Thursday, September 17, 2026

సిగ్గు లేదా?🔴ఒక స్త్రీగా పుట్టి.. నేనొక ఆడదాన్ని అని చెప్పుకోడానికి?

సిగ్గు లేదా?🔴ఒక స్త్రీగా పుట్టి.. నేనొక ఆడదాన్ని అని చెప్పుకోడానికి?

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lvXkLzaXdwk





Title: సిగ్గు లేదా?🔴ఒక స్త్రీగా పుట్టి.. నేనొక ఆడదాన్ని అని చెప్పుకోడానికి?

Author Name: PRATIKULA VEDAM

Description: స్త్రీ శరీరం ప్రకృతి సహజం, కానీ "ఆడతనం" సమాజం సృష్టించిన ఒక మానసిక కండిషనింగ్. మిమ్మల్ని మీరు కేవలం ఒక 'ఆడది'గా పరిమితం చేసుకుంటున్నారా? ఆధునిక FEMINISM అసలైన మూల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతోంది? 'నాహం దేహస్మి' అనే లోతైన తత్వంతో సమాజం సృష్టించిన సంకెళ్లను బద్దలు కొట్టి, ఒక మనిషిగా మీ నిజమైన చైతన్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

#PratikulaVedam #WomenEmpowermentTelugu #SelfRealization #PhilosophyTelugu #TeluguMotivation #FeminismTelugu #TeluguSpeeches

Transcript:
(00:00) ఆడ శరీరం ఆడతనం ఈ రెండిటికీ మధ్య చాలా లోతైన డిఫరెన్స్ ఉంది. మరి దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ మీరు ఒక సూక్ష్మమైన లాజిక్ ని అర్థం చేసుకోవాలి. బయోలాజికల్ గా ఒక స్త్రీ శరీరంతో పుట్టడం అనేది ప్రకృతి రీత్య సహజం అండ్ అందులో ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవరూ మార్చలేరు కూడా కానీ స్త్రీ అనే శరీరానికి ఆడది అని అనిపించుకోవడం మాత్రం ప్రకృతి సృష్టించింది కాదు అది ఈ సమాజం సృష్టించిన ఒక మానసిక కండిషనింగ్ స్త్రీ అనేది మీ శరీరం కానీ ఆడది అనేది మాత్రం మీ మెదడులో సమాజం ఇన్స్టాల్ చేసిన ఒక సాఫ్ట్వేర్ ప్రకృతిలో వేరే ఏజీ దేవుని చూడండి ఈ తేడా
(00:43) కనిపించదు. ఉదాహరణకి పులిని తీసుకుందాం. ఆడపులి ఎప్పుడైనా నేను లేడీ పులిని కదా నేను కొంచెం సాఫ్ట్ గా మెల్లగా అరవాలి అణగి మణగి ఉండాలి అని అనుకుంటదా అనుకోదు ఎందుకంటే దానిలో ఆడతనం అనే కండిషనింగ్ లేదు. అది జస్ట్ ఒక ఫీమేల్ పులి అంతే కానీ మనుషుల్లోకి వచ్చేసరికి మాత్రం అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే కాలేజీల్లో చదువుకొని ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఒకేలాంటి మెథడ్తో బయటిక వచ్చినా అందులో ఆడవాళ్ళు మాత్రమే జుట్టు పొడుగ్గా ఎందుకు పెంచుకోవాలి ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు సాఫ్ట్ గా మాట్లాడాలి ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ఇదంతా మీ శరీరంలో
(01:23) లేదు ఇది మీ బుర్రలో సమాజం చొప్పించిన కల్చర్ లో ఉంది. మీరు పొద్దున్న నిద్ర లేవగానే మీ గురించి మీరు ఏమనుకుంటారు నేను ఒక మనిషిని అని అనుకోరు నేనొక ఆడదాన్ని అని అనుకుంటారు. అక్కడే మొదలవుతుంది మీ పతనం ఒక్కసారి గాని మీ మనసులో నేను ఆడదాన్ని అని ఫిక్స్ చేసుకోగానే దానికి సంబంధించిన ఒక పెద్ద నెర్రేటివ్ మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది.
(01:49) ఆడది కాబట్టి పెళ్లి చేసుకోవాలి ఆడది కాబట్టి ఎవరో ఒకరికి భార్యగా ఉండాలి ఆడది కాబట్టి పిల్లల్ని కనాలి ఆడది కాబట్టి తల్లిగా త్యాగాలు చేయాలి ఆడది కాబట్టి అర్ధరాత్రి రోడ్డు మీద ఉంటే భయపడాలి ఆడది కాబట్టి ఎవరో ఒక మగాడు వచ్చి కాపాడాలి ఎందుకు ఎందుకు ఇలా భయపడాలి అర్ధరాత్రి రోడ్డు మీద ఉంటే ఎవరైనా దాడి చేస్తారేమో అనే భయం ఫిజికల్ భద్రతకు సంబంధించింది.
(02:10) అది ఆడదైనా మగవాడైనా అది లాజికల్ కానీ నేను ఆడదాన్ని కాబట్టి నేను నిస్సహాయురాలిని అని మీ బురలో ఎందుకు ఫీడ్ అయింది సమాజం మీ ఆడతనాన్ని గ్లోరిఫై చేస్తుంది. ఆడపిల్ల అంటే అనుకువగా ఉండాలి మహాలక్ష్మి లాగా సర్దుకు పోవాలి భార్యగా భర్త చెప్పిందే వినాలి అని కీర్తిస్తుంది. మరి మీరు ఆ పొగడతలకి పడిపోయి ఆ ఉచ్చులో చిక్కుకుపోతారు.
(02:34) మీరు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా లోపల మాత్రం ఆ ఆదర్శవంతమైన ఆడది అనే భారాన్ని మోస్తూనే ఉంటారు. ఇదంతా విని ఒక ఆడదిగా మీరు ఏమంటారంటే అందుకే కదండీ మేము ఫెమినిస్టులుగా మారాం మా హక్కుల కోసం పోరాడుతున్నాం అని అంటారు. బట్ ఈ ఫెమినిజం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద జోక్. ఒక ఆడదానికి బయట జరిగే వివక్ష వరకట్టం ఆఫీసులో ప్రమోషన్స్ రాకపోవడం ఇవన్నీ కూడా కేవలం చెట్టుకున్న కొమ్మలు మాత్రమే.
(03:02) మరి అసలైన రూట్ కాస్ అది వేరే ఉంది. ఒక స్త్రీగా ఉన్న మీరు మిమ్మల్ని మీరు ఆడది అని అనుకోవడమే ఆ రూట్ కాస్ మీ మైండ్ లో మీరు నేను ఒక ఆడదాన్ని అనే ఐడెంటిటీని అలాగే పెట్టుకొని బయట మాత్రం హక్కుల కోసం ఫైట్ చేస్తే దాన్ని ఫెమినిజం అనరు దాన్ని ఉమెన్లీ ఫెమినిజం అని అంటారు. అండ్ దీనివల్ల ఎవ్వరికీ ఎలాంటి లాభం లేదు. ఇది ఎలాంటిదంటే మీ శరీరం మీద ఒక పెద్ద కుళ్లిపోతున గాయం ఉంటే దాని లోపల నుండి నయం చేయకుండా దానిపైన స్వేచ్ఛ అని రాసి ఉన్న ఒక ఖరీదైన కలర్ఫుల్ బ్యాండేజ్ అంటించడం లాంటిది.
(03:40) లోపల గాయం మానకుండా అలాగే ఉన్నప్పుడు దాని మీద బ్యాండేజ్ ఎంత ఉంటాయంటే ఎంత అందంగా ఉంటాయండి. ఇన్ఫాక్ట్ ఈ రంగుల ఫెమినిజం వల్ల మీరు ఇప్పుడు డబల్ షిఫ్ట్లు చేయాల్సి వస్తుంది. ఒక పక్కేమో మోడరన్ ఉమెన్ అనే భారాన్ని మోస్తున్నారు అంటే ఆఫీస్ లో ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవ్వాలి డబ్బు సంపాదించాలి ఇండిపెండెంట్ గా కనిపించాలి.
(04:01) ఎట్ ద సేమ్ టైం లోపల ఆడతనం అనే ఐడెంటిటీని వదులుకోలేక ఒక ట్రెడిషనల్ ఉమెన్ అనే భారాన్ని కూడా మోస్తున్నారు. అంటే అత్తగారి ఇంట్లో అందరినీ మెప్పించాలి పండుగలకు పూజలు చేయాలి పర్ఫెక్ట్ భార్యగా పర్ఫెక్ట్ తల్లిగా పేరు తెచ్చుకోవాలి అని ఈ రెండు పడవల ప్రయాణంలో మీరు మానసికంగా నలిగిపోతున్నారు. ఎందుకంటే మీ మూల సమస్య డబ్బు కాదు చదువు కాదు మీ మూల సమస్య నేనొక ఆడదాన్ని అనే మీ ఐడెంటిటీ మరి నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అహం బ్రహ్మస్మి నేనే సృష్టిని ఈ సృష్టి అంతా స్త్రీ తత్వమే అని చాలామంది వేదాంతం మాట్లాడుతుంటారు కానీ అలాంటి వేదాంతాలు మాట్లాడేదానికంటే ముందు నాహం దేహస్మి అంటే నేను అసలు ఈ శరీరాన్నే
(04:47) కాదు అనే బేసిక్ లాజిక్ అర్థం చేసుకోవాలి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు ఎవరు అని అడిగితే మీ మొదటి సమాధానం నేను ఫలానా వాళ్ళ భార్యని నేను ఒక ఆడదాన్ని అని రాకూడదు నేను ఒక మనిషిని ఐ యామ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని రావాలి. అసలు ఇంకా లోతుగా వెళ్తే నేను గమనించేదాన్ని అర్థం చేసుకునే ఒక చైతన్యాన్ని అని చెప్పగలగాలి.
(05:11) సమాజం ప్రవచనకర్తలు కలిసి మీ పురుల రుద్దిన ఈ ఆడతనం అనే నాన్సెన్స్ ని ముందు పక్కన పెట్టి ఫస్ట్ అఫ్ ఆల్ మిమ్మల్ని మీరొక మనిషిగా చూసుకోవడం మొదలు పెట్టండి. నాది స్త్రీ శరీరం కావచ్చు కానీ అది కేవలం ప్రకృతి నాకు ఇచ్చిన ఒక బయోలాజికల్ రూపం మాత్రమే అంతమాత్రాన భయపడుతూ ఉండాలి సాఫ్ట్ గా మాట్లాడాలి ఎవరికో భార్యగా అణగి మణగి బ్రతకాలి అని సొసైటీ రాసిన స్క్రిప్ట్ ని నేను ఎందుకు ఫాలో అవ్వాలి అని ఎప్పుడైతే మీరు లాజికల్ గా ప్రశ్నిస్తారో ఆ రోజే మీ మానసిక సంఖెళ్లు బద్దలవుతాయి.
(05:45) లేకపోతే మీరు ఎన్ని పిహెచ్డిలు చేసినా నెలకి ఎన్ని లక్షలు సంపాదించినా అమెరికాలో సెటిల్ అయినా సరే లోపల మాత్రం ఎవరో ఒకరికి భయపడుతూ ఇంకెవరి దగ్గరో పెర్మిషన్లు అడుగుతూ మీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక ఫ్యాన్సీ బానిసలానే బ్రతుకుతారు. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఆడది అనే ఫీలింగ్ ఒక జబ్బు కాదు అది ఒక బ్రమ.
(06:08) ఆ భ్రమ నుండి బయటపడి మనిషిగా బ్రతకడం మొదలు పెట్టండి. ఈ లాజిక్ మీలో ఏ ఒక్కరి ఆలోచన విధానాన్ని మార్చిన ఈ సమాజం వేసిన అతి పెద్ద మాట్రిక్స్ ని మీరు బ్రేక్ చేసినట్టే థింక్ అబౌట్ ఇట్

No comments:

Post a Comment