Thursday, September 17, 2026

ఇంగ్లాండ్ చీకటి చరిత్ర | The Dark History of England

ఇంగ్లాండ్ చీకటి చరిత్ర | The Dark History of England

Author Name:Think Deep

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkDeep

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Sm3QqWtwhno





Title: ఇంగ్లాండ్ చీకటి చరిత్ర | The Dark History of England

Author Name: Think Deep

Description: ఇంగ్లాండ్ చీకటి చరిత్ర | The Dark History of England

How did a small, disconnected island overcome brutal invasions and plagues to become the largest empire in history? Thousands of years ago, Britain was not even an island, but was connected to Europe by a landmass called Doggerland before rising sea levels submerged it. This documentary explores the complete, blood-soaked history of England. From the fierce Celtic tribes facing Julius Caesar's Roman armies to the terrifying Viking invasions and the Norman Conquest of 1066, discover how endless wars shaped a nation. We also dive into the dark era of the Black Death which wiped out half the population, the ruthless six marriages of King Henry VIII, and the devastating English Civil War that resulted in King Charles I losing his head. Ultimately, this violent clash of Romans, Anglo-Saxons, Vikings, and Normans gave birth to the modern English language we speak today.

If you found this historical journey fascinating, please subscribe to the channel, like the video, and drop a comment below on whether you think England could have ruled the world without the power of its parliament!

#EnglandHistory #BritishEmpire #TeluguHistory #Documentary #WorldHistory #Vikings #JuliusCaesar #TudorDynasty #HistoryInTelugu #UntoldHistory

Scripting and Editing :- Manikanta
Voice Over :- Prudhvi
@prudhvipods

Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

The Content used In this Video is only For educational purpose

For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Transcript:
(00:00) ఈరోజు ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశంగా కనిపించే ఇంగ్లాండ్ వేలాది సంవత్సరాల క్రితం అసలు ఒక ద్వీపమే కాదు ఈరోజు మనం బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ అని పిలుస్తున్న ప్రాంతం ఒకప్పుడు యూరప్ ప్రధాన భూభాగంతో కలిసి ఉన్న ఒక మైదానం అప్పట్లో మనుషులు నడుచుకుంటూనే అక్కడికి వెళ్లి వస్తూ ఉండేవారు. కానీ ఈరోజుకి దాదాపు 11వ000 సంవత్సరాల క్రితం ప్రకృతిలో ఒక భయంకరమైన మార్పు వచ్చింది.
(00:23) భూగోళం రూపరేఖలు శాశ్వతంగా మారిపోయాయి. మంచు కరగడం మొదలైంది. సముద్రం వాటర్ లెవెల్స్ ఎంత వేగంగా పెరిగాయ అంటే యూరోప్ మరియు బ్రిటన్ ను కలిపే డాగర్లాండ్ అనే ఒక పెద్ద మైదానం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆ పచ్చటి దారి కాస్త ఒక లోతైన సముద్రంగా మారింది. అలా బ్రిటన్ ప్రపంచం నుంచి విడిపోయి ఒక ప్రత్యేకమైన ఐలాండ్ గా మిగిలిపోయింది.
(00:42) అలా ప్రపంచం నుంచి విడిపోయిన అక్కడ మనుషులు జీవితం మాత్రం ఆగిపోలేదు. క్రీస్తుపూర్వం 4వ000 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ వ్యవసాయం మొదలైంది. ఆ తర్వాత స్టోన్ హేజ్ లాంటి ఎన్నో రహస్యమైన భారీ రాతి నిర్మాణాలను మనుషులు నిర్మించారు. ఇక సరిగ్గా క్రీస్తుపూర్వం 55 లో ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. సముద్రపు అలల్ని చీల్చుకుంటూ వందలాది రోమన్ యుద్ధ నౌకలు తీరం వైపు దూసుకొచ్చాయి.
(01:07) ఆ సైన్యాన్ని లీడ్ చేస్తోంది చరిత్రలోనే అత్యంత ఆసియాలు ఉన్న రోమన్ జనరల్ జూలియస్ సీజర్. ఫ్రాన్స్ ను జయించిన తర్వాత ఈ కొత్త ద్వీపాన్ని కూడా తన కాళ్ళ కింద తొక్కి పారేయాలనేది సీజర్ కోరిక. అయితే సీజర్ చేసిన మొదటి దాడి కేవలం సముద్ర తీరానికే పరిమితమైంది. అందుకే ఆ తర్వాత సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం 54 లో మరింత పెద్ద సైన్యాన్ని తీసుకొని మళ్ళీ వచ్చాడు.
(01:29) ఈసారి రోమన్ సైనికుల కత్తులు కెల్టిక్ ఆదివాసీల రక్తం చిందిస్తూ టేమ్స్ నది ఉత్తర తీరానికి చేరుకున్నాయి. కానీ స్థానికుల తీవ్రమైన పోరాటం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సీజర్ అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. సీజర్ లాంటి గొప్ప యోధుడే గెలవలేని ఆ నేలను రోమన్ సామ్రాజ్యం మాత్రం మర్చిపోలేకపోయింది. ఎలాగైనా ఆ ద్వీపాన్ని ఆక్రమించాలన్న కసి వాళ్ళలో ఉండిపోయింది.
(01:53) దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం 43 లో రోమన్ చక్రవర్తి క్లాడియర్స్ ఒక పక్కా ప్లాన్ తో ఇంగ్లాండ్ మీద దాడికి వెళ్ళాడు. ఈసారి రోమన్ సైన్యం ఎక్కడా ఆగలేదు. తమ క్రూరత్వంతో కఠినమైన శిక్షలతో దాదాపు ఇంగ్లాండ్ మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంది. అదే సమయంలో లండన్, చెస్ట్ ఆక్ లాంటి ప్రాంతాలకు పునాదులు వేసింది. ఇవే నేడు ప్రపంచ పటంలో పెద్ద నగరాలుగా ఉన్నాయి.
(02:16) అయితే రోమన్ల పాలనలు అక్కడ అంతా ప్రశాంతంగా ఏమీ లేదు. క్రీస్తు శకం 60 లో బౌడికా అనే ఒక ధైర్యవంతురాలైన ఆదివాసి రాణి రోమన్ల అన్యాయాలకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటు రోమన్ సామ్రాజ్యాన్ని వణకించింది. రాణి బౌడికా సైన్యం వేలాది మంది రోమన్ సైనికులను చంపేసింది. కానీ ఆ తర్వాత ఈ తిరుగుబాటును రోమన్లు చాలా దారుణంగా అనిచేశారు.
(02:36) ఈ సంఘటన తర్వాత రోమన్లు తమ సరిహద్దులను కాపాడుకోవడానికి ఉత్తర దిశగా హాడ్రియన్స్ వాల్ అనే ఒక భారి రాతి గోడను నిర్మించారు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల పాటు ఇంగ్లాండ్ రోమన్ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయింది. రోమన్ సైన్యం వెళ్ళిపోగానే ఇంగ్లాండ్ పూర్తిగా అనాధగా మారిపోయింది. అక్కడ రాజు లేడు సైన్యం లేదు. సరిగ్గా అదే సమయంలో సముద్రం మీద వచ్చిన కొన్ని కొత్త కబీలాలు ఈ అనాధ భూమి మీద కన్నేసాయి.
(03:01) వాళ్ళు అక్కడ అడుగు పెట్టగానే ఒక భయంకరమైన రక్తపాతం మొదలైంది. అదే నేటి ఆంగ్ల భాషకు సంస్కృతికి జన్మనిచ్చింది. రోమన్లు వెళ్ళగానే ఇంగ్లాండ్ మూలవాసులైన కెల్టిక్ ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఐదవ శతాబ్దం మధ్యలో యుద్ధం అవతల నుంచి కొన్ని జర్మనీక్ తెగలు అక్కడికి వచ్చాయి. వీరినే మనం నేడు ఆంగ్లో సాక్సన్స్ అని పిలుస్తున్నాం.
(03:22) మొదట్లో వీళ్ళు రోమన్ సైన్యంలో అద్య సైనికులుగా పనిచేసేవారు. ఈ మార్పు ఎలా జరిగిందంటే దానిపై చరిత్రలోనే నేటికి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక భయంకరమైన మారణ కాండ అని కొందరు అంటారు. ఈ బయట వాళ్ళు స్థానికులను దారుణంగా చంపేసి వారి భూములను ఆక్రమించుకున్నారని కొందరు చెప్తారు. మరికొందరు మాత్రం ఈ మార్పు నెమ్మదిగా శాంతియుతంగా జరిగిందని భావిస్తారు.
(03:43) నిజం ఏదైనా దాని ఫలితం మాత్రం చాలా క్రూరంగా ఉంది. ఈ ఆంగ్లో సాక్సన్ ప్రజలు స్థానికుల సంస్కృతిని సాంప్రదాయాలను వారి భాషను పూర్తిగా తుడిచి పెట్టేశారు. శతాబ్దాల నాటి ఈ నాగరికతను నాశనం చేసి తమ భాషను పద్ధతులను వాళ్ళపై బలవంతంగా రుద్దారు. ఆ భాషే కాలక్రమంలో నేటి ఇంగ్లీష్ గా మారింది. ఏడవ శతాబ్దం వచ్చేసరికి ఆ ఆంగ్లో సాక్సన్లు స్థానికులను తరిమికొట్టి వేల్స్ కార్నర్వాల్ లాంటి పశ్చిమ మూలాలకు పరిమితం చేశారు.
(04:09) ఇక దాదాపుగా ఇంగ్లాండ్ మొత్తం వీరి చేతుల్లోకి వచ్చేసింది. కానీ వీళ్ళు తమలో తాము ఐక్యంగా లేరు. మొత్తం భూమిని ఏడు చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించుకున్నారు. అవే ఈస్ట్ ఇంగ్లియా, ఎసెక్స్, కెంట్, సెక్స్, మెర్సియా, నార్త్ రంబియా మరియు వెసెక్స్ ఈ రాజ్యాలన్నీ ఒకే భాష మాట్లాడిన అధికార దాహంతో ఎప్పుడూ ఒకరినొకరు చంపుకునేవారు. కాలక్రమంలో ఈ ఆంగ్లో సక్సన్ రాజులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు.
(04:35) ఇక 793వ సంవత్సరం ఒక చల్లని ఉదయం నార్త్ అంబ్రియా తీరంలో ఉన్న లెండిస్ పాండ్ అనే ఒక ప్రశాంతమైన క్రైస్తవ మఠంలో పూజారులు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అకస్మత్తుగా సముద్రం నుంచి వింత ఆకారంలో ఉన్న పొడవాటి పొడవలు తీరం వైపు రావడం కనిపించాయి. వాళ్ళకి అర్థమయ్యేలోపే పడవల నుంచి గొడ్డళ్లు డాళ్ళు పట్టుకొని పొడవైన యోధులు అరుస్తూ బయటిక వచ్చారు.
(04:55) ఇంగ్లాండ్ మీద వైకింగ్స్ చేసిన మొట్టమొదటి అతి పెద్ద చారిత్రాత్మక దాడి ఇదే. ఈ వైకింగ్స్ పవిత్రమైన మటన్లోకి చొరబడి దేవుడి విగ్రహాలను పగలగొట్టారు. నిరాయుధులైన పూజారులని విచక్షణ రైతంగా నరికేశారు. అక్కడున్న బంగారం వెండి ఖజానాలను దోచుకొని వెళ్ళిపోయారు. చర్చులు పీఠాలు అత్యంత సురక్షితమైనవిగా భావించే ఆ కాలంలో ఈ ఘటన దేశం మొత్తాన్ని భ్రమింపజేసింది.
(05:17) మొదట్లో ఈ వైకింగ్స్ కేవలం రావడం దోచుకోవడం పారిపోవడం ఇలాంటివి చేసేవారు. కానీ 865వ సంవత్సరంలో వారి ఆశ మరింత పెరిగింది. ఈసారి కేవలం బంగారం దోచుకోవడానికి రాలేదు. మొత్తం భూమిని ఆక్రమించుకున్నారు. ద గ్రేట్ హెతిన్ ఆర్మీ అని పిలవబడే ఒక భారి వైకింగ్ సైన్యం ఇంగ్లాండ్ తీరంలో దిగింది. ఈ సైన్యం వరుసగా ఆంగ్లో సక్సన్ రాజ్యాలను నాశనం చేస్తూ ముందుకు వెళ్ళింది.
(05:41) 867 లో నార్త్ అంబ్రియా నేలమట్టం అయింది. 869లో ఈస్ట్ ఇంగ్లియా అంతమైంది. 874 వచ్చేసరికి మెర్సియా కూడా వైకింగ్స్ పాదాల కింద నలిగిపోయింది. ఇక ఇంగ్లాండ్ మొత్తంలో వైకింగ్స్ ముందు ధైర్యంగా నిలబడిన ఏకైక రాజ్యం వెసెక్స్ మాత్రమే. ఆ రాజ్యపు రాజు పేరు ఆల్ఫ్రెడ్. వైకింగ్స్ వెసెక్స్ ను కూడా నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టారు. 878వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు ఎంత దారుణంగా మారాయంటే రాజు ఆల్ఫ్రెడ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి అడవుల్లు చిత్తడి నేలల్లో దాక్కున్నాడు.
(06:12) ఇంగ్లాండ్ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడింది. చుట్టూ కేవలం వైకింగ్స్ గొడ్డళ్లు ప్రజల అరుపులు మాత్రమే వినిపించాయి. ఆంగ్లో సక్సన్ సామ్రాజ్యం దాదాపు అంతం కావడానికి సిద్ధంగా ఉంది. రాజు ఆల్ఫ్రెడ్ ఈ క్రూరమైన వైకింగ్స్ ముందు లొంగిపోతాడా లేదా అడవుల నుంచి తిరిగివచ్చి ఇంగ్లాండ్ ను సరికొత్త చక్రవర్తి అవుతాడా అడవులో దాక్కున్న రాజు ఆల్ఫ్రెడ్ దగ్గర తిరిగి రావడానికి కూడా ఏమీ లేదు.
(06:35) అతని మనసులో ఉన్న ఒకే ఒక్క లక్ష్యం తన మాతృభూమికి స్వేచ్ఛ తీసుకురావడం. 878 మే నెలలో ఆల్ఫ్రెడ్ చల్లాచెదురైన తన సైనికుల్ని ఒక్కొక్కటిగా చేర్చాడు. ఎండిక్టన్ యుద్ధంలో వైకింగ్స్ పై తన జీవితంలోనే అతి పెద్ద పోరాటం చేశాడు. ఈ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందంటే కత్తుల శబ్దాలు సైనికుల అరుపులతో ఆకాశం దద్దరిల్లింది. ఆల్ఫ్రెడ్ వేసిన వ్యూహం పనిచేసింది.
(06:57) అతను వైకింగ్స్ ను వెనక్కి తరిమి కొట్టాడు. ఈ చారిత్రాత్మక విజయంతోనే అతని ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వెసెక్స్ రాజులు నెమ్మదిగా వైకింగ్స్ ఆక్రమించిన ప్రాంతాన్ని తిరిగి దక్కించుకున్నారు. ఆల్ఫ్రెడ్ మనవడు ఎథిల్స్టన్ 1927 లో యాక్ ను ఆక్రమించుకున్నాడు. చరిత్రలో తొలిసారిగా తనకు తాను కింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్ అని పేరు పెట్టుకుని బిరుదిచ్చుకున్నాడు.
(07:20) అంటే అప్పుడే నిజమైన అర్థంలో ఒక ఐక్యమత్యమైన ఇంగ్లాండ్ పుట్టింది. కానీ ఈ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు.వ000 42 లో రాజు ఎడ్వర్డ్ ద కన్ఫెసర్ సింహాసనం ఎక్కాడు. కానీ అతను చేసిన ఒకే ఒక్క పెద్ద తప్పు ఇంగ్లాండ్ ను మళ్ళీ నాశనాలంచుకు చేర్చింది.వెయిన్ని 66వ సంవత్సరం మొదలవ్వగానే ఇంగ్లాండ్ సింహాసనం కోసం ఒక భయంకరమైన పోరాటం దానికి చరిత్రలోనే సాటి లేదు.
(07:43) ఎడ్వర్డ్ మరణం తర్వాత ఇంగ్లాండ్ లో ఒక బలమైన నాయకుడు హెరాల్డ్ గాడ్విన్సన్ తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. కానీ ఈ సింహాసనం మీద కేవలం అతని కన్ను మాత్రమే లేదు. నార్వేకు చెందిన క్రూరమైన వైకింగ్ రాజు హెరాల్డ్ హాడ్రాడా మరియు ఫ్రాన్స్ లోని నార్మాండీ డ్యూకి విలియం ఇద్దరు కూడా సింహాసనం మీద కన్నేశారు.
(08:03) ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న దేశం దాని మీద ఒకేసారి ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు. 166 సెప్టెంబర్ నెలలో నార్వేకు చెందిన వైకింగ్స్ ఉత్తరం వైపు నుంచి దాడి చేశారు. రాజు హెరాల్డ్ చాలా వేగంగా స్పందించి స్టాంఫోర్డ్ బ్రిడ్జి యుద్ధంలో వైకింగ్స్ రాజును చంపి ఆ దాడిని తిప్పికొట్టాడు. కానీ అతని విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే లోపే దక్షిణం నుంచి మరో చెడ్డ వార్త ఫ్రాన్స్ కు చెందిన డ్యూక్ విలియం ఒక పెద్ద సైన్యంతో ఇంగ్లాండ్ వైపు వస్తున్నాడని హెరాల్డ్ యొక్క అలసిపోయిన సైన్యం విశ్రాంతి లేకుండా వారాల తలబడి నడుచుకుంటూ దక్షిణం వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా వెయన్ని 66
(08:34) అక్టోబర్ 14వ తేదీ రానే వచ్చింది. చరిత్రలో అత్యంత క్రూరమైన ఆ రోజున బాటిల్ ఆఫ్ హెస్టింగ్స్ అని పిలుస్తారు. యుద్ధభూమిలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఒకవైపు ఫ్రాన్స్ అశ్వికా దళం ఉంటే మరోవైపు ఆంగ్లో సక్సెన్ సైనికులు తమ డాలుతో ఒక గోడను నిలబెట్టారు. యుద్ధం మధ్యలో డ్యూక్ విలియం చనిపోయాడని ఒక పుకారు వ్యాపించింది.
(08:54) కానీ విలియం తన హెల్మెట్ తీసేసి నేను బ్రతికే ఉన్నాను. ఈ భూమిని గెలిచి తీరుతాను అని అరిచాడు. ఈ గందరగోళం మధ్యలో ఒక బాణం నేరుగా రాజు హెరాల్డ్ కంట్లు గుచ్చుకుంది. రాజు కింద పడిపోగానే ఆంగ్లో సత్సం సైన్యంలో భయాందోళన. అదే సంవత్సరం క్రిస్మస్ రోజున ఫ్రాన్స్ విజేతను విలియం ది కాంకరర్ అనే పేరుతో ఇంగ్లాండ్ కొత్త రాజుగా ఎన్నుకుంది.
(09:15) రాజు కాగానే విలియం మొత్తం ఇంగ్లాండ్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. దేశంలోని ప్రతి రూపాయి ప్రతి మనిషికి సంబంధించిన లెక్కలు ఉంచడానికి జ్యూమ్స్ డే బుక్ అనే పేరుతో ఒక పెద్ద సర్వే చేయించాడు. దాదాపుగా 80 సంవత్సరాల తర్వాత సింహాసనం కోసం జరిగిన పోరాటం వల్ల దేశంలో భయంకరమైన అంతర్యుద్ధం కూడా మొదలైంది. చివరికి 1154 లో రెండవ హెన్రీ సింహాసనాన్ని అధిష్టించాడు.
(09:36) ప్లాంటజనేట రాజవంశానికి మొదటి రాజుగా ఆయన చరిత్రకఎక్కాడు. కానీ వినడానికి వింతగా ఉంటుంది కదా ఇంత పెద్ద సామ్రాజ్యానికి రాజైన హెన్రీ వారసుడు కింగ్ జాన్ వైఫల్యం వల్లే ఈ ధనవంతులందరూ తిరుగుబాటు చేశారు. 1215లో ధనవంతులందరూ కలిసి రాజును చుట్టుముట్టి ఒక చారిత్రాత్మక పత్రం మీద సంతకం చేయించారు. దాన్నే మాగ్నకాట అని పిలుస్తారు.
(09:57) ఇది రాజుకున్న అపరిమితమైన అధికారాలకు బ్రేక్ వేసింది. సామ్రాజ్య ప్రజల హక్కులకు పునాది వేసింది. దీని తర్వాత మొదటి ఎడ్వర్డ్ దేశంలో మొదటి పార్లమెంట్ ను ప్రారంభించాడు. అలాగే కత్తి బలంతో వేల్స్ ను కూడా ఆక్రమించుకున్నాడు. 14వ శతాబ్దం మొదలవ్వగానే ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య భూమి కోసం ఒక పెద్ద యుద్ధం మొదలైంది. చరిత్రలో దీన్ని 100 ఇయర్స్ వారని కూడా పిలుస్తారు.
(10:17) అంటే 100 ఏళ్ల పాటు జరిగిన యుద్ధం మూడో ఎడ్వర్డ్ నాయకత్వంలో ఇంగ్లాండ్ సైన్యం ఎన్నో యుద్ధాల్లో ఫ్రాన్స్ ను ఓడించింది. బ్రతికున్న కూలీల మీద రాజు యుద్ధ ఖర్చుల కోసం భారి పన్నులు వేసింది కూడా అప్పుడే. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా 1381 లో పేద రైతులు పీజెంట్స్ రివోల్ట్ అని పిలిచే ఒక చారిత్రాత్మక తిరుగుబాటు మొదలు పెట్టారు. అది లండన్ వీధులను కుదిపేసింది.
(10:38) కోపంతో ఉన్న రైతులు ప్రభుత్వ అధికారులను నడి రోడ్డుపై నరికేశారు. అయితే ఆ తర్వాత ఈ తిరుగుబాటును అణచివేశారు. కానీ రాజభవనం లోపల సింహాసనం కోసం జరిగే నెత్తుటి పోలు ఇంకా ముగియలేదు. 1455లో ఒక అంతర్యుద్ధం మొదలై అది ప్లాంటస్ అనేటి రాజవంశంలోని రెండు వర్గాల మధ్య తీవ్రమైన పోరాటానికి దారి తీసింది. ఈ యుద్ధాన్ని చరిత్రలో వార్స్ ఆఫ్ ది రోజెస్ అని పిలుస్తారు.
(10:59) ఎందుకంటే యర్క్ వర్గానికి గుర్తుగా తెలుపు గులాబీ లంకాస్టర్ వర్గానికి గుర్తుగా ఎరుపు గులాబీ ఉండేవి. 30 ఏళ్ల పాటు సాగిన ఈ రక్తపాతంలో రెండు వర్గాలకు చెందిన ధనవంతులు మరియు యువరాజులు ఒకరినొకరు నరుక్కొని చంపుకున్నారు. చివరికి 1485 లో జరిగిన బాష్వర్త్ ఫీల్డ్ యుద్ధంలో యార్క్ వంశానికి చెందిన చివరి రాజు మూడో రిచర్డ్ ను హెన్రీ ట్యూడర్ చంపేసాడు.
(11:21) రిచర్డ్ మరణంతో ఈ రక్తపాతం ఆగింది. రెండు వంశాలను ఏకం చేయడానికి హెన్రీ ట్యూడర్ [సంగీతం] యాక్ రాణిని పెళ్లి చేసుకున్నాడు. చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బలమైన ట్యూడర్ రాజవంశం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక మగబిడ్డ కోసం ఆరు పెళ్లిలు చేసుకున్న ఆ ట్యూడర్ రాజవంశపు రాజు ఎవరు? అలాగే అతని నిర్ణయాలు మొత్తం ఇంగ్లాండ్ మతాన్ని ఎలా మార్చేసాయో చూద్దాం.
(11:43) ట్యూడర్ వంశం ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఒక కొత్త శాంతియుత శకం మొదలైంది. కానీ 1509లో ఎనిమిదవ హెన్రీ సింహాసనం ఎక్కినప్పుడు దేశ చరిత్ర ఒక వింతైన క్రూరమైన మలుపు తిరిగింది. హెన్రీకి తన సామ్రాజ్యం కోసం ఒక కొడుకు అంటే ఒక వారసుడు కావాలి. అతని మొదటి భార్య క్యాథరిన్ ద్వారా కేవలం ఒక కూతురు మాత్రమే పుట్టింది. ఆమె పేరే మేరీ. హెన్రీ విడాకులు తీసుకోవడానికి స్పెయిన్ పోప్ నిరాకరించాడు.
(12:08) కోపంతో ఈ రాజు దేశం మొత్తాన్ని క్యాథలిక్ చర్చ్ నుంచి వేరు చేశాడు. అతను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే ఒక కొత్త ప్రొటెస్టంస్ మతాన్ని ఏర్పాటు చేసి తన ఇష్టా ప్రకారం విడాకులు తీసుకున్నాడు. కొడుకు పుట్టాలనే పిచ్చితో హెన్రీ వరుసగా ఆరు పెళ్లిలు చేసుకున్నాడు. అతని రెండవ భార్య అన్నే బోలిన్ కూడా కొడుకును కనలేకపోయిందనే కారణంతో ఆమెను నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేసాడు.
(12:28) మూడో భార్య కొడుకు పుట్టగానే చనిపోయింది. నాలుగో భార్య అందంగా లేదని విడాకులు ఇచ్చాడు. ఐదో భార్య మోసం చేసిందనే పనితో చంపేసాడు. కేవలం ఆరో భార్య మాత్రమే అదృష్టవంతురాలు. ఆమె రాజు చనిపోయేటప్పటికి ప్రాణాలతో బ్రతికుంది. 1547 లో హెన్రీ చనిపోయిన తర్వాత అతని కొడుకు ఎడ్వర్డ్ రాజుయ్యాడు. కానీ టీబి వ్యాధి కారణంగా అతను చిన్న వయసులోనే చనిపోయాడు.
(12:49) ఆ తర్వాత హెన్రీ మొదటి కూతురైన బ్లడీ మేరీ సింహాసనం ఎక్కింది. మేరీ పక్కా క్యాథలిక్ అందుకే ఆమె తన తండ్రి సృష్టించిన ప్రొటెస్టెంట్ మతానికి చెందిన ప్రజలను కూడా దారుణంగా హింసించింది. దాదాపు 280 మందిని సజీవంగా స్తంభానికి కట్టి కొట్టింది. కాల్చి చంపేసింది. ఈ క్రూరత్వం వల్లే ప్రజలు ఆమెను నేటికి బ్లడీ మెరీ అంటారు. కానీ 1558లో మెరీ చనిపోయిన తర్వాత ఇంగ్లాండ్ చరిత్రలోకి ఆ రాణి ఎంట్రీ ఇచ్చింది.
(13:14) దేశాన్ని ప్రపంచంలోనే ఒక మహాశక్తిగా మార్చిన రాణి. మొదటి ఎలిజబెత్ రాణి ఎలిజబెత్ పాలించిన 45 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ని స్వర్ణ యుగం అని పిలుస్తారు. ఆమె దేశంలో మతపరమైన శాంతిని నెలకొలిపింది. జనాభా పెరిగింది. విలియం షేక్స్పియర్ లాంటి గొప్ప రచయితలు ఈ కాలంలోనే తమ నాటకాలను రాశారు. ఇక 1588 లో అప్పటి అతి పెద్ద నావికా దళమైన స్పానిష్ అర్మాడాను వాళ్ళు మట్టి కరిపించారు.
(13:39) ఎలిజబెత్ ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. అందుకే 1603 లో ఆమె మరణంతో ట్యూడర్ వంశవంతమైంది. అప్పుడు స్కాట్లాండ్ కు చెందిన స్టువర్ట్ రాజ వంశానికి చెందిన రాజు జేమ్స్ చేతికి సింహాసనం వెళ్ళింది. రాజు జేమ్స్ కాలంలో 1605 లో గన్ పౌడర్ ప్లాట్ అనే ఒక ప్రసిద్ధ కుట్ర జరిగింది. దీనిలో కొంతమంది క్యాథలిక్లు పార్లమెంట్ ను మందుగుండు సామాగ్రితో పేల్ చేయడానికి ప్రయత్నించారు.
(14:00) అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు అమెరికా మరియు భారతదేశంలో తమ మొదటి స్థావరాలను ఏర్పాటు చేశారు. ఇవే ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నెముకగా మారాయి. ఇక 19వ శతాబ్దం వచ్చేసరికి ఈ బ్రిటన్ లోని పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఆవిరి యంత్రాలు మరియు కర్మాగారాల శక్తి ఈ చిన్న దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా మార్చేసాయి.
(14:22) ఆ సామ్రాజ్యంలో ఎప్పుడూ సూర్యుడు అస్తమించడు అని చెబుతారు. అయితే 20వ శతాబ్దపు మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు ఈ దేశాన్ని పూర్తిగా దివాళ తీయించాయి. కానీ వేల ఏళ్ళు ఈ ఎత్తు పల్లల చరిత్ర ప్రపంచానికి ఒక కొత్త భాషణ ఇచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం ఆ భాషనే మాట్లాడుతుంది. రోమ్ యొక్క లాటిన్ ఆంగ్లో సాక్సన్ యొక్క జర్మనిక్ వైకింగ్స్ యొక్క ఓల్డ్ నాట్స్ మరియు నార్మన్స్ యొక్క ఫ్రెంచ్ ఈ భాషలన్నిటి కలయక వల్లే నేటి ఇంగ్లీష్ పుట్టింది.
(14:47) వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment