాలనే [సంగీతం] అహంకారం కోసం చంపేస్తారు.
(00:57) ఫ్రాంక్ స్టాక్టన్ రాసిన [సంగీతం] ద లేడీ ఆర్ ద టైగర్ అనే కథ గుర్తొస్తుంది. అదేంటంటే ఒక నియంత రాజు ఉండేవాడు. అతనికి న్యాయం కంటే వినోదమే ఎక్కువ ఇష్టం అందుకే అతను ఒక విచిత్రమైన న్యాయ వ్యవస్థను కనిపెట్టాడు. రాజ్యంలో ఎవరైనా నేరం చేస్తే కోర్టు, సాక్ష్యాలు, వాదనలు ఉండవు. అతన్ని ఒక భారీ స్టేడియం మధ్యలో నిలబడతారు.
(01:21) ఎదురుగా ఒకేలా కనిపించే రెండు భారీ తలుపులు ఉంటాయి. ఒక తలుపు వెనుక ఎన్నో రోజులుగా ఆకలితో ఉంచిన ఒక భయంకరమైన పులి ఉంటుంది. మరో తలుపు వెనుక ఆ రాజ్యంలోనే అత్యంత అందమైన యువతి నిలబడి ఉంటుంది. నేరస్తుడు తన ఇష్టంతో ఒక తలుపు తెరవాలి. ఒకవేళ పులి బయటకు వస్తే అతను దోషి అని అందరూ నమ్మేస్తారు. ఒకవేళ యువతి బయటికి వస్తే అతను నిర్దోషి అని ప్రకటించి అదే క్షణంలో ఆ యువతితో అతని పెళ్లి జరిపిస్తారు.
(01:49) రాజు దృష్టిలో అది న్యాయం అది విధి. అయితే ఒకరోజు ఈ విచిత్రమైన న్యాయస్థానంలోకి ఒక యువకుడు తీసుకురాబడ్డాడు. అతను చేసిన నేరం ఏంటంటే రాజకుమార్తెని ప్రేమించాడు అంతే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకుమార్తె కూడా అతన్ని అంతే తీవ్రంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమ రాజుల చట్టాలను గెలవలేదు. వారి రహస్యం బయటపడింది. వెంటనే ఆ యువకున్ని స్టేడియంలో నిలబడ్డారు.
(02:15) బట్ రాజకుమారికి ఒక రహస్యం తెలుసు. ఆ రెండు తలుపుల వెనుక ఏముందో ఆమెకు ముందే తెలుసు. ఏ తలుపు వెనుక పులి ఉందో ఏ తలుపు వెనుక యువతి ఉందో ఆమెకు స్పష్టంగా తెలుసు. అంతేకాదు ఆ యువతి ఎవరో కూడా ఆమెకు తెలుసు. ఒకప్పుడు తన ప్రియుడి వైపు చూసి నవ్విందనే కారణంతోనే ఆమెపై రాజకుమారికి అసూయ ఉంది. ఇప్పుడు అదే అమ్మాయి తన ప్రేమించిన మనిషికి భార్యగా మారే అవకాశం ఉంది.
(02:41) సో ఇప్పుడు ఒక్క [సంగీతం] క్షణం ఆలోచించండి. మీరు ఆ రాజకుమారి స్థానంలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిజంగా ప్రేమిస్తే మీ ప్రియుడు ఇంకో స్త్రీని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా బతకడాన్ని చూడగలరా లేక అతను మీకు దక్కకపోతే ఎవ్వరికీ దక్కకూడదని అనుకుంటారా? ఈ ప్రశ్నకు తొందరగా సమాధానం చెప్పకండి. ఎందుకంటే మనిషి తన గురించి చెప్పుకునే సమాధానం ఒకటి నిజంగా నిర్ణయం తీసుకునే సమయంలో చేసే పని ఇంకొకటి.
(03:09) అతను నేరుగా రాజకుమారి వైపు చూశడు. ఆమె కూడా అతని వైపు చూసింది. ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క శబ్దం [సంగీతం] వినిపించలేదు కేవలం తన కుడి చేతి వేళని స్వల్పంగా కదిలించి కుడి వైపు ఉన్న తలుపును చూపించింది అంతే ఇక్కడే ఒక గుడ్డి ప్రేమికుడు అయితే ఏమనుకుంటాడు ఆమె నన్ను ప్రేమిస్తుంది నన్ను చంపాలనుకోదు కాబట్టి ఆమె చూపించిన తలుపు వెనుక ఖచ్చితంగా యువతి ఉంటుంది.
(03:36) ఆమె కనీసం [సంగీతం] నా ప్రాణాలైనా కాపాడాలని కోరుకుంది అని ప్రేమలో పడిన చాలామంది ఇక్కడే ఓడిపోతారు. వాళ్ళు ఎదుటి మనిషి మాటను నమ్ముతారు కానీ అతని మనస్తత్వాన్ని చదవరు. బట్ తెలివైన మనిషి మాత్రం మరో ప్రశ్న అడుగుతాడు. ఆమె నన్ను ప్రేమిస్తుందా కాదు. ఆమె ప్రేమలో అహంకారం ఎంత ఉందో అదే అసలు ప్రశ్న. సో ప్రేమ అహంకారం రెండు బయటకు ఒకేలా కనిపిస్తాయి.
(04:03) రెండూ నువ్వు నాకు కావాలి అని చెబుతాయి. కానీ వాటి ఉద్దేశ్యం వేరు ప్రేమ చెబుతుంది నువ్వు సంతోషంగా ఉండాలి అని అలానే అహంకారం చెబుతుంది నువ్వు నాతోనే సంతోషంగా ఉండాలి అని ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న ఒక్క పదమే వేలాది విషాదాలకు కారణం. ఒక మనిషి నిజంగా ప్రేమిస్తే తన వల్ల కాకపోయినా ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అహంకారంతో ప్రేమించిన మనిషి మాత్రం ఎదుటివాడి సంతోషాన్ని తన [సంగీతం] మీద జరిగిన అవమానంగా భావిస్తాడు.
(04:34) అతనికి విడిపోవడం బాధ కాదు తన్ను వదిలి ఇంకొకరితో నవ్వడం బాధ అదే అసూయ అదే ఈర్ష్య అదే ప్రేమను హత్యగా మార్చే మొదటి మెట్టు అందుకే మనం ప్రతిరోజు చూసే చాలా విషాదాల [సంగీతం] వెనుక ప్రేమ ఉండదు. నన్ను కాదన్నావు కాబట్టి చంపేస్తాను. నాతో బ్రేకప్ అయ్యావు కాబట్టి యసిడ్ పోస్తాను. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి [సంగీతం] చావాల్సిందే ఇవన్నీ ప్రేమ కథలు కావు.
(05:02) ఇవి గాయపడిన అహంకారం మాట్లాడే మాటలు ప్రేమ ఎప్పుడూ ప్రాణాలు తీయదు [సంగీతం] అహంకారం మాత్రమే తీస్తుంది. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ అహంకారం ఎప్పుడూ ప్రేమ ముసుగే వేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ రాజకుమారిని చూడండి. ఆమె ఒక సాధారణ అమ్మాయి కాదు రాజకుమారి చిన్నప్పటి నుంచి తనకు కావాల్సింది తనకే దక్కాలి అనే వాతావరణంలో పెరిగింది. అధికారం అలవాటయింది. ఓటమి తెలియదు.
(05:27) అలాంటి మనిషి తన ప్రేమించిన వాడు ఇంకో స్త్రీతో జీవితాంతం నవ్వుతూ పిల్లల్ని కనుతూ తనను పూర్తిగా మరిచిపోయి జీవించడం భరించగలడా లేక ఒక్క క్షణం బాధపడి చనిపోవడం భరించగలడా ఒకటి గమనిస్తే చాలాసార్లు మనిషి ప్రేమను కోల్పోయినందుకు బాధపడడు తన విలువ తగ్గిపోయిందనే భావనకు బాధపడతాడు. నన్ను వదిలి ఇంకొకరిని ఎంచుకున్నాడు అనే ఆలోచన అతని ఆత్మగౌరవాన్ని చీల్ చేస్తుంది.
(05:52) అప్పుడు అతను ప్రేమ కోసం పోరాడడు తన అహంకారాన్ని కాపాడుకోవడానికి పోరాడతాడు. అసలు ప్రేమకి అథారిటీ అనేది ఉండదు కానీ అహంకారానికి ఉంటుంది. అందుకే ప్రేమ నువ్వు స్వేచ్ఛగా ఉండు అంటుంది. [సంగీతం] అహంకారం నువ్వు నా సొంతం అంటుంది. ప్రేమ చేతులు విడిచి పెడుతుంది. అహంకారం గొంతు పట్టుకుంటుంది. ప్రేమకి ధైర్యం అవసరం అహంకారానికి భయం అవసరం.
(06:17) భయం ఉన్నచోటే నియంత్రణ పుడుతుంది. కానీ ఒక్క క్షణం ఊహించండి. ఆ యువకుడు నిజంగా ఆలోచించి ఉంటే అతను తలుపును కాదు రాజకుమారి మనసును [సంగీతం] చదివి ఉండాలి. ఆమె ప్రేమను కాదు ఆమె అహంకారాన్ని అంచనా వేసి ఉండాలి. ఎందుకంటే జీవితంలో కూడా మనం చేసే అతి పెద్ద తప్పు ఇదే మనం మనల్ని ప్రేమిస్తున్నారో లేదో చూసుకుంటాం. కానీ వాళ్ళ ప్రేమలో స్వేచ్ఛ ఉందా స్వార్థం ఉందా అనేది చూడాం.
(06:44) ఒక మనిషి మిమ్మల్ని రోజుకి 100 సార్లు ఐ లవ్ యు అనొచ్చు. అదే మనిషి మీ ఫోన్ చెక్ చేయాలనుకోవచ్చు. మీ స్నేహితులను వదిలేయమని చెప్పొచ్చు మీ జీవితంపై నిర్ణయాలు తానే తీసుకోవాలని ప్రయత్నించవచ్చు. మీరు నవ్వే హక్కు కూడా తన అనుమతితోనే ఉండాలని కోరవచ్చు. బయటకు చూస్తే ఇవన్నీ ప్రేమలా కనిపిస్తాయి. కానీ లోపల చూస్తే [సంగీతం] అవన్నీ కంట్రోల్ చేసే పనులే కదా కంట్రోల్ ఎక్కువైన చోట ప్రేమ తక్కువ అవుతుంది.
(07:10) అందుకే అతను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని కాదు నా స్వేచ్ఛను ఎంత గౌరవిస్తున్నాడు అనేదే పాయింట్ ఇక్కడ. చివరికి ఈ కథ మనకు నేర్పేది ఒకటే ప్రేమను అర్థం చేసుకోవడం కంటే ముందు అహంకారాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రేమ మిమ్మల్ని బ్రతికిస్తుంది. అహంకారం మాత్రం ప్రేమ భాషలోనే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మనుషులు మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు కాదు మిమ్మల్ని నా [సంగీతం] సొంతం అని నమ్మేవాళ్ళు ఎందుకంటే ద్వేషించే మనిషి మీ నుంచి దూరంగా వెళ్తాడు.
(07:43) కానీ అహంకారంతో [సంగీతం] ప్రేమించే మనిషి మాత్రం మీరు దూరంగా వెళ్ళకుండా ఏ హద్దుకైనా వెళ్తాడు. అందుకే ఎవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నమ్మే ముందు వాళ్ళు [సంగీతం] మీ ఆనందాన్ని కూడా ప్రేమిస్తున్నారా అని చూడండి. మీరు వాళ్ళతో లేకపోయినా మీరు బాగుండాలని కోరుకుంటే అది ప్రేమ. మీరు వాళ్ళతో లేకపోతే మీరు ఎవ్వరికీ దక్కకూడదని అనుకుంటే అది ప్రేమ కాదు అది గాయపడిన అహంకారం.
(08:10) ఆ అహంకారానికి పూలు ఇష్టం ప్రేమ మాటలు ఇష్టం త్యాగం గురించి మాట్లాడడం ఇష్టం కానీ అవకాశం వస్తే అదే అహంకారం పులి కంటే [సంగీతం] క్రూరంగా మారుతుంది. ప్రపంచంలో ప్రతి పులికి గోర్లు ఉంటాయి. కానీ ప్రతి అహంకారానికి ప్రేమ అనే ముసుగు ఉంటుంది. అదే దాన్ని గుర్తించడం [సంగీతం] అత్యంత కష్టమైన పని.

No comments:

Post a Comment