Thursday, September 17, 2026

స్కూల్లో మీ పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా? | Child Protection | Out of COVERAGE

స్కూల్లో మీ పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా? | Child Protection | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=V3OD1Zgb3Ug





Title: స్కూల్లో మీ పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా? | Child Protection | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: What are the legal protections and institutional guidelines to stop school bullying? In this comprehensive educational video, we dive deep into the role of schools in preventing bullying and the strict regulations mandated by the Right to Education (RTE) Act, CBSE guidelines, and Child Rights laws.

To provide actionable solutions, we also share crucial insights and advice from leading child psychologists, along with latest data from global survey statistics. This video serves as an authentic, research-based guide for parents, teachers, and school administrators to ensure a safe environment for every child.

🕒 We Covered in This Video 👇👇
Child Psychologist Insights & Warning Signs
Global Bullying Surveys & Current Statistics
CBSE Regulations & School Accountability
RTE Act & Legal Child Rights Protections
Actionable Steps for Parents and Teachers

👇👇
Disclaimer : The information provided in this video is for educational, informational, and awareness purposes only. While it references the Right to Education (RTE) Act, CBSE guidelines, child rights, and psychological studies, it does not constitute formal legal advice or professional psychological counseling.
If your child is facing severe bullying or mental distress, please consult a licensed child psychologist, school authorities, or a legal professional immediately. The creator of this video is not responsible for any actions taken based on the information provided herein.


🚨 If a child is in Distress, facing severe bullying, or needs immediate assistance, please use these official emergency resources:

👉👉 Child Helpline : Call 1098 (Pan-India 24/7 toll-free emergency phone service managed by the Ministry of Women and Child Development).

👉👉 National Emergency Number : Call 112 (All-in-one emergency response for immediate Police, Fire, or Medical assistance).

👉👉 Cyber Helpline: Call 1930 (To report severe online cyberbullying, harassment, or digital blackmail).


Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#antibullying
#childsafety
#parentingtips
#childrights
#rteact2009
#outofcoverage

Transcript:
(00:01) [సంగీతం] అండర్లైన్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ప్రతి స్కూల్లో ప్రతి ప్లేగ్రౌండ్ లో ఇది నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల చిన్నారుల నుంచి 14 15 ఏళ్ల టీనేజర్ల దాకా ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా నరకం చూస్తున్నారు. దాని పేరే బుల్లియింగ్ మీ పిల్లలు ఇప్పటివరకు మీకు చెప్పారో లేదో వాళ్ళు చెప్పిన మీ తల్లిదండ్రులకు అర్థమైందో లేదో అర్థమైనా పట్టించుకున్నారో లేదో కానీ ఇప్పటినుంచి పట్టించుకోండి.
(00:33) ఇది ఎలాంటిదో దాని తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో రాజస్థాన్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థం చేయిస్తాను. నవంబర్ 1 2025 జైపూర్ లోని ప్రతిష్టాత్మక పాఠశాల ఎప్పట్లాగే స్కూల్ కు బయలుదేరింది తొమ్మిదేళ్ల చిన్నారి తను చదివేది ఫోర్త్ క్లాస్ చదువులో టాప్ ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ తనదే ఆటపాటల్లోనూ ముందు ఉండేది.
(00:57) కానీ ఒక్కటే ప్రాబ్లం కొంతకాలంగా తోటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయం పేరెంట్స్ కి చెప్పింది. వాళ్ళు ఒకటి రెండు సార్లు పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ చెబుతూ ఏడుస్తుండడంతో స్కూల్ కి వెళ్లి రెండు మూడు సార్లు టీచర్లకు కూడా చెప్పారు. వాళ్ళు పిల్లల మధ్య ఇది మామూలే కదండీ అంటూ సర్దు చెప్తూ వచ్చారు. ఒకరోజు ఓ అబ్బాయి డిజిటల్ పలక మీద ఏదో గీసి ఆ పాపకు చూపించాడు.
(01:18) తన మనసు తీవ్రంగా గాయపడింది. అక్కడితో ఆగకుండా మాటలతో ఏడిపించడం మొదలు పెట్టాడు. టీచర్ తో చెప్తా ఉండు అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ మరోసారి మిస్ దగ్గరికి వెళ్ళింది. ఎప్పట్లాగే ఆ టీచర్ సర్ది చెప్పే ప్రయత్నమే చేసింది. ఆ ఉదాసీనత ఆ నిర్లక్ష్యం చూసి ఆ ఆకత ఇంకా రెచ్చిపోయాడు. మర్నాడు అదే పరిస్థితి ఎదురైంది. ఈసారి ఆ పాపతో పాటు వాడు కూడా టీచర్ కి వెళ్లి కంప్లైంట్ చేశడు.
(01:42) నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తావా అయితే నేను కూడా నీ మీద కంప్లైంట్ చేస్తాను. నా మీదనా ఏమని ఇస్తావ్ నువ్వు ఏమని ఇస్తావో నేను కూడా అదే ఇస్తాను. బాధితురాలినే నిందుతురాలిగా మార్చేసే ప్రయత్నం అది. రెండు రోజుల తర్వాత వాడికి మరో ఇద్దరి తోడై టీచర్ కి ఇంకో కంప్లైంట్ చేశారు. దాంతో ఆ చిన్నారి తాను ఒంటరిన అయిపోయానని కుమిలిపోయింది.
(02:03) నన్ను అర్థం చేసుకునే వారు ఎవ్వరూ లేరు. నా పక్కన నిలబడేవారు ఎవ్వరూ లేరని నలిగిపోయింది. ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు ఏకాగకిని అనే భావన కలిగినప్పుడు అందరూ నాపైనే దాడి చేస్తున్నారనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉంటాయి. టీచర్ ఆ చిన్నారిని పిలిపించి బోన్లో నిలబెట్టింది. తన తప్పేమీ లేదని రోజు వీళ్లే నన్ను ఏడిపిస్తున్నారని ఆ చిన్నారి చేతులు జోడించి టీచర్ వద్ద ఎక్కిలతో ఏడ్చింది.
(02:29) ఆమె వినిపించుకోలేదు సరి కదా రోజు జరుగుతున్న ఈ తందుకు తనే కారణమని ఆ చిన్నారిపై అరిచేసింది. తాను నిర్దోషినని తానే బాధితురాలనని ఎలా నిరూపించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. నెలల తరబడి నా మీదనే దాడి జరుగుతుంటే చివరకు అందరూ నాదే తప్పని అంటున్నారు. ఫ్రెండ్స్ టీచర్లు తల్లిదండ్రులు ఎవ్వరు నా వెంట లేరు అనుకుందో ఏమో ఏడుస్తూ క్లాసుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు ఎక్కేసింది.
(02:54) క్షణాల్లో స్కూల్ మొత్తం గ్రౌండ్ వైపు పరిగెత్తింది. ఆ బంగారు తల్లి పేరు అమైరా. అమైరా అంటే అర్థం అందం మరో అర్థం కూడా ఉంది అమరత్వం రెండో దాన్నే శాశ్వతం చేసి వెళ్ళిపోయింది. ఎన్ని చేతులకు అంటుకున్న పాపం ఇది జీవితాంతం కన్నీళ్లతో కడుక్కున్నా కూడా తుడిచేసుకోగలరా ఎవరిని దీనికి బాధ్యులని చేయాలి అంత చిన్న వయసులోనే జీవితాన్ని ముగించాలనే ఆలోచన వచ్చిందంటే ఆ పసి మనసు ఎంత నరకం చూసి ఉండాలి? ఎంత ఆవేదన భరించి ఉండాలి? ఇలాంటి సమాజాన్ని ఏ కోర్టు ముందు నిలబెట్టి ఎన్ని సార్లు ఉరిశిక్ష వేస్తే ఆ చిట్టి తల్లి ఆత్మ శాంతిస్తుంది.
(03:30) వెన్నులో వనికి పుట్టించే విషయం ఏంటంటే ప్రతి స్కూల్లోనూ ఎంతో మంది అమైరాలు ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పుకోలేని వారు మరికొందరు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఏడుస్తూ ఉన్నవారు. అందులో [గురకలు] అమ్మాయిలు మాత్రమే ఉంటారు అనుకుంటే పొరపాటే అబ్బాయిల్లో కూడా ఈ బలిపీఠం మెట్ల ముందు కూలబడి రోధిస్తున్న వారు ఎందరో.
(03:50) భాజాప్తగా చెప్తున్న దేశంలోని లక్షలాది స్కూల్లలో ప్రతి తరగతి గదిలోనూ వీరు ఉంటారు. ప్రతి స్కూల్లోనూ ఆకతాయలు కనిపిస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 34 నుంచి ఏకంగా 42% వరకు విద్యార్థులు ఈ బుల్లింగ్ ని ఫేస్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ సగం మంది విద్యార్థులు ఏదో ఒక స్థాయిలో ఈ దారుణాన్ని అనుభవిస్తున్నారు. హై స్కూల్ కన్నా ప్రైమరీ స్కూల్ లోనే ఇది మరీ ఎక్కువగా ఉండడం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.
(04:16) పెద్దలంతా గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా చాలాసార్లు ఆకతాయలు తోటి విద్యార్థుల మీద చేసే పనులకు ఆధారాలు ఉండవు. కంప్లైంట్ చేయడానికి కూడా దొరకవు. తమకంటే బాగా చదివే పిల్లల పుస్తకాలు దాచేయడం, అట్టలు చింపేయడం, గోడల మీద రాతలు రాయడం, క్లాసులోనికి బయటికి వెళ్తున్నప్పుడు కాళ్ళు అడ్డం పెట్టడం, అభ్యంతరకరమైన నిక్ నేమ్స్ పెట్టి పిలవడం ఇలాంటి ఉదాహరణలు సవలక్ష ఉంటాయి.
(04:39) వీటి మీద కంప్లైంట్ చేస్తే టీచర్లు పేరెంట్స్ ఆ ఒక పిల్ల ఆటలుగా కొట్టిపడేస్తారు. కానీ అన్నిసార్లు అవి పిల్ల చేష్టలు కానే కావు నోట్ దిస్ పాయింట్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కునే ధైర్యం అందరి పిల్లల్లో ఉండదు. ఎవరికైనా చెబితే వాళ్ళు మరింతగా రెచ్చిపోతారేమో అని భయపడతారు. తమలో తామే నలిగిపోతుంటారు. మరీ శృతిమించినప్పుడు మాత్రమే వారు నోరు తెరుస్తారు.
(05:00) చివరకు నోరు తెరిచి ఇంట్లో వాళ్ళకి చెబితే వాళ్ళు ఇలాంటివి పట్టించుకోవద్దు వదిలేయ్ ఇవి కామన్ అని చెప్పి వదిలేస్తుంటారు. దీంతో పిల్లల మనసులోకి ఒక అభద్రత భావం జరపడుతుంది. పొద్దున్నే స్కూల్ కి వెళ్ళాల్సిన టైం అవుతుందంటేనే ఒక భయం పుట్టుకొస్తుంది. దాన్ని తప్పించుకునేందుకే కడుపు నొప్పనో జ్వరం వచ్చిందనో తలన వస్తుందనో చెప్తుంటారు.
(05:20) ఇవన్నీ దొంగ నొప్పులని కనిపెట్టేస్తారు ఈ సిబిఐ పేరెంట్స్ కానీ ఎందుకు అలా చెప్తున్నారో మాత్రం అర్థం చేసుకోలేరు. చదువుకో చదగాక ఈ దొంగ ముచ్చలు చెప్తున్నారు. మంచి మంచి బట్టలు, తిండి, కలర్ కలర్ బ్యాగులు, పుస్తకాలు అన్ని కొనిస్తాను ఇంకేం కావాలి అంటారు. కానీ అలా ఎందుకు చేస్తున్నారో మాత్రం తెలుసుకోలేరు. ఇక టీచర్ల పరిస్థితి మరో రకంగా ఉంటుంది.
(05:40) నిత్యం పిల్లల గోల చూసి చూసి చిరాకు వచ్చేస్తుంది. అలా ఏది సీరియస్ కంప్లైంట్ ఏది కొట్టి పారేయాల్సిందో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు పడిపోతుంటారు. కానీ బుల్లియింగ్ అత్యంత దారుణమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది పిల్లల పాలిట బలిపీఠమే. అమైరా మాదిరిగా జీవితాన్ని ముగిస్తేనే భార్య విషాదం కాదు. చిన్న వయసులో వారి మనసుకు తగిలిన గాయాలు పెద్దయిన తర్వాత కూడా కోలుకోకుండా చేస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? ఆ దాడులు ఏకంగా పిల్లల భవిష్యత్తును వారి వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాయి.
(06:12) పాతికేళ్లు వచ్చిన తర్వాత కూడా కొందరు నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే భయపడుతుంటారు. తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలంటే వనికిపోతుంటారు. ఇతరులు తప్పు చేసినా సరే ఎదిరించడానికి ధైర్యం చాలదు. వీటన్నింటికీ చిన్నప్పుడు మనసుకు తగిలిన గాయాలే కారణం అని మీలో ఎంతమందికి తెలుసు? పెద్దైన తర్వాత ఇలాంటి ప్రవర్తనను ఎత్తి చూపుతూ ఆ వయసులో కూడా హేలన చేసే వాళ్ళు చుట్టూ ఉంటారు.
(06:35) ఇంత వయసు వచ్చినా నీ ఒపీనియన్ చెప్పలేవా అంటూ ఎత్తిపడుస్తుంటారు. ఆ విధంగా తాను ఇలా ఎందుకు తయారయ్యానో తనకే అర్థం కాని స్థితిలోకి నెట్టేయబడతారు పిల్లలు. ఇలాంటి ప్రపంచంలో తాము ఎందుకు పనికి రాని వాళ్ళమని ఫిక్స్ అయిపోతారు. అలాంటి వారు ఇక ఎన్నటికీ పైకి లేవలేని స్థితికి చేరిపోతారు. దీనంతటికీ బీజం ఎక్కడ పడిందో ఎవ్వడికీ తెలియదు.
(06:55) ఎవరికీ అవసరమే లేదు కూడా స్కూల్లో ఏడిపించినవాడు పట్టించుకొని టీచర్ లైట్ తీసుకున్న అమ్మా నాన్నలు అందరూ బాగానే ఉంటారు. కానీ కంటికి కనిపించని ఆ గాయాలు సలుపుతూనే ఉంటాయి. జీవితాంతం వాటిని మోస్తూ భరిస్తూ తిరుగుతూ ఉంటారు ఈ బాధ్యతలు. ఇవి ఏ ఎక్స్రేకు దొరకవు. ఏ స్కానింగ్ లోనూ కనిపించవు. ఏ మెడికల్ టెస్ట్ లోనూ బయటపడవు. అందుకే ఇవాళే ఈరోజే ఇప్పుడే మీ పిల్లలతో మాట్లాడండి.
(07:20) స్కూల్లో ఇలాంటి టీజింగ్ కాలేజీలో రాగింగ్ పేరుతో సాగే ఈ దారుణాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయా అనేది ఆరా తీయండి. ఇందాకే చెప్పాను కదా చాలా విషయాలు కంప్లైంట్ చేయడానికి కూడా అందవని అవి ఎలా ఉంటాయో మరికొని తెలుసుకోండి. ఆకతాయలు వెనక నుండి తల మీదనో వీపు మీదనో కావాలనే కొడతారు. అరే చూసుకోకుండా తగిలింది అంటారు. ఆపై ఎగతాలిగా ముసిముసిగా నవ్వులు నవ్వుతుంటారు. ఇది రోజు జరుగుతూ ఉంటుంది.
(07:44) కావాలనే ఎదురొచ్చి గుద్దుతుంటారు. లంచ్ బాక్స్ లాంటివి దాచేస్తారు. వాష్రూమ్లో క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు గడియ పెట్టేస్తారు. ఈ వేధింపులన్నీ మగపిల్లల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవన్నీ భౌతిక వేదింపులుగానే చూడాలి. పిల్లాటలు ఎంత మాత్రం కాదు. ఇంకా వారు మాట్లాడే విధానాన్ని యాసను భాషను హేలనగా ఇమిటేట్ చేస్తుంటారు.
(08:07) నడిచే పద్ధతిని అవమానించేలా అనుకరిస్తుంటారు. బలహీనతలను గుర్తు చేస్తుంటారు. వైకల్యంతో పిలుస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ను తిట్టడం బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ కూడా మాటలతో మానసికంగా వేధించడంగానే భావించాలి. మొత్తం వేధింపుల్లో దాదాపు 55%నికి పైగా ఇలాంటివే ఉంటున్నట్టు అంచన. కావాలని ఇగ్నోర్ చేస్తుంటారు. ఆటలాడే సమయంలో వారిని ఏ జట్టులోకి తీసుకోకుండా కార్నర్ చేస్తుంటారు.
(08:29) తన గురించి పుకార్లు పుట్టిస్తారు. మిగతా పిల్లల్ని తనతో మాట్లాడకుండా చేస్తారు. వారి మతం, కులం, ప్రాంతం, భాష, ఆర్థిక స్తోమత ఇలాంటి అంశాలను ఎత్తుచూపుతో అవమానిస్తుంటారు. ఇలా ఒకరి ఉనికిని వ్యక్తిత్వాన్ని చులకన చేయడం కూడా వేధింపే. ఈ విధంగా మాటలు చేతలతో మనసు మీద బండరాళ్లు విసిరేసి వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. కానీ వీళ్ళు నిత్యం నరకం చూస్తుంటారు.
(08:54) ఇలాంటి వాటిని చాలా మంది పిల్లలు బయటకి చెప్పరు. ఇక పేరెంట్స్ తో బాండింగ్ సరిగా లేని పిల్లలు ఎన్నటికీ నోరూపరు. కాబట్టి పేరెంట్సే కనిపెట్టాలి. మీ పిల్లల్లో ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో ముందు గమనించండి. అందులో మొదటివి మానసిక లక్షణాలు. ఎప్పుడూ తీవ్రమైన డల్లుగా ఉంటారు. ఒత్తిడిలో కనిపిస్తుంటారు. స్కూల్ అంటే భయపడతారు పీడకలలు వస్తుంటాయి.
(09:16) చుట్టూ ఉన్న వారితో అంటి ముటనట్టుగా ఉంటారు. తన మీద తనకు నమ్మకం లేకుండా ఉంటారు. కారణం లేకుండానే ఏడుస్తుంటారు. ఇవన్నీ కూడా బుల్లియం కారణంగానే ఏర్పడే మానసిక సమస్యలు. రెండోది చదువు సమస్యలు. రోజు స్కూల్ కు చక్కగా వెళ్ళేవాళ్ళు అకస్మాత్గా స్కూల్ కి వెళ్ళేందుకు ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు. బాగా చదివే పిల్లాడు తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు.
(09:37) బడి ఎగ్గొట్టేందుకు రకరకాల కారణాలు చెప్తుంటారు. పాఠాలు శ్రద్ధగా వినకపోవడం క్లాసులో చురుగ్గా లేకపోవడం వీటి వెనక కూడా అదే ప్రభావం ఉంటుంది. మూడోది శారీరక సమస్యలు సరిగా నిద్రపోరు లంచ్ బాక్స్ తినకుండా ఇంటికి పట్టుకొస్తుంటారు. తలనొప్పితో బాధపడుతుంటారు. తరుచు వాంతులు అవుతుంటాయి. నిజంగానే తరచు కడుపు నొప్పి కూడా వస్తుంటుంది.
(10:00) కోపంతో తలను చేతులను గోడకేసి కొట్టుకుంటూ ఉంటారు. వీటికి కూడా వేధింపులే కారణం అంటే ఆశ్చర్యం కలగక మారదు. ఈ ఇబ్బందుల కారణంగా పిల్లల్లో హార్మోన్ల పనితీరు కూడా దెబ్బ తింటుంది. ఇలా వచ్చే ఆరోగ్య సమస్యలను సైకోసోమాటిక్ అని వైద్యులు పిలుస్తారు. ఇవన్నీ ముదిరితే ఏం జరుగుతుందో తెలుసా? అందరూ అమేరా మాదిరిగా ఒక్క క్షణంలో విముక్తి కావాలని నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ కొంచెం కొంచెంగా ఆరోగ్యాన్ని జీవితాన్ని కోల్పోతుంటారు.
(10:25) చదువు అంటేనే విరక్తి వచ్చేస్తుంది. స్కూల్ గురించి మాట్లాడితే చిరాకు పడుతుంటారు. తన వస్తువులను బడిలో పోగొట్టుకొని వస్తుంటారు. లేదంటే పాడు చేసుకొని వస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి కూడా దూరంగా ఉంటారు. ఆడుకోవడానికి కూడా వెళ్లరు. ఈ సమస్యలను తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దవాళ్ళు సాధ్యమైనంత త్వరగా పసిగట్టకపోతే అవి వాళ్ళతో పాటే పెరిగి పెద్దవవుతాయి.
(10:45) బలమైన గాయాలుగా మిగిలిపోతాయి. మనుషుల మీద జీవితం మీద నమ్మకం కోల్పోతారు. ఏ పని చేయడానికి ఆసక్తిగా ఉండరు. చివరకు ఈ బాధ నుంచి బయట పడేందుకు మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. ఇలా మత్తుకు బానిసైన వాళ్ళు మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఆఫీస్లో నలుగురితో స్వేచ్ఛగా పని చేయలేరు. బతుకులో సంతోషమే కనిపించదు. ఈ విధంగా వ్యక్తిత్వాన్ని జీవితాన్నే నాశనం చేసే స్థాయిలో బుల్లియంగ్ తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపునులు హెచ్చరిస్తున్నారు.
(11:14) జామా పీడియాట్రిక్స్ జర్నల్ చేసిన పరిశోధన ప్రకారం సాధారణ విద్యార్థులతో పోలిస్తే వేధింపులకు గురయ్యే విద్యార్థుల్లో జీవితాన్ని ముగించాలని ఆలోచన ఏకంగారెండున్నర రెట్లు అధికంగా ఉంటుందట. మరి ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా? ఇందుకోసం చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని తల్లిదండ్రులు చేయాల్సినవి కొన్ని పాఠశాలలు చేయాల్సినవి ఇంకొన్ని బాధితులే స్వయంగా చేయాల్సినవి ముందుగా పేరెంట్స్ పిల్లలకు సపోర్టివ్ గా ఉండాలి.
(11:44) అమ్మ నాన్న ఇచ్చే మద్దతు ముఖ్యంగా తండ్రి ఇచ్చే మద్దతు పిల్లల్లో ఎనలేని ధైర్యాన్ని నింపుతుంది. నీ వెనక నేను ఉన్నాను ఏం జరిగినా తర్వాత చూసుకుందాం చేసేయ్ అని తండ్రి చెప్పే మాట ఈ ప్రపంచాన్నే గెలిచేంత గుండె ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి పేరెంట్స్ పిల్లలతో మనసు విప్పి మాట్లాడితే వారు నోరు విప్పుతారు. రెండోది బాధ్యతలు చేయాల్సినవి.
(12:04) బుల్లింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారు ఒక ఖాళీ కుర్చి ఎదురుగా నిలబడి అందులో ఆకతాయి ఉన్నట్టుగా ఊహించుకొని వారితో ధైర్యంగా మాట్లాడుతున్నట్టు ప్రాక్టీస్ చేయాలి. కవచ్ లాంటి యప్స్ బుల్లింగ్ ఎదుర్కోవడంలో అండగా నిలుస్తాయి. వీటిని ఫాలో కావాలి. ఎప్పటికప్పుడు తమకు ఎదురైన ఈ సంఘటనలను పెన్నుతో కాగిద మీద స్వయంగా రాసి పెట్టుకోవాలి.
(12:24) దీనివల్ల మనసులో భారం తగ్గుతుంది. అంతేకాదు టైం వచ్చినప్పుడు వాస్తవాలు వివరించేటప్పుడు ఉదాహరణగా కూడా సాక్ష్యాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక మూడోది పాఠశాలలు చేయాల్సింది. వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. చాలా స్కూల్ ఫీజులు వసూలు చేసుకోవడంలో చూపే శ్రద్ధ పిల్లలపై చూపించట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇది ఏకంగా స్కూల్ మూసేసే పరిస్థితిని కూడా తీసుకురావచ్చని యాజమాన్యాలు గుర్తించాలి.
(12:46) బుల్లింగ్ కు సంబంధించి జాతీయ బాలల హక్కుల కమిషన్ సిబిఎస్స విద్యా చట్టం ఎన్నో నిబంధనలు మార్గదర్శకాలు రూపొందించాయి. వీటిని ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ పాటించాలి. తమ సిబ్బందికి ఈ విషయంలో శిక్షణ కూడా ఇవ్వాలి. రాగింగ్ అనేది కేవలం కాలేజీలకు సంబంధించిన విషయంగా చూడకూడదు. ప్రతి స్కూల్లోనూ ఒక యాంటీ బుల్లింగ్ పాలసీ ఉండాలి.
(13:08) బుల్లింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పిల్లలకు బలంగా చెప్పాలి. వేధింపులకు గురైన వారు బాధ్యతలు ఎవరైనా తమ పేరు తెలియకుండా కంప్లైంట్ చేసే ఒక కంప్లైంట్ బాక్స్ స్కూల్లో పెట్టాలి. దాని మీద నిజమైన విచారణ జరిపించాలి. ఆకతాయలను దారిలో పెట్టేందుకు బాధ్యతలకు ఓదార్పు ఇచ్చేందుకు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఒక అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలి. క్యాంటీన్లు, ప్లేగ్రౌండ్, కారిడార్లు, స్కూల్ బస్సు ఇలా పెద్దవాళ్ళు ఎవరు లేని చోటనే ఇలాంటి వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి.
(13:37) వీటిని అడ్డుకోవడానికి సీనియర్ విద్యార్థులను మానిటర్స్ గా ఉంచాలి. సిసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రి తర్వాత మూడో స్థానం గురువుదే కానీ ఇవాళ టీచర్ పోస్ట్ కూడా జీతం కోసం చేసే ఓ సాధారణ ఉద్యోగం అయిపోయింది. అటు ఇంట్లో వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళవి. కాబట్టి మన పిల్లలను ముందుగా మనమే కాపాడుకోవాలి. నర్సరీ నుంచిటెన్త్ దాకా ఇంటర్ నుంచి యూనివర్సిటీ దాకా ఈ బుల్లింగ్ తో నరకం చూస్తున్న వారు ఎందరో కాబట్టి ఇవాళే ఇప్పుడే మీ పిల్లలతో మాట్లాడండి.
(14:05) బుల్లియంగ్ ని శాశ్వతంగా మొగ్గలోనే తుంచేయండి. ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. [సంగీతం]

No comments:

Post a Comment